వాలంటీర్ పలకరింపునకు నోచుకోని అవ్వాతాతలు
ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు... అయన వచ్చి డబ్బులిస్తే మందులు... పప్పు ఉప్పు...సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు... చేతిలోకి పైసలు పడలేదు... ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.
అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు.. నిలబడడం.. ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ )లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. కొన్నాళ్లపాటు ఆ ఖాతా యాక్టివ్‌గా లేకపోతే ఆ ఖాతాలను బ్యాంకులు మూసేస్తాయి.
ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక ... సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు..
మగ నంగనాచి చంద్రబాబు..
ఊళ్లలో కొంతమంది నంగనాచి లేడీస్ ఉంటారు.. వాళ్ళో గదిలో మొగుణ్ణి చావచితక్కొట్టి మళ్ళీ వీధుల్లోకి వచ్చి.. అయ్యో నా మొగుడు నన్ను చంపేసినాడమ్మో... నా మొగుడు.. కొట్టీసినాడమ్మో అంటూ వీధిలోకి వచ్చి వీరంగం వేస్తారు... ఇప్పుడు చంద్రబాబు సైతం మగ నంగనాచి పాత్రలో జీవిస్తున్నారు... మార్చి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్షన్లు అందించే వాలంటీర్లను కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు అయ్యో వృద్ధులు అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు.
వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇస్తే అది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అంశం అవుతుంది కాబట్టి.. ఆ డోర్ డెలివరీకి ఆపాలంటూ కోర్టులు, ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకున్న చంద్రబాబుకు వెనువెంటనే విషయం అర్థమైంది. ఏప్రిల్లో ఇలాగే ఎండల్లో లబ్ధిదారులు బ్యాంకులు.. సచివాలయాలు వద్దకు వెళ్లి పెన్షన్లను తీసుకుంటూ... చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు.. దీంతో ఇదేదో తనకు వ్యతిరేకత అయ్యేలా ఉందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇదంతా జగన్ కుట్ర అని, పెన్షన్లు ఎగ్గొట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఎదురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ మేలో కూడా మరింత మండుతున్న ఎండల్లో వృద్ధులు మళ్ళీ బ్యాంకులవద్ద పడిగాపులు కాయడం.. దీనికి చంద్రబాబే కారణం అని వాళ్ళు గుర్తించి ఆయన్ను తిడుతుండడంతో ఏమి చేయాలో తెలియక చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు..
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment