సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారుతుందని చెప్పేందుకు సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ఘటనే నిదర్శనమంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
‘‘మొన్న ఓయూ పరిధిలోని అమ్మాయిల వసతి గృహాల వద్ద ఆగంతకుల అల్లర్లు మితిమీరుతున్నాయని వార్తలు వచ్చినా ప్రభుత్వం మేల్కోలేదు. ఫలితంగా ఆగంతకులు రెచ్చిపోయి నిన్న సికింద్రాబాద్ అమ్మాయిల వసతి గృహంలోకి చొరబడ్డారు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి ధైర్య సాహసాలను అభినందిస్తున్నా.. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్‌లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. హాస్టల్‌లో భద్రతా లోపంపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Comments
Please login to add a commentAdd a comment