సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను 2500 రూపాయలకు పెంచారని వైఎస్సార్సీపీ ఎంపీ వెంకట మిథున్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం అందుతుందన్నారు. ఈ మేరకు ఎంపీ చిత్తూరులో ఆదివారం మాట్లాడుతూ.. ఎవరి రికమెండేషన్ లేకుండానే పథకాలు ఇంటిటికీ చేరుతున్నాయన్నారు. గతంలో అర్హత ఉన్నా కూడా జన్మభూమి కమిటీ చెబితేనే పెన్షన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు మాత్రమే టీడీపీ పెన్షన్ పెంచిందని దుయ్యబట్టారు.
పిల్లలు అందరూ చదువుకుని ప్రయోజకవంతులు అవ్వాలనేదే సీఎం జగన్ ఉద్దేశ్యమని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు, అప్పుడే కుటుంబాలు బాగుపడుతాయనేది ఆయన ఆలోచన అని కొనియాడారు. అందుకే పెచ్చులు ఊడిపోయే పాఠశాలలను నాడు-నేడుతో అబివృద్ది చేశారని, పిల్లలకు యూనిఫాం, భోజనం, అమ్మ ఒడి ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలుగులో చదివి ఢిల్లీలో ఉద్యోగం కావాలంటే కష్టమని అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష మీడియా తీసుకొచ్చామని చెప్పారు.
చదవండి: బయపరెడ్డీ అని కేక వేస్తే.. ఒకరు కాదు.. పది మంది వస్తారు.. ఎందుకంటే?
‘చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి కానీ పెద్దవాళ్ళ పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలా? చిన్న పిల్లలకు ఎవ్వరికీ ఓట్లు లేవు, కేవలం అందరి జీవితాల్లో మార్పు కోసమే ఈ పథకాలు. ప్రతి పథకం మహిళలకు అందిస్తున్నారు, ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. పేద ప్రజలకు సహాయం చేస్తే చంద్రబాబుకు వచ్చే బాధ ఏంటి?. గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఒక మాట చెపితే దానికి కట్టుబడి ఉంటారు. పేదలకు ఇళ్ళు లేవని ఇప్పుడు గృహ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ’ అని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చదవండి: ఛీ ఛీ పార్టీ ఆఫీస్‌లో ఇదేం పని.. బీజేపీ నేతల వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment