చక్కటి ప్రణాళిక, సమగ్రమైన అధ్యయనం, సలక్షణమైన నిర్ణయంతో జిల్లాలో వైఎస్సార్ సీపీ టీడీపీ నోరు మూయించింది. ఒక్క విమర్శకు కూడా తావు లేని విధంగా సిక్కోలు పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ‘ఎచ్చెర్ల’ వెళ్లిపోతే రోడ్డెక్కుదామని వేచి చూసిన ప్రతిపక్షానికి నోట మాట రాకుండా సమాధానం చెప్పింది. కీలకమైన ఆ ప్రాంతాన్ని సిక్కోలులోనే ఉంచేస్తూ టీడీపీకి ఊహించని షాకిచ్చింది. రాజాం, పాలకొండ వాసులకు కూడా మంచి జరిగేలా నిర్ణయం తీసుకుని ఆయా ప్రాంతాల అభిమానాన్ని చూరగొంది.
సాక్షి, శ్రీకాకుళం: విమర్శ చేద్దామనుకున్న వారి నోళ్లు మూతబడ్డాయి. ఆందోళనలతో హడావుడి చేద్దామని భావించిన వారి నినాదాలు మూగబోయాయి. సిక్కోలు పునర్ వ్యవస్థీకరణలో ప్రభుత్వం సమగ్రమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చి, శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచడంతో ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వైఎస్ జగన్ సర్కారు ఈ నిర్ణయంతో వైరి పక్షం నోరు మూయించి, జనాల మనసులను మరోసారి గెలుచుకుంది.
ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం ఎంపీ స్థానం పరిధిలో ఉండడంతో ఆ జిల్లాలోకి వెళ్లిపోతుందని చాలాకాలంగా వాదనలు జరుగుతున్నాయి. అలా జరిగితే జిల్లా కేంద్రంలోని కొంత భాగం వెళ్లిపోతుందని, పైడిభీమవరం, నవభారత్ పారిశ్రామిక వాడలతో పాటు ట్రిపుల్ ఐటీ, అంబేడ్కర్ యూనివర్సిటీ, ఐటీఐ, పాలిటెక్నికల్ కళాశాల, జిల్లా శిక్షణా నైపుణ్యాభివృద్ధి సంస్థ, వ్యవసాయ కళాశాల, పలు ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు, పో లీసు శాఖకు చెందిన ఏఆర్ విభాగం, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, ఫార్మా రంగం, జాతీయ రహదారి వంటివి జిల్లా కోల్పోతుందని అంతా అపోహలు సృష్టించారు. దీన్నే ఆయుధంగా చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ వేచి చూసింది. అయితే ప్రజలు, స్థానిక నాయకుల అభిప్రాయాల ను ప్రభుత్వం గౌరవించి ఎచ్చెర్లను శ్రీకాకుళంలోనే ఉంచడంతో టీడీపీ వ్యూహాలన్నీ చతికిలపడ్డాయి.
చదవండి: (Andhra Pradesh New Districts: పెద్ద జిల్లా ప్రకాశం.. చిన్న జిల్లా విశాఖ)
రెండు రెవెన్యూ డివిజన్లు.. 1466 రెవెన్యూ గ్రామాలు
సరికొత్త సిక్కోలులో రెండు రెవెన్యూ డివిజన్లు, 921 పంచాయతీలు, 1466 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నా యి. వీటి పరిధిలో 5,53,830 కుటుంబాలు ఉంటాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో 16 మండలాలు, టెక్క లి రెవెన్యూ డివిజన్‌లో 14 మండలాలు ఉంటాయి. శ్రీకాకుళం డివిజన్‌లో ఇప్పటికే ఉన్న ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గా ల మండలాలు, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, పోలాకితో పాటు ఇంతవరకు పాలకొండ రెవెన్యూ డివిజన్‌లో ఉన్న కొత్తూరు, హిరమండలం, సారవకోట మండలాలు కలుస్తాయి. టెక్కలి డివిజన్‌లో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గా ల మండలాలు, జలుమూరుతో పాటు ఇప్పటివరకు పాలకొండ డివిజన్‌లో ఉన్న పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు కలుస్తాయి.
‘మన్యం’లోకి పాలకొండ.. బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌లో రాజాం
కొత్తగా పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటయ్యే మ న్యం జిల్లాలో పాలకొండ కలవనుంది. ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ డివిజన్ హోదా యథావిధిగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న రాజాం నియోజకవర్గ మండలాలు విజయనగరం జిల్లా పరిధిలోని బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌లో కలుస్తాయి. అలాగే, పాలకొండ డివిజన్‌లో ఉన్న పాతపట్నం నియోజకవర్గ మండలాలు టెక్కలి, శ్రీకాకుళం డివిజన్‌లలో విలీనమవుతాయి. పాతపట్నం, రాజాం నియోజకవర్గాల మండలాలు పోతుండగా, కొత్తగా కురుపాం ని యోజకవర్గంలోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి కలవనున్నాయి. మొత్తం ఆరు మండలాలతో పాలకొండ రెవెన్యూ డివిజన్ కొనసాగనుంది.
చదవండి: (కనుల ముందు కలల జిల్లాలు)
మరింత సౌలభ్యం
పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గం కలవడంతో ఆ ప్రాంత వాసులకు మరింత సౌలభ్యం కలగనుంది. 18.84 లక్షల జనాభాతో 3,846 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విజయనగరం ఏర్పాటవు తుంది. రాజాం వాసులకు శ్రీకాకుళం కంటే విజయనగరంతోనే లావాదేవీలు ఎక్కు వ. వ్యాపార, ఇతర వ్యవహారాలు, సంబంధాలు కూడా అక్కడితోనే ఎక్కువ. ఇప్పుడు అధికారికంగా కూడా ఒక జిల్లాలోనే ఉండనున్నారు. ఇక, వారికి రెవెన్యూ డివిజన్‌గా ఉన్న బొబ్బిలి మరింత దగ్గరగా ఉండనుంది. రాజాం నియోజకవర్గం విలీనంతో విజయనగరం జిల్లాలోకి కొత్తగా 123 పంచాయతీలు, 171 రెవెన్యూ గ్రామాలు, 68,003 హౌస్ హోల్డ్స్ వెళ్లనున్నాయి.
శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్: 16 మండలాలు (కొత్తగా కలిసేవి: కొత్తూరు, హిరమండలం, సారవకోట)
టెక్కలి రెవెన్యూ డివిజన్: 14 (కొత్తగా కలిసేవి: పాతపట్నం, మెళియాపుట్టి)
బొబ్బిలి రెవెన్యూ డివిజన్ : 11 (వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం, బొబ్బిలి, తెర్లాం, రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు,గజపతినగరం, మెరకముడిదాం) పాలకొండ రెవెన్యూ డివిజన్: 6 (వీరఘట్టం, సీతంపేట, పాలకొండ, భామిని, జియ్యమ్మవలస, గరుగుబిల్లి)
పార్వతీపురం రెవెన్యూ డివిజన్ : 10 (కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం,పార్వతీపురం,సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ)
పాలకొండకు అనుకూలం..
పాలకొండ నియోజకవర్గం విషయానికి వస్తే సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతో కలిసి 9.72లక్షల జనాభాతో 3,935 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో విలీనం అవుతుంది. దీని వల్ల జిల్లా కేంద్రం పార్వతీపురం వారికి మరింత దగ్గరవుతుంది. పాలకొండ వాసులకు కూడా శ్రీకాకుళం కంటే పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతోనే సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. ఈ నియోజకవర్గంలోని వీరఘట్టం ప్రజలు శ్రీకాకుళం రావాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. భామిని వాసులైతే 98 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొత్త జిల్లా ఏర్పాటైతే వీరఘట్టం ప్రజలు 30 కిలోమీటర్లు, భామిని మండల ప్రజలు 70 కిలోమీటర్ల లోపే జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. పాలకొండ నియోజకవర్గం విలీనం కావడం వల్ల మన్యం జిల్లాలోకి 146 గ్రామ పంచాయతీలు, 226 రెవెన్యూ గ్రామాలు, 59,488 హౌస్ హోల్డ్స్ కలవనున్నాయి.
సముచిత ప్రాధాన్యం..
పరిపాలనా సౌలభ్యం, సత్వర సే వలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టాం. వచ్చే నెల 26వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తాం. మన జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
– ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం
శుభపరిణామం
నూతన జిల్లాల ఏర్పాటు శుభ ప రిణామం. జిల్లాల వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. కొత్త జిల్లాలతో ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయి. సీఎం వినూత్న ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.
– తమ్మినేని సీతారాం, అసెంబ్లీ స్పీకర్
గొప్ప నిర్ణయం
జిల్లాల పునర్విభజన గొప్ప పరిణామం. ఎచ్చెర్ల విషయంలో జిల్లా వాసులకు భయం ఉండేది. కానీ ఇక్కడి మనోభావాలను సీఎం గౌ రవించారు. ఇందులో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కృషి అధికంగా ఉంది. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మంత్రి
సీఎంకు కృతజ్ఞతలు
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం అనిర్వచనీయం. పరిపాలనా సౌలభ్యం కోసం సులభతరంగా పర్యవేక్షణ చేసేందుకు వీలుగా శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిన సీఎంకు కృతజ్ఞతలు.
– పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
నూతన అధ్యాయం
అన్ని ప్రాంతాలకు సమన్యా యం జరిగేలా సీఎం వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాలకు రూపకల్పన చేశారు. ఇది నూతన అధ్యాయం.
– డాక్టర్ కిల్లి కృపారాణి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment