న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ మరోమారు ఉద్యోగుల్లో కోత విధించింది. వీరికి ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
రెజ్యూమే రూపకల్పనకు సాయం చేయడంతోపాటు ఇంటర్వ్యూకు సన్నద్ధం చేయడం, మెళకువలు నేర్పడం, మార్కెట్లో ఉన్న ఉద్యోగావకాశాలను తెలియజేయడం వంటివి ఔట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ అంటారు. తీసివేతకు గురైన సిబ్బందికి సాయం చేసేందుకు.. మార్కెట్లో నియామకాలు చేపడుతున్న 30 కంపెనీలతో పేటీఎం మానవ వనరుల విభాగం చేతులు కలిపింది. కాగా, ఎంత మందిని తొలగించిందీ అన్న విషయం మాత్రం వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment