
సాక్షి, విజయవాడ : కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో కొత్తగా 10 కంటైన్‌మెంట్ జోన్లను కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. ఎ.కొండూరు మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామం, చాట్రాయి మండలంలోని బూరుగుగుడెం గ్రామం, చాట్రాయి మండలంలోని ఆరుగొలనుపేట గ్రామం, గుడివాడ మండలంలోని మందపాడు గ్రామం, గూడూరు మండలంలోని కప్పల దొడ్డి గ్రామం,ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామం, ముసునూరు మండలంలోని గుల్లపూడి గ్రామం, నందిగామ మండలంలోని మాగల్లు గ్రామం, నందివాడ మండలంలో పుట్టగుంట గ్రామం, వీరుల్లపాడు మండలంలోని గూడెం మాధవరం గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్‌లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (ఏపీలో కొత్తగా 6,235 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment