గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సెర్ప్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ బదులు సచివాలయంలో పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీకి ప్రత్యామ్నాయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయంలోని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ కార్డు, బయో మెట్రిక్ ఆధారంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానం నిలిపివేయనున్నారు. ఏప్రిల్ 3 నుంచి సచివాలయంలో పెన్షన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment