placement
-
స్థానం మారిన పుస్తకం
‘ఎ మిస్ ప్లేస్డ్ బుక్ ఈజ్ ఎ లాస్ట్ బుక్‘ అన్నది ఆంగ్ల నానుడి. అలాగే ‘దయచేసి ఎక్కడ నుంచి తీసిన పుస్తకాలు అక్కడే పెట్టండి’ అన్న మాట కూడా గ్రంథాల యాలలో చూస్తుంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, పుస్తకం కానీ స్థానభ్రంశం చెందితే దానిని తిరిగి పట్టుకోవడం కష్టం అవుతుంది. పుస్తకాల విషయంలో అది మరీ కష్టం. అందుకే ఎక్కడ తీసిన పుస్తకాన్ని అక్కడ పెట్టడం అవసరమే కాదు, అనివార్యం కూడా.గ్రంథాలయాల్లో పుస్తకాల్ని ఒక క్రమంలో సర్దుతారు. ఫలానా పుస్తకం కావాలి అంటే ఫలానా అలమరలోని ఫలానా అరలో ఉంది అ నిర్వాహకులు ఉన్న చోటు నుండి కదలకుండా చెప్పగలరు. కానీ, ఆ పుస్తకాన్ని ఉన్న చోటు నుండి తీసి తిరిగి అక్కడ పెట్టక ΄ోతే చెప్పటం సాధ్యం కాదు. బద్ధకించి, మళ్ళీ అక్కడిదాకా వెళ్ళటం ఎందుకు అని తాము ఉన్న చోటనే ఎక్కడి నుండో తెచ్చిన పుస్తకం పెట్టేసేవాళ్ళు ఉన్నారు. మరి కొంత మంది తాము చదవటం పూర్తి కాలేదు, దానిని దాని స్థానంలో పెడితే ఎవరైనా తీసుకువెడితే వాళ్ళు తిరిగి ఇచ్చేదాకా ఎదురు చూడాలి, కనుక దాని చోటు మారిస్తే తానే తీసుకోవచ్చు అని జాగ్రత్తగా... గుర్తుగా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సమయానికి పెట్టిన చోటు మర్చి΄ోతారు. ఇంకొకరు ఎవరో ఇది ఇక్కడిది కాదు అని తీసి పక్కన పెడతారు. అంతే సంగతులు. మళ్ళీ ఎప్పుడో అన్నీ సద్దుతున్నప్పుడు మాత్రమే బయట పడుతుంది. ఇది ఒక్క పుస్తకాల విషయానికే కాదు, అన్ని విషయాలకీ వర్తిస్తుంది. ఇంట్లో ఏదైనా వస్తువుని అది ఉండే చోట కాక మరొకచోట పెడితే, ఎదురుగా ఉన్నా త్వరగా కనపడదు. ఇంకేదో వెతుకుతున్నప్పుడు కనపడుతుంది. అప్పుడు అది పనికి రావచ్చు, రాక ΄ోవచ్చు. అందుకే ఎక్కడ నుండి తీసిన వస్తువుని అక్కడ పెడితే వెతుక్కునే పని ఉండదు. కళ్ళు మూసుకుని అయినా దానిని తీయవచ్చు. దీనికి కారణం మనిషి ఒక వస్తువుని పరిసరాలు మొదలైన వాటిని కూడా జత చేసి గుర్తు పెట్టుకునేట్టు చేయటం మనసు లక్షణం. మనుషులనైనా మొదటి సారి ఎక్కడ చూశామో అక్కడ కనపడితే వెంటనే గుర్తిస్తాం. వాతావరణం, పరిసరాలు మారితే గుర్తు పట్టటం కష్టమే. ఇక్కడ ఉంటారు అని అనుకోలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నాలు దీనికి చిహ్నం. ఇల్లు అందంగా, వెసులుబాటుగా ఉండటానికి ఒక సూత్రం ΄ాటించాలని ΄ాశ్చాత్యులు గట్టిగానే చె΄్పారు. ‘‘ప్రతి వస్తువు దాని చోట ఉండటం, ప్రతి వస్తువుకి ఒక చోటు ఉండటం.’’ వేలం వెఱి<గా వస్తువులని సేకరించితే ఎక్కడ పెట్టాలో తెలియక చిందరవందరగా పడేస్తూ ఉంటారు. వస్తువుది, ఇంటిది కూడా అందం, విలువ తగ్గి΄ోతాయి. పెట్టటానికి తగిన చోటు లేనప్పుడు తెచ్చి వాటి విలువని తగ్గించ కూడదు. ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టటం గొప్ప సౌలభ్యమే కాదు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ హనుమ. సంజీవని పర్వతాన్ని తెచ్చి, దానితో పని పూర్తి అయిన పిమ్మట ఎక్కడి నుండి తీసుకువచ్చాడో తిరిగి అక్కడ భద్రంగా పెట్టి వచ్చాడు. అందువల్ల రెండవమారు తేవటానికి వెళ్ళినప్పుడు అది ఉండే ప్రదేశం తెలుసు కనుక వెంటనే తేగలిగాడు. మొదటిసారి పని అయింది కదా అని ఎక్కడో అక్కడ పెట్టి ఉంటే వెతకటానికి ఎంతో సమయం వెచ్చించవలసి వచ్చేది. వ్యక్తిత్వ వికాసానికి ఇది కూడా పెం΄÷ందించుకోవాల్సిన ఒక లక్షణం. వస్తువుల విషయం మాత్రమే కాదు. ప్రేమాభిమానాలు, నమ్మకం, విశ్వసనీయత మొదలైన మనోభావాలని కూడా అస్థాన పతితం చేయకూడదు. కఠిన మైన మనస్సు కలవారి మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటే, తరువాతి కాలంలో ఎవరినైనా ప్రేమగా చూడగలగటం కష్టమే. ప్రేమరాహిత్యంలో బతికే వారి విషయంలో ఇటువంటిదే జరిగి ఉండవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
పేటీఎంలో ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ మరోమారు ఉద్యోగుల్లో కోత విధించింది. వీరికి ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రెజ్యూమే రూపకల్పనకు సాయం చేయడంతోపాటు ఇంటర్వ్యూకు సన్నద్ధం చేయడం, మెళకువలు నేర్పడం, మార్కెట్లో ఉన్న ఉద్యోగావకాశాలను తెలియజేయడం వంటివి ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ అంటారు. తీసివేతకు గురైన సిబ్బందికి సాయం చేసేందుకు.. మార్కెట్లో నియామకాలు చేపడుతున్న 30 కంపెనీలతో పేటీఎం మానవ వనరుల విభాగం చేతులు కలిపింది. కాగా, ఎంత మందిని తొలగించిందీ అన్న విషయం మాత్రం వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించలేదు. -
ఉబర్‌లో జాబ్.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే
IIT Bombay Student Gets More Than 2 Crore Rupees Job Offer From Uber: ఐఐటీలు, ఐఐఎంలు అంటేనే ప్రతిభకు పట్టుగొమ్మలు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు ఐఐటీయన్స్‌కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి కూడా వెనకాడవు. తాజాగా ఈ జాబితాలోకి ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ చేరింది. ఓ ఐఐటీ విద్యార్థికి ఏడాడికి రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. ఆ వివరాలు.. (చదవండి: హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు) ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతిభకు ఉబర్ ఫిదా అయ్యింది. అందుకే ఏడాదికి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అలానే ఐఐటీ గుహవటి విద్యార్థికి ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాక, నివేదికల ప్రకారం ఈ ఏడాది 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనంతో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. (చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది) ఈ ఆఫర్లు గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, 2020లో ఐఐటీ బాంబే విద్యార్థి అందుకున్న అత్యధిక ప్యాకేజీ రూ. 1.54 కోట్లు మాత్రమే. గతేడాది కరోనావైరస్, ప్రపంచవ్యాప్త లాక్డౌన్.. వ్యాపారలపై భారీ ప్రభావం చూపింది. ఈ గందరగోళాలన్ని ముగిసి ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా ఉండటమే భారీ ప్యాకేజ్ ఆఫర్‌కి కారణమని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్ -
ఆర్బీఐలో ఇంటర్న్‌షిప్ రూ.20వేల స్టయిపండ్
దేశ కేంద్ర బ్యాంకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. 2022 సంవత్సరానికి సంబంధించి స్వదేశీ, విదేశీ విద్యార్థుల కోసం సమ్మర్ ఇంటర్న్‌షిప్స్‌కు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేల స్టయిపండ్ అందిస్తారు. ఇది బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎకానమీ, లా తదితర విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. అర్హతలు, ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్ 31 తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 125 ఇంటర్న్‌లకు అవకాశం కల్పించనుంది. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి గరిష్టంగా మూడు నెలలు ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఈ ఇంటర్న్‌షిప్ శిక్షణ కొనసాగుతుంది. ఎవరు అర్హులు ► స్వదేశీ విద్యార్థులకు అర్హతలు: ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు, అలాగే మేనేజ్మెంట్/స్టాటిస్టిక్స్/లా/కామర్స్ /ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్/బ్యాంకింగ్/ఫైనాన్స్‌లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అభ్యసించే వారు(లేదా) భారతదేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో న్యాయశాస్త్రంలో మూడేళ్ల పూర్తిస్థాయి బ్యాచిలర్ డిగ్రీని చదువుతున్న వారు ఆర్బీఐ సమ్మర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఆయా కోర్సుల చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ చదువుతున్నవారే కేంద్ర బ్యాంక్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► విదేశీ విద్యార్థులకు అర్హతలు: విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ఫైనాన్స్, బ్యాం కింగ్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, లా(ఐదేళ్ల ప్రోగ్రామ్)లో గ్రాడ్యుయేషన్ ఆ పైస్థాయి ఉన్నత కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ► వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన వారికి 2022 జనవరి/ఫిబ్రవరిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ లను నిర్వహిస్తారు. తుది ఎంపికకు సంబంధించిన వివరాలను 2022 ఫిబ్రవరి/మార్చి నెలల్లో ప్రకటిస్తారు. ఇంటర్న్‌షిప్‌లో ఇలా ► ఎంపికైన ఇంటర్న్లు ముంబైలో ఉన్న బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ విభాగాలు లేదా వివిధ ప్రాంతాల్లోని ఆర్బీఐ కంట్రోల్ ఆఫీస్‌ల్లో మాత్రమే ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్‌కు రిపోర్ట్ చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకుకు డిక్లరేషన్ ఆఫ్ సీక్రసీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్ సమయంలో దూర ప్రాంతాల విద్యార్థులు తమవసతి సౌకర్యాలను సొంతంగా భరించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ► అర్హత, ఆసక్తి గల విద్యార్థులు తాము చదువుతున్న ఇన్స్టిట్యూట్ లేదా కాలేజీ ద్వారా ఆన్లైన్ వెబ్బేస్డ్ అప్లికేషన్ ఫామ్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► విదేశీ విద్యార్థులు నిర్దేశిత దరఖాస్తును ఈమెయిల్ ద్వారా పంపించాలి. ► హార్ట్‌కాపీలు పంపేందుకు చిరునామా: ది చీఫ్ జనరల్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ (ట్రైనింగ్–డెవలప్మెంట్ డివిజన్), సెంట్రల్ ఆఫీస్, 21వ అంతస్తు, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్, షహీద్ భగత్ సింగ్ రోడ్, ముంబై 400 001కు పంపాలి. ► విదేశీ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్‌ను నింపి మెయిల్ ద్వారా cgminchrmd@rbi.org.in కు పంపించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2021 ► వెబ్సైట్: https://opportunities.rbi.org.in -
13న ఉస్మానియా కళాశాలలో జాబ్‌మేళా
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): స్థానిక ఉస్మానియా కళాశాలలో ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి డా. నిస్సార్ అహ్మద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డా. రెడ్డీస్ ఎస్ఎంటీ(హైదరాబాద్) ఆధ్వర్యంలో ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 18–19 ఏళ్లలోపు యువకులు హాజరుకావాలని ఆయన కోరారు. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ(2016)లో 60 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్ సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌కార్డుతో ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలలో అర్హత సాధించిన వారికి రెండేళ్లపాటు అన్ని సదుపాయాలతో ఏడాదికి రూ.1.45 లక్షల వేతనంతో ఉపాధి కల్పిస్తారని తెలిపారు. వివరాలకు 9700382288 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. -
21న పూల్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈనెల 21న రాయలసీమ యూనివర్సిటీ, ఇండియన్ ఇమ్మాన్నోలాజికల్స్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలో పూల్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2014 తరువాత బీఎస్సీ(లైఫ్ సైన్సెస్) పూర్తి చేసిన అభ్యర్థులు మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగానికి అర్హులని, ఎంపికైన వారికి మొదటి ఏడాది ఉచిత వసతి కల్పించి నెలకు రూ.11 వేలు స్టైఫండ్ ఇస్తారని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఏడాది అనంతరం రూ.17 వేలతో వేతనం ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు 21న రాయలసీమ యూనివర్సిటీకి అర్హత పత్రాలతో రావాలని సూచించారు. -
16,17 తేదీల్లో శంకరాస్లో ప్లేస్మెంట్ డ్రై వ్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బీఏ, బీఎస్సీ, బీకామ్ ఉత్తీర్ణులకోసం ఈ నెల 16, 17 తేదీల్లో గాయత్రీ ఎస్టేట్ శంకరాస్ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రై వ్ నిర్వíß స్తామని కాలేజీ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్డీఎఫ్సీ, కరూర్ వైశ్య, కోటక్ మహింద్రా, అమెజాన్, మార్గదర్శి తదితర కంపెనీల్లో టెక్నికల్ ఆపరేటర్, ప్రోగ్రామర్, అడ్మినిస్ట్రేషన్, సేల్స్ ఎగ్జిక్యూటీవ్ తదితర ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్య్లూలు నిర్వహిస్తారన్నారు. -
ప్లేస్మెంట్ పేరుతో మోసం
రూ. 25 వేలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన పీసీ టెక్నాలజీస్ కంపెనీ పోలీసులను ఆశ్రయించిన బాధిత ఇంజినీరింగ్ విద్యార్థులు భవ్య (పేరు మార్చాం) బీటెక్ ఈసీఈ 2016లో పూర్తి చేసింది. జేఎన్టీయూ పరిధిలోని అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల వారు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి పీసీ టెక్నాలజీస్ అనే కంపెనీని ఆహ్వానించారు. ఏకంగా 18 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కంపెనీ ప్రతి నిధులు ప్రకటించారు. మొదట రూ. 25 వేలు కంపెనీ పేరుతో డిపాజిట్ చే యాలని సూచించారు. అనంతరం మూడు నెలలు ట్రెనింగ్ ఉంటుంది. అందులో సై్టఫండ్ నెలకు రూ. 18 వేలు ఇస్తామన్నారు. ట్రైనింగ్ అనంతరం ఉద్యోగంలో నెలకు రూ. 25వేల జీతం చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో అందరూ డిపాజిట్ చేశారు. జూన్ 9న ట్రైనింగ్‌కు హాజరయ్యారు. అప్పటి నుంచి సై్టఫండ్ అదిగో.. ఇదిగో అంటూ ఊరడించారు. వారం రోజులు మీకు సెలవు ఇస్తున్నామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. తిరిగి వచ్చే సరికి బోర్డు తిప్పేశారు. కంపెనీ వెబ్సైట్ పనిచేయలేదు. సీఈఓ నుంచి మేనేజర్ వరకు ఎవరి సెల్ఫోన్లు పనిచేయలేదు. దీంతో తాము మోసపోయామని విద్యార్థులకు అర్థమైంది. కళాశాల యాజామాన్యాన్ని ప్రశ్నిస్తే‘ మిమ్మిల్ని ఉద్యోగాల్లో చేరాలని ఒత్తిడి చేశామా? మీరు కంపెనీ గురించి ఆలోచించుకొని జాయిన్ కావాల్సింది?’ అంటూ మాటమార్చేశారు. రూ. 25 వేలతో పాటు సమయం వృథా అయిందని విద్యార్థులు వాపోయారు. బెంగుళూర్ పోలీసులకు ఫిర్యాదు పీసీ టెక్నాలజీ కంపెనీ తమను మోసం చేసిందని బెంగుళూర్లోని అశోక్‌నగర్ పోలీస్‌స్టేçÙన్లో బాధిత ఇంజినీరింగ్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. డిపాజిట్ కట్టించుకొని కంపెనీని మూసేశారని పేర్కొన్నారు. తమ సర్టిఫికెట్లు కళాశాల వద్దే ఉండడంతో ఫిర్యాదు నేపథ్యంలో తమకు ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పీసీ టెక్నాలజీస్ కంపెనీ 15 బ్రాంచుల్లో ఇదే తరహాలో మోసం చేసినట్లు బెంగళూర్ పోలీసులు చెప్పారని విద్యార్థులు తెలిపారు. -
గతవారం బిజినెస్
2 లక్షల కోట్లు సమీకరించిన కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ బాండ్ల ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ.2.04 లక్షల కోట్ల నిధులు సమీకరించాయని ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. నిధుల సమీకరణలో ఆర్థిక సేవల రంగ కంపెనీలు అగ్రస్థానంలో, ఆ తర్వాతి స్థానంలో విద్యుత్ రంగం కంపెనీలు ఉన్నాయి. కంపెనీల వారీగా చూస్తే రూ.19,312 కోట్లు సమీకరించి పవర్ ఫైనాన్స్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో ఎల్ఐసీ హౌసింగ్ (రూ.10,768 కోట్లు), హెచ్డీఎఫ్సీ (రూ.9,701 కోట్లు), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొ(రూ.8,121 కోట్లు). ఐడీఎఫ్సీ (రూ.7,042 కోట్లు) ఉన్నాయి. పెరిగిన పీ-నోట్స్ పెట్టుబడులు పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా భారత క్యాపిటల్ మార్కెట్లోకి పెట్టుబడులు వరుసగా రెండో నెలా పెరిగాయి. అక్టోబర్‌లో భారత క్యాపిటల్ మార్కెట్లోకి (ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్ విభాగాలు) రూ. 2.58 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో వచ్చిన పెట్టుబడుల విలువ రూ. 2,53,875 కోట్లు. భారత్‌లో నమోదైన విదేశీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థల ద్వారా సంపన్న విదేశీ ఇన్వెస్టర్లు, హెడ్జ్ ఫండ్స్, ఇతర విదేశీ సంస్థలు పీ-నోట్స్ రూపంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఐవీఆర్‌సీఎల్‌లో 5% దాటిన ఐడీబీఐ వాటా ఆర్థిక కష్టాల్లో ఉన్న నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్ తీసుకున్న రుణాలకు వడ్డీల బదులు ఈక్విటీలను జారీ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఐడీబీఐ బ్యాంక్‌కు 39.40 లక్షల షేర్లను జారీ చేయడం జరిగింది. ఫండెడ్ ఇంట్రెస్ట్ టర్మ్ లోన్ (ఎఫ్‌ఐటీఎల్) ఒప్పందంలో భాగంగా ఈ షేర్లను కొనుగోలు చేసినట్లు ఐడీబీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ తాజా షేర్లతో ఐవీఆర్‌సీఎల్‌లో ఐడీబీఐ బ్యాంక్ వాటా 4.77 శాతం నుంచి 5.32 శాతానికి పెరిగింది. 2వేల కోట్లు చెల్లించనున్న వీఎంఎస్ఎల్ వేర్వేరుగా ఉన్న నాలుగు లెసైన్సుల విలీనానికి రూ. 2,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్ లిమిటెడ్ (వీఎంఎస్ఎల్)కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ చెల్లింపులు ఎప్పుడు పూర్తయితే అప్పుడు... కేంద్రం విలీన ప్రక్రియకు అనుమతిస్తుందని న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. లెసైన్సుల తాత్కాలిక విలీనానికి అనుమతి ఇస్తూ... టెలికం వివాదాల పరిష్కార, అప్పీలేట్ ట్రిబ్యునల్ (టీడీఎస్ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ఇచ్చింది. తగ్గనున్న ముడిచమురు దిగుమతుల బిల్లు అంతర్జాతీయంగా బలహీన డిమాండ్‌తో ముడిచమురు ధరలు క్షీణించిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం భారత్ క్రూడ్ దిగుమతుల బిల్లు 35 శాతం మేర తగ్గనుంది. 73.28 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 4.73 లక్షల కోట్లు) పరిమితం కానుంది. 2014-15లో సుమారు 112 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.87 లక్షల కోట్లు) విలువ చేసే 189 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది. ఈసారి దాదాపు 188 మిలియన్ టన్నుల దాకా దిగుమతి చేసుకోవచ్చని అంచనా. రూపే కార్డు బీమాకు కాల పరిమితి పొడిగింపు రూపే కార్డుకు సంబంధించి ప్రమాద బీమా క్లెయిమ్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఏదైనా ఒక ప్రమాద సంఘటన విషయంలో... క్లెయిమ్‌కు ముందు కార్డు వినియోగ కాలాన్ని (కార్డ్ యూసేజ్ కండీషన్) 90 రోజుల వరకూ పొడిగించింది. ఇప్పటి వరకూ ఈ పరిమితి 45 రోజులుగా ఉంది. నవంబర్ 25 నుంచీ తాజా నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద జారీ అయిన రూపే డెబిట్ కార్డుపై లక్ష వరకూ ప్రమాద బీమా కవరేజ్ ఉంది. ఈ పథకం కింద ఇప్పటి వరకూ దాదాపు 16.54 కోట్ల మందికి రూపే కార్డులు జారీ అయ్యాయి. మైక్రోఫైనాన్స్ సంస్థలిచ్చే రుణ పరిమితి పెంపు బ్యాంకింగ్యేతర ఫైనాన్స్-సూక్ష్మ రుణాల సంస్థలు దీర్ఘకాలానికి ఇచ్చే రుణాల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ రెట్టింపు చేసింది. దీంతో ఇకపై 24 నెలల వ్యవధికి ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐలు రూ. 30,000 దాకా రుణం ఇవ్వొచ్చు. ఇప్పటిదాకా ఈ పరిమితి రూ. 15,000గా ఉంది. 24 నెలల లోపు గడువుకి జారీ చేసే రుణాల పరిమితి పెంచాలన్న పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల కనిష్టానికి రూపాయి డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం 19 పైసలు క్షీణించి 66.76 వద్ద ముగిసింది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి. నెల చివర కావడంతో దిగుమతిదారులు, కొన్ని బ్యాంక్‌ల నుంచి డాలర్‌కు డిమాండ్ బాగా ఉండటంతో రూపాయి విలువ ఈ స్థాయిలో క్షీణించిందని నిపుణులంటున్నారు. విదేశీ నిధులు తరలిపోవడం కొనసాగుతుండడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని వారంటున్నారు. జీవీకే బయోసెన్సైస్ ఎఫ్‌డీఐకి ఓకే జీవీకే బయోసెన్సైస్‌కు చెందిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం లభించింది. మొత్తం రూ.160 కోట్ల విలువైన మూడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్ఐపీబీ) ఆమోదం తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ రంగానికి ఫండ్ పునరుత్పాదక విద్యుత్ రంగానికి ఊతమిచ్చే విధంగా 1 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 6,500 కోట్లు) ప్రై వేట్ ఈక్విటీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. అలాగే పర్యావరణ అనుకూల విద్యుత్పత్తికి తోడ్పాటునిచ్చేలా రాబోయే మూడు-నాలుగేళ్లలో ఏటా 4 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. రూ.246 కోట్ల బంగారం బాండ్లు ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన పసిడి పథకాల విషయం లో... బాండ్లకు మంచి స్పందన లభించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డిపాజిట్ల పథకం నిరుత్సాహకరంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. నవంబర్ 5 నుంచి 20 వతేదీ మధ్య తొలి దశ గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాండ్ల కోసం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 63,000 దరఖాస్తులు అందాయి. విలువ రూపంలో రూ. 246 కోట్లు. మొబైల్ సర్వీస్ రంగ విశ్వరూపం! భారత్‌లో మొబైల్ సర్వీసుల రంగం భారీగా విస్తరించనుంది. 2020 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా 8.2 శాతానికి (దాదాపు రూ. 14 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ టెలికం ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ జీఎస్ఎంఏ పేర్కొంది. 2014లో ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపింది. 2020 నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుతుందని అభిప్రాయపడింది. 4జీ స్మార్ట్ఫోన్ల జోరు భారత్‌లో 4జీ స్మార్ట్పోన్ల జోరు పెరుగుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 21 శాతం వృద్ధితో 2.83 కోట్లకు పెరిగాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. చౌక ధర 4జీ ఫోన్లకు డిమాండ్ మూడు రెట్లు పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఐడీసీ తెలిపింది. డీల్స్.. ఇంగ్లాండ్‌కు చెందిన బుపా కంపెనీ.. భారత ఆరోగ్య బీమా వెంచర్ మ్యాక్స్ బుపాలో తనకున్న 26 శాతం వాటాను 49 శాతానికి పెంచుకోనున్నది. దీనికి రూ.191 కోట్లు చెల్లించనున్నదని మ్యాక్స్ గ్రూప్ ఎండీ రాహుల్ ఖోస్లా చెప్పారు. మ్యాక్స్ ఇండియా, బుపా కంపెనీలు కలసి 74:26 నిష్పత్తిలో మ్యాక్స్ బుపా బీమా కంపెనీని ఏర్పాటు చేశాయి. ఫార్మా రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీస్తూ బొటాక్స్ తయారీ సంస్థ అలెర్గాన్, అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్ విలీనం కానున్నాయి. ఈ డీల్ విలువ దాదాపు 160 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 10,40,000 కోట్లు) ఉండనుంది. తద్వారా ప్రపంచంలోనే నంబర్ వన్ ఫార్మా సంస్థ ఏర్పాటు కానుంది. టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా సింగపూర్ కు చెందిన క్రేయాన్ డేటా కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. జంగిల్ వెంచర్స్‌కు చెందిన ఈ క్రేయాన్ డేటా కంపెనీలో ఆయన ఎంత పెట్టుబడులు పెట్టింది వెల్లడి కాలేదు. టెలికం సంస్థలు ఐడియా సెల్యులార్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ దేశీయంగా తొలి స్పెక్ట్రం ట్రేడింగ్ ఒప్పందానికి తెరతీశాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్ (పశ్చిమం)లో వీడియోకాన్‌కి ఉన్న టెలికం స్పెక్ట్రంను కొనుగోలు చేసేందుకు ఐడియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 3,310 కోట్లు చెల్లించనుంది. ఈ సర్కిళ్లలో వచ్చే ఏడాది 4జీ సర్వీసులు ప్రారంభించేందుకు ఈ స్పెక్ట్రంను ఉపయోగించుకోనున్నట్లు ఐడియా తెలిపింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మరో 23 శాతం వాటాను జపాన్‌కు చెందిన నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.2,265 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో తమ వాటా 49 శాతానికి చేరిందని నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. మహీంద్రా గ్రూప్‌కు చెందిన యూజ్డ్ కార్ల విక్రయ సంస్థ మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్‌లో అమెరికాకు చెందిన కాక్స్ ఆటోమోటివ్ కొంత వాటాను కొనుగోలు చేసింది. -
క్యాంపస్ ప్లేస్మెంట్లలో సీబీఐటీ రికార్డు
మొదటి దశలో 1,244 మందికి ఉద్యోగాలు సాక్షి, హైదరాబాద్: చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) క్యాంపస్ ప్లేస్మెంట్లో రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్‌లో జరిగిన మొదటి దశ క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఆ కాలేజీకి చెందిన 1,244 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. వచ్చే ఏడాది ఇంజనీరింగ్ పూర్తి చేసుకోనున్న ఈ విద్యార్థులు రూ.3.25 లక్షల నుంచి రూ.7.5 లక్షల వార్షిక వేతనం పొందనున్నారు. '36 ఏళ్ల సీబీఐటీ ప్రస్థానంలో ఇన్ని ఉద్యోగాలు పొందడం ఇదే ప్రథమం. త్వరలో ప్రారంభం కానున్న రెండో దశలోనూ మా విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తారు. ఎన్నో దేశీయ, విదేశీ కంపెనీలు ప్లేస్మెంట్ల కోసం రానున్నాయి' అని సంస్థ ప్లేస్మెంట్ అధికారి ఎన్.ఎల్.ఎన్.రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి దశలో కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు ఒరాకిల్, జేపీ మోర్గాన్, డెలాయిట్, ఎకోలైట్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు తమ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయని వివరించారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు సీబీఐటీ విద్యాసంస్థ అధ్యక్షుడు వి.మాలకొండారెడ్డి, ప్రిన్సిపల్ బి.చెన్నకేశవరావు అభినందనలు తెలిపారు. -
ప్లేస్మెంట్లలో సీబీఐటీ రికార్డు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటైన చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) విద్యార్థులు రికార్డు సంఖ్యలో ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఇప్పటి వరకూ 1010 మంది విద్యార్థులు (2015 బ్యాచ్) క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందారని సీబీఐటీ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ సెల్ హెడ్ డాక్టర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి గురువారం తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ తమ కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థులకు దేశంలోనే అత్యధిక వార్షిక వేతనాన్ని రూ. 12 లక్షలు ఆఫర్ చేసిందని ఆయన వెల్లడించారు. డెల్లాయెట్, ఆక్సెంచర్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమినీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఆఫర్ చేశాయని వివరించారు. జేపీ మోర్గాన్, ఫోర్డ్, ఐగేట్ వంటి ఐటీ, ఉత్పత్తి, తయారీ సంస్థలు ప్లేస్మెంట్ల కోసం తమ కాలేజీకి రానున్నాయని పేర్కొన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు సీబీఐటీ అధ్యక్షుడు ఉండేలా మాలకొండారెడ్డి అభినందనలు తెలిపారు.