
విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సాగరం పంచాయతీ శివారు ఓకే శ్రీరాంపురం గ్రామానికి చెందిన వుట జగ్గయ్యమ్మకు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ రమేష్
సాక్షి, అమరావతి: సెలవు రోజు అయినా ఆదివారం కూడా గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ఈ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60.81 లక్షల మందికి పింఛను డబ్బులు విడుదల చేయగా.. తొలి 3 రోజుల్లో 59,31,526 మంది (97.53 శాతం) లబ్ధిదారులకు రూ.1,385.16 కోట్లను అందజేశారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా సోమ, మంగళవారాల్లో వారి ఇళ్ల వద్దే వలంటీర్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment