గుంటూరుకు చెందిన అన్నపూర్ణమ్మకు పింఛన్ అందజేస్తున్న వలంటీరు ఫన్నా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 96.13 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది. వలంటీర్లు శనివారం కూడా రాష్ట్రమంతటా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. 66,15,482 మంది లబ్ధిదారులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ.1961.13 కోట్లు విడుదల చేసింది.
శనివారం వరకు మొత్తం 63,59,727 మంది లబ్ధిదారులకు రూ.1,885 కోట్లు అందజేశారు. ఇందులో దాదాపు 54 లక్షల మంది లబ్ధిదారులకు 1వ తేదీనే పింఛను డబ్బులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment