Etcherla constituency
-
ఆయనను కలవాలంటే ముందు ఆరుగురిని కలవాలట!
చీపురుపల్లి: వాస్తవంగా ఆయన వలస నేత. ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా సొంత ఇల్లు ఉండదు. ఆఫీసు ఉండదు. ఆయనను అనుచరులూ నమ్మరు. ఎన్నికల వేళ ఉపయోగించుకోవడమే తప్ప... ఆపద వేళ ఆదుకోవడం ఆయనకు తెలియదు. ఆర్థికంగా కుంగిపోయినా రూపాయి సాయం చేసే గుణం లేదు. నాలుగు దశాబ్దాల సీనియారిటీ ఉందని చెప్పుకునే ఆయనకు ఆ నియోజకవర్గంలో కనీసం అద్దెకు ఇల్లు కూడా తీసుకోరు. ఎన్నికల ప్రచారంలో తిరగడం, తీరా గెలిచినా, ఓడినా సరే విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లలో గడపడం ఆయనకు అలవాటు. ఓటమి చెందితే ఎలాగూ కనిపించని ఆ సీనియర్ నేత గెలిచినా సరే ప్రజలు ఎలా ఉన్నారో, నియోజకవర్గం అభివృద్ధి ఏమిటో కనీసం పట్టించుకోరంటూ ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు చెప్పేమాటలతో చీపురుపల్లిలోని పార్టీ శ్రేణుల్లో గుబులు రేగుతోంది. పార్టీ శ్రేణుల్లో ‘కళ’ తప్పింది. ఓటమి ఖాయమని తెలిసినా కొద్దిమంది నాయకులు ఆయన వెంట నడుస్తున్నారు. ఆయన తీరు తెలిసి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. 2014లో ఎచ్చెర్లలో గెలుపొంది, మంత్రి పదవి అలంకరించి ఆ నియోజకవర్గానికి ఏమైనా చేశారా అంటే అక్కడి ప్రజలు సున్నా సింబల్ చూపిస్తున్న దుస్థితి. దీంతో ఆయన నాయకత్వాన్ని 2019లో అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఓటమి చెందాక ఐదేళ్లు ఆ నియోజకవర్గ ప్రజలకు కనీసం ముఖం కూడా చూపించలేదట. ఆ వలసనేత తీరు ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచే నైజం ఉన్న నాయకుడు ఇప్పుడు ప్రజలను ఏం ఉద్దరిస్తాడన్న చర్చ రచ్చబండలపై సాగుతోంది.అంతా పీఏ కన్నుసన్నల్లోనే...నలభై ఏళ్లు సీనియారిటీ ఉన్న ఆయన ప్రజలకు ఎలాగూ ముఖం చూపించరు సరికదా.. గ్రామ, మండల స్థాయిలో పార్టీ క్యాడర్‌నూ కలవరట. ఏదైనా కష్ట, సుఖాలు చెప్పుకోవాలన్నా, అభివృద్ధి కోసం మాట్లాడాలన్నా సరే ఆయన అపాయింట్మెంట్ ఉండదట. పార్టీ క్యాడరైనా, నాయకులైనా ఎవరైనా సరే పీఏగా ఉన్న వెంకటేశ్వరస్వామిని కలుసుకుని తమ గోడు వెల్లబోసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందే. ప్రస్తుతం కొత్త నియోజకవర్గమైన చీపురుపల్లిలో కూడా అదే పరిస్థితి క్యాడర్‌కు ఎదురవుతోందనే చర్చ ఆ పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లోనే సాగుతుండం గమనార్హం. ఇంకా ఎన్నికలు జరగలేదు, గెలుపు, ఓటములు సంగతి పక్కన పెడితే ప్రస్తుతం కూడా క్యాడర్‌తో ఆయన మాట్లాడే పరిస్థితి లేదని, పీఏతోనే ప్రతీ విషయం చెప్పుకోవాల్సి వస్తోందని నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అందుకనే ఆ సీనియర్ ఏ నియోజకవర్గం వదిలి వెళ్లిపోయినా అక్కడ క్యాడర్ అంతా పండగ చేసుకుంటారని టీడీపీ వర్గీయుల్లోనే చర్చ జరుగుతోంది. -
సాధికారతను చాటిన ఎచ్చెర్ల
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల ప్రజలు సామాజిక సాధికారతను ఎలుగెత్తి చాటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అండదండలతో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నియోజకవర్గమంతా కలియదిరిగారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. రణస్థలం నుంచి చిలకపాలెం – పొందూరు రోడ్డు వరకు 15 కిలోమీటర్లు సాగిన బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్ అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. అనంతరం చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభకు ఇసకేస్తే రాలనంతగా ప్రజలు హాజరయ్యారు. అన్ని కులాలకు సమాన హక్కులు కల్పింస్తున్న సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో అన్ని కులాలకు సమాన హక్కులు కల్పిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి కులాలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి, వారికి రాజ్యాధికారాన్ని, సంపదను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను, 700 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. అనేక పథకాలు, అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. కరోనా సమయంలో గుజరాత్‌కు వలస వెళ్లిన 4,500 మంది మత్స్యకారులను ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా జిల్లాకు తెచ్చామని, 24 మంది మత్స్యకారులను పాకిస్థాన్ నుంచి విడిపించామని చెప్పారు. బీసీలు జడ్జీలుగా ఉండకూడదని కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను అవహేళన చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ అప్పట్లో చంద్రబాబు పాలనను ఎందుకు విమర్శించలేదని ప్రశ్నించారు. జగనన్న బలం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. దేశానికి సచివాల య, వలంటీర్ వ్యవస్థలు ఆదర్శంగా నిలిచాయన్నారు.తన పని తీరు నచ్చితేనే ఓటు వేయమని అడగగలిగే ఏకైక సీఎం వైఎస్ జగన్ అని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. సీఎం జగన్ అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఉప ముఖ్యమంత్రులు, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేవని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తెలిపారు. కులం, మతం, ప్రాంతం, లంచం, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రయోజనాలు అందాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రమే అసంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సీఎం జగన్ విశాఖను రాజధాని చేయాలనుకుంటుంటే టీడీపీ మాత్రం అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు. విశాఖను రాజధాని చేస్తే ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. -
వలస వచ్చి మామీద పెత్తనమా.. ఎచ్చర్లలో ఎల్లో ఫైట్!
ఆయనో సీనియర్ నేత. మాజీ మంత్రి.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. ఇదంతా గతం. ఇప్పుడు సీన్ మారింది. మీరొద్దు, మీ పెత్తనం వద్దంటూ అంతా సైడ్ అయిపోతున్నారు. అయినా ఆయన మాత్రం మళ్లీ తనకే టికెట్ కావాలంటూ తనదైన శైలిలో పావులు కదుపుతుండడం పచ్చ పార్టీలో చిచ్చు రేపుతోంది. కిమిడి కళా వెంకటరావు వ్యవహారశైలి ఎప్పుడూ వివాదస్పదమే. సూపర్ సీనియర్ జాబితాలో నెట్టుకొస్తున్నారు తప్పితే క్షేత్ర స్థాయిలో కేడర్‌తో నిత్యం వివాదాలే. 2009లో రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఎచ్చర్ల నియోజకవర్గానికి కళా వెంకటరావు వలస వెళ్లారు. ఆ ఎన్నికలో పీఆర్పీ తరఫున పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో మరోసారి పోటీచేసి విజయం సాధించారు. అయితే వలస నేత కావడంతో.. ఆయనకు, స్థానిక నేతలకు ఏ దశలో పొసగలేదు. ఫలితంగా 2019లో ఘోర ఓటమి చవిచూశారు. 2024లో ముచ్చటగా మూడోసారి ఎచ్చర్ల నుంచి పోటీకి తహతహలాడుతున్నా.. చెప్పుకోదగ్గ నేతలెవరూ ఆయన వెంట లేకపోవడం చర్చనీయాంశమైంది. ఎచ్చర్ల మండలంలో జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, జి.సిగడాం మాజీ ఎంపీపీ బొమ్మన వెంకటేశ్వరరావు, లావేరు మండంలో అలపాన సూర్యనారాయణ, రణస్థలం మండలంలో కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించకపోవడం విభేదాలను తేటతెల్లం చేస్తోంది. దాంతో కొత్త టీమ్‌ను తయారు చేసుకునేందుకు కళా వెంకటరావు శ్రమిస్తున్నా ఓ స్థాయి నేతలు వెంట రావడానికి ఆసక్తి చూపడం లేదట. దాంతో ఎవరికి తెలియని నేతలు ఇప్పుడు ఆయన వెంట దర్శనమిస్తున్నారు. ఈసారి ఎలాగైనా టికెట్ సాధించాలనే పట్టుదలతో కళా ఉన్నా.. వ్యతిరేక వర్గీయులు ఆయన్ను లైట్ తీసుకుటుండడం కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. కళాను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడి నుంచో వలస వచ్చి పెత్తనం చేయాలనుకుంటే కుదరదని, వలస నేత పెత్తనం ఇంకా ఎంత కాలమని కొందరు నేతలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కళా వెంకటరావు పనైపోయింది.. ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని బహిరంగానే ప్రకటిస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మాజీ మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన తనను కాదని, వేరే వారికి చంద్రబాబు టికెట్ ఇచ్చే అవకాశమే లేదని ఆయన అంటున్నారట. అయితే క్యాడర్ మాత్రం ఈసారి కళాను పక్కన పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తుండడం స్థానిక టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఎచ్చెర్ల యథాతథంతో.. టీడీపీ ఎత్తులు చిత్తు
చక్కటి ప్రణాళిక, సమగ్రమైన అధ్యయనం, సలక్షణమైన నిర్ణయంతో జిల్లాలో వైఎస్సార్ సీపీ టీడీపీ నోరు మూయించింది. ఒక్క విమర్శకు కూడా తావు లేని విధంగా సిక్కోలు పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ‘ఎచ్చెర్ల’ వెళ్లిపోతే రోడ్డెక్కుదామని వేచి చూసిన ప్రతిపక్షానికి నోట మాట రాకుండా సమాధానం చెప్పింది. కీలకమైన ఆ ప్రాంతాన్ని సిక్కోలులోనే ఉంచేస్తూ టీడీపీకి ఊహించని షాకిచ్చింది. రాజాం, పాలకొండ వాసులకు కూడా మంచి జరిగేలా నిర్ణయం తీసుకుని ఆయా ప్రాంతాల అభిమానాన్ని చూరగొంది. సాక్షి, శ్రీకాకుళం: విమర్శ చేద్దామనుకున్న వారి నోళ్లు మూతబడ్డాయి. ఆందోళనలతో హడావుడి చేద్దామని భావించిన వారి నినాదాలు మూగబోయాయి. సిక్కోలు పునర్ వ్యవస్థీకరణలో ప్రభుత్వం సమగ్రమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చి, శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచడంతో ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వైఎస్ జగన్ సర్కారు ఈ నిర్ణయంతో వైరి పక్షం నోరు మూయించి, జనాల మనసులను మరోసారి గెలుచుకుంది. ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం ఎంపీ స్థానం పరిధిలో ఉండడంతో ఆ జిల్లాలోకి వెళ్లిపోతుందని చాలాకాలంగా వాదనలు జరుగుతున్నాయి. అలా జరిగితే జిల్లా కేంద్రంలోని కొంత భాగం వెళ్లిపోతుందని, పైడిభీమవరం, నవభారత్ పారిశ్రామిక వాడలతో పాటు ట్రిపుల్ ఐటీ, అంబేడ్కర్ యూనివర్సిటీ, ఐటీఐ, పాలిటెక్నికల్ కళాశాల, జిల్లా శిక్షణా నైపుణ్యాభివృద్ధి సంస్థ, వ్యవసాయ కళాశాల, పలు ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు, పో లీసు శాఖకు చెందిన ఏఆర్ విభాగం, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, ఫార్మా రంగం, జాతీయ రహదారి వంటివి జిల్లా కోల్పోతుందని అంతా అపోహలు సృష్టించారు. దీన్నే ఆయుధంగా చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ వేచి చూసింది. అయితే ప్రజలు, స్థానిక నాయకుల అభిప్రాయాల ను ప్రభుత్వం గౌరవించి ఎచ్చెర్లను శ్రీకాకుళంలోనే ఉంచడంతో టీడీపీ వ్యూహాలన్నీ చతికిలపడ్డాయి. చదవండి: (Andhra Pradesh New Districts: పెద్ద జిల్లా ప్రకాశం.. చిన్న జిల్లా విశాఖ) రెండు రెవెన్యూ డివిజన్లు.. 1466 రెవెన్యూ గ్రామాలు సరికొత్త సిక్కోలులో రెండు రెవెన్యూ డివిజన్లు, 921 పంచాయతీలు, 1466 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నా యి. వీటి పరిధిలో 5,53,830 కుటుంబాలు ఉంటాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 16 మండలాలు, టెక్క లి రెవెన్యూ డివిజన్లో 14 మండలాలు ఉంటాయి. శ్రీకాకుళం డివిజన్లో ఇప్పటికే ఉన్న ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గా ల మండలాలు, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, పోలాకితో పాటు ఇంతవరకు పాలకొండ రెవెన్యూ డివిజన్లో ఉన్న కొత్తూరు, హిరమండలం, సారవకోట మండలాలు కలుస్తాయి. టెక్కలి డివిజన్లో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గా ల మండలాలు, జలుమూరుతో పాటు ఇప్పటివరకు పాలకొండ డివిజన్లో ఉన్న పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు కలుస్తాయి. ‘మన్యం’లోకి పాలకొండ.. బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో రాజాం కొత్తగా పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటయ్యే మ న్యం జిల్లాలో పాలకొండ కలవనుంది. ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ డివిజన్ హోదా యథావిధిగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న రాజాం నియోజకవర్గ మండలాలు విజయనగరం జిల్లా పరిధిలోని బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో కలుస్తాయి. అలాగే, పాలకొండ డివిజన్లో ఉన్న పాతపట్నం నియోజకవర్గ మండలాలు టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లలో విలీనమవుతాయి. పాతపట్నం, రాజాం నియోజకవర్గాల మండలాలు పోతుండగా, కొత్తగా కురుపాం ని యోజకవర్గంలోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి కలవనున్నాయి. మొత్తం ఆరు మండలాలతో పాలకొండ రెవెన్యూ డివిజన్ కొనసాగనుంది. చదవండి: (కనుల ముందు కలల జిల్లాలు) మరింత సౌలభ్యం పునర్వ్యవస్థీకరణలో భాగంగా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గం కలవడంతో ఆ ప్రాంత వాసులకు మరింత సౌలభ్యం కలగనుంది. 18.84 లక్షల జనాభాతో 3,846 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విజయనగరం ఏర్పాటవు తుంది. రాజాం వాసులకు శ్రీకాకుళం కంటే విజయనగరంతోనే లావాదేవీలు ఎక్కు వ. వ్యాపార, ఇతర వ్యవహారాలు, సంబంధాలు కూడా అక్కడితోనే ఎక్కువ. ఇప్పుడు అధికారికంగా కూడా ఒక జిల్లాలోనే ఉండనున్నారు. ఇక, వారికి రెవెన్యూ డివిజన్‌గా ఉన్న బొబ్బిలి మరింత దగ్గరగా ఉండనుంది. రాజాం నియోజకవర్గం విలీనంతో విజయనగరం జిల్లాలోకి కొత్తగా 123 పంచాయతీలు, 171 రెవెన్యూ గ్రామాలు, 68,003 హౌస్ హోల్డ్స్ వెళ్లనున్నాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్: 16 మండలాలు (కొత్తగా కలిసేవి: కొత్తూరు, హిరమండలం, సారవకోట) టెక్కలి రెవెన్యూ డివిజన్: 14 (కొత్తగా కలిసేవి: పాతపట్నం, మెళియాపుట్టి) బొబ్బిలి రెవెన్యూ డివిజన్ : 11 (వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం, బొబ్బిలి, తెర్లాం, రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు,గజపతినగరం, మెరకముడిదాం) పాలకొండ రెవెన్యూ డివిజన్: 6 (వీరఘట్టం, సీతంపేట, పాలకొండ, భామిని, జియ్యమ్మవలస, గరుగుబిల్లి) పార్వతీపురం రెవెన్యూ డివిజన్ : 10 (కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం,పార్వతీపురం,సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ) పాలకొండకు అనుకూలం.. పాలకొండ నియోజకవర్గం విషయానికి వస్తే సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతో కలిసి 9.72లక్షల జనాభాతో 3,935 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో విలీనం అవుతుంది. దీని వల్ల జిల్లా కేంద్రం పార్వతీపురం వారికి మరింత దగ్గరవుతుంది. పాలకొండ వాసులకు కూడా శ్రీకాకుళం కంటే పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతోనే సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. ఈ నియోజకవర్గంలోని వీరఘట్టం ప్రజలు శ్రీకాకుళం రావాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. భామిని వాసులైతే 98 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొత్త జిల్లా ఏర్పాటైతే వీరఘట్టం ప్రజలు 30 కిలోమీటర్లు, భామిని మండల ప్రజలు 70 కిలోమీటర్ల లోపే జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. పాలకొండ నియోజకవర్గం విలీనం కావడం వల్ల మన్యం జిల్లాలోకి 146 గ్రామ పంచాయతీలు, 226 రెవెన్యూ గ్రామాలు, 59,488 హౌస్ హోల్డ్స్ కలవనున్నాయి. సముచిత ప్రాధాన్యం.. పరిపాలనా సౌలభ్యం, సత్వర సే వలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టాం. వచ్చే నెల 26వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తాం. మన జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. – ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం శుభపరిణామం నూతన జిల్లాల ఏర్పాటు శుభ ప రిణామం. జిల్లాల వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. కొత్త జిల్లాలతో ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయి. సీఎం వినూత్న ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. – తమ్మినేని సీతారాం, అసెంబ్లీ స్పీకర్ గొప్ప నిర్ణయం జిల్లాల పునర్విభజన గొప్ప పరిణామం. ఎచ్చెర్ల విషయంలో జిల్లా వాసులకు భయం ఉండేది. కానీ ఇక్కడి మనోభావాలను సీఎం గౌ రవించారు. ఇందులో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కృషి అధికంగా ఉంది. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మంత్రి సీఎంకు కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అనిర్వచనీయం. పరిపాలనా సౌలభ్యం కోసం సులభతరంగా పర్యవేక్షణ చేసేందుకు వీలుగా శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నూతన అధ్యాయం అన్ని ప్రాంతాలకు సమన్యా యం జరిగేలా సీఎం వైఎస్ జగ న్మోహన్రెడ్డి కొత్త జిల్లాలకు రూపకల్పన చేశారు. ఇది నూతన అధ్యాయం. – డాక్టర్ కిల్లి కృపారాణి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు -
ఎచ్చెర్లలో..అన్నీ ఉన్నా..!
పెరటి చెట్టు మందుకు పనికిరాదన్న చందంగా తయారైంది ఎచ్చెర్ల నియోజకవర్గం పరిస్థితి. నియోజకవర్గంలో అన్ని సదుపాయాలూ ఉన్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల యువతకు ఉపాధి దొరకడం లేదు. రైతులకు సాగునీరు అందడం లేదు. విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన లేదు. మత్స్యకారులు పొట్టచేతబట్టుకుని వలస పోక తప్పడం లేదు. నియోజక వర్గం ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు, స్వతంత్రులు ఎంఎల్ఏలుగా గెలుపొందినప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు పోటీ పడుతున్నా పోటీ మాత్రం ప్రధానంగా అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మధ్యే ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ సారి నియోజకవర్గం పరిస్థితిని పరిశీలిస్తే.. ఎచ్చెర్ల నియోజకవర్గం జిల్లాలోనే ప్రత్యేకం. జిల్లా ముఖ ద్వారం పైడిభీమవరం ఈ నియోజకవర్గంలోనే ఉంది. మరో పక్క శ్రీకాకుళం పట్టణాన్ని అనుకుని ఉన్న మండలం ఎచ్చెర్ల. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎచ్చెర్ల మండలం లో ఉన్నాయి. పైడిభీమవరం పారిశ్రామిక వా డ నియోజకవర్గంలోనే ఉంది. తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస ప్రాజక్టుల ద్వా రా నియోజకవర్గానికి సాగునీరు అందుతుం ది. జిల్లాలోనే వైవిధ్యభరిత నియోజకవర్గం ఇది. నియోజక వర్గ పాలకుల్లో అంకితభావం లేకపోవడమే నియోజక వర్గ ప్రగతి కుంటుపడుతుండడానికి ప్రధాన కారణంగా చెప్పవ చ్చు. అభివృద్ధికి అవకాశం ఉన్న నియోజ కవర్గంలో ఇంకా వెనుకబాటు తప్పడం లేదు. ఎచ్చెర్ల నియోజక వర్గం 1967లో ఏర్పాటైంది. సిటింగ్ ఎంఎల్ఏకు అసమ్మతి సెగ ప్రస్తుత రాష్ట్ర మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఈ నియోజకవర్గం నుంచి అధికార తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ పోటీ పడుతున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తరువాత అత్యల్ప మెజారిటీతో 2014 ఎన్నికల్లో 4,741 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సిటింగ్ ఎంఎల్ఏ కళాకు నియోజకవర్గంలో ప్రతికూల వాతావరణం స్పష్టంగా ఉంది. పార్టీకి అండగా ఉన్నవారిని కాదని, కొత్త నాయకులకు ఆయన ప్రాధాన్యం ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో స్థానిక నాయకులు ఉన్నారు. జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి వర్గంతో కళా వెంకటరావుకు దీర్ఘకాలిక వైరం ఉంది. మరోపక్క రణస్థలం మండలంలో కాపు సామాజక వర్గాన్ని కాదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నడికుదిటి ఈశ్వరరావుకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయడిని పార్టీలోకి తీసుకు రావడంతో మొత్తం టీడీపీ నాయకులు దాదాపుగా పార్టీని వీడారు. మరో పక్క తమ పట్టు చూపించేందుకు బూరాడ వెంకటరమణ వంటి వారు ఎదురు చూస్తున్నారు. కిరణ్‌కుమార్‌కు పెరుగుతున్న ఆదరణ గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి ఆయన ప్రజల మధ్యనే ఉన్నారు. మరో పక్క కిరణ్ స్థానికుడు. రణస్థలం మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇది ఆయనకు కలిసివచ్చే అంశం. కళావెంకటరావు రాజాం నియోజక వర్గంలోని రేగిడి మండలానికి చెందిన వ్యక్తి. దీంతో ఈ సారి స్థానికుడికి మద్దతు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. మరో పక్క గత 10 రోజులుగా వైఎస్ఆర్సీపీ బలం పుంజుకుంది. ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాల్లో 20 వేల వరకు ఓట్లను ప్రభావితం చేయగలిగే క్యాడర్ వైఎస్సార్సీపీలో చేరడం గమనార్హం. దీంతో అనూహ్యంగా వైఎస్సార్సీపీ బలం పుంజుకుంది. మరో పక్క క్షేత్రస్థాయిలో జగన్మోహన్రెడ్డి పాదయాత్ర తరువాత ఒక్కసారిగా పార్టీకి ఆదరణ రెట్టింపైంది. అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. ఈ గాలిని అడ్డుకునేందుకు డబ్బు, మద్యం వంటి వాటిని అధికార పార్టీ నమ్ముకున్నా..