inthiyaz
-
అతను మృగాడే.. వెలుగులోకి ఇంతియాజ్ ఆగడాలు
సాక్షి, కదిరి(అనంతపురం జిల్లా): రాళ్లపల్లి ఇంతియాజ్. కందికుంట అనుచరుడు. తెలుగు యువత నల్లచెరువు మండల ప్రధాన కార్యదర్శి. మెడలో పసుపు కండువాతో కనిపించే ఇంతియాజ్‌కు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవటం అలవాటు. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిలను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించడం.. ఆ తర్వాత వారిని లైంగికంగా వేధించడం అతనికి పరిపాటి. ఈ క్రమంలోనే తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణిని వేధించాడు. ‘నన్ను ప్రేమించక పోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతాను’ అంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో తాను ఇంతియాజ్ వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టంగా పేర్కొంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. గతంలోనూ ఓ యువతికి వేధింపులు ఇంతియాజ్ గతంలోనూ నల్లచెరువు మండలంలో ఓ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వేధించాడు. దీంతో సదరు యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన టీడీపీ పెద్దలు దుప్పటి పంచాయితీ చేసి అతనిపై కేసు లేకుండా చేశారు. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకోవడం, ప్రేమలోకి దింపడం, చివరకు బ్లాక్మెయిల్ చేసి కామవాంఛ తీర్చుకోవడం ఇంతియాజ్‌కు అలవాటుగా మారింది. కుటుంబ పరువు బజారున పడుతుందనే భయంతో ఎంతోమంది తమకు జరిగిన అన్యాయాన్ని బయట చెప్పుకోలేక పోయారు. సంధ్యారాణి ఆత్మహత్య ఘటనతో ఇంతియాజ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చంపుతామని సీఐకి బెదిరింపు ఇటీవల కదిరి ఎన్జీఓ కాలనీకి సంబంధించిన భూ వివాదంలో దూరిన కందికుంట, ఆయన అనుచరులు భూ యజమానులపై దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో జేసీబీ అద్దాలు పగలగొట్టడంతో పాటు వారి ఆగడాలను అడ్డుకోవాలని చూసిన పట్టణ సీఐ తమ్మిశెట్టి మధుపై కూడా దాడికి యత్నించారు. వారిలో సంధ్యారాణి మృతికి కారణమైన రాళ్లపల్లి ఇంతియాజ్ కూడా ఉన్నారు. ‘మా అన్న కందికుంటనే అడ్డుకుంటావా? నీకెంత ధైర్యం. నిన్ను నరికి చంపుతాం..’ అంటూ కందికుంట అనుచరుడు మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో బాగా వైరల్ అయింది. అయినా పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందువల్లే పేట్రేగి పోతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో హైడ్రామా కదిరి టౌన్: సంధ్యారాణి ఆత్మహత్య కేసులో పోలీసులు శుక్రవారం ఇంతియాజ్‌ను అదుపులోకి తీసుకోగా, అతను నాటకానికి తెరలేపాడు. కదిరి కోర్టులో, ప్రభుత్వ ఆస్పత్రిలో తనను పోలీసులు కొట్టారంటూ హంగామా చేశాడు. అంతకుముందు తనకు ఆరోగ్యం సరిగా లేదని పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా, పరీక్షించిన వైద్యులు అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. దీంతో పోలీసులు న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇంతియాజ్‌ను రిమాండ్‌కు తరలించారు. -
కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ అరెస్ట్
-
59.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: సెలవు రోజు అయినా ఆదివారం కూడా గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ఈ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60.81 లక్షల మందికి పింఛను డబ్బులు విడుదల చేయగా.. తొలి 3 రోజుల్లో 59,31,526 మంది (97.53 శాతం) లబ్ధిదారులకు రూ.1,385.16 కోట్లను అందజేశారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా సోమ, మంగళవారాల్లో వారి ఇళ్ల వద్దే వలంటీర్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. -
విజయవాడలో కొత్తగా 10 కంటైన్మెంట్ జోన్లు
సాక్షి, విజయవాడ : కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో కొత్తగా 10 కంటైన్మెంట్ జోన్లను కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. ఎ.కొండూరు మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామం, చాట్రాయి మండలంలోని బూరుగుగుడెం గ్రామం, చాట్రాయి మండలంలోని ఆరుగొలనుపేట గ్రామం, గుడివాడ మండలంలోని మందపాడు గ్రామం, గూడూరు మండలంలోని కప్పల దొడ్డి గ్రామం,ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామం, ముసునూరు మండలంలోని గుల్లపూడి గ్రామం, నందిగామ మండలంలోని మాగల్లు గ్రామం, నందివాడ మండలంలో పుట్టగుంట గ్రామం, వీరుల్లపాడు మండలంలోని గూడెం మాధవరం గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (ఏపీలో కొత్తగా 6,235 పాజిటివ్ కేసులు) -
పరీక్షల శాతం పెంచేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు
-
తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్
సాక్షి, విజయవడ: విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక విమానాల్లో విదేశాల నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. సోమవారం ఉదయానికి తొలి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనుందన్నారు. ముంబాయి నుంచి హైరారబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్టుకు తరలింపు జరుగుతుందన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. (కేర్ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!) కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారంతా గన్నవరం ఎయిర్‌పోర్టుకే వస్తారని ఆయన చెప్పారు. 14 రోజులపాటు క్వారెంటైన్‌కు తరలిస్తామన్నారు. ప్రభుత్వ క్వారెంటైన్లో ఉండేందుకు ఇష్టపడని వారికోసం పెయిడ్ క్వారెంటైన్ కేంద్రాలు సిద్ధం చేశామని ఆయన అన్నారు. విజయవాడలోని పలు హోటళ్లు, లాడ్జ్‌ల్లో 1200 రూములు సిద్ధం చేశామన్నారు.నాలుగు కేటగిరీలుగా రూములను కేటాయిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్‌లో హోటళ్లకు తరలిస్తామని చెప్పారు. 14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతామని వివరించారు. పెయిడ్ క్వారెంటైన్ల వద్ద మెడికల్ టీం, పారిశుధ్య సిబ్బంది ఉంటారని తలిపారు. పోలీసుల పర్యవేక్షణ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌ని వినియోగిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. (ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు) -
నిరుపేదలకు ‘గోరుముద్ద’
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): నగర పాలక సంస్థ, అమృత హస్తం సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు ఉద్ధేశించిన ‘గోరుముద్ద’ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. సాంబమూర్తి రోడ్డులోని అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ఆవరణలో ‘గోరుముద్ద’ కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రారంభించారు. నిరుపేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వీఎంసీ, అమ్మహస్తం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు. తొలిరోజు భోజనం అందించేందుకు సహకరించిన జస్టిస్ ఆర్.మాధవరావును ప్రత్యేకంగా అభినందించారు. నిరుపేదలకు ఆపన్నహస్తం అందించాలని కోరారు. వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నగర పరిధిలో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నేరుగా భోజనం సమకూరిస్తే పేదలకు అమృతహస్తం ట్రస్ట్ పంపిణీ చేస్తుందన్నారు. హోటల్స్, కల్యాణ మండపాలు, ఇతర వేదికల్లో జరిగే శుభాకార్యాల్లో మిగిలిన భోజనం పారేయకుండా ఫోన్ (9246472100) చేసి ట్రస్ట్‌కు సమాచారం అందిస్తే వాటిని తీసుకొచ్చి ‘గోరుముద్ద’ కార్యక్రమంలో పేదలకు అందించడం జరుగుతుందన్నారు. అమృతహస్తం ట్రస్ట్ ఎంతో కాలంగా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గుర్తించి వీఎంసీ తరఫున అవసరమైన వసతులు కల్పించిందని తెలిపారు. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ గోరుముద్ద పేరుతో పేదలకు భోజన సౌకర్యం కల్పించడం మంచి కార్యక్రమం అన్నారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యమన్నారు. అనంతరం స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కన్జూమర్ కోర్టు జడ్జి ఆర్ మాధవరావు, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా కరుణశ్రీ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్సు) యు.శారదాదేవి, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. -
ఎంపికైన వారందరు శాశ్వత ఉద్యోగులే...
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజల గుమ్మం ముందుకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 11,025 పోస్టులు ఉన్నాయని, వీటికి 2లక్షల 625 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయగా, 69,216 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మొత్తం 14 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయని, అలాగే ఎంపికైన అభ్యర్థులను అర్హతను బట్టి ఆయా శాఖలకు ఎంపిక చేస్తామని అన్నారు. ఎంపికైన వారందరు శాశ్వత ఉద్యోగులుగా ఉంటారని పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను సంబంధిత శాఖల అధికారులకు పంపించామని, రేపు లేక ఎల్లుండి కాల్ లెటర్లు పంపించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 24, 25 తేదీల్లో ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందని, రోస్టర్ పాయింట్ విధానంలో నియామకం జరుగుతుందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు 30, 1 తేదీల్లో శిక్షణ ఇచ్చి అక్టోబర్ 2వ తేదీ నుంచి విధుల్లోకి పంపనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. చదవండి: ‘సచివాలయ’ ఫలితాలు విడుదల సచివాలయ ఫలితాలు: కేటగిరీ వారీ ఉత్తీర్ణుల జాబితా ‘సచివాలయ’ టాపర్స్ వీరే -
వైఎస్సార్ రైతు భరోసా ప్రతి రైతుకూ అందాలి
సాక్షి, చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకూ రూ.12,500 అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శుక్రవారం వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబరు 15వ తేదీ నాటికి రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అందించే నగదుకు సంబంధించి రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. కౌలు రైతుల గుర్తింపును పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న మూడు లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయశాఖ ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అందుకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా రైతులకు న్యాయమైన ఎరువులు, విత్తనాలను ఈ ప్రయోగ కేంద్రాల ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో పెద్ద, చిన్న గ్రామాలను ఆదర్శగ్రామాలుగా ఎంపిక చేసుకుని ఎరువులు, విత్తనాలు పంపిణీ ఏ విధంగా జరుగుతుందో అధ్యయనం చేయాలన్నారు. అధ్యయనంలో వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని జిల్లా అంతా పంపిణీ కోసం మార్గదర్శకాలు రూపొందించుకోవాలన్నారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ద్వారా జిల్లాలో రెండు రోజుల్లో జరగనున్న మేళా కార్యక్రమంలో సుమారు 10వేల మంది రైతులు అప్పటికప్పుడు ఈ పథకంలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలుగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా 1281 హెక్టార్లలోని పంటభూములు పూర్తిగా ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారన్నారు. వీటి కోసం రూ.1.83 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. 4,200 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 53.8 హెక్టార్లలో సెరీకల్చర్ పంటలు దెబ్బతిన్నాయన్నారు. నవంబరు 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి మత్స్యకారు కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించేలా జాబితా రూపొందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 మోహన్‌కుమార్, డీఆర్వో ఎ ప్రసాద్, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, మత్స్యశాఖ జేడీ యాకూబ్‌బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్డు సచివాలయ కార్యాలయం భవనాలు సిద్ధం చేయండి వార్డు సచివాలయ కార్యాలయాల కోసం అనువైన భవనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. మచిలీపట్నంలోని ఆయన చాంబర్ నుంచి కమిషనర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబరు 2వ తేదీ నుంచి వార్డు వలంటీర్లు, సెక్రటేరియట్ల ఉద్యోగుల కోసం కార్యాలయాలు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో త్వరలో పూర్తిస్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అవసరమైన భవనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటికే మునిసిపాలిటీల్లో వార్డు వలంటీర్ల నియామకం జరిగిందని, ఏయే వార్డుల్లో ఖాళీలు ఉన్నాయో పరిశీలించాలన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు కోసం