సాక్షి, విజయవాడ: పెన్షన్లు పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5 వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబిటి విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70 శాతం మంది పెన్షన్లను బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది.
ఆధార్ లింక్‌యిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం.. దివ్యాంగులు, దీర్ఘకాలిగా వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ ఖాతాలేని 25 శాతం మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment