
హోం మినిస్టర్‌నవుతా.. అండమాన్ పంపుతా
మండలంలోని కేకేనాయుడుపేట గ్రామంలో జరుగుతున్న పోలింగ్‌ను పరిశీలించడానికి వచ్చిన టీడీపీ అభ్యర్ది కళావెంకటరావు పోలీసులపై వీరంగం చేశారు. పోలీసులు వైఎస్సార్‌సీపీని సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాను గెలుస్తానని , టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. తాను హోం శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఇద్దరు పోలీసులను అండమాన్‌కు పంపిస్తానని బెదిరించారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఎచ్చెర్ల మండలం కొయ్యాం పంచాయతీ నాయుడు ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కూడా కళా వెంకటరావు, ఎంపీపీ అభ్యర్థి బల్లాడ వెంకటరమణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి వచ్చి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ను నిలిపివేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందని గొడవలు సృష్టించవద్దని స్థానిక నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొన్నా తర్వాత విషయం తెలుసుకున్న నాయకులు నాలికకర్చుకుని అక్కడి నుంచి జారుకున్నారు.