ఆ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోండి: కోనేరు ప్రసాద్ | YSR Congress party supporter attacked by police constable in Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

ఆ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోండి: కోనేరు ప్రసాద్

Published Wed, May 7 2014 6:47 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

YSR Congress party supporter attacked by police constable in Ibrahimpatnam

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై పోలీసు కానిస్టేబుల్ దాడిని ఆ పార్టీ విజయవాడ లోక్సభ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్  ఖండించారు. సదరు కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను బుధవారం విజయవాడలో డిమాండ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం జెడ్పీ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై కానిస్టేబులు అకారణంగా ఘర్షణకు దిగి దాడి చేశాడు.

 

ఆ దాడిలో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కార్యకర్తపై దాడి సమాచారాన్ని కోనేరు ప్రసాద్కు సమాచారం అందించారు. దాంతో ఆయన హుటాహుటిన ఇబ్రహీంపట్నం వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడిని పరామర్శించారు. అనంతరం ఆ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు కోనేరు ప్రసాద్ ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement