సాఫ్ట్‌బాల్ సాధనలో బడగల కేతన్
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు క్రీడాకారులు రోజు రోజుకూ రాటుదేలుతున్నారు. అడు గు పెట్టిన ఆటలో అత్యున్నత శిఖరా లు అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రయాణమే చేస్తూ జిల్లా కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించేందుకు మరో యువ కెరటం సిద్ధమవుతోం ది.సాఫ్ట్‌బాల్‌లో జిల్లా నుంచి భారత జట్టుకు ఆడేందుకు ప్రాతినిథ్యం వహించేందుకు ఓ కుర్రాడు సిద్ధమవుతున్నాడు. జిల్లాకు చందిన బడగల కేతన్ భారత అండర్–12 సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. జపాన్‌లోని మియాజికి వేదికగా జూలై 1 నుంచి 6 వరకు జరిగే అండర్–12 ఇంటర్నేషనల్ బాలుర సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనే భారత్ బేస్‌బాల్ ప్రాబబుల్స్ జట్టులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బడగల కేతన్‌కు చోటు లభించింది. ఈ మేరకు సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ అనైగర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు నుంచి ఎంపికైన సమాచారం జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు చేరింది.
ఆటలపై మక్కువతో..
గార గ్రామానికి చెందిన బడగల హరిధరరావు, మైథిలి దంపతుల కుమారుడు కేతన్. నగరంలోని మహాలక్ష్మినగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి ఏపీఐఐసీ శ్రీకా కుళం జోనల్ మేనేజర్‌గా పనిచేస్తూనే జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్‌గా పలు క్రీడాసంఘాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. తల్లి గృహిణి. 9వ తరగతి చదువుతున్న అక్క మనశ్విత ఉంది. పిల్లలకు చదువుతోపాటు ఆటలను నేర్పించాలని త ల్లిదండ్రులు భావించారు. అందుకు అనుగుణంగా చిన్ననాటి నుంచి క్రీడలపై ఆసక్తి పెం చుకున్న కేతన్ సాఫ్ట్‌బాల్ క్రీడను ఎంచుకున్నారు. 2017లో తన తండ్రి ప్రోత్సాహంతోనే సాఫ్ట్‌బాల్‌లో ప్రవేశం పొందిన కేతన్‌కు కరాటేలో కూడా ప్రావీణ్యత ఉండటం విశేషం.
ఫ్యామిలీ మొత్తం క్రీడల నేపథ్యం..
కేతన్ తండ్రి హరిధరరావు రాష్ట్రస్థాయి వాలీ బాల్ క్రీడాకారుడు. పలు రాష్ట్రస్థాయి వాలీ బాల్ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించారు. అక్క మనశ్విత జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడాకారి ణి. ఇటీవలి రాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలవడంలో కీలక భూమిక పోషించింది. తల్లితో పా టు తండ్రి, అక్క ప్రోత్సాహంతో కేతన్ రెట్టిం చిన ఉత్సాహంతో పోటీల్లో రాణిస్తున్నాడు.
జాతీయ పోటీల్లో రాణింపుతో చాన్స్..
కేతన్ నిరంతరం సాధన చేస్తున్న సమయంలో ఈ ఏడాది మే 7 నుంచి 9 వరకు తెలం గాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వేదికగా జరిగిన జాతీయ అండర్–12 బాలుర సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించా డు. ఈ పోటీల్లో మెరుగైన ఆటతీరుతోపాటు చురుగ్గా కనిపించడంతో నేరుగా జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో కేతన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోటా నుంచి జాతీయ జట్టుకు పరిగణనలోకి తీసుకున్నారు. కేతన్ ఆర్‌డీటీ అనంతపురం రెసిడెన్షియల్ క్యాంప్ లో బద్రీనా«థ్, నాయక్, ఓబులేష్, నాగేంద్ర, లక్ష్మీ శిక్షణలో రాటుదేరాడు. జిల్లాలో సాఫ్ట్‌బాల్ సంఘ కార్యదర్శి ఎంవీ రమణ, సీనియర్ ప్లేయర్లు మెలకువలు నేర్పారు.
