Kimidi Kala Venkata Rao
-
చంద్రబాబు మంత్రివర్గంలో చోటుదక్కని సీనియర్లు చంద్రబాబు మంత్రివర్గంలో చోటుదక్కని సీనియర్లు
వారంతా రాజకీయాల్లో సీనియర్లు. గెలిస్తే మంత్రి పదవి తమకే వస్తుందని గట్టిగా నమ్మారు. ఎన్నికల ప్రచార సభలు, సమీక్షల్లో పార్టీ శ్రేణుల వద్ద అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. తీరా గెలిచాక మంత్రి పదవులు వరించకపోవడం.. కొత్తగా ఎన్నికైన వారికే చంద్రబాబు ప్రభుత్వం పట్టంకట్టడం ప్రస్తుతం జిల్లాలోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజాంలో తనను గెలిపిస్తే టీడీపీ ప్రభుత్వంలో మంత్రినవుతానన్న కోండ్రు మురళీమోహన్ మాటలు నెగ్గలేదు... చీపురుపల్లిలో సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణను ఓడించి వస్తే మంత్రి పదవి కచ్చితంగా ఇస్తామని కళావెంకటరావుకు చంద్రబాబు ఇచ్చిన హామీ పనిచేయలేదు... శృంగవరపుకోటలో మూడోసారి గెలిస్తే సామాజికవర్గ సమీకరణాల్లో తనకు మంత్రి పదవి వస్తుందనుకున్న కోళ్ల లలితకుమారి కలలు నెరవేరలేదు... తొలిసారిగా ఎమ్మెల్యే అయినా ఏదో ఒక లెక్కలో తమకు జాక్‌పాట్ తగలకపోతుందా అని ఆశించిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లెక్కలూ ఫలితమివ్వలేదు. లోకేశ్‌తో సాన్నిహిత్యం, తన భార్యవైపు సంబంధాలతో చాపకింద నీరులా పనిచేసుకున్న కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరం టీడీపీ టికెట్ దక్కించుకోవడంలోనే కాదు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించడంలోనూ సఫలమయ్యారు. విజయనగరం జిల్లా నుంచి ఏకైక మంత్రి అయ్యా రు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు.కోండ్రు ఆశలపై నీళ్లు...రాజాం (ఎస్సీ) నియోజకవర్గంలో 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చలువతో ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు మురళీమోహన్ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా నిర్వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తే కేవలం 4,790 ఓట్లే వచ్చాయి. టీడీపీ తీర్థం పుచ్చుకొని 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసినా వైఎస్సార్సీపీ నాయకుడు కంబాల జోగులు చేతిలో చావుదెబ్బ తప్పలేదు. అప్పటివరకూ పోటీగా ఉన్న సీనియర్ నాయకురాలు ప్రతిభాభారతి ఆరోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కోండ్రు పని సులువైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. తాను గెలిస్తే చంద్రబాబు కేబినెట్లో తనకు చోటు ఖాయ మని ప్రచారం చేసుకున్న ఆయనకు ఇప్పుడు నిరాశే మిగిలింది. ఎస్సీ కోటాలో కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించినా చివరకు హడావుడే మిగిలింది.ఎందు‘కళా’..?ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా కొచ్చి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకుడిపై గెలిచిన కిమిడి కళావెంకటరావుకు ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు తప్పక ఉంటుందని ఆయన అనుచరులు అంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. 1983లో రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాత నుంచీ టీడీపీ అభ్యర్థిగా ఉణుకూరు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఉణుకూరు రద్దు అయిన తర్వాత ఎచ్చెర్ల నియోజకవర్గానికి మారిన ఆయన 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు. ఇలా ఆరుసార్లు ఎమ్మెల్యే, గతంలో రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు, 1998–2004 వరకూ రాజ్యసభ సభ్యుడిగా సేవలు, అంతకుమించి టీడీపీ రాష్ట్ర శాఖకు తొలి అధ్యక్షుడిగా పనిచేసిన కళాకు ఈసారి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. ఆయనకు చోటు దక్కకపోవడంతో అనుచరులంతా డీలా పడిపోయారు. స్పీకర్ పదవి వరిస్తుందనే ప్రచారం జరుగుతున్నా అది ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందో చూడాలి.‘కోళ్ల’ ఆశలు ఆవిరివిజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా ల్లో బలీయమైన సామాజికవర్గం నుంచి కోళ్ల లలితకుమారి ఒక్కరే ఈసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు కోళ్ల అప్పలనాయుడి కోడలుగా, రాజకీయ వారసురాలిగా శృంగవరపుకోట నియోజకవర్గంలో మూడో సారి గెలిచిన ఆమె ఈసారైనా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఆమెకే కాదు ఆమె సామాజికవర్గం నుంచి మరే ఎమ్మెల్యేకూ ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆ సామాజికవర్గ నాయకులంతా గుర్రుగా ఉన్నారు.తొలిసారి గెలిచినా...బొబ్బిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బేబీనాయనకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. ఎందుకో ఆయన పేరు పరిశీలనలోనే లేకుండాపోయింది. విజయనగరం నుంచి రెండో సారి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెడుతున్న అదితి గజపతిరాజుకు కూడా తన తండ్రి అశోక్ గజపతిరాజు కోటాలో మంత్రి పదవి వస్తుందని బంగ్లా అభిమానులంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ రాజకీయ అస్త్రసన్యాసం చేసిన అశోక్‌ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌ను చేయించాలని అధిష్టానం ఆలోచిస్తోందట. దీంతో అదితికి మంత్రి పదవి అవకాశం లేకుండాపోయింది. జనసేన ఎమ్మెల్యేల్లో ఏకై క మహిళ నాయకురాలిగా ఆ పార్టీ కోటాలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి మంత్రి పదవి వస్తుందని ఆమె అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. తుదకు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌కు తూర్పుకాపు కోటాలో, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణికి ఎస్టీ కోటాలో మంత్రి పదవులు దక్కాయి.మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గం: గజపతినగరం (తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు) వయస్సు: 42 సంవత్సరాలు విద్యార్హత: ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్) స్వగ్రామం: గంట్యాడ కుటుంబం: భార్య: లక్ష్మీసింధు (గృహిణి) పిల్లలు: విహాన్ (కుమారుడు), మేధ (కుమార్తె) తాత : కొండపల్లి పైడితల్లి నాయుడు (రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు) తండ్రి : కొండపల్లి కొండలరావు (రెండుసార్లు గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు) చిన్నాన్న: కొండపల్లి అప్పలనాయుడు (2014–19లో టీడీపీ ఎమ్మెల్యేగా చేశారు) పూర్వాశ్రమం: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అమెరికా, యూఏఈ, ఈజిప్ట్ తదితర దేశాల్లో పనిచేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాజకీయ ప్రస్థానం నియోజకవర్గం: సాలూరు (తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు) వయస్సు: 50 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ స్వగ్రామం: సాలూరు కుటుంబం: తండ్రి : జన్ని ముత్యాలు (1972–78 వరకూ కాంగ్రెస్ పారీ్టలో ఎమ్మెల్యేగా పనిచేశారు) తల్లి: జన్ని పార్వతమ్మ భర్త: గుమ్మడి జయకుమార్ పిల్లలు: పృధ్వీ (కుమారుడు), ప్రణతి (కుమార్తె) పూర్వాశ్రమం: కాంగ్రెస్ పార్టీ సాలూరు నియోజకవర్గ ఇంచార్జిగా 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి అప్పటి టీడీపీ అభ్యర్థి ఆర్పీ భంజ్‌దేవ్ చేతిలో ఓడిపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి నాటి కాంగ్రెస్ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసినా మళ్లీ ఓటమి తప్పలేదు. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమెను ఎమ్మెల్సీగా చేసింది. 2021 వరకూ ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. తర్వాత నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొరపై గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమెకు చంద్రబాబు మంత్రివర్గంలోనూ చోటు దక్కింది. -
ఆఫీస్ ఖాళీ చేసిన ‘కళా వెంకటరావు’
చీపురుపల్లి: జాతర జరిగే చోటకు సర్కస్ కంపెనీలు రావడం.. జాతర ముగిశాక తట్టాబుట్టా సర్దేయడం మనందరికీ తెలిసిందే. చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలాగనే ఉంది. ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇక్కడ అభ్యర్థులు మారిపోతుండడం, వారు కూడా ఇతర జిల్లాల నుంచి వలస రావడం, పోలింగ్ ముగిసిన మరుచటి రోజు నుంచే కనిపించకపోవడం సర్వసాధారణమైపోయింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇక్కడ అదే సీన్ రిపీట్ అయ్యింది. మే 13న పోలింగ్ ముగిసిన తరువాత చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆఫీస్‌ను ఖాళీ చేసేశారు. మూటాముడి సర్దేశారు. కళా కోసం వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందంటూ ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మే 13న పోలింగ్ ముగిసాక చీపురుపల్లి నియోకజవర్గ టీడీపీలో ఇదే పరిస్థితి ఉంటుందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ కోఆర్డినేటర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో ప్రతీ గ్రామంలోనూ ప్రజల కు వివరించారు. తాజాగా అదే జరగడంతో నియోజకవర్గంలో అంతేగా.. అంతేగా అనే చర్చ జోరుగా సాగుతోంది.ఆఫీస్ ఖాళీ చేసిన కళా..చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిమిడి కళా వెంకటరావు పేరును మార్చినెలాఖరులో టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఆయన ఏప్రిల్ మొదటి వారంలో చీపురుపల్లిలో తొలిసారి అడుగు పెట్టారు. ఓ వారం వరకు టీడీపీ సీనియర్ నేతకు చెందిన ఓ లాడ్జిలోనే మకాంవేశారు. తరువాత కనీసం అద్దె ఇల్లు కూడా తీసుకోకుండా గరివిడి నుంచి విజయనగరం వెళ్లే ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న ఓ కల్యాణమండపాన్ని మే 13 వరకు అద్దెకు తీసుకున్నారు. అక్కడే కళా బస ఏర్పాటు చేసి, కార్యకర్తలకు భోజనాలు కోసం వంటలు వండించారు. మే 13న పోలింగ్ పూర్తయిన తరువాత 14న మరోసారి కార్యకర్తల కోసం చివరి సారిగా భోజనాలు వండి పెట్టారు. అంతే.. అదే ఆఖరి రోజు. కల్యాణ మండపం అద్దె సెటిల్ చేసి ఖాళీ చేసేశారు. ఆ తరువాత ఈ నెల 18న ఓ లాడ్జిలో ప్రెస్‌మీట్ పెట్టారు. తరువాత ఆయన అక్కడా కనిపించకపోవడంతో.. ఏదైనా అవసరం వస్తే ఎక్కడ, ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి దాపురించిందని పార్టీ శ్రేణ్రుల్లో అంతర్మథనం ప్రారంభమయ్యింది.కళాకు ఇది అలవాటే..టీడీపీ అభ్యర్థి కళా తన ఆనవాయితీను కొనసాగించారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా కనీసం అద్దె ఇల్లు కూడా లేకుండా కాలయాపన చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఎచ్చెర్ల నియోజకవర్గంలో పదేళ్ల పాటు బాధ్యతలు వహించినా అదే ఆనవాయితీ కొనసాగించగా, చీపురుపల్లిలో కూడా అదే విధానం ఇక్కడ క్యాడర్‌కు అలవాటు చేయాలన్నదే ఆయన ఆలోచన అంటూ సొంత పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఎలాగూ విజయావకాశాలు తక్కువగా ఉన్నాయనే అంచనాకు వచ్చిన నేపథ్యంలో కనీసం అద్దె ఇల్లు కూడా తీసుకోలేదనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. -
చంద్రబాబు, పురందేశ్వరి స్కెచ్.. ‘కళా’ కుటుంబంలో కుంపటి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కుటుంబంలో చంద్రబాబు చిచ్చు రగిల్చారు. సొంత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడుతున్న రాజకీయ ఆటలో కళా వెంకటరావు పావుగా మారారు. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గం నుంచి ఉత్తరాంధ్రలో వేగంగా ఎదిగిన ఆయన ఇప్పుడు టికెట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని వెంకటరావుకు చంద్రబాబు ఆఫర్ ఇస్తూనే, మరోవైపు అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కళా సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జున ఆశలపై నీళ్లు చల్లారు. విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, మళ్లీ చీపురుపల్లిలో పార్టీని బతికించేందుకు ఐదేళ్లుగా కృషి చేస్తే తుదకు కరివేపాకులా తీసిపారేస్తున్నారంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం లోక్‌సభ ఆశ చూపించి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గాన్నే నమ్ముకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. సహచర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నారా లోకేశ్‌కు సన్నిహితుడిగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. అయితే, ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పనికిరాడంటూ టీడీపీ అధిష్ఠానమే ఇప్పుడు ముద్ర వేస్తోంది. ఇందుకు ఐవీఆర్ఎస్ సర్వే కారణం చూపిస్తోంది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తారంటూ లీకులు ఇచ్చింది. అక్కడ వెంకటరావు సోదరుడు, ప్రస్తుత నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కిమిడి నాగార్జున టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు చీపురుపల్లికి వెంకటరావును పేరును తేవడంతో కిమిడి కుటుంబంలో అగ్గిరాజుకుంది. తీవ్ర అసంతృప్తికి లోనైన నాగార్జున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నెల కిందటి వరకు నాగార్జున, మూడు రోజుల కిందటి వరకు గంటా శ్రీనివాసరావు, తాజాగా కళా వెంకటరావు.. ఇలా రోజుకో పేరును టీడీపీ అధిష్టానం తెరమీదకు తెస్తుండడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. దీన్ని చక్కదిద్దడానికి కళా వెంకటరావు పేరు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు తాజాగా లీకులు ఇస్తున్నారు. ఫలించిన పురందేశ్వరి స్కెచ్ నడికుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) ఇటీవలి వరకూ ఎచ్చెర్లలో గ్రామస్థాయి నాయకుడు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతో 2014–19 మధ్య కాస్త హవా చూపించారు. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంపై కన్నేసిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొని, పురందేశ్వరి పంచన చేరారు. ఆమె చలువతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవీ దక్కించుకున్నారు. ఇక్కడ బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి పావనిని తప్పించి మరీ ఈశ్వరరావుని జిల్లా అధ్యక్షుడిని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్ నేరుగా ఎన్‌ఈఆర్‌కు ప్రకటించకుండా నెమ్మదిగా స్కెచ్ అమలుచేశారు. తొలుత శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కోటాలో చూపించారు. అక్కడ గుండ లక్ష్మీదేవి కుటుంబం ఆందోళన చేయడంతో అది టీడీపీకే ఇచ్చేసి పొరుగున ఉన్న ఎచ్చెర్ల బీజేపీ కోటాలో వేసేశారు. తద్వారా ఎచ్చెర్ల టికెట్ తనదేనని ధీమాగా ఉన్న కిమిడి కళావెంకటరావు ఆశలపై నీళ్లు చల్లేశారు. ఇప్పుడు ఎన్ఈఆర్ను రంగంలోకి తెస్తున్నారు. బాబు పితలాటకంతో నాగార్జున బలి చంద్రబాబు, పురందేశ్వరి పెట్టిన పితలాటకంతో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జున బలవుతున్నారు. ఆయన తల్లి కిమిడి మృణాళిని 2014లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న నాగార్జున రాజకీయాలపై ఆసక్తితో ఇక్కడకు వచ్చి టీడీపీలో చేరారు. 2019లో ఓడిపోయారు. అయినప్పటికీ నాగార్జునకు భవిష్యత్ ఉందని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి నాగార్జున పనికిరాడంటూ చంద్రబాబు ముద్ర వేసేశారు. -
కళా వెంకటరావు మెడకు చీపురుపల్లి గంట
అటు తిరిగి ఇటు తిరిగి కిమిడి కళా వెంకటరావు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని ఆయన్ను పార్టీ సూచించినట్లు సమాచారం. ఎచ్చెర్లలో పార్టీ శ్రేణులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ‘కళా’ను చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేయాలని పార్టీ అధినేత మొదట్లోనే సూచించారు. కానీ ‘కళా’ అంగీకరించలేదు. విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి పంపించి పోటీ చేయించాలని అనుకున్నారు. ఆయన కూడా అంగీకరించకపోవడంతో అక్కడ మంత్రి బొత్సపై పోటీకి సరైన అభ్యర్థి దొరకలేదు. దాంతో మళ్లీ కళా మెడలో గంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విస్తృత బంధువర్గం, పరిచయాలు ఉన్న సీనియర్ నేత అయిన కళా అయితేనే బొత్సకు కొంత పోటీ ఇవ్వగలరన్నది చంద్రబాబు ఆలోచన. అదే సమయంలో ఎచ్చెర్లలో పంచాయితీని కూడా పరిష్కారం సాధించినట్లు అవుతుందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్లలో స్వపక్షంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీ నేత కిమిడి కళా వెంకటరావును నియోజకవర్గం మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాకుండా చీపురుపల్లి నియోజకవర్గంలో బరిలో దించితే ఎలా ఉంటుందనేదానిపై ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూసినా ఆయన ససేమిరా అనడంతో ప్రత్యామ్నాయంగా కళా వెంకటరావుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే ప్రకారం కళాను బరిలో దించుతారా? లేదంటే అక్కడా సానుకూలత లేదని పక్కన పెట్టేస్తారా? అంత రిస్క్ చేయడమెందుకని ఓడిపోయే సీట్లలో ఎవరు పోటీ చేస్తే ఏముందని ఎచ్చెర్లకే వదిలేస్తారా? అన్నది ప్రస్తుతం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. గ్రూపుల గోల..! ఎచ్చెర్లలో టీడీపీ బలహీనంగా ఉంది. గత ఐదేళ్లలో ఆ పార్టీ ఏమాత్రం బలపడలేదు. సరికదా గ్రూపులుగా తయారై టీడీపీ శ్రేణులు విడిపోయి మరింత పట్టుకోల్పోయారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి ఇక్కడ వర్గపోరు నడుస్తోంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఒకవైపు, ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు మరోవైపు గ్రూపుగా తయారై రాజకీయాలు చేస్తున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఎవరికి వారు బల ప్రదర్శన చేసుకుంటున్నారు. ఎన్నాళ్లు కళా వెంకటరావు పల్లకిమోస్తామని, ఈ సారి కలిశెట్టికి టికెట్ ఇవ్వాల్సిందేనని కొన్నాళ్లుగా టీడీపీలో ఓ గ్రూపు పట్టుబడుతూ వస్తోంది. చెప్పాలంటే కళా వెంకటరావుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తోంది. చౌదరి బాబ్జీ తదితర నాయకులు సైతం కళా వెంకటరావుతో తాము వేగలేమని.. అణగదొక్కే రాజకీయాలు ఇంకెంత కాలమని స్వరం విన్పిస్తున్నారు. అనుకున్నట్టుగా చివరికొచ్చేసరికి కళాతో పోటీగా కలిశెట్టి రేసులో నిలబడ్డారు. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రకరకాల సర్వేలు.. పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేస్తే సమస్యే లేదని ఒకవైపు ఆలోచిస్తుండగానే మరోవైపు కళా, కలిశెట్టిలో ఎవరి బెస్ట్ అన్నదానిపై ఐవీఆర్ఎస్తో పాటు రకరకాల సర్వేలను చంద్రబాబు చేయించారు. కొన్నింటిలో కలిశెట్టికి సానుకూలత రాగా, మరికొన్నింటిలో కళాకు అనుకూలంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం ఆ పార్టీకి గుదిబండగా తయారైంది. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టే నాయకత్వం అక్కడ లేకపోవడంతో చంద్రబాబు రకారకాల ఆలోచనలు చేస్తున్నారు. తరుచూ నియోజకవర్గాలు మార్చి ఎన్నికల్లో గట్టెక్కుతున్న గంటా శ్రీనివాసరావును అక్కడ బరిలో దించాలని చూసింది. పార్టీకి సమస్యగా మారిన గంటాను ఈ రకంగానైనా వదిలించుకోవాలని చంద్రబాబు అండ్‌కో చూస్తోంది. దానిలో భాగంగా ఓడి పోయిన సీట్లలో గంటాను పోటీ చేయిస్తే పీడ విరగడయిపోతుందని భావించారు. కానీ, గంటా దాని కి ససేమిరా అంటున్నారు. బొత్సతో పోటీ చేయలేనని చెప్పేస్తున్నారు. ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మంచిదన్న ఆలోచనకొచ్చి తన మనసులో మాటను అధిష్టానానికి చేప్పేశారు. కాకపోతే, పైరవీలు, లాబీయింగ్ చేసే గంటా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గంటా పోటీ చేసే సీటుపై ఆ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలో చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకటరావును పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేదానిపై ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించింది. ఎచ్చెర్లలో ఎలాగూ కష్టం.. చీపురుపల్లిలో కనీసం పోటీ అయినా ఇచ్చి బొత్సతో ఢీకొనాలని చూస్తోంది. అందులో భాగంగానే చీపురుపల్లికి కళా వెంకటరావును పంపిస్తారని ఇప్పటికే ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు సమాచారం వచ్చింది. బీజేపీకి ఎచ్చెర్ల ఇచ్చేస్తే.. సీనియర్‌కు కనీసం చీపురుపల్లిలోనైనా సీటు ఇచ్చి గౌరవం ఇచ్చామని చెప్పుకునేలా టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ సమీకరణాలు చివరి వరకు నడుస్తాయా? లేదంటే ఆఖరి నిమిషంలో మారుతాయో తెలియదు గానీ ప్రస్తుతం చీపురుపల్లికి కళాను పంపించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. -
కిమిడి కళావెంకటరావు కుటుంబానికి చంద్రబాబు ఝలక్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో టిక్కెట్ కోసం సిగపట్లు తారస్థాయికి చేరాయి. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నవారు ఆనందంలో ఉంటే... ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు, కటౌట్లకు భారీగా చేతిచమురు వదిలించుకున్నవారు మాత్రం నైరాశ్యంలో కూరుకుపోయారు. తమకు న్యాయం చేయకపోతే తడాఖా చూపిస్తామని ప్రత్యక్షంగా, పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు కుటుంబానికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. చివరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఇన్నాళ్లూ పనిచేసిన కిమిడి నాగార్జున పేరు తొలి జాబితాలో వెల్లడిగాకపోవడం గమనార్హం. పారాచ్యూట్ నాయకుడు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లికి వెళ్లమని అధిష్టానం ఒత్తిడి చేస్తోందని తెలుసుకున్న నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కె.ఎ.నాయుడికి ఎదురుదెబ్బ... గజపతినగరం నియోజకవర్గం టీడీపీ టిక్కెట్‌ను కొండపల్లి శ్రీనివాస్‌కు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు (కె.ఎ. నాయుడు), ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతోంది. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో వారంతా శనివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఇప్పటివరకూ నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ కోసం కష్టపడ్డానని, మూడు పార్టీలు మారివచ్చిన కొండపల్లి కొండలరావుకు, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు అధిష్టానం పెద్దపీట వేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తనతో పాటు 500 మంది తన అనుచర గణం పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం గజపతినగరంలో నిరసనకు పిలుపునిచ్చారు. గజపతినగరం టికెట్‌ను ఆశించిన మరో టీడీపీ నాయకుడు కరణం శివరామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ చేసిన ద్రోహానికి కంటతండి పెట్టారు. ‘కళ’ తప్పింది.. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు విజయనగరం జిల్లా రాజకీయాలపై గతంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత తన సొంత ప్రాంతమైన రాజాం విజయనగరం జిల్లాలో విలీనమైన దృష్ట్యా ఇక చక్రం తిప్పాలని విశ్వప్రయత్నాలు చేశారు. తీరా టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి చెల్లని కాసు అయిపోయారు. ఎచ్చెర్ల టికెట్‌ను మరోసారి ఆశిస్తున్న ఆయన పేరు తొలి జాబితాలో ప్రకటించకపోవడం గమనార్హం. ఆయన సోదరుడి కుమారుడు, టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడైన కిమిడి నాగార్జున కూడా మరోసారి చీపురుపల్లి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. తొలి జాబితాలో ఆయన పేరు కూడా వెల్లడించలేదు. కిమిడి కళావెంకటరావు కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించినా రాజాం టికెట్‌ను కోండ్రు మురళీమోహన్‌కు చంద్రబాబు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కోండ్రుకు బదులుగా స్వర్ణరాణికి టికెట్ ఇవ్వాలంటూ కిమిడి కుటుంబం, మాజీ ఎంపీపీ కొల్లా అప్పలనాయుడు చేసిన ప్రతిపాదన కూడా గాలికి కొట్టుకుపోయింది. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, మహానాడులో తొడకొట్టి సవాలు చేసిన ఆమె కుమార్తె గ్రీష్మ పేర్లను చంద్రబాబు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వీరి తీరు ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకం. నివురుగప్పిన నిప్పులా అసమ్మతి... బొబ్బిలి టికెట్ దక్కించుకున్న ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) మినహా తొలి జాబితాలో పేరు వెల్లడైన అందరికీ తమ నియోజకవర్గాల్లో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అస్త్ర సన్యాసం చేసి తన కుమార్తె అదితికి విజయనగరం టికెట్ ఇప్పించుకోగలిగారు. ఈ నియోజకవర్గంలో అశోక్ అణచివేసిన బీసీ మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మాత్రం కిమ్మనలేదు. ఆమె అనుచరులు మాత్రం రగిలిపోతున్నారు. పార్వతీపురం టికెట్‌ను ఎన్నారై బోనెల విజయచంద్రకే చంద్రబాబు కేటాయించారు. దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకు మొండిచేయి చూపించారు. విజయచంద్రను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాట కూడా చెల్లలేదు. సాలూ రులో భంజ్‌దేవ్ వర్గం ఎంత వ్యతిరేకించినా టికెట్ మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికే దక్కింది. కురుపాంలో ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకించినా తోయక జగదేశ్వరికే టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. వ్యతిరేక వర్గాలు తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థులను డిపాజిట్లుకూడా రాకుండా ఓడిస్తే తప్ప చంద్రబాబుకు బుద్ధిరాందంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. బీసీలకు చంద్రబాబు మోసం... కేవలం ఓట్ల కోసమే బీసీల జపం చేసే చంద్రబాబు అసలు నైజం బయటపడింది. బీసీల జిల్లాగా పేరొందిన విజయనగరం జిల్లాకు సంబంధించి టీడీపీ–జనసేన కూటమి తరఫున తొలిజాబితాలో టికెట్లు దక్కించుకున్నవారిలో బీసీ అభ్యర్థి ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన రాజాం మినహాయిస్తే మిగిలిన నాలుగు జనరల్ సీట్లలో బీసీలకు ఒక్క సీటు మాత్రమే దక్కింది. విజయనగరం, బొబ్బిలి టికెట్లను రాజులకే (క్షత్రియ సామాజిక వర్గానికి) కేటాయించింది. ఏకులా వచ్చి మేకు అయ్యింది... నెల్లిమర్ల ఎమ్మెల్యే నేనే అవుతానంటూ ఇన్నాళ్లూ ఉబలాటపడిన కర్రోతు బంగార్రాజు నెత్తిన పిడుగుపడింది. జనసేన కోటాలో టికెట్ దక్కించుకున్న లోకం మాధవిని తొలుత తక్కువగా అంచనా వేశారు. ఆమె పవన్ కల్యాణ్ మద్దతుతో బరిలోకి దిగేసరికి బంగార్రాజు సహా నెల్లిమర్ల టీడీపీ నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. శనివారం సాయంత్రం విజయనగరంలోని ఒక హోటల్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. బంగార్రాజు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, నెల్లిమర్ల మండల టీడీపీ అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మునాయుడు తదితరులంతా హాజరయ్యారు. మూడ్రోజుల్లో లోకం మాధవిని మార్చకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేయాలని, తాడేపల్లి వెళ్లి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్యాలెస్ వద్ద నిరసన తెలిపివద్దామని నిర్ణయించారు. లోకం మాధవి వర్గం మాత్రం సంతోషంలో ఉంది. అయితే, మాధవి ఎలా గెలుస్తుందో చూస్తామని టీడీపీ వర్గాలు బహిరంగంగానే సవాల్ చేస్తుండడం గమనార్హం. -
టీడీపీ కుట్రలివే.. అబద్ధాలతో ‘రాజకీయ’ అంతస్తులు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న వివాదం జరిగినా దానికి వైఎస్సార్సీపీతో లంకె పెట్టేయడం.. తద్వారా రాజకీయ మైలేజ్ కోసం కక్కుర్తి పడటం టీడీపీకి పరిపాటిగా మారింది. వ్యక్తిగతమా, కుటుంబ గొడవా, వర్గ పోరాటమా.. అన్నది చూడకుండా.. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా.. ఏదైనా సంఘటన జరిగితే చాలు.. చంద్రబాబు, లోకేష్ నుంచి కిందిస్థాయి నేతల వరకు ఏమాత్రం ఇంగితం లేకుండా అధికార పార్టీపై నిందలు మోపేస్తారు. చదవండి: పవన్ విషప్రచారానికి దిమ్మతిరిగే కౌంటర్ చాలా సంఘటనల్లో అసలు వాస్తవాలు బయటకొచ్చి తమ పార్టీ పరువే పోతున్నా.. వారి తీరు మారడంలేదు. హరిపురంలో ఏళ్లనాటి కుటుంబ గొడవ నేపథ్యంలో ఇద్దరు మహిళలపై దాడి ఘటనలో కూడా టీడీపీ ఇలాగే అభాసుపాలైంది. ఈ కేసులో నిందితులు తమ పార్టీకి సన్నిహితులేనన్న విషయం విస్మరించి విషం చిమ్మడానికి తెగబడింది. అసలు విషయం బయటపడటంతో టీడీపీ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా తయారైంది. టీడీపీ మళ్లీ అబద్ధాలను, అవాస్తవ ప్రచారాలనే నమ్ముకుంటోంది. ఎక్కడో ఏదో జరిగిన దానికి వైఎస్సార్సీపీ నాయకులను, ప్రభుత్వాన్ని ఆపాదించి రాజకీయ లబ్ధి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మందస మండలం హరిపురంలో నెలకొన్న ఘటనలోనూ ఇదే జరిగింది. మందస మండలం హరిపురంలో స్థల వివాదం ముదిరి సోమవారం ఇద్దరు మహిళలపై కంకర పోసే వరకూ వెళ్లింది. కొట్ర రామారావు, ప్రకాశరావు, ఆనందరావులతో సమీప బంధువులైన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలకు ఓ ఇంటి స్థలం విషయమై ఎప్పటినుంచో వివాదం ఉంది. గత తొమ్మిదేళ్లుగా వీరి మధ్య స్థల వివాదం నడుస్తోంది. 2017 నుంచి బాధితులైన తల్లీ కూతుళ్లు పోరాటం చేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, ఆయన అల్లుడు వద్దకు పంచాయతీ వెళ్లింది. కానీ వివాదాన్ని పరిష్కరించలేదు. అందులోనూ కొట్ర రామారావుకు శివాజీ, కళా వెంకటరావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల వివాదం పరిష్కారానికి చొరవ చూపలేదన్న ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వంలోనే బాధిత మహిళలు 2017, 2019లో నిరహార దీక్షలు కూడా చేశారు. చివరికి వివాదం కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆ మహిళలపై కొట్ర రామారావు అండ్‌కో బాధిత మహిళలపై కంకర పోసి సజీవ సమాధి చేసేందుకు యత్నించారని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు చెప్పుకొస్తున్నారు. ఈ ఫొటోలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుతో ఉన్న వ్యక్తే హరిపురంలో బాధిత మహిళలపై కంకర పోసిన ఘటన కేసులో ఏ1గా ఉన్నారు. ఈయన పేరు కొట్ర రామారావు, టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనడానికి ఈ ఫొటోనే నిలువెత్తు సాక్ష్యం. మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, గౌతు శిరీష దగ్గరి నుంచి టీడీపీ కీలక నేతల వరకు సత్సంబంధాలు ఉన్నాయి. అంతమాత్రాన బాధిత మహిళలపై కంకర పోసి, సజీవ సమాధి చేసేందుకు టీడీపీ కీలక నేతలు అండగా నిలిచారని చెప్పడం సమంజసం కాదు. రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదం చినికి చినికి గాలివానగా మారి మహిళలపై కంకరపోసే వరకు వెళ్లిందే తప్ప కింజరాపు రామ్మోహన్నాయుడో, కళా వెంకటరావో, గౌతు శ్యామ సుందర్ శివాజీయో చేయించరాని అనడం తప్పు. ఆరోపణలు, విమర్శలు చేయడం కూడా సరికాదు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌కు కనీసం ఇంగితం లేకుండా సోమవారం ట్వీట్లపై ట్వీట్లు పెట్టారు. ఇక్కడ జరిగిన ఘటనను ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లింకు పెట్టి దుష్పచారం చేశారు. వైఎస్సార్సీపీకి ఆపాదించి, పోలీసు వ్యవస్థను కూడా వదలకుండా అబద్ధపు ప్రచారం చేశారు. పోలీసులు చర్యలు తీసుకోలేదనే స్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్లారు. వాస్తవంగా ఈ ఘటనపై సోమవారమే కేసు నమోదు చేసి, అభియోగాలున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇదేమీ చూడకుండా తమ రాజకీయ లబ్ధి కోసం హరిపురం ఘటనను వైఎస్సార్సీపీతో ముడిపెట్టి కుట్రపూరితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించారు. చివరికి ఆ ప్రచారంలో వాస్తవం లేదని, అదంతా అబద్ధమని తేలిపోవడంతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. గతంలో టీడీపీ కుట్రలివే.. టెక్కలిలో ఎప్పుడో బుద్ధుడి విగ్రహం మణికట్టు విరిగిపోతే.. దాన్ని రాజకీయం చేసి మత విద్వేషాలు రెచ్చగొడతామని యతి్నంచి తెలుగు తమ్ముళ్లు దొరికిపోయారు. దీంట్లో తెరవెనక అచ్చెన్నాయుడు కీలక పాత్ర వహించారు. సంతబొమ్మాళి మండలం పాలేశ్వరపురం ఆలయంలోని పాత నంది విగ్రహాన్ని టీడీపీ నేతలు పట్టపగలే తరలించి, నడిరోడ్డుపై ఉన్న సిమెంట్ దిమ్మపై ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రతిష్టించి అపచారానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇదంతా చేసిందని, హిందు మతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని దు్రష్పచారం చేసేందుకు కుట్ర పన్నారు. కానీ సీసీ కెమెరాల పుటేజీలో టీడీపీ నేతల బాగోతం బయటపడింది. అడ్డంగా దొరికిపోవడంతో పోలీసులు కేసు పెడితే.. విగ్రహం మార్చినంత మాత్రాన కేసులు పెడతారని బుకాయింపునకు దిగారు. పరీక్షల సీజన్లో సరుబుజ్జిలి మండలం రొట్టవలస, కొత్తకోట జెడ్పీహెచ్ స్కూళ్లలో పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం టీడీపీ నాయకులు లీక్ చేసి, దానిని ప్రభుత్వంపై మోపి దుష్ప్రచారానికి యత్నించి దొరికిపోయారు. చివరికీ వారంతా అరెస్టు అయ్యారు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక, ప్రసారాల శాఖ ప్రెస్‌నోట్ జారీ చేసినట్టుగా ఒక ఫేక్ ప్రెస్‌నోట్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అనుచరుడైన సంతబొమ్మాళి మండలం బోరుబద్ర గ్రామానికి చెందిన అప్పిని వెంకటేష్ సామాజిక మాధ్యమాల్లోకి వెళ్లి దుష్ప్రచారానికి దిగారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలతో విష ప్రచారం చేస్తున్నట్టుగా వెంకటేష్‌ను గుర్తించి సీఐడీ అధికారులు విచారణ కూడా చేశారు. హరిపురం ఘటనలో ఇద్దరి అరెస్ట్ మందస: మండలంలోని హరిపురంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు మందస ఇన్చార్జి ఎస్ఐ మధు తెలిపారు. హరిపురంలో భూ వివాదానికి సంబంధించి కొట్ర దాలయ్మ, మజ్జి సావిత్రిలపై ట్రాక్టర్‌తో కంకర వేసి హత్యాయత్నం చేశారన్న సంఘటన సంచలనంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు హరిపురానికి చెందిన కొట్ర రామారావు, పిడిమందస గ్రామానికి చెందిన కంచిలి ప్రకాశరావులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు. -
టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు రాజుకుంటున్నాయి. భవిష్యత్‌లో తనకు ప్రతిబంధకంగా త యారవుతున్న నాయకులను సాగనంపే పనిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. తనకు పోటీగా తయారవుతున్న నాయకులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్ టీడీపీ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయగా, నేడు టీడీపీ ఉత్తరాంధ్ర కార్యకర్తల శిక్షణ శిబిరం డైరెక్టర్ కలిశెట్టి అప్పలనాయుడును సస్పెండ్ చేస్తున్న ట్టు కళా వెంకటరావు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి కళా వెంకటరావుకు నియోజకవర్గంలో అసమ్మతి పోరు ఎక్కువైంది. ముఖ్యంగా కళా కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును నియోజకవర్గంపై వదలడం, రాష్ట్ర స్థాయి పదవి అప్పగించడంతో కళాపై కినుకు ఎక్కువైంది. అసలే వలస నేత, ఆపై ఆయన కుటుంబ సభ్యులు తమపై పెత్తనం చేయడమేంటని ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది. దీంతో కళా అలెర్ట్ అయ్యారు. వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలు, పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులపై దృష్టి సారించారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును ఏకపక్షంగా సస్పెండ్ చేయగా, నేడు నియోజకవర్గంలో కీలకమైన కలిశెట్టి అప్పలనాయుడుపైనా అదే వేటు పడింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు కళాకు ఆ అధికారం ఎక్కడిదని, ఏ ఆదేశాలైనా పార్టీ నుంచి రావాలని ఆయన్ని వ్యతిరేకిస్తున్న నాయకులంతా ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో దోస్తీ.. ఒక వైపు కళా వెంకటరావు సోదరుడు కుటుంబీకులంతా ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్నారు. సోము వీర్రాజు తదితర నేతలతో మంతనాలు జరిపారు. మే నెలలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదంతా ఎప్పటికప్పుడు కళా వ్యతిరేక వర్గీయులు బయటపెడుతున్నారు. ఏ రోజుకైనా కళా వెంకటరావు బీజేపీలో చేరడం ఖాయమని కూడా చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో తనకు వ్యతిరేకంగా నడుస్తున్న నాయకులపై వరుసగా సస్పెన్షన్ వేటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ఉండాలంటే అసమ్మతి నేతలందరినీ బయటికి పంపించాలనే షరతుతో అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తమపై వేటు వేస్తున్నారని అసమ్మతి నేతలు వాపోతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం అక్రమాలకు పాల్పడి, పార్టీని అప్రతిష్ట పాలుజేసి, ఇప్పుడు కష్టపడ్డ సీనియర్లను పార్టీ నుంచి దూరం చేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆ పార్టీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆ ఇద్దరికీ పదవీ గండం? ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్ను -
కళా వెంకట్రావు ఓ డిక్టేటర్.. ఆడియో హల్చల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘‘వారి బంధువులకు ఓ న్యాయం. మిగతా కార్యకర్తలకు ఔటర్ కులాల వారికి ఓ న్యాయం అన్నమాట. అంటే వారి చేతిలో ఉన్న చెంచాగాళ్లందరికీ ఓ రూల్ అన్నమాట. మిగతా వారందరికీ, అదర్ కమ్యూనిటీలు ఏమైనా ఉంటే అదో రూల్. ఇది ఓ డిక్టేటర్షిప్ రూలింగ్‌లో ఉందన్నమాట ఇక్కడ. కిందన కూర్చోవాల, చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల, ఉంగరాలు ఉండకూడదు, బుర్ర దువ్వుకోకూడదు ఇలాంటి రూల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నాయకత్వంలో.. ఎచ్చెర్లకు సంబంధించి రూల్స్ అన్నీ ఇక్కడ పనిచేయవు. పూర్వం బ్రిటీష్ వారి పరిపాలనలా ఉండాలన్నమాటిక్కడ. చూస్తే స్థానికులు కాదు. పోనీ స్థానికులైనా ఫరవాలేకపోను. మాకు ఎక్కడినుంచో వస్తారు నాయకులు, ఇక్కడ మమ్మల్ని బ్రిటీష్ వాళ్లు ఏలినట్లు ఏలుతారన్నమాట’’ ఇదీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావునుద్దేశించి జి.సిగడాం మండలం సంతవురిటికి చెందిన బాలగుమ్మ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలతో కూడిన ఆడియో ప్రస్తుతం టీడీపీ సర్కిల్లోనూ, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ►కళా వెంకటరావుపై ఎచ్చెర్ల నేతలు ఒక్కొక్కరిగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటికే చౌదరి బాబ్జీ, కలిశెట్టి అప్పలనాయుడు తదితర నేతలు గుర్రుగా ఉన్నారు. చాపకింద నీరులా మిగతా కేడర్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ►మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో జి.సిగడాం మండలం సంతవురిటిలో టీడీపీ మద్దతుదారుని బరిలోకి దించలేదని, ఆయన మరోపక్షంతో కుమ్మక్కయ్యారన్న కారణం చూపి ఆ గ్రామ, మండల నేతైన బాలగుమ్మ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయించారు. దీని వెనుక కళాకు వ్యతిరేక స్వరమే కారణమైనప్పటికీ అవకాశం వచ్చిందని సర్పంచ్ ఎన్నికల ముసుగులో వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారన్న వాదనలు ఉన్నాయి. ►1982 నుంచి ఆస్తులు అమ్ముకుని అటు మండలం, ఇటు గ్రామంలోనూ తన తండ్రి దగ్గరి నుంచి టీడీపీ కాపాడుకుంటూ వస్తున్న తమకు సస్పెన్షన్ బహుమతి ఇచ్చారని వెంకటేశ్వరరావు రగలిపోతున్నారు. కళా వెంకటరావు సొంత మండలమైన రేగిడిలో అనేక పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోయారని, రేగిడి, వంగర మండలాల్లో ఏకంగా ఎంపీటీసీలే ఏకగ్రీవమైపోయి మండల పరిషత్ పీఠాలు వైఎస్సార్సీపీ పరమయ్యాయని, దానికి కళా బాధ్యులు కాదా? తనను సస్పెండ్ చేసినప్పుడు...ఆ రూల్ కళాకు వర్తించదా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అసలు సస్పెండ్ చేయడానికి కళా వెంకటరావు ఎవరని నేరుగా ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేయాలే తప్ప ఈయనెవరని ధిక్కార స్వరం వినిపించారు. నేరుగా తన వాయిస్‌ను రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో వదిలారు. ఇప్పుడీ ఆడియో టీడీపీ సర్కిల్లోనూ, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. చదవండి: అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..! పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు -
టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యువనేత!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడిని నియమించనున్నారు. కొద్దిరోజుల్లో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ అన్నీ తామై వ్యవహరించడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రావు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన రామ్మోహన్నాయుడిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రామ్మోహన్నాయుడు 6,653 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగుతున్నారు. -
కళ తప్పిన మంత్రి!
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట రావు ఘోర ఓటమి చవిచూశారు. వైఎస్సా ర్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ చేతిలో 18813 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీయేతర పార్టీలు మూడుసార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించా యి. 2004, 2009ల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో గొర్లె కిరణ్‌కుమార్ విజయం సాధించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు కళా వెంకటరావు పోటీ చేయగా రెండు సార్లు ఓటమి చెందారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన ఆయన మూడో స్థానంలో నిలిచారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌పై 4741 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పటి నుంచి కిరణ్‌కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నిరంతరం ప్రజల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్‌ను టీడీపీ నాయకత్వం ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నా కొత్త క్యాడర్ తయారు చేస్తూ ముందుకుసాగారు. నిరంతరం ప్రజల్లో ఉండటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, జన్మభూమి కమిటీల వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లటం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడం విజయానికి దోహదపడ్డాయి. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించటం, పార్టీ నవరత్నాలు పథకాల సాయంతో కళావెంకటరావును ఓడించగలిగారు. -
తెలంగాణ బకాయిలపై కోర్టుకు: మంత్రి కళా
విజయవాడ: తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై ఏపీ మంత్రి కళా వెంకట్రావు మాట్లాడారు. బకాయిలు చెల్లించని పక్షంలో కోర్టుకు వెళ్ళుతామని ఆయన అన్నారు. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను తెలంగాణ చెల్లించనంటోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి అదనంగా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం రెండు సంస్థలతో పీపీఎల్ చేసుకుందన్నారు. ఆ పీపీఎల్ మేరకు రెండు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. వాళ్లు కోర్టుకు వెళతారనే పక్షంలో కొనుగోలు గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు చేయలా ? వద్దా ? అనేది నిర్ణయించాలని ఈఆర్సీకి పంపుతామని మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. -
రాజకీయ ‘చెద’రంగం!
► పార్టీలో నిబద్ధతకు గుర్తింపు లేదన్న గౌతు శివాజీ ► అధిష్టానం తీరుతో మీడియా ముందు కంటతడి ► సీనియర్ నేత కళా వెంకటరావుకు ‘ఎనర్జీ’ ► రవాణా శాఖతో అచ్చెన్నాయుడికి ప్రమోషన్ ► కార్మిక, క్రీడా శాఖల్లో విఫలమైనా కీలక శాఖ బాధ్యతలు ‘ఇది రాజకీయ‘చెద’రంగం... దీన్ని ఆడలేకపోయా... అందుకే మంత్రి పదవి రాలేదేమో! నా సీనియార్టీని చంద్రబాబు గుర్తించి ఆ మంత్రి పదవి ఇస్తారేమోనని భావించా! కానీ ఆశపడలేదు! పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా! దానికి గుర్తింపు రాలేదు...’ ఇదీ జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు గౌతు శ్యామసుందర శివాజీ ఆవేదన! జిల్లాలో తన సమకాలీనుడైన కిమిడి కళావెంకటరావు పార్టీ మారొచ్చినా పెద్దపీట వేయడం, మరో సమకాలీన నేత ఎర్రన్నాయుడి తమ్ముడు అచ్చెన్నాయుడికి ప్రాధాన్య శాఖలతో ప్రమోషన్ ఇవ్వడం శివాజీ కన్నీటికి కారణమైందనే చర్చ మొదలైంది! కార్మిక, క్రీడా శాఖల్లో విఫలమైనా రవాణా, బీసీ సంక్షేమం వంటి కీలక శాఖలు అచ్చెన్నకు ఇవ్వడంలో అంతరార్థం బాగా పనిచేయడం కన్నా చంద్రబాబు మెచ్చిన సుగుణమేదో ఆయనలో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పార్టీలో తొలి నుంచి కష్టపడినవారి కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరినవారికే పెద్దపీట వేయడం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ సీనియర్ నాయకులకు మింగుడుపడట్లేదు. జిల్లాలో పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కంటతడి పెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో సేవలందించినా గుర్తించకుండా అధిష్టానం మొండిచేయి చూపడాన్ని జీర్ణించుకోలేకపోయారు. మూడేళ్ల క్రితమే శివాజీకి మంత్రిమండలిలో చోటుదక్కుతుందని ఆశించినా వివిధ కారణాలు చూపించి తనకన్నా జూనియర్ నాయకుడైన అచ్చెన్నాయుడి వైపే చంద్రబాబు మొగ్గు చూపించారు. అప్పట్లో శివాజీ కుమార్తె శిరీషను పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌కు మంత్రి పదవి కల్పించడం కోసం ఎప్పటికైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ఏడాది క్రితం నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటి నుంచే ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మంత్రి పదవి కోసం చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించారనేది బహిరంగ రహస్యమే! పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు కలిసొచ్చిన ప్రతి అంశాన్ని చక్కగా వినియోగించుకొని లోకేశ్‌కు సన్నిహితులుగా మారిపోయారు. చివరకు లోకేశ్ సిఫారసుతోనే ఇంధన వనరులు (ఎనర్జీ) వంటి ప్రాధాన్యం ఉన్న శాఖతో జిల్లాలో రెండో మంత్రిగా అడుగుపెట్టగలిగారు. అయితే కళా పార్టీ మారొచ్చిన నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే జిల్లా సీనియర్‌గా తనకే మంత్రి పదవి వస్తుందని శివాజీ ఆశించారు. చివరకు తన తండ్రికి మంత్రిగా అవకాశం కల్పించడానికి ఒకవేళ తన పార్టీ పదవే అడ్డొస్తే వదులుకోవడానికీ సిద్ధమేనని శిరీష జిల్లాలో ఓ ముఖ్య నేత వద్ద చెప్పినా సదరు నేత ఆ విషయాన్ని అధిష్టానం దృష్టి తీసుకెళ్లలేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తన కుమార్తె తప్ప జిల్లాలో టీడీపీ నాయకులెవ్వరూ తనకు మద్దతుగా నిలవకపోవడం కూడా శివాజీని కలిచివేసి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాకు మూడేళ్లలో ఒరిగిందేమిటి? చంద్రబాబు మంత్రివర్గంలో గత మూడేళ్లుగా అచ్చెన్నాయుడు కార్మిక, ఉపాధి, యువజన, క్రీడా శాఖలను నిర్వహించారు. అయితే ఆయా శాఖల బాధ్యతలు గాకుండా జిల్లాపై ఆధిపత్యం కోసం, ఇరిగేషన్ వంటి ఇతర శాఖల విషయాల్లో జోక్యం చేసుకోవడంతోనే ఆయన కాలం గడిపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిలో అట్టడుగునున్న జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా సొంత ప్రాంతానికి చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. సిక్కోలుతో పాటు ఉత్తరాంధ్రలో దాదాపు లక్ష మంది కార్మికులకు ఏకైక ఆధారమైన జూట్ మిల్లులకు లాకౌట్ ప్రకటించారు. అనేక చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ మూడేళ్ల కాలంలో జిల్లాకు ఒక్క పరిశ్రమనూ తేలేకపోయిన అచ్చెన్న కనీసం ఆ మూతపడిన పరిశ్రమలనైనా తెరిపించలేక కార్మిక మంత్రిగా విఫలమయ్యారు. ఇక క్రీడా, యువజన సర్వీసుల శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నా జిల్లాలో క్రీడల ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలు లేవు. చివరకు జిల్లా కేంద్రంలో కూల్చేసిన కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసి దాదాపు ఏడాదైపోతున్నా మోక్షం కలగలేదు. ఇటీవల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో ఆగమేఘాలపై ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే జిల్లా క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లభించలేదు. ఇటీవల దివ్యాంగుల క్రికెట్లో ఇటీవల పాకిస్తాన్ జట్టును చితక్కొట్టి ప్రపంచకప్‌ను సాధించిన భారతజట్టులోని కీలక సభ్యుడు దున్న వెంకటేశ్వరరావు జిల్లావాసే! అతనికి భారీ నజరానా కాదుకదా కనీసం క్రీడాశాఖ తరఫున సన్మానం కూడా చేయలేదు. పదవులతో మేలు జరిగేనా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అచ్చెన్నాయుడికి రవాణా, బీసీ సంక్షేమ, చేనేత, వస్త్ర మంత్రిత్వశాఖలు దక్కాయి. అలాగే కళావెంకటరావుకు ఎనర్జీ మంత్రిత్వశాఖ లభించింది. ఈ ఇద్దరు మంత్రులతో జిల్లాకు ఇకనైనా మేలు జరుగుతుందేమోనని సిక్కోలు ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాలో 80 శాతం పైగా బీసీలే! కానీ వారి జనాభా దామాషా ప్రతిపాదికన చూస్తే బీసీ రుణాలు ఏమూలకు సరిపోవట్లేదు. వంద వరకూ బీసీ సంఘాలు ఏర్పాటు చేయాల్సివున్నా జిల్లాకు ప్రస్తుతం 35కి మించి కులసంఘాలు లేవు. ఆయా సంఘాలను ఏర్పాటు చేసి, సంక్షేమానికి తగినట్లుగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అలాగే జిల్లాలో చేనేత కార్మికులున్న గ్రామాలు వంద వరకూ ఉన్నాయి. పొందూరు, నరసన్నపేట మండలాల్లో చేనేత క్లస్టర్లు ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా వాటికి అతీగతీ లేదు. ఇక పొందూరు ఖాదీ ప్రపంచ ఖ్యాతిగాంచినా అక్కడి ఖాదీ సంఘం, చేనేత కార్మికుల పరిస్థితి దీనావస్థలో ఉంది. చివరకు శ్రీకాకుళంలోనున్న ఖాదీ గ్రామోద్యయ సంఘాన్ని నిర్వీర్యం చేసేసి, సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సంఘం స్థలంలో నిర్మించిన భవనాన్నీ అద్దెకు ఇచ్చేసిన ఘనత కూడా టీడీపీ ప్రభుత్వానిదే. వీటన్నింటినీ అచ్చెన్న చక్కదిద్దుతారో లేదో వేచి చూడాల్సిందే! కళాతో ‘ఎనర్జీ’వచ్చేనా? జిల్లాలో కొవ్వాడ అణువిద్యుత్తు పార్కుతో పాటు కాకరాపల్లి, పొలాకిలో ధర్మల్ విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు ఇంధన వనరుల మంత్రిగా కళా వెంకటరావు ఏమేరకు కృషి చేస్తారనేదీ చర్చనీయాంశమైంది. కాకరాపల్లిలో ఈస్ట్‌కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భరించలేక ప్రైవేట్ యాజమాన్యం అర్ధంతరంగా చేతులెత్తేసింది. దీనికి రుణం ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జెన్కోకు భారీ మొత్తానికి అప్పగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఫలించలేదు. ఇక పోలాకిలో జపాన్ ఆర్థిక సహాయంతో నిర్మించ తలపెట్టిన ధర్మల్ విద్యుత్తు కేంద్రం కూడా ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. ఇక గుజరాత్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కళా సొంత నియోజకవర్గంలోని కొవ్వాడకే తరలివచ్చిన అణువిద్యుత్తు పార్కు పనులు ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా సంస్థ వెస్టింగ్ హౌస్ ఇటీవలే దివాళా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఇవన్నీ అధిగమించి కళా జిల్లాకు ఎంత ‘ఎనర్జీ’ తీసుకువస్తారో వేచిచూడాల్సిందే! -
ఒంటరవుతున్న అచ్చెన్న
కళా చుట్టూ నేతల ప్రదక్షిణ సమాచారం వెళ్ళినా మంత్రి మౌనం శ్రీకాకుళం : జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఒంటరవుతున్నారు. ఏడాదిన్నరపాటు జిల్లాలో హవా కొనసాగించిన ఆయన ఇపుడిపుడే కార్యకర్తల నుంచి దూరం అవుతున్నారు. కొన్నాళ్ళుగా అమరావతి శంకుస్థాపన పనిలో ఉన్న మంత్రికి ఇక్కడిసమాచారం తెలియడం లేదు. ఫోన్లో తాజా పరిస్థితిని నేతలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. మొన్నటి వరకూ వెంట తిరిగి పనులు చేయించుకున్న దిగువశ్రేణి నేతలు కూడా ఇపుడు రూటు మారుస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు సైతం సొంత పనుల కోసం పక్కచూపులు చూస్తున్నారు. తాజా పరిణామాలతో మంత్రి కుటుంబ సభ్యులు అవాక్కవుతున్నారు. క్యాబినెట్లో సీటు పొంది అసెంబ్లీలో నోరుపారేసుకుని, రాష్ట్ర ప్రథమపౌరుడ్ని పరుషజాలంతో మాట్లాడిన మంత్రి పరిస్థితి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. నిన్న మంత్రి వెంట... నేడు కళా చెంత... జిల్లాలోని మంత్రి వెంటే తిరిగిన నేతలు సైతం ఇపుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు చుట్టూ తిరుగుతున్నారు. గతంలో కేవలం ఎచ్చెర్ల నియోజకవర్గానికే పరిమితమైన కళాకు ఇపుడు రాష్ట్ర అధ్యక్షునిగా పదవి దక్కడంతో పనుల కోసం ఆయన వెంట ప్రదక్షిణలు చేస్తున్నారు. పాలకొండ కోటదుర్గమ్మ దర్శనానికి వెళ్ళిన కళా చుట్టూ అక్కడి కాపునేతలంతా చేరిపోయారు. తాజాగా శుక్రవారం శ్రీకాకుళం పట్టణాధ్యక్షుడు మాదారపు వెంకటేష్ సహా 30మంది ప్రత్యేక వాహనాల్లో రాజాం వెళ్ళి కళాను కలుసుకున్నారు. బుధవారం జరిగిన కళా అభినందన సభను బహిష్కరించిన వీళ్ళంతా నాటి సంఘటనకు కారణాలను వివరించి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకే రాజాం వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా వెళ్ళినవారంతా శ్రీకాకుళం ఎమ్మెల్యే అనుచరులే కావడం విశేషం. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా మంత్రి వెంటే తిరిగిన ఎమ్మెల్యే ఇపుడు రూటు మార్చినట్టు తమ్ముళ్ళే ప్రచారం చేస్తున్నారు. జిల్లా అధిష్టానంపైనా ఫిర్యాదు ఇదిలా ఉంటే జిల్లా అధిష్టానంపై దిగువశ్రేణి నేతలు కొంతమంది శుక్రవారం కళాకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. బుధవారం నాటి కార్యక్రమం విఫలమైన నేపధ్యంలో జిల్లా అధ్యక్షురాలు శిరీష, పలాస ఎమ్మెల్యే శివాజీల మొండి వైఖరే కారణమని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి సన్మాన కార్యక్రమానికి పట్టణాధ్యక్షున్ని వేదికపైకి పిలవాలని కోరితే శివాజీ మాత్రం ఒకరిని పిలిస్తే మండల నాయకులను సైతం పిలవాల్సి వస్తుందని ఘీంకరించారని, జిల్లా అధిష్టానంపై చర్య తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కొన్నాళ్ళుగా శివాజీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారే ఈ చర్యలకు పూనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాదులో కళా ప్రమాణస్వీకారం చేసినపుడు, కళా తొలిసారి జిల్లాకు వచ్చినపుడు కలవని నేతలు ఇన్నాళ్ళ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి అభినందించడంపైనా చర్చ జరుగుతోంది. ఇదంతా జిల్లా మంత్రిని ఒంటరిని చేసేందుకేనన్న ప్రచారమూ ఉంది. -
చినబాబుకు పట్టం!
-
చినబాబుకు పట్టం!
లోకేశ్‌కు టీడీపీలో కీలక బాధ్యతల అప్పగింతపై చంద్రబాబు దృష్టి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నారా లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే విషయంపై ఆయన తండ్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. వాస్తవానికి కుమారుడికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించాలని బాబు ఎప్పట్నుంచో అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన పది నెలల నుంచి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. వివిధ పనులు, అవసరాల కోసం వచ్చే నేతలకు.. ఒకసారి లోకేశ్ బాబును కూడా కలవకపోయారా అని చెబుతూ.. కుమారుడికి తానిస్తున్న ప్రాధాన్యాన్ని నేతలు గుర్తించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ రకంగా పార్టీలో లోకేశ్ ప్రాధాన్యతను క్రమంగా పెంచాలని, వచ్చే మహానాడులో ఆ మేరకు ఒక ప్రకటన చేయాలని కూడా చంద్రబాబు భావించారు. కుమారుడి విషయంలో ఎంతచేసినా.. తెలుగుదేశంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న సీనియర్ల నుంచి వ్యతిరేకత తప్పదనే సంకేతాలు రావడంతో చంద్రబాబు వ్యూహం మార్చారు. తాను నిర్ణయం ప్రకటించడం కాకుండా కిందిస్థాయి నుంచి ఈ డిమాండ్ చేయించి, ఆ తర్వాత ఎంపిక చే స్తే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పథకంలో భాగంగానే పార్టీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి లాంటి నేతలతో మాట్లాడించారు. గత మహానాడుతోనే మొదలు గత మహానాడు సందర్భంగానే చంద్రబాబు ఈ మేరకు పునాది వేశారు. లోకేశ్‌ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా నియమించారు. అప్పట్నుంచే పార్టీలో అంతా తానే అన్నట్టుగా లోకేశ్ వ్యవహరిస్తున్నారు. బదిలీలు, కాంట్రాక్టుల అప్పగింత వంటి అనేక వ్యవహారాల్లో గత పది నెలలుగా లోకేశ్ జోక్యం విపరీతంగా పెరిగిందని టీడీపీ నేత లే అంగీకరిస్తున్నారు. ఈ విధంగా.. ముఖ్యంగా పెద్దాచిన్నా తేడా లేకుండా నేతల వ్యవహారాల్లో లోకేశ్ జోక్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న పలువురు సీనియర్లు సందర్భోచితంగా పార్టీ నేతల సమావేశాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని గమనించిన బాబు స్పీడును కొంత తగ్గించారు. తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఇస్తున్నట్టు ఎన్నికలకు ముందు లీకులు ప్రచారంలో పెట్టారు. ఎన్నికల ముగిసిన తర్వాత ఆ విషయం ఎక్కడా ప్రస్తావనకు రాకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్త పడింది. లోకేశ్‌ను తెరమీదకు తేవడంపై మరింత ముమ్మరంగా దృష్టి సారించింది. ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అటు తెలంగాణలోను పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. డివిజన్, వార్డు, మం డల, జిల్లా స్థాయి కమిటీల సమావేశాలూ జరుగుతున్నా యి. ఈ సందర్భంగానే ఎక్కడికక్కడ లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ నేతల నుంచి వచ్చేలా ఎన్టీఆర్ భవన్ నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఆయా సమావే శాల్లో లోకేశ్‌కు పార్టీలో కీలకమైన పదవి అప్పగించాలని కోరుతూ తీర్మానాలు సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మూడో వారం చివరలో జిల్లా స్థాయి సమావేశాలు (మహానాడులు) జరగనున్నాయి. వీటిల్లో కూడా లోకేశ్‌కు కీలక బాధ్యతలపై తీర్మానాలు చేయించటంతో పాటు నేతల నుంచి డిమాండ్లు చేయించనున్నట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. వచ్చే నెల 27 నుంచి 29 వరకు విజయవాడలో టీడీపీ మహానాడు జరగనుంది. ఆ మహానాడులోనూ లోకేశ్‌కు బాధ్యతల అప్పగింతపై నేతలు పెద్దఎత్తున డిమాండ్ చేసేలా ఇప్పటికే వ్యూహం సిద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేశ్‌ను కూర్చోబెట్టాలన్నదే చంద్రబాబు లక్ష్యమని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేశ్‌కు రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించాలనేది బాబు వ్యూహమని చెబుతున్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా పార్టీ తీర్మానం చేస్తుంది. పార్టీకి జాతీయ హోదా లేనప్పటికీ ముందుముందు విస్తరిస్తామన్న పేరుతో చంద్రబాబు ఆ హోదాలో కొనసాగుతారని చెబుతున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభాగాలకు వేర్వేరుగా కార్యవర్గాలను ప్రకటిస్తారు. ఏపీ విభాగం అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావును నియమించనున్నట్టు సమాచారం. టీటీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఎల్. రమణ కొనసాగుతున్నారు. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. -
20 లక్షల మందికి టీడీపీ సభ్యత్వం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారంనాటికి 20.45 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్లు కిమిడి కళా వెంకట్రావు, పెద్దిరెడ్డిలు ఆదివారం తెలిపారు. ఏపీలో 17.60 లక్షల మంది, తెలంగాణలో 2.85 లక్షల మంది నమోదు చేసుకున్నారన్నారు. జపాన్ నుంచి తిరిగి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు సభ్యత్వ నమోదుపై ఆదివారం తన నివాసంలో పార్టీ నేతలతో సమీక్షించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కళా వెంకట్రావు, పెద్దిరెడ్డిలు ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. నెల రోజుల క్రితం ప్రారంభించిన ఈ ప్రక్రియ డిసెంబర్ 3వ తేదీతో ముగుస్తుందన్నారు. -
పెత్తనం కోసం టీడీపీ నేతలు డిష్యూం డిష్యూం
అధికారంలోకి వస్తున్న టీడీపీలో అధికార కేంద్రీకరణ దిశగా వర్గ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా జిల్లాలో ఆ పార్టీ ఓడిపోయిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టు కోసం ఇరువర్గాలు పావులు కదుపుతున్నాయి. టీడీపీ ఓడిపోయిన మూడు నియోజకవర్గాలు పాలకొండ డివిజన్‌లోనే ఉండటం గమనార్హం. దాంతో ఆ డివిజన్‌కే చెందిన సీనియర్ నేత కళా వెంక ట్రావు సహజంగానే ఆ స్థానాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గం విషయంలో ప్రస్తుతానికి హడావుడి లేనప్పటికీ రాజాం, పాతపట్నం నియోజకవర్గాలపై ఆధిపత్యం కోసం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజాంలో ఓటమిపాలైన సీనియర్ నేత ప్రతిభా భారతి నైరాశ్యంలో కూరుకుపోవడం కళాకు కలసివస్తోంది. మరోవైపు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పాతపట్నం స్థానంపై పట్టు సాధించాలని కింజరాపు వర్గం భావిస్తోంది. అలాగే పాలకొండ డివిజన్లో కళాకు పోటీగా మరో అధికార కేంద్రాన్ని తయారు చేయడానికి వ్యూహాన్ని రచిస్తోంది. తనదే పెత్తనం అంటున్న కళా రాజాం నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. పార్టీ అభ్యర్థి ప్రతిభా భారతి ఓటమిపాలవడంతో పార్టీకి పెద్దదిక్కు ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. ఓడిపోయిన అభ్యర్థే ఇన్చార్జ్గా ఉండటం సంప్రదాయంగా వస్తోంది. కానీ తనకు ఎన్నికల్లో స్థానిక నేతలు సహకరించలేదని ప్రతిభా భారతి కినుక వహించారు. ఏ పదవీ లేకుండా ఐదేళ్లపాటు నియోజకవర్గ బాధ్యతలు మోయలేనని ఆమె పరోక్షంగా సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మహానాడులో చంద్రబాబునాయుడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని లేవనెత్తడాన్ని ఆమె తన ఆంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. 2019 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఈ ఐదేళ్లు పార్టీ బాధ్యతలు తానెలా మోస్తానని వ్యాఖ్యానించడం ద్వారా పరోక్షంగా నియోజకవర్గంలోని నేతలే పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని తేల్చిచెప్పేశారు. సహజంగానే ఈ పరిణామాలను కళా వెంకట్రావు తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కళా సొంత నియోజకవర్గమైనందున రాజాంలో ఆయన కుటుంబ సభ్యులు ఆధిపత్యం చెలాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీనిపై నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నేతలకు సంకేతాలు అందుతున్నాయి కూడా. నైరాశ్యంలో ఉన్న ప్రతిభా భారతి వీటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. దాంతో కళా వర్గీయుల ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. కళా వర్గం ఆధిపత్యం కిందకు రాజాం నియోజకవర్గం చేరినట్లేనని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. పాతపట్నంపై కొత్త పితలాటకం టీడీపీ ఓటమి పాలైన పాతపట్నం నియోజకవర్గం సరికొత్త వర్గపోరుకు వేదికగా నిలుస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైన శత్రుచర్ల విజయరామరాజు మళ్లీ నియోజకవర్గానికి వచ్చే పరిస్థితులు దాదాపుగా లేవనే చెప్పొచ్చు. వయోభారం, ఇతరత్రా కారణాలతో ఆయన నియోజకవర్గంపై ద ృష్టి సారించే అవకాశాలు లేవు. దాంతో పార్టీ ఇన్చార్జి ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. పాలకొండ డివిజన్లో కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంపై కూడా పట్టు సాధించాలని కళా భావిస్తున్నారు. అందుకు వీలుగా తన సన్నిహితుల్లో ఒకర్ని ఇన్చార్జిగా నియమించాలన్నది ఆయన వ్యూహం. కానీ ఇందుకు కింజరాపు అచ్చెన్నాయుడు ససేమిరా అంటున్నారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పాతపట్నంపై తమకే ఆధిపత్యం ఉండాలన్నది కింజరాపు కుటుంబ ఉద్దేశం. అందుకోసం తమ సన్నిహిత నేతను ఇన్చార్జిగా నియమించాలని పట్టుపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా టీడీపీలో కళా, కింజరాపు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది. -
హోం మినిస్టర్నవుతా.. అండమాన్ పంపుతా
మండలంలోని కేకేనాయుడుపేట గ్రామంలో జరుగుతున్న పోలింగ్‌ను పరిశీలించడానికి వచ్చిన టీడీపీ అభ్యర్ది కళావెంకటరావు పోలీసులపై వీరంగం చేశారు. పోలీసులు వైఎస్సార్సీపీని సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాను గెలుస్తానని , టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. తాను హోం శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఇద్దరు పోలీసులను అండమాన్‌కు పంపిస్తానని బెదిరించారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎచ్చెర్ల మండలం కొయ్యాం పంచాయతీ నాయుడు ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కూడా కళా వెంకటరావు, ఎంపీపీ అభ్యర్థి బల్లాడ వెంకటరమణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి వచ్చి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్‌ను నిలిపివేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందని గొడవలు సృష్టించవద్దని స్థానిక నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొన్నా తర్వాత విషయం తెలుసుకున్న నాయకులు నాలికకర్చుకుని అక్కడి నుంచి జారుకున్నారు.