ప్రజలు మాత్రం ఫ్యాన్ గుర్తుకు ఓటేసేందుకు ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. అరకొరగా సాగునీరు ఎచ్చెర్ల నియోజక వర్గంలో రణస్థలం, లావేరు, జి.సిడాం మండలాలకు 45 వేల ఎకరాలకు తోటపల్లి సాగునీరు అందాలి. ఇప్పటికీ పిల్లకాల్వల వ్యవస్థ పూర్తికాలేదు. జి.సిగడాంలో 5,000 ఎకరాలకు నీరు అందవల్సిన మడ్డువల్స నీరు సజావుగా శివారు భూములకు అందడం లేదు. ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురం పెద్ద చెరువుకు మిగులు జలాల తరలింపు ప్రశ్నార్థకంగా మారింది. ఎచ్చెర్ల మండలంలో 7,500 ఎకరాలు నారాయణపురం కుడికాల్వ కింద సాగునీరు అందాల్సి ఉండగా, ఏటా రైతులకు ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలు తప్పడం లేదు. నిర్లక్ష్యపు వర్శిటీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో కనీసం 120 మంది రెగ్యులర్ బోధకులు ఉండాల్సి ఉండగా, 11 మంది మాత్రమే రెగ్యులర్ బోధన సిబ్బంది ఉన్నారు. వర్సిటీలో మౌలిక వసతులు ప్రధాన సమస్య. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఒక్కో ఏడాది క్యాపిటల్ గ్రాంట్ కింద రూ. 40 కోట్లు మంజూరు చేసినా, నిధులు విడుదల కాలేదు. వర్సిటీకి ప్రభుత్వం అప్పగించిన 130 ఎకరాలకు ప్రహరీ సైతం లేని దుస్థితి. వసతి గృహాలు, తరగతి గదుల కొరత వెంటాడుతోంది. విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి. 49 మంది బోధకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినా ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు. కలుషిత జలాలే దిక్కు ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండలాల్లో చాలా గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. అయినా సురక్షిత తాగునీరు అందించ డం లేదు. గ్రామాల్లో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ సుజల ధార మాత్రం అమలు కావడం లేదు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మూడు వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు జరగ్గా.. శ్రీకాకుళంలో 2016లో రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 2016–17లో 1000, 2017–18లో 1000, 2018–19లో 1000 మందికి ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పించారు. అయితే ఇక్కడ పీయూసీ రెండో సంవత్సరం తరగతులు మాత్రమే సాగుతున్నాయి. మిగతా తరగతలు కృష్ణా జిల్లాలోని న్యూజివీడులో సాగు తున్నాయి. రెండో సంవత్సరం పీయూసీ సైతం ఏర్పాటు సమయంలో సిద్ధంగా ఉన్న 21వ శతాబ్ది గురుకులం భవనాల్లో 500 మంది హిళలకు, అద్దెకు తీసుకున్న మిత్రా ఇంజినీరింగ్ కళాశాలలో 500 మందికి తరగతులు నిర్వహిస్తున్నారు. మూడు వేల మందితో తరగతులు నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీని నిర్వీర్యం చేశారు. మరో పక్క కాంట్రాక్ట్ సిబ్బందితో మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. మూత పడుతున్న పరిశ్రమలు పైడిబీమవరం, ఎచ్చెర్ల, నవభారత్ ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. స్వర్ణాంధ్ర జూట్ మిల్లు, వరం పవర్ ప్లాంట్ వంటి పరిశ్రమలు మూత పడ్డాయి. మరో పక్క స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదు. మూతపడుతున్న పరిశ్రమలు, ఉన్న పరిశ్రమల్లో ఉపాధి లేక పోవటంతో యువత ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంతవరకు ఎమ్మెల్యేల వివరాలివి. సంవత్సరం విజేత పార్టీ 1967 నడిమింటి అప్పల నాయుడు కాంగ్రెస్ 1972 బల్లాడ హరప్పడు రెడ్డి స్వతంత్ర 1978 కొత్తపల్లి నర్సయ్య జనతా 1983 కావలి ప్రతిభాభారతి టీడీపీ 1985 కావలి ప్రతిభాభారతి టీడీపీ 1989 కావలి ప్రతిభాభారతి టీడీపీ 1994 కావలి ప్రతిభాభారతి టీడీపీ 1999 కావలి ప్రతిభాభారతి టీడీపీ 2004 కోండ్రు మురళీమోహన్ కాంగ్రెస్ 2009 మీసాల నీలకంఠనాయుడు కాంగ్రెస్ 2014 కమిడి కళావెంకటరావు టీడీపీ ఓటర్లు: 2,23.369 పురుషులు: 1,13,730 మహిళలు: 1,09,564 ఇతరులు: 25 -
