సాక్షి, విశాఖపట్నం: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 77.01 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. 47 లక్షల మందికి రూ.1193.88 కోట్లు పంపిణీ చేశారు. తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సెలవు రోజైనా ఆదివారం కూడా పెన్షన్లు అందించారని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు.
చదవండి: శాసనమండలి చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఆదివారం అయినప్పటికీ 60 లక్షల 80 వేల మందికి పెన్షన్ల పంపిణీ జరిగిందన్నారు. కొన్ని దూర ప్రాంతాల్లో నగదు తీసుకు వెళ్లడానికి వీలుగా లేని ప్రాంతాల్లో స్వల్పంగా అందక పోవచ్చని, స్వల్ప మొత్తం అందకపోతే తప్పుడు ప్రచారం చేయకూడదన్నారు. అనవసరపు ప్రచారాలతో అవ్వ తాతలు ఆందోళన చెందే అవకాశం వుందన్నారు. ఈ రాత్రి తొమ్మిది, పదికల్లా వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారనీ, మారుమూల ప్రాంతాల్లో నగదు తీసుకువెళ్లలేని వారి వల్ల ఆలస్యం అయి వుంటుందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment