చినబాబుకు పట్టం! | lokesh-to-become-working-president-of-tdp | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 22 2015 8:28 AM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM

బాబునాయుడు దృష్టి సారించారు. వాస్తవానికి కుమారుడికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించాలని బాబు ఎప్పట్నుంచో అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన పది నెలల నుంచి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. వివిధ పనులు, అవసరాల కోసం వచ్చే నేతలకు.. ఒకసారి లోకేశ్ బాబును కూడా కలవకపోయారా అని చెబుతూ.. కుమారుడికి తానిస్తున్న ప్రాధాన్యాన్ని నేతలు గుర్తించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ రకంగా పార్టీలో లోకేశ్ ప్రాధాన్యతను క్రమంగా పెంచాలని, వచ్చే మహానాడులో ఆ మేరకు ఒక ప్రకటన చేయాలని కూడా చంద్రబాబు భావించారు. కుమారుడి విషయంలో ఎంతచేసినా.. తెలుగుదేశంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న సీనియర్ల నుంచి వ్యతిరేకత తప్పదనే సంకేతాలు రావడంతో చంద్రబాబు వ్యూహం మార్చారు. తాను నిర్ణయం ప్రకటించడం కాకుండా కిందిస్థాయి నుంచి ఈ డిమాండ్ చేయించి, ఆ తర్వాత ఎంపిక చే స్తే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పథకంలో భాగంగానే పార్టీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి లాంటి నేతలతో మాట్లాడించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement