కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): స్థానిక ఉస్మానియా కళాశాలలో ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్‌మెంట్ అధికారి డా. నిస్సార్ అహ్మద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డా. రెడ్డీస్ ఎస్‌ఎంటీ(హైదరాబాద్) ఆధ్వర్యంలో ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 18–19 ఏళ్లలోపు యువకులు హాజరుకావాలని ఆయన కోరారు. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ(2016)లో 60 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌కార్డుతో ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలలో అర్హత సాధించిన వారికి రెండేళ్లపాటు అన్ని సదుపాయాలతో ఏడాదికి రూ.1.45 లక్షల వేతనంతో ఉపాధి కల్పిస్తారని తెలిపారు. వివరాలకు 9700382288 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.