
ప్రతీకాత్మక చిత్రం
తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీకి షాక్‌లు మీద షాక్‌లు తగులున్నాయి. టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కుటుంబసభ్యులు రాజీనామా చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రత్తిపాడులో పర్వత కుటుంబసభ్యులు టీడీపీకి సేవలందిస్తూ వచ్చారు. మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పర్వత రాజబాబు, ఆయన సతీమణి జానకీదేవీలు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
పార్టీని నమ్ముకున్న వారి కంటే అవినీతి పరులకే టీడీపీలో సముచిత స్థానం ఇచ్చారని పర్వత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్రప్రసాద్, బాపనమ్మ కుటుంబసభ్యులను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. రేపు(బుధవారం) వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పర్వత కుటుంబసభ్యులు పార్టీలో చేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment