Observation admissions
-
వడపోత
రేపటిలోగా జీఓ 59 దరఖాస్తుల పరిశీలన ఆ తర్వాత క్షేత్రస్థాయికి అధికారులు ఆరు కేటగిరీలు మినహా అన్నింటికీ మోక్షం ఆగస్టులో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జీఓ 59 దరఖాస్తుల వడపోత మొదలైంది. అభ్యంతరకర స్థలాల జాబితాను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల పరిశీలనకు నడుంబిగించిన జిల్లా యంత్రాంగం.. ముందుగా క్రమబద్ధీకరణకు అనువుగాని స్థలాలకు సంబంధించిన అర్జీలను వేరు చేస్తోంది. ఆగస్టు నెలాఖరులోగా జీఓ 59 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర సర్కారు గడువు నిర్ధేశించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఇప్పటికే మార్గదర్శకాలను కూడా జారీచేసింది. 27 అంశాలతో కూడిన చెక్లిస్ట్ను కూడా అందజేసింది. ఈ మేరకు స్థలాల క్రమబద్ధీకరణ పర్వాన్ని కొనసాగించాలని నిర్ధేశించింది. 125 గజాల్లోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీఓ 58 కింద ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన అధికార యంత్రాంగం.. చెల్లింపు కేటగిరీలోనూ అదే తరహాలో ముందుకు నడవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా వివాదాస్పద /అభ్యంతరకర స్థలాల క్రమబద్ధీకరించకూడదని సంకల్పించిం ది. మరీ ముఖ్యంగా అభ్యంతరకర భూములుగా తేల్చిన వక్ఫ్, రైల్వే, రక్షణ, రిజర్వ్ఫారెస్ట్లు, ఖాళీ స్థలాలు, పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాల జోలికి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఇవేకాకుండా ఎఫ్టీఎల్, శిఖం, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, శ్మశానవాటికల్లో కట్టడాలను క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, జీఓ 58 కింద వచ్చిన ఇలాం టి దరఖాస్తులను రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించినట్లు చెప్పారు. భూమి స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటున్న సర్కారు.. ఒక్కో దరఖాస్తును ని శితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇదే సూత్రం చెల్లింపు కేటగిరీలో వచ్చిన దరఖాస్తులకూ వర్తిస్తుందని చెప్పారు. కాగా, అభ్యంతరకర స్థలాల జాబితా సోమవారంలోపు కొలిక్కివస్తుందని, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అధికారుల బృందాలు పర్యటించి క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలిస్తారని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, జీఓ 59 కింద జిల్లావ్యాప్తంగా 11,744 దరఖాస్తులు రాగా, దీనికి సంబంధించి ఖజానాకు రూ.68.92 కోట్ల రాబడి వచ్చింది. క్రమబద్ధీకరణకు నోచుకునే నిర్మాణదారులు ఐదు విడతలుగా నిర్ధేశిత కనీస ధర చెల్లించే వెసులు బాటు కల్పించిన తరుణంలో.. క్రమబద్ధీకర ణతో సుమారు రూ.250 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఓ ఘట్టం ముగిసింది
గ్రేటర్లో పింఛను దరఖాస్తుల పరిశీలన పూర్తి 1.55 లక్షల మంది అర్హులుగా గుర్తింపు 96,590 దరఖాస్తుల తిరస్కృతి మరోసారి దరఖాస్తుకు అవకాశం సిటీ బ్యూరో: సామాజిక పింఛన్లకు సంబంధించి కీలక ఘట్టమైన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా సామాజిక పింఛన్లకు 1,55,253 మందిని ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్ జిల్లాలో 87,217 మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో 68,036 మంది ఉన్నారు. అక్టోబర్ నుంచి పెంచిన కొత్త పింఛన్ల అమలుకు పూనుకున్న ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించగా... ఎట్టకేలకు నగరంలో సమగ్ర కుటుంబ సర్వే లింకుతో ఈ తంతు పూర్తి చేశారు. అనర్హులు 96 వేలకు పైనే... నగరంలో సామాజిక పింఛన్లకు 2,51,843 దరఖాస్తులు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వే లింకుతో దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 1,55,253 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన 96,590 దరఖాస్తుదారులను అనర్హులుగా తిరస్కరించారు. వీరిలో అర్హులు ఉండీ...తిరస్కారానికి గురైతే తిరిగి ఆర్డీఓకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి అధికారులు అవకాశం కల్పించారు. ఇలాంటి దరఖాస్తులపై ఆర్డీఓ పర్యవేక్షణలో విచారణ చేపట్టి .. అర్హులకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక ఇలా... రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో సామాజిక పింఛన్లకు వచ్చిన 1,13.456 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 68,036 మందిని అర్హులుగా గుర్తించారు. 