Updates:
►తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న సీఎం జగన్
►కాకినాడలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
►సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్ పెంచాం. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నాం. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. నా జగనన్న సైన్యం వలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు.
►చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా?. అర్హత ఉంటే చాలు అందరికీ పెన్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్ రూ.58వేలు మాత్రమే ఇచ్చారు. గతానికి, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలి. మన ప్రభుత్వంలో రూ.లక్షా 47వేలు అందిస్తున్నాం. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించే వారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదు.
►గతంలో ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పెన్షన్ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్‌ను పెంచుకూంటూ రూ.3వేలు అందిస్తున్నాం. బాబు నెలకు రూ.400కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రూ.2వేల కోట్లు ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నాం.
►చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కూడా పాట్నర్. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ-5 చూపించవు.
►2014 ఎన్నికల్లో దత్తతండ్రి, దత్తపుత్రుడు ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. ఈరోజు అదే దత్తపుత్రుడు పేదలకు ఇళ్లపై అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనేది దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపింది. జైల్లో ఉన్న అవినీతిపరుడు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడు. అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు.
►53 లక్షల 52వేల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. రైతన్నలకు ప్రతీ ఏటా రూ.13,500 అందిస్తున్నాం. రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.33,300 కోట్లు జమ చేశాం. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.19,179కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించాం. 78 లక్షల 94వేల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా అందిజేస్తున్నాం.
►ప్రతీ గ్రామంలో సచివాలయం తెచ్చాం. ప్రతీ గ్రామంలోనూ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతీ గ్రామంలో మార్పు తెచ్చాం.
►ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చాం. నాడు-నేడుతో పాఠశాలలను ఆధునీకరించాం. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం మారిందల్లా ప్రభుత్వమే మాత్రమే. చంద్రబాబు హయాంలో ఇవ్వన్నీ ఎందుకు జరగలేదు.
►రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. ఎన్నికల వేళ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని నేతలు వస్తారు. అలాంటి వారితో జాగ్రత్త’ అంటూ కామెంట్స్ చేశారు.
►కాకినాడలో ఆర్వోబీని ప్రారంభించిన సీఎం జగన్
►రూ.94కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్
►పింఛన్ల పెంపు ఉత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
►పింఛన్ల మొత్తం రూ.1,967.34కోట్ల మెగా చెక్ ఆవిష్కరణ
►సభా వేదికకు చేరుకున్న సీఎం జగన్
►కాకినాడ చేరుకున్న సీఎం జగన్.
►ముఖ్యమంత్రి జగన్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీతా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు
►మరికాసేపట్లో ఆర్ఎంసీ గ్రౌండ్స్‌కు చేరుకోనున్న సీఎం జగన్
►అక్కడ జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ ఫించన్ కానుక రూ.3 వేలకు పెంపు.
►అనంతరం నగరంలో రూ.94 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించినున్న ముఖ్యమంత్రి జగన్
►సీఎం జగన్ రాకతో జనసంద్రమైన కాకినాడ నగరం
►రోడ్ షోలో పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు
►కాకినాడ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
►వైఎస్సార్ పింఛన్ కానుక రూ.3వేలకు పెంపును ప్రారంభించనున్న సీఎం
సాక్షి, తాడేపల్లి: విశ్వసనీయతకు అర్ధం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుక, ఠంఛన్‌గా పెన్షన్.
పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. ప్రతీ నెలా రూ.3,000 రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు.. నేడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేయనున్నారు.
పర్యటన ఇలా..
ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు.
వైఎస్సార్‌సీపీ రికార్డు..
►గత ప్రభుత్వంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఒక్కో లబ్దిదారుడికి నెలకు అందించిన పెన్షన్ కేవలం రూ. 1,000..
►ఐతే జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న పెన్షన్ ఒక్కో లబ్దిదారునికి రూ.3,000
►గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు
►జగనన్న ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు
►గత ప్రభుత్వంలో సగటున ఖర్చు చేసిన మొత్తం నెలకు రూ. 400 కోట్లు మాత్రమే
►జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేస్తున్న ఖర్చు నెలకు రూ. 1,968 కోట్లు, ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే దాదాపు ఐదు రెట్లు అధికం
►1 జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు.. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 83,526 కోట్ల పైమాటే.
►గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఠంఛన్‌గా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి, గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేత.. అది ఆదివారమైనా, సెలవు రోజైనా సరే..
►పెన్షన్ పెంపు ద్వారా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి.
►పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్.
పెన్షన్ పెంపు ఇలా..
జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు.
జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు.
జనవరి 2023న రూ. 2,750కు పెంపు.
జనవరి 2024న రూ.3వేలకు పెంపు.
►పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు.
►2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు.
►జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు.
►జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు.
►జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు.
►జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు.
►గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 29,51,760.
►ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు.
►పెన్షన్ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు పెంపు:
►గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు.
►2019లో పెన్షన్ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు.
►2022లో పెన్షన్ లబ్ధిదారులు రూ.62 లక్షలు.
►2023లో పెన్షన్ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు.
►2024లో పెన్షన్ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు.
పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను చూసుకుంటే..
►గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్‌గా ప్రతినెలా కొటో తేదీనే పొద్దుటే తలుపుతట్టి గుండ్ మార్నింగ్ చెప్పిమరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడపవద్దనే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందిస్తున్నారు.
►గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్ని కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది.
►నేడు, కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హులైన ఉండి ఒకవేళ ఏ కారణంచేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో బైయాన్యువల్ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు.
►పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లబ్ధిదారు ఆత్మాభిమానం నిలబడేలా వారికి సేవలు అందిస్తోంది.
►2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000
►ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనం.
►గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన, అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం.
Comments
Please login to add a commentAdd a comment