వైఎస్ మాట..విశ్వవిద్యాలయానికి బాట
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ : శ్రీకాకుళం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. జిల్లా విద్యార్థులు ఉన్నత విద్యభ్యాసానికి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని 1980వ సంవత్సరం నుంచి జిల్లా ప్రజలు ఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అనేక కమిటీలు వేశాయి. అయినా విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు 2008వ సంవత్సరం జూన్ 25న జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీని మంజూరు చేసి ఏర్పాటు చేశారు. గార మండలం కళింగపట్నానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఏయూ ప్రొఫెసర్ చోడిపల్లి వెంకట సుధాకర్‌ను తొలి వైస్‌చాన్స్‌లర్‌గా నియమించారు. ప్రస్తుతం ఈ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యలో కీలకంగా మారింది. వర్సిటీలో ఎల్ఎల్బీ, గణితం, జియోఫిజిక్స్, ఫిజిక్స్, జియాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంసీఏ, ఎఈడీ, యోగా డిప్లమో, ఎంఎల్ఐఎస్సీ, బీఈడీ మెంటల్లీ రి టార్డ్, బయోటెక్నాలజీ, తెలుగు, సోషల్ వర్క్, ఎల్ఎల్ఎం, ఇంగ్లీష్, రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఎంకాం, ఎంజేఎంసీ, ఎంబీఏ, ఇంజినీరింగ్‌లో సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ కోర్సులు ఉన్నాయి. కోర్సులు విస్తరిస్తూ విద్యార్థులకు విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంది. ప్రత్యేక దృష్టి పెడితే ఈ వర్సిటీ రాష్ట్రంలోనే ఉత్తమ వర్సిటీగా రూపొందే అవకాశం ఉంటుందని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నారు. విద్యా ప్రగతితోనే ప్రాంతీయ అభివృద్ధి విద్యా ప్రగతితేనే ప్రాంతీయ అభివృద్థి సాధ్యమవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విద్య ప్రాధాన్యాన్ని గుర్తించారు. అందుకే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం విద్యార్థులు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్లి చదువుకునేవారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని రానున్న ప్రభుత్వాలు ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన సంస్థగా తీర్చి దిద్దాలి. -మిర్యాల చంద్రయ్య,మాజీ ఇన్చార్జ్ వైస్‌చాన్సలర్ -
హోం మినిస్టర్నవుతా.. అండమాన్ పంపుతా
మండలంలోని కేకేనాయుడుపేట గ్రామంలో జరుగుతున్న పోలింగ్‌ను పరిశీలించడానికి వచ్చిన టీడీపీ అభ్యర్ది కళావెంకటరావు పోలీసులపై వీరంగం చేశారు. పోలీసులు వైఎస్సార్సీపీని సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాను గెలుస్తానని , టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. తాను హోం శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఇద్దరు పోలీసులను అండమాన్‌కు పంపిస్తానని బెదిరించారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎచ్చెర్ల మండలం కొయ్యాం పంచాయతీ నాయుడు ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కూడా కళా వెంకటరావు, ఎంపీపీ అభ్యర్థి బల్లాడ వెంకటరమణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి వచ్చి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్‌ను నిలిపివేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందని గొడవలు సృష్టించవద్దని స్థానిక నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొన్నా తర్వాత విషయం తెలుసుకున్న నాయకులు నాలికకర్చుకుని అక్కడి నుంచి జారుకున్నారు.