45,420 దరఖాస్తులను తిరస్కరించారు. హైదరాబాద్ జిల్లాలో సామాజిక పింఛన్లకు వచ్చిన 1,38,387 దరఖాస్తులలో... 87,217 అర్హమైనవిగా గుర్తించారు. మిగిలిన 51,170 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో అర్హత సాధించిన లబ్ధిదారుల్లో వికలాంగుల పింఛన్లకు 15,728 మంది,వితంతు పింఛన్లకు 39,860 మంది ఉన్నట్టు తేల్చారు. వృద్ధాప్య పింఛన్లకు 31,629 మంది ఎంపికయ్యారు. త్వరలో పంపిణీ నగరంలో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన అధికార యంత్రాంగం సత్వరమే పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై దృష్టి సారిస్తోంది. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి పింఛన్లు అందజేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. -
భారీగా వడపోత
89 వేలకు పైగా పింఛను దరఖాస్తుల తిరస్కృతి వచ్చిన దరఖాస్తులు 2.71 లక్షలు ఇంకా పరిశీలించాల్సినవి 49వేలు సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ సామాజిక పింఛన్లకు అర్హులుగా 1,32,951 మందిని ఎంపిక చేశారు. అక్టోబర్ నుంచి పెంచిన కొత్త పింఛన్లను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 30లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించింది. నగర, పట్టణ ప్రాంతాల్లోనే పరిశీలన పూర్తి కాకపోవడంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గ్రేటర్ పరిధిలో ఇంకా 49,261కి పైగా పింఛను దరఖాస్తులను పరిశీ లించాల్సి ఉంది. నగరంలో సామాజిక పింఛన్లకు 2,71,837 దరఖాస్తులు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వే లింకుతో ఇప్పటి వరకు 2,22,576 పరిశీలించారు. వీటిలో 1,32,951 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. మిగిలిన 89,625 దరఖాస్తులను తిరస్కరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే వాటిని తిరస్కరించినట్లు అధికార వర్గాల వివరణ. వీరందరూ పునః పరిశీలనకు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు పేర్కొంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక 60 శాతమే సామాజిక పింఛన్లకు ఎంపిక విధానాన్ని పరిశీలిస్తే... నగరంలో 60 శాతానికి మించలేద ని తెలుస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా ల్లో పింఛన్ల పరిస్థితిని చూస్తే... రంగారెడ్డి జిల్లాలోని పట్టణ ప్రాంతంలో పింఛన్లకు 1,33,450 దరఖాస్తులు రాగా, వాటిలో 1,13.456 పరిశీ లించారు. అందులో 68,036 మందిని అర్హులు గా గుర్తించారు. 45,420 దరఖాస్తులను తిరస్కరించారు. హైదరాబాద్ జిల్లాలో పింఛన్లకు 1,38,387 దరఖాస్తులు అందాయి. వాటిలో 1,09,120 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 64,915 మందిని ఎంపిక చేశారు. మిగిలిన 44,205 దరఖాస్తులు నిబంధనల మేరకు లేవని తిరస్కరించారు. ► ఈ జిల్లాలో వికలాంగుల పింఛన్లకు 22,998 దరఖాస్తులు రాగా, వాటిలో 17,942 పరిశీలించారు. 11,296 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. 6,646 దరఖాస్తులను తిరస్కరించారు. ► వితంతు పింఛన్లకు 59,265 దరఖాస్తులు అందాయి. 47,505 దరఖాస్తునలు పరిశీలించి... 30,625 అర్హమైనవిగా గుర్తించారు. 16,880 దరఖాస్తులను తిరస్కరించారు. ► వృద్ధాప్య పింఛన్లకు వచ్చిన దరఖాస్తులు 56,124. అధికారులు పరిశీలించినవి 46,673. అర్హమైనవి 22,994. తిరస్కరణకు గురైనవి 23, 679 దరఖాస్తులు. గ్రేటర్లో సర్వేకు కష్టాలు నగరంలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి స్థాయిలో కాకపోవటంతో పింఛను దరఖాస్తుల పరిశీలన జాప్యమవుతోంది. ఈ దరఖాస్తుల ఆధారంగా సమగ్ర కుటుంబ సర్వే కొనసాగిస్తూనే... వాటిని పరిశీలించడం సిబ్బందికి కత్తి మీద సాములా మారింది. దరఖాస్తుల ఆధారంగా ఇప్పటి వరకు 50 వేలకు పైగా కుటుంబాలలో సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సర్వేకు ఉపాధ్యాయులు సెలవు దినాలను సైతం లెక్క చేయకుండా సహకరించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్కిళ్ల వారీగా సమగ్ర సర్వే సాఫ్ట్వేర్ వివరాలను మండల యూనిట్‌గా అనుసంధానం చేసుకుని దరఖాస్తులు పరిశీలించారు. అయినప్పటికీ గ్రేటర్లో ఇంకా పరిశీలించాల్సిన దరఖాస్తులు 49,261 ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లావి 29,261 ఉన్నాయి. -
భద్రతా కార్డుల పరిశీలన మళ్లీ మొదటికి!
పరిగణనలోకి నూతన ఆదాయ, భూపరిమితి పెంపు * ఆహార భద్రతా కార్డుల జారీపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు * 48 లక్షల దరఖాస్తులకూ తప్పని పునఃపరిశీలన * డిసెంబర్ 15 నాటికి పూర్తి చే యాలని ప్రభుత్వ నిర్ణయం * జనవరి 15 తరువాతే కార్డుల జారీ సాధ్యమంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందజేయనున్న ఆహార భద్రతా కార్డు (ఎఫ్ఎస్సీ) దరఖాస్తుల పరిశీలన మళ్లీ మొదటికొచ్చింది. రేషన్‌కార్డు పొందేందుకు ఉన్న ఆదాయ, భూపరిమితిని పెంచిన నేపథ్యంలో అందుకనుగుణంగా ఆహారకార్డుల లబ్ధిదారుల ఎంపిక పరిశీలన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు తాజాగా మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. దీంతో మొత్తం 96 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు పూర్తిచేసిన 48 లక్షల దరఖాస్తుల పునఃపరిశీలన అనివార్యంగా మారింది. ఇప్పటికే పింఛన్ దరఖాస్తుల పరిశీలనలో ఊపిరిసలపని క్షేత్రస్థాయి అధికారులకు డిసెంబర్ 15 నాటికి భద్రతాకార్డుల పరిశీలనా పూర్తిచేయాలని ప్రభుత్వం విధించిన గడువు తలకుమించిన భారంగా మారనుంది. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్తగా ఇచ్చిన మార్గదర్శకాల మేరకు దరఖాస్తుల పరిశీలన జరపాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 90 శాతం, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, కరీంగనర్ జిల్లాల్లో 50 శాతానికి పైగా దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఒక్క అనర్హుడికి కార్డు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని ఓ పక్క ప్రభుత్వం హెచ్చరిస్తున్న తరుణంలో కొత్త మార్గదర్శకాల మేరకు కచ్చితంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాల్సి ఉంటుందని, పనిభారం రెండింతలు అవుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్ 15 నుంచి సాధ్యమేనా..? ఇదిలా ఉండగా వచ్చేనెల 15 నుంచి లబ్ధిదారులకు ఆహార భద్రతా కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిర్ణీత గడువులో ఇప్పటికే పరిశీలన చేసిన కార్డులతో పాటు అదనపు 50 లక్షల కార్డులను ఈ సమయంలోగా పూర్తి చేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలన కొంత చురుగ్గా సాగినా, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి పట్టణాల్లో నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం కష్టమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్యను బట్టి జనవరి రెండోవారానికి గానీ కొత్త కార్డుల జారీ సాధ్యమని స్పష్టం చేస్తున్నాయి. -
జర.. ఆగండి!
86 వేల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం కుటుంబ సర్వే పూర్తయితేనేపింఛన్లు {పభుత్వానికి నివేదించిన అధికార గణం తదుపరి చర్యల కోసం ఎదురుచూపులు మండల కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు గ్రేటర్ హైదరాబాద్‌లో కుటుంబ సమగ్ర సర్వే వివరాలు లేకపోవటంతో సామాజిక పింఛన్లకు వచ్చిన 86 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తిగా నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొంది. ఇదే పరిస్థితి ఆహార భద్రతా కార్డులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనలోనూ ఎదుర వబోతోంది. దీనికి ప్రధాన కారణం నగరంలో 25 శాతానికి పైగా సమగ్ర కుటుంబ సర్వే జరగకపోవటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక పింఛను దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సమగ్ర కుటుంబ సర్వేతో ముడిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడ ంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇది దరఖాస్తుదారులకు శాపంగా మారింది. - సాక్షి, సిటీబ్యూరో నగరంలో సామాజిక పింఛన్లకు తాజాగా 2.49 లక్షల దరఖాస్తులు వచ్చా యి. వీటిలో ఇప్పటి వరకు 1.63 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిశీలించిన అధికారులు 1.17 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలిపోయిన 86 వేల దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వే వివరాలు లేనందున పరిశీలించలేదు.ఈ విషయాన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటినిర్ణయం వెలువడలేదు. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఒక వైపు దరఖాస్తుదారుల నుంచి పింఛన్ల కోసం ఒత్తిడి... మరో వైపు ఉన్నతాధికారుల నుంచి స్పందన కనిపించకపోవటంతో అధికారులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. సర్కారు నుంచి సరైన నిర్ణయం వస్తే గానీ ఈ దరఖాస్తుల పరిశీలనకు మోక్షం లభించే పరిస్థితి కనిపించటం లేదు. మిగిలిపోయిన ప్రాంతాల్లో మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తే తప్ప ఈ దరఖాస్తుల పరిశీలన సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. పరిశీలనకు నోచుకోని దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాకు చెందినవి 56 వేలు ఉండగా, రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని దరఖాస్తులు 30 వేలకు పైగా ఉన్నాయి. కారణాలివే... సమగ్ర కుటుంబ సర్వే సమయంలో నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన వేలాది నిరుపేద కుటుంబాలు గ్రామాలకు తరలిపోవటం వల్ల ఇక్కడి సర్వేలో పాల్గొనలేకపోయారు. సొంత ప్రాంతంలోని కుటుంబ సర్వేలో పాల్గొన్న వారంతా మళ్లీ ఇక్కడా దరఖాస్తుచేశారు. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో.. అక్కడి నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని... విచారణ కు అందుబాటులో ఉండాలని అధికారులు సూచించటంతో అలా చేశారని తెలుస్తోంది. మరోపక్క గ్రేటర్లో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వే కార్పొరేషన్ సర్కిళ్ల వారీగా చేపట్టారు. ఒక్కో సర్కిల్లో రెండు, మూడు మండలాలతో పాటు డివిజన్లు ఉన్నాయి. ఇంకోవైపు సామాజిక పింఛన్ల కోసం మండలం యూనిట్‌గా దరఖాస్తులు స్వీకరించారు. దీంతో సమగ్ర కుటుంబ సర్వేను పింఛన్ దరఖాస్తులతో ముడిపెట్టడానికి సాఫ్ట్వేర్ సహకరించలేదు. ఇది కూడా దరఖాస్తుల పరిశీలనకు అంతరాయంగా మా రింది. సాంకేతిక అధికారులు కుటుంబ సర్వేను మండల యూనిట్‌గా మార్చుకోవటం ద్వారా కొంత ప్రగతిని సాధించగలిగారు. సర్వే కాని ప్రాంతాలకు సంబంధించిన సామాజిక పింఛన్ల దరఖాస్తుల పరిశీలన కష్టతరంగా మారటంతో నిలిపివేశారు. తప్పని ప్రదక్షిణలు దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపికలో జాప్యంతో దరఖాస్తుదారుల్లో టెన్షన్ పెరుగుతోంది. నగరంలో ఇప్పటి వరకు 5200 మందికే పింఛన్లు పంపిణి చేసి...మిగిలిన వారిని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి గతంలో మాదిరిగానే పింఛన్లు తీసుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలియక తల్లడిల్లుతున్నారు. వీరికి సమాధానం చెప్పేవారే కనిపించడం లేదు. తిరగలేకపోతున్నా... నాది బండ్లగూడ మండలం ఫాతీమానగర్. 80 ఏళ్ల వికలాంగురాలిని. అధికారుల సూచన మేరకు గత నెల 17వ తేదీనా కార్యాలయానికి వచ్చి అతికష్టం మీద పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకూ విచారణ కోసం మా ఇంటికి ఎవరూ రాలేదు. ఇప్పటికే కొంత మంది పింఛన్లు తీసుకున్నారు. నా పింఛన్ కోసంకాళ్లరిగేలా తిరుగుతున్నా. - రహమత్బీ, ఫాతీమానగర్ -
ఫింఛన్... టెన్షన్
