బాన్సువాడ: ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఫించన్ల పంపిణీ ఎట్టకేలకు ప్రారంభమైంది. గతంలో వివిధ రకాల సామాజిక ఫించన్లు పొందుతున్నవారితో పాటు, కొత్తవారికి ఫిం చన్లు పంపిణీ చేసేందకు ప్రభుత్వం ‘ఆసరా’ పథకాన్ని ప్రవేశపెట్టింది.
అయినప్పటికీ, తమకు ఫించన్లు వస్తాయో రావోననే ఆందోళన కొందరు లబ్ధిదారులను వెంటాడుతోంది. వయోభారంలో ఉన్న పండుటాకులు, భర్తను కోల్పోయిన అభాగ్యులు, వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్న వివిధ వృత్తిదారులు ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నా రు. ఇటీవల ఫించను మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచడంతో పోటీ పెరిగింది.
కొత్త జాబితాతో కలవరం
జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో శని వారం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభిం చారు. కొత్త జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చాలా చోట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఫించన్ల కోసం ప్రతీ గ్రామం నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. నేటికీ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. గత నెల 20 నుంచే ఆయా గ్రామాలలో దరఖాస్తుల విచారణ ప్రారంభించారు.
మున్సిపాలిటీలలో విచారణ ఆలస్యంగా ప్రారంభమైంది. రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అధికారుల రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు వృద్ధులు వారు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తహ శీలు కార్యాలయాలకు త ండోపతండాలుగా తరలి వచ్చి వాకబు చేస్తున్నారు. కొందరు లబ్ధిదారులు ఉదయం ఎనిమిది గంటలకే పరగడుపున అధికారుల వద్దకు చేరుకుని తమ గురించి విచారణ జరపాలని వేడుకొంటున్నారు.
ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుందో అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. విచారణ నత్తనడకన సాగుతోంది. ఎక్కువ మందిని విచారించాల్సి రావడంతో బృందాలుగా వెళ్తున్న రెవెన్యూ సిబ్బంది, దరఖాస్తుదారుల చిరునామా లభిం చక ఇబ్బందుల పాలవుతున్నారు.
అధికారులకు తలనొప్పి
అనేక గ్రామాలలో నిర్ణీత లక్ష్యం కన్నా అధికంగా అర్హులు ఉండడంతో ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. సీలింగ్ మించి ఎంపిక చేయరాదని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతి గ్రామంలో ఐదు శాతం వృద్ధులు, ఐదు శాతం వితంతువులు, మూడు శాతం వికలాంగులను మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది.
గ్రామ జనాభా ఆధారంగా ఎస్‌సీలు 80 శాతం, ఎస్‌టీలు 75 శాతం, బీసీలు 50 శాతం, ఓసీలు 20 శాతం మేర ఫించన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. కొన్ని గ్రామాలలో ఓసీలు 20 శాతానికి మించి అర్హులున్నప్పటికీ వారు ఎంపికయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం మండలానికి వెయ్యి ఫించన్లను అందించేందుకు రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం.
జిల్లాలో గతంలో ఫించన్లు పొందుతున్నవారిలో సుమారు 50 వేల మంది తమ ఫించన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎందరు లబ్ధిదారులను ఎంపిక చేశారనే విషయం అధికారికంగా వెల్లడించలేదు.
ఫింఛన్... టెన్షన్
Published Sun, Nov 9 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement