
అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ (Alladi Cloud Training) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 'సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్' అనే కార్యక్రమాన్ని బుధవారం (ఫిబ్రవరి 12) ప్రారంభించింది. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న సమయంలో.. సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి కెరీర్ అందించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు.
అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ ప్రారంభించిన ప్రోగ్రామ్‌లో.. ఏఐఎంఎల్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్ జావా & పైథాన్, అజూర్ క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ సెలీనియం టెస్టింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ వంటి వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు ఉంటాయని మల్లెషయ్య అల్లాడి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 20 ఏళ్లకంటే ఎక్కువ అనుభవం కలిగిన సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, పరిశ్రమ నిపుణులు అందుబాటులో ఉంటారు. ట్రైనింగ్ సమయంలో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం, ఉద్యోగం సాధించడానికి కావలసిన అన్ని మెళుకువలను నేర్పుతారు. అంతే కాకుండా శిక్షణలో భాగంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నిర్వహిస్తారు.
ట్రైనింగ్ పూర్తయిన తరువాత.. ACTNOW దాని బలమైన నెట్‌వర్క్ ద్వారా ప్రముఖ టెక్ కంపెనీలతో తగిన ఉపాధి అవకాశాలను కనుగొనడంలో సహాయపడుతుంది. సంబంధిత బ్రాంచ్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పట్ల మక్కువ కలిగి ఉన్న ఎవరైనా ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment