
విజయవాడ: తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై ఏపీ మంత్రి కళా వెంకట్రావు మాట్లాడారు. బకాయిలు చెల్లించని పక్షంలో కోర్టుకు వెళ్ళుతామని ఆయన అన్నారు. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను తెలంగాణ చెల్లించనంటోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి అదనంగా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం రెండు సంస్థలతో పీపీఎల్ చేసుకుందన్నారు.
ఆ పీపీఎల్ మేరకు రెండు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. వాళ్లు కోర్టుకు వెళతారనే పక్షంలో కొనుగోలు గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు చేయలా ? వద్దా ? అనేది నిర్ణయించాలని ఈఆర్సీకి పంపుతామని మంత్రి కళా వెంకట్రావు చెప్పారు.