బాన్సువాడ: ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఫించన్ల పంపిణీ ఎట్టకేలకు ప్రారంభమైంది. గతంలో వివిధ రకాల సామాజిక ఫించన్లు పొందుతున్నవారితో పాటు, కొత్తవారికి ఫిం చన్లు పంపిణీ చేసేందకు ప్రభుత్వం ‘ఆసరా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, తమకు ఫించన్లు వస్తాయో రావోననే ఆందోళన కొందరు లబ్ధిదారులను వెంటాడుతోంది. వయోభారంలో ఉన్న పండుటాకులు, భర్తను కోల్పోయిన అభాగ్యులు, వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్న వివిధ వృత్తిదారులు ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నా రు. ఇటీవల ఫించను మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచడంతో పోటీ పెరిగింది. కొత్త జాబితాతో కలవరం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో శని వారం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభిం చారు. కొత్త జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చాలా చోట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఫించన్ల కోసం ప్రతీ గ్రామం నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. నేటికీ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. గత నెల 20 నుంచే ఆయా గ్రామాలలో దరఖాస్తుల విచారణ ప్రారంభించారు. మున్సిపాలిటీలలో విచారణ ఆలస్యంగా ప్రారంభమైంది. రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అధికారుల రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు వృద్ధులు వారు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తహ శీలు కార్యాలయాలకు త ండోపతండాలుగా తరలి వచ్చి వాకబు చేస్తున్నారు. కొందరు లబ్ధిదారులు ఉదయం ఎనిమిది గంటలకే పరగడుపున అధికారుల వద్దకు చేరుకుని తమ గురించి విచారణ జరపాలని వేడుకొంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుందో అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. విచారణ నత్తనడకన సాగుతోంది. ఎక్కువ మందిని విచారించాల్సి రావడంతో బృందాలుగా వెళ్తున్న రెవెన్యూ సిబ్బంది, దరఖాస్తుదారుల చిరునామా లభిం చక ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారులకు తలనొప్పి అనేక గ్రామాలలో నిర్ణీత లక్ష్యం కన్నా అధికంగా అర్హులు ఉండడంతో ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. సీలింగ్ మించి ఎంపిక చేయరాదని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతి గ్రామంలో ఐదు శాతం వృద్ధులు, ఐదు శాతం వితంతువులు, మూడు శాతం వికలాంగులను మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది. గ్రామ జనాభా ఆధారంగా ఎస్సీలు 80 శాతం, ఎస్టీలు 75 శాతం, బీసీలు 50 శాతం, ఓసీలు 20 శాతం మేర ఫించన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. కొన్ని గ్రామాలలో ఓసీలు 20 శాతానికి మించి అర్హులున్నప్పటికీ వారు ఎంపికయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం మండలానికి వెయ్యి ఫించన్లను అందించేందుకు రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఫించన్లు పొందుతున్నవారిలో సుమారు 50 వేల మంది తమ ఫించన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎందరు లబ్ధిదారులను ఎంపిక చేశారనే విషయం అధికారికంగా వెల్లడించలేదు. -
నత్తనడకన ‘ఆహార భద్రత’!
దరఖాస్తుల్లో పది శాతమే పూర్తయిన పరిశీలన పింఛన్ దరఖాస్తుల పరిస్థితీ అంతే భారీగా దరఖాస్తులు రావడం వల్లే ఆలస్యమవుతోందంటున్న అధికారులు హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు, పింఛన్ల మంజూరు కోసం స్వీకరించిన దర ఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించగా... ఇప్పటివరకు ఆహార భద్రత కు సంబంధించి పది శాతం, పింఛన్‌కు సం బంధించి 20 శాతం దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. అయితే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పరిశీలన ఆలస్యమవుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 1,500 పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో... అర్హులతో పాటు అనర్హులు కూడా భారీ సంఖ్యలో వీటికోసం దరఖాస్తులు చేసుకున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముందని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం సంతృప్త స్థాయిలోనే 31.67 లక్షల పెన్షన్లు ఉండగా... తాజాగా వచ్చిన దరఖాస్తులు 37.94 లక్షలను మించిపోయాయని అధికారవర్గాలు తెలిపాయి. అదే విధంగా ప్రస్తుతమున్న రేషన్‌కార్డుల్లో లక్షల సంఖ్యలో బోగస్ అని ప్రభుత్వం భావిస్తుండగా... తాజా గా ఆహార భద్రత కార్డుల కోసం 92.73 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయని పేర్కొన్నాయి. ఇందులోనూ శనివారం నాటికి 8.33 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నవంబర్ 8వ తేదీన కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. అది సాధ్యమయ్యే అవకాశం కనిపించకపోవడంతో నవంబర్ 20వ తేదీకి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహా ర భద్రత దరఖాస్తుల్లో 30 లక్షలకుపైగా.. పింఛన్ దరఖాస్తుల్లోనూ సగం వరకూ తిరస్కరణకు గురయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ‘సమగ్ర సర్వే’ ఆధారంగా చూస్తే.. తెలంగాణలో పింఛన్లు ఇరవై లక్షలకు మించరాదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా వచ్చేనెల మాత్రమే పెన్షన్‌దారులకు నేరుగా నగదు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్లను పూర్తిగా పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర పోస్టుమాస్టర్ జనరల్ సంధ్యారాణి, ఇతర అధికారులతో సంప్రదింపులు జరిపింది.