జగ్గయ్యపేట, ఉయ్యూరు, గుడివాడ, తిరువూరు మునిసిపాలిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. పట్టణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం కోసం స్థలాలను ఎంపిక చేయాలన్నారు. ఎంత మందికి స్థలాలు అవసరమవుతాయో ప్రతిపాదనలు తయారుచేసి అం దుకు తగిన విధంగా స్థలాలను గుర్తించాలన్నా రు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 మోహ న్‌కుమార్, డీఆర్వో ఎ ప్రసాద్ పాల్గొన్నారు. నిబంధనలకు అనుగుణంగా గోశాలలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా గోశాలలు నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శుక్రవారం గోశాలల నిర్వాహకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గోశాలల నిర్వహణ లోపం కారణంగా ఇటీవల విజయవాడలో సుమారు 100 ఆవులు మృత్యువాతపడ్డాయన్నారు. గోశాలల్లో సరైన సంరక్షణ, పోషణ, వైద్యసేవలు గోవులకు అందేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 27 గోశాలలు ఉన్నాయని, వాటి నిర్వహణ కోసం సహకారాన్ని అందిస్తామన్నారు. పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ భరత్ రమేష్ మాట్లాడుతూ కబేళాకు తరలిస్తున్న గోవులను పట్టుకుని గోశాలలకు అప్పగించాలని చూస్తే వసతికి సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సుమారు 8 ఎకరాల్లో ప్రత్యేక పశువుల వసతి కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గడ్డి కోసే యంత్రాలు 50 శాతం సబ్సిడీతో గోశాలల నిర్వహణకు అందించనున్నామన్నారు. గోశాలలకు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో వెటర్నరీ వైద్యులను నియమించామని, వీరు 15 రోజులకు ఒకసారి గోశాలకు వెళ్లి వైద్యసహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించాలని సూ చించామన్నారు. బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా మాట్లాడుతూ మచిలీపట్నంలోని రోడ్లపై పశువుల సంచారం ఎక్కువగా ఉందని వీటిని నియంత్రించేందుకు పశువులను తరలించా లంటే గోశాలల్లో భూములు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమావేశంలో జేసీ–2 మోహన్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, విజయవాడ అడిషనల్ డీసీపీ–2 చంద్రశేఖర్ ఇతర అధికారులు, గోశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి మహిళలను, బాలికలను మభ్యపెట్టి వ్యభిచారంలోకి దించుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్లో శుక్రవారం సెక్స్ ట్రాఫికింగ్, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలనపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పేదరికం కారణంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి మహిళలను, బాలికలను వ్యభిచారంలోకి దించుతున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. మహిళలపై అత్యాచారాల నిరోధానికి తమిళనాడుకు చెందిన ఐజేఎం ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ స్వచ్ఛంద సంస్థ సెక్స్ ట్రాఫికింగ్ నిర్మూలనపై చేసిన కృషిని కలెక్టర్ అభినందించారు. జిల్లాలో మహిలల హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. నిరుపేదలైన అభ్యాగులు, అనాథలు, విభిన్న ప్రతిభావంతులను సరైన సంరక్షణ లేకుండా వదిలేస్తున్నారన్నారు. అటువంటి వారిని బాలకార్మిక నిర్మూలన సంస్థ, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వారిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ–2 మోహన్‌కుమార్, డీఆర్వో ఎ ప్రసాద్, బీసీ సంక్షేమశాఖ డీడీ భార్గవి తదితర అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో ‘థ్యాంక్యూ అంగన్వాడీ అక్క’
సాక్షి, విజయవాడ: జిల్లాలో పౌష్టికాహార మాసోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. పౌష్టికాహారంపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పౌష్టికాహారాన్ని పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే ‘థ్యాంక్యూ అంగన్వాడీ అక్క’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. జిల్లాలో బలహీనంగా ఉన్న పిల్లలు ఉండకూడదనేది తమ లక్ష్యమని తెలిపారు. దాన్ని చేరుకోడానికి అవసరమైన వనరులన్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌష్టికాహార మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, విజయవాడ : సెప్టెంబరు 1 నుంచి జరిగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. అవి పంచాయతీ సెక్రటరీ, విఆర్వో, అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఎఎన్ఎమ్ ఉద్యోగాలకు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. 374 సెంటర్లలో 200655 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ సంఖ్యలో పరీక్ష ఎప్పుడూ జరగలేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్షలు ఉదయం 10 నుండి 12వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు అరగంట ముందు పరీక్ష హాల్లో ఉండాలి. ఓఎమ్ఆర్ షీట్లలో పరీక్ష ఉంటుంది. సెల్ఫోన్లకు అనుమతి లేదు. పరీక్ష నిర్వహించడానికి 8 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. పటిష్ట భద్రత నడుమ ప్రశ్రపత్రాల తరలింపు ఉంటుంది. ప్రతి సెంటర్‌కు చీఫ్ సూపరింటెండ్‌తో పాటు స్పెషల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్లను నియమించాం. ప్రతి బస్టాండ్‌లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష జరిగే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జీరాక్స్ సెంటర్లను మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు రేషన్ అందదనే అపోహలు వద్దని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ వలంటీర్లు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ప్రతీ ఇంటినీ సర్వే చేస్తారనీ, ప్రజలు తమ సమాచారాన్ని సరైన రీతిలో ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి తీసుకున్న సమాచారాన్ని వలంటీర్లు తహసీల్దార్లకు అందజేస్తారు. అంతేకాక, ఈ కేవైసీ నమోదు చేయనివారు దాదాపు 3 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నామనీ, ఈ కేవైసీని సంబంధిత రేషన్ షాపుల్లో నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. -
సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో నూతన ఇసుక పాలసీ
సాక్షి, విజయవాడ : సెప్టెంబర్ 5 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఇసుక పాలసీ రానుందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇసుక కొరతపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, వసంత కృష్ణా ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇల్లు నిర్మించుకునే వారికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇసుకను స్టాక్ పాయింట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఎవరికైనా ఇసుక కావాలంటే సంబంధిత తహసీల్ధార్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 19 నుంచి కొత్త పాలసీ వచ్చే వరకు ఇదే విధానం అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో తోట్ల వల్లూరు ఇసుక రిచ్ మాత్రమే తెరిచి ఉంటుందని తెలిపారు. -
నచ్చినట్టు తీశాను
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ తొలిసారిగా నిర్మించిన హైవే కాసుల వర్షం కురిపిస్తోంది. సొంత సినిమా అయినప్పటికీ స్క్రిప్టు ప్రకారం కాకుండా, మనసుకు నచ్చినట్టు సన్నివేశాలు తీశానని, తను చేసిన సాహసం వృథా కాలేదని అన్నాడు. రణ్‌దీప్ హుడా, ఆలియాభట్ జోడీగా వచ్చిన ఈ సినిమాను రూ.18.25 కోట్ల ఖర్చుతో నిర్మించగా, మొదటి వారంలోనే రూ.22.38 కోట్లు సంపాదించిపెట్టింది. ‘హైవే సినిమాతో నేను ఒక కొత్త రకం విత్తనాన్ని నాటాను. నిబంధనలను పట్టించుకోలేదు. ఎలా తీయాలనిపిస్తే అలా తీశాను. నా సినిమా సంకుచితంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. బాగాధైర్యం చేసి ఈ కొత్త తరహామార్గాన్నిఎంచుకున్నా..చివరికి విజయం సాధించాను’ అని అలీ వివరించాడు. స్క్రిప్టు లేకుం డా సినిమా మొదలుపెట్టాం కాబట్టి అనుకున్నట్టుగా సినిమా రాకుంటే మధ్యలోనే షూటింగ్‌ను ఆపేయాలని ఇతడు మొదటే నిర్ణయించుకున్నాడు. దీనికితోడు ఇది వరకు తీసిన రాక్‌స్టార్ పెద్దగా విజయం సాధించకపోవడం కూడా ఇందుకు కారణం. ‘సినిమా కోసం సాజిద్ నడియద్వాలా నుంచి అప్పులు తీసుకున్నాను. ఎలాగొలా చెల్లించగలుగుతానన్న నమ్మకం ఉండేది. డబ్బు లేకపోతే ఆయన దగ్గర పని చేసి అప్పు తీర్చుదామని కూడా అనుకున్నాను’ అని వివరిం చాడు. హైవే హిట్ అయిందని అలీ మౌనంగా ఏమీ ఉండ డం లేదు. అన్ని నగరాల్లో తిరుగుతూ సినిమా గురించి ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాడు. కథ, రణ్‌దీప్, ఆలియా ప్రేక్షకులకు బాగా నచ్చారని అన్నాడు. ఇక ఈ దర్శకుడు తాజాగా రణ్‌బీర్ కపూర్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. కథ కొంత భాగాన్ని సిద్ధం చేసినా.. కంప్యూటర్లో సాంకేతిక సమస్య రావడంతో మొత్తం తొల గిపోయిందని, ఇప్పుడు మొదటి నుంచి మళ్లీ రాస్తున్నానని ఇంతియాజ్ అలీ వివరించాడు.