చంద్రబాబు పాలన విష వృక్షం.. మన పాలన కల్పవక్షం: సీఎం జగన్‌ | Cm Jagan Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలన విష వృక్షం.. మన పాలన కల్పవక్షం: సీఎం జగన్‌

Published Thu, Feb 15 2024 4:58 PM | Last Updated on Thu, Feb 15 2024 8:04 PM

Cm Jagan Comments On Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు జిల్లా: గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య  చాలా తేడా ఉందని.. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయన్నారు.  గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో మాట్లాడుతూ, మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయని పేర్కొన్నారు.

‘‘ఇంటింటి ఆర్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని సురక్ష ప్రవేశపెట్టాం. గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాలిందే. గతంలో ప్రతీ పనికి కార్యాలయా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. వాలంటీర్లు సూర్యుడు ఉదయించక  ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ అందిస్తున్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, చంద్రబాబు పాలనలో  39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేది. గడప గడపకు వెళ్లి పెన్షన్‌ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదు’’ అని సీఎం చెప్పారు.

వాలంటీర్లు నా సైన్యం.. పేదలకు సేవ చేసే వాలంటీర్లే..  రేపు కాబోయే లీడర్లు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్ల సేవలకు గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నా. ఇవాళ్టి నుంచి వారంపాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమం. పేదవాళ్లకు మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదు. 875 మంది వాలంటీర్లకు సేవావజ్రా అవార్డులు. 4,150 మంది సేవారత్న అవార్డులతో గౌరవం. 2,50,439 మందికి సేవామిత్ర అవార్డులతో సన్మానం. 2,55,464 మంది వాలంటీర్లకు అభివందనలతో నగదు బహుమతి. లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్లు బద్దలు కొట్టారు. మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుట్టింది. చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుట్టింది. వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు. చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడు. బాబు  హామీలకు రూ. లక్షా 26 వేల 140 కోట్లు అవుతుంది. ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి.. బాబు ఏదేదో చెప్తాడు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు’’ అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

చంద్రబాబు కాలుకదపకుండా హైదరాబాద్  ఇంట్లో కూర్చుంటారు. వేరే రాష్ట్రాల్లో గెలిచిన పార్టీల హామీలు సేకరిస్తారు. ఆ హామీలన్నీ కిచిడీలు చేసి కొత్త మేనిఫెస్టో అంటారు. ఆ హామీలు అమలు చేసే పరిస్ధితి కూడా రాష్ట్రానికి ఉండదు. ఎలాగో చేసేది మోసమే కాబట్టి హామీలు ఇచ్చేస్తున్నారు. నా 8 పథకాలకు రూ.52,700 కోట్లు కావాలి. నేను ఇస్తున్న ఈ స్కీమ్‌లను టచ్‌చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. బాబు 6 హామీలు జత చేస్తే లక్షా 26 వేల కోట్లు కావాలి. నేను చాలా కష్టపడితే ఏడాదికి 70 వేల కోట్లు ఇస్తున్నా. మరి చంద్రబాబు ఏటా లక్షా 26వేల కోట్లు ఇవ్వగలరా. చంద్రబాబు ఇస్తున్న హామీలను నమ్మకండి. ఎన్నికలయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేస్తారు. ఈ నిజాలన్నీ వాలంటీర్లు ఇంటింటికీ చెప్పాలి.  ప్రజలు మోసపోకుండా వాలంటీర్లే అవగాహన కల్పించాలి’’ అని సీఎం పిలుపునిచ్చారు.

చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సైన్యమ్ సిద్ధం కావాలి. చంద్రబాబు కుట్రలను ప్రజలకు తెలియజేయాలి. అబద్దాల యోధులను మట్టి కరిపించాలి. వాలంటీర్లు నా సైన్యం. మన యువ సైన్యం రాబోయే రెండు నెలలు యుద్దానికి సిద్ధం కావాలి. మన స్టార్ క్యాంపెయినర్లు అవ్వా, తాతలు, రైతులు. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలి. మన చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చేసింది . చంద్రబాబు వస్తే చంద్రముఖీలు వస్తాయని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్దానికి సిద్ధమే. 58 నెలల పాలనలో వ్యవస్థలో మార్పు వచ్చిందంటే వాలంటీర్లే కారణం. ఒక్క జగన్ ఒక్క వైపు .. మరో వైపు దుష్టచతుష్టయం ఉంది. మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వెళ్తున్నాం. మన పాలనలో పేదలకు సొంతింటి కల సాకారం చేశాం. వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపు మంట. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ఐదేళ్ల కింద వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి పిలిపించుకోవడమే’’ అని సీఎం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబు డబుల్‌ గేమ్‌.. రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement