కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈనెల 21న రాయలసీమ యూనివర్సిటీ, ఇండియన్ ఇమ్మాన్నోలాజికల్స్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలో పూల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ బి.అమర్‌నాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2014 తరువాత బీఎస్సీ(లైఫ్ సైన్సెస్) పూర్తి చేసిన అభ్యర్థులు మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగానికి అర్హులని, ఎంపికైన వారికి మొదటి ఏడాది ఉచిత వసతి కల్పించి నెలకు రూ.11 వేలు స్టైఫండ్ ఇస్తారని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఏడాది అనంతరం రూ.17 వేలతో వేతనం ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు 21న రాయలసీమ యూనివర్సిటీకి అర్హత పత్రాలతో రావాలని సూచించారు.