సిమ్లాలో జరిగే శిక్షణ శిబిరాలకు హాజరు
ఇండియన్ సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ నుంచి వర్తమానం అందుకున్న కేతన్ తండ్రి హరిధర్ హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈనెల 6 నుంచి జరిగే శిక్షణ శిబిరాల్లో పాల్గొనేందుకు పయనమయ్యారు. శిక్షణ అనంతరం 16 మంది సభ్యులతో కూడిన తుది జట్టును ప్రకటిస్తారు. ప్రస్తుతం కేత న్ ప్రతిభ, నిలకడైన ఆటతీరు, మైదానంలో చురుగ్గా ఉండే విధానం ఆధారంగా చూస్తే దాదాపుగా తుది జట్టులో ఛాన్స్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర, జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. అదే జరిగితే శ్రీకాకుళం జిల్లా నుంచి మరో అంతర్జాతీ య క్రీడాకారుడు ఎంపికైనట్టే. జిల్లా నుంచి దేశం తరుపున ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న అతిపిన్న వయస్కునిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఇటీవలి బేస్‌బాల్ క్రీడలో జిల్లా నుంచి తోటాడ శ్రీను ఇండియన్ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.
3 స్టేట్, 2 నేషనల్స్..
కేతన్ గడిచిన రెండేళ్లలో సాఫ్ట్‌బాల్ పోటీల్లో రాణించి సత్తాచాటాడు. అసోసియేషన్ మీట్స్ ఇప్పటి వరకు మూడు రాష్ట్రస్థాయి పోటీలు, రెం డు జాతీయస్థాయి పోటల్లో ప్రాతినిధ్యం వహించి భళా అనిపించాడు. ఇందులో ఒక కాంస్య పతకం ఉండటం విశేషం. 2018 నవంబర్ 1 నుంచి 3 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన అండర్–11 జాతీ య బాలుర సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున బరిలోకి దిగాడు. ఈ పోటీల్లో ఆంధ్రా తృతీయ స్థానంలో నిలవడంతో కేతన్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. 2019–20 సీజన్‌లో అండర్–14 వయో విభాగంలో స్కూల్‌గేమ్స్‌పోటీలకు సన్నద్ధమవుతున్నాడు.
శుభాకాంక్షలు తెలిపిన దాసన్న
బడగల కేతన్ భారత అండర్–12 సాఫ్ట్‌బాల్ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపిక కావడాన్ని పురస్కరించుకుని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి హ రిధర్, కేతన్‌లతో ఫోన్లో మాట్లాడిన దాసన్న జిల్లాకు అంతర్జాతీయ కీర్తి తీసుకొచ్చిందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మా న ప్రసాదరావు, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ మార్పు ధర్మారావు, ఒలింపిక్ సంఘ కార్యదర్శి పి.సుందరరావుతోపాటు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దానేటి శ్రీధర్, కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ, పీఈటీ సంఘ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ఆనంద్‌కిరణ్, పోలి నాయుడు, రాజారావు, సునీత, రమణ హర్షం వ్యక్తం చేశారు.
భారత జట్టుకు ఆడటమే లక్ష్యం
భారత సాఫ్ట్‌బాల్æ జట్టుకు ఆడటం నా జీవిత లక్ష్యం. పేరెంట్స్, కోచ్‌ల ప్రోత్సాహంతో నిరంతరం సాధన చేస్తున్నాను. నేషన ల్స్ మీట్‌లలో రాణించాను. సెలెక్టర్లు నన్ను ఎంపికచేయడం సంతోషంగా ఉంది. ఫైనల్ టీమ్‌కు ఎంపిక అవుతానని నమ్మకం ఉంది. సిమ్లాలో జరిగే కోచింగ్ క్యాంప్‌కు హాజరవుతున్నాను. – బడగల కేతన్, సాఫ్ట్‌బాల్ భారత ప్రాబబుల్స్ జట్టు క్రీడాకారుడు
Comments
Please login to add a commentAdd a comment