- ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు
- బంధువుల ఇంటివద్ద కోలుకుంటున్న బాధితుడు
దివ్యాంగుడికి పింఛను పంపిణీ
Published Fri, Nov 4 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
నల్లూరు(కపిలేశ్వరపురం) :
మండలంలోని నల్లూరుకు చెందిన గుత్తుల వీరవెంకట సత్యనారాయణ అలియాస్ కొండయ్య కుటుంబ సభ్యులకు అధికారులు శుక్రవారం పింఛను పంపిణీ చేశారు. పింఛను రాకపోవడంతో మనస్తాపానికి గురైన కొండయ్య గురువారం బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొండయ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ప్రస్తుతం బంధువుల ఇంటి వద్ద కోలుకుంటున్నాడు. కాగా వైఎస్సార్ సీపీ నాయకులు కుడుపూడి సత్యనారాయణ (చిన్నా), సవిలే శరత్, నరాల వెంకట్రావు కొండయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అఘాయిత్యంతో పింఛను పంపిణీకి సంబంధం లేదు
ఇంటి వద్ద ఇతర కారణాలతో అఘాయిత్యానికి పాల్పడి అందుకు పింఛను ఇవ్వకపోవడమేననడంతో çసంబంధం లేదని ఎంపీడీఓ అబ్రహం లింక¯ŒS శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలిముద్రలు, ఐరిష్ సమస్యలు తలెత్తడంతో సత్యనారాయణకు ఏడాది కాలంగా కార్యదర్శి వేలిముద్రతో పింఛను ఇస్తున్నామని, ఆధార్‌ను మీ సేవా కేంద్రంలో అప్‌డేట్ చేసుకోమని చెప్తున్నా లబ్ధిదారుడుస్పందించలేదన్నారు. అందువల్లే సెప్టెంబరు నుంచి పింఛన్ నిలిచిపోయిందని, ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో కుటుంబ సభ్యులకు పింఛను అందజేశామని ఎంపీడీఓ తెలిపారు. కాగా ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎస్సై పెద్దిరాజు ఆత్మహత్యాయత్నం నేరం మీద కొండయ్యపై కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement