osmania
-
ఉస్మానియా ఆస్పత్రి భవనం పోలీస్ గ్రౌండ్స్ లో నిర్మించవద్దని డిమాండ్
-
ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ఘటన.. ఎమ్మెల్సీ కవిత ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారుతుందని చెప్పేందుకు సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ఘటనే నిదర్శనమంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘‘మొన్న ఓయూ పరిధిలోని అమ్మాయిల వసతి గృహాల వద్ద ఆగంతకుల అల్లర్లు మితిమీరుతున్నాయని వార్తలు వచ్చినా ప్రభుత్వం మేల్కోలేదు. ఫలితంగా ఆగంతకులు రెచ్చిపోయి నిన్న సికింద్రాబాద్ అమ్మాయిల వసతి గృహంలోకి చొరబడ్డారు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి ధైర్య సాహసాలను అభినందిస్తున్నా.. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. హాస్టల్లో భద్రతా లోపంపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు -
ఓయూ లేడిస్ హాస్టల్ ఆగంతకుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో పొట్టేలా రమేశ్, సన్నీలను ఇద్దరు నిందితులుగా గుర్తించామన్నారు. అదేవిధంగా ఈ ఇద్దరు పాత నేతస్తులని పేర్కొన్నారు. వీరిలో సన్నీ అనే నిందితున్ని ఆరెస్టు చేశామన్నారు. రమేశ్ గతంలో పీడి యాక్ట్ కింద జైలుకు వెళ్లాడని తెలిపారు. వీరిద్దరు హాస్టల్లో ఫోన్లు దొంగలించడానికి వెళ్లారని.. ఏ2 నిందితుడు సన్నీ హాస్టల్ బయట ఉండగా.. ఏ1 రమేశ్ లోపలికి వెళ్లారని తెలిపారు. బాత్రూం ద్వారానే హాస్టల్ లోపలికి వెళ్లి మళ్లీ ఆక్కడి నుంచే దొంగలు బయటకు వచ్చారని చెప్పారు. బాత్రూం నుంచి బయటకు వస్తుండగా ఓ అమ్మాయి కంటబడగా.. దీంతో ఆమెపై దాడి చేశారని తెలిపారు. ఈ కేసులో ఏ1 పొట్టేలా రమేశ్ దొరికితే మరిన్ని విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. -
గోల్కొండలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య?
హైదరాబాద్: గోల్కొండ కోటలో గుర్తు తెలియని పర్యాటకుడు శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. రాత్రి 9గంటలకు సెక్యూరిటీ గార్డులు కోటలోని రాణీ మహల్ వెనక లైట్ అండ్ సౌండ్ షో జరిగే ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా అక్కడ ఓ వ్యక్తి పడి ఉండటాన్ని గమనించారు. ముందు నిద్రపోతున్నాడని అనుకున్నా, కదిపి చూసినా లేవకపోవడంతో అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు, 108కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహం పక్కన కూల్‌డ్రింగ్ సీసా, టీ కప్పు ఉండటంతో మృతుడు ఏదైనా విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుని వయసు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండొచ్చని తెలిపారు. -
రన్నరప్ ఉస్మానియా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కార్ఫ్‌బాల్ (మిక్స్డ్) చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) గ్రౌండ్స్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో ఓయూ 3–8తో ఎండీయూ రోహ్తక్ యూనివర్సిటీ చేతిలో పరాజయం పాలైంది. విజేత జట్టులో అంజలి, సుమన్ ఆకట్టుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో జమ్మూ యూనివర్సిటీ 4–3తో ఢిల్లీ యూనివర్సిటీపై గెలుపొందింది. జమ్ము తరఫున రుషాలి మెరుగైన ప్రతిభ కనబరిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ కార్ఫ్‌బాల్ సంఘం అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. , , -
ఓయూ విద్యార్థుల ముందస్తు అరెస్టులు
- ఉద్యోగాలడిగితే మూకుమ్మడి అరెస్టులా? - నిరుద్యోగ జేఏసీ సూటి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముందస్తు చర్యగా పలువురు నిరుద్యోగ జేఏసీ విద్యార్థులతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం ఐదుగంటలకే ఉస్మానియా హాస్టళ్ల వద్ద విద్యార్థులను అరెస్టు చేసేందుకు పోలీసులు మోహరించారు. పలువురు విద్యార్థులు అరెస్టులను తప్పించుకొనేందుకు అజ్ఞాతం లోకి వెళ్ళినట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. కొంతమందిని హాస్టల్ గదుల్లోనే పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ‘ఇ’హాస్టల్, ‘బి’ హాస్టల్, న్యూ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్(ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్) నుంచి నిరుద్యోగ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని ఉత్సవ ప్రాంగణం నుంచి బయటకు పంపారు. అదేవిధంగా నిరుద్యోగ విద్యార్థి ఉద్యమ నాయకుడు, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేశ్‌ను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్‌లు ఇచ్చి అరెస్టులు చేశారు యూనివర్సిటీ ఉత్సవ ప్రాంగణంలోనికి వస్తున్న విద్యార్థులను, ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ ‘ఎ’ గ్రౌండ్ నుంచి, ‘బి’ గ్యాలరీకి వెళ్తున్న ఓయూ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో తెలంగాణ విద్యార్థి సంఘం నాయకుడు దుర్గం భాస్కర్, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, వట్టికూటి రామారావు, నిజ్జన రమేశ్, ఏఐఎస్ఎఫ్ ప్రేమ్, టీయూఎస్ఎఫ్ పుల్లారావు, దరువు మల్లన్న, ఆశప్ప, శ్రవణ్, విజయ్‌కుమార్ మాదిగ, గణేశ్ తదితరులున్నారు. వీరిని అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మా యూనివర్సిటీ, మా సెలబ్రేషన్స్ అని భావించి పాల్గొనేందుకు వస్తుంటే ఉత్సవాల్లో పాల్గొనకుండా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని దుర్గం భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. భయభ్రాంతులకు గురిచేస్తారా? ఉద్యోగాలడిగితే మూకుమ్మడిగా అరెస్టులు చేస్తారా అని నిరుద్యోగ జేఏసీ ప్రశ్నించింది. నిరుద్యోగ జేఏసీ గత కొంతకాలంగా చేస్తు న్న డిమాండ్లను పట్టించుకోకుండా, విద్యా ర్థులను ఉన్నపళంగా అరెస్టు చేసి, భయ భ్రాంతులకు గురిచేయడం అన్యాయమని నిజ్జన రమేశ్ అన్నారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల ఉద్యోగాల విషయంలో ఏ హామీ లేకుండా, కేవలం అరగంట కోసం పోలీసులతో వర్సిటీని నింపేసి, కార్యక్రమాన్ని హడావుడిగా ముగించుకొన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే తమపై 132 కేసులున్నాయని, ఇంకా కేసులు పెట్టి సాధించేదేమీ ఉండదని ఆయన తెలిపారు. -
ఓయూతో విడదాయలేని బంధం : ప్రొఫెసర్ శేఖర్
-
విదేశీయులకూ గమ్యస్థానం!
చింతకింది గణేశ్ వందేళ్లు.. కోటి మందికిపైగా విద్యార్థులు.. అందులో ఎందరో ప్రముఖులు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఉస్మానియాలో చదువుకుంటున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చి విద్యను అభ్యసిస్తున్న వారిలో ఉస్మానియాలో చేరుతున్నవారే ఎక్కువ. దాదాపు 87 దేశాలకు చెందిన వారు ఉస్మానియాలో చదువుతున్నారు. ప్రస్తుతం 3,897 మంది విదేశీ విద్యార్థులున్నారు. ఇటీవల దేశంలో అత్యధికంగా విదేశీ విద్యార్థులు పుణె విశ్వవిద్యాలయంలో చదువుకుంటుండగా.. రెండో స్థానంలో ఉస్మానియా నిలిచింది. అంచలంచెలుగా విశ్వవ్యాప్తం ఉస్మానియాకు విశ్వవ్యాప్త గుర్తింపు రావడానికి అప్పట్లో పనిచేసిన వైస్ చాన్సలర్ల కృషి ఎంతో ఉంది. 2000వ సంవత్సరానికి ముందు ఇక్కడ చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య పదుల్లోనే ఉండేది. దీనిని గ్రహించిన అప్పటి వీసీ డీసీ రెడ్డి.. యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్ ఆఫీస్ (యూఎఫ్ఆర్వో)ను ప్రారంభించారు. ఓయూలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు సింగిల్ విండో విధానంలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దీంతో క్రమంగా విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగి.. 2016–17కు వచ్చే సరికి 3,897కి చేరింది. ఓయూ ప్రత్యేకతలివీ.. ► దేశంలో ఏడో పురాతన విశ్వవిద్యాలయంగా, దక్షిణ భారతదేశంలో మూడోదిగా ఉస్మానియా చరిత్రలో నిలిచింది. ► 1917లో ఆవిర్భవించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటివరకు 24 మంది వైస్ చాన్సలర్లు బాధ్యతలు నిర్వర్తించారు. ► ఉస్మానియా యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో ఏటా 3.17 లక్షల మంది ఉన్నత విద్య చదువుతున్నారు. కొన్నేళ్ల కింద ఈ సంఖ్య 5 లక్షలుగా ఉండేది. వివిధ కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేయడంతో అనుబంధ కళాశాలలు, విద్యార్థుల సంఖ్య తగ్గింది. ► గ్రామీణ, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ధ్యేయంతో ఉస్మానియానే మొదటిసారిగా వరంగల్‌లో తర్వాత కొన్నేళ్లకు మహబూబ్‌నగర్, నల్లగొండల్లో ప్రాం తీయ కేంద్రాలను ప్రారంభించింది. తర్వాత వాటినే విశ్వ విద్యాలయాలుగా మార్చారు. -
కాంక్ష ఉన్నా.. ఆంక్షల నిర్బంధం
- స్వాతంత్య్రోద్యమ సమయంలో నివురుగప్పిన నిప్పులా ఉస్మానియా - ఉద్యమాలు, నిరసనలకు వ్యతిరేకంగా నిజాం ఫర్మానా - వందేమాతరం ఉద్యమంతో నిరసనలు - వందలాది మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు - స్వాతంత్య్రం వచ్చిన రోజున నిశ్శబ్దంగా యూనివర్సిటీ - భారత్‌లో విలీనం కావాలన్న ఆంక్షలపైనా దిగ్బంధం బ్రిటీషు వారి నుంచి, నిజాం రాచరికం నుంచి స్వాతంత్య్రం పొందాలన్న కాంక్ష ఎంతగా ఉన్నా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంక్షల నిర్బంధంలో ఉండిపోయింది. స్వాతంత్య్రోద్యమం గురించి కనీసం మాట్లాడడమూ తప్పేనంటూ నిజాం జారీ చేసిన ఫర్మానాతో విద్యార్థుల్లో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉండిపోయింది. వందేమాతరం ఉద్యమ సమయంలో విద్యార్థులు దిగ్బంధాన్ని మీరి నిరసనలు తెలిపారు. వందలాది మంది విద్యార్థులను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేసి, అణచివేశారు. ఇక స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనూ యూనివర్సిటీ స్తబ్ధంగా ఉండిపోయింది. ఆ విశేషాలపై ప్రత్యేక కథనం.. మహ్మద్ మంజూర్ దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి హైదరాబాద్, జూనాగఢ్, జమ్మూకశ్మీర్ సంస్థానాలు ప్రత్యేకంగానే కొనసాగాయి. 200 ఏళ్ల బ్రిటీషు పాలన నుంచి స్వేచ్ఛ లభించిందని దేశవ్యాప్తంగా సంబరాలు, జెండా పండుగ జరుపుకొన్నా.. ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. 1947 ఆగస్టు 15వ తేదీ శుక్రవారం వచ్చింది, హైదరాబాద్ సంస్థానంలో శుక్రవారం వారాంతపు సెలవు. అంతేకాదు అప్పుడు రంజాన్ నెల జుమ్మతుల్ విదా, రంజాన్ జాగారం రాత్రి (రంజాన్ చివరి శుక్రవారం, దానిముందు రోజు లైలతుల్ ఖదర్) ఉంది. దాంతో ఓయూ హాస్టల్లో కొంత మంది విద్యార్థులు తప్ప ఎవరూ లేరు. దానితోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, నగర చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి. తిరిగి ఉస్మానియాలో 19వ తేదీన తరగతులు ప్రారంభమయ్యాక మాత్రమే స్వాతంత్య్ర సాధనపై చర్చలు మొదలయ్యాయి. నిజాం పాలనలో ఉన్న కారణంగా జాతీయ జెండాను ఎగురవేయలేకపోయారు. స్వాతంత్య్రోద్యమానికి.. అసలు బ్రిటీషు వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం రాకముందు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో స్వాతంత్య్రోద్యమంపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అంతేకాదు స్వాతంత్య్రానికి కొద్ది వారాల ముందు 1947 జూలై 30న విశ్వవిద్యాలయంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించొద్దంటూ.. స్వాతంత్య్రం అంశంపై మాట్లాడొద్దంటూ నిజాం ఫర్మానా జారీ అయింది కూడా. అయితే స్వాతంత్య్రానంతరం బ్రిటీషువారు స్వదేశీ సంస్థానాలు అటు పాకిస్థాన్‌లోగానీ, ఇటు భారత్‌లోగానీ చేరవచ్చని.. లేదా స్వతంత్రంగా ఉండవచ్చని సూచించారు. దీనిపై మాత్రం ఉస్మానియాలో ఆందోళన వ్యక్తమైంది. హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేయాలనే డిమాండ్లు వెలువడ్డాయి. కానీ నిజాం ఫర్మానా కారణంగా విద్యార్థులు, అధ్యాపకులెవరూ బహిరంగంగా ఆందోళనలు వంటివి చేయలేకపోయారు. ‘వందేమాతరం’ ఉద్యమం ఊపు.. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులు 1938లో వందేమాతరం నినాదాన్ని ఎత్తుకున్నారు. అప్పటికి ఆర్ట్స్ కాలేజీ భవనం పూర్తికాలేదు. వర్సిటీ గన్ఫౌండ్రీలోనే కొనసాగుతోంది. అక్కడి కళాశాలలో ఓ రోజు ఉదయం ప్రార్థన సందర్భంగా కొందరు విద్యార్థులు వందేమాతరం ఆలపించారు. ఆ తర్వాత విద్యార్థులు స్వాతంత్య్ర పోరాటానికి అనుకూలంగా చర్చలు నిర్వహిస్తూ, వందేమాతరం ఆలపించారు. అయితే బ్రిటీషు ప్రభుత్వానికి నిజాం విశ్వాసపాత్రుడు కాబట్టి, ఉస్మానియాలో వందేమాతరం ఆలపించవద్దంటూ నిషేధం విధించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి అనుకూలంగా నిరసనలు చేపట్టవద్దని ఆదేశించారు. దీనిపై విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమైంది. హైదరాబాద్‌తో పాటు జిల్లాలు, తాలూకాల్లోనూ విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో ఉస్మానియాలో 350 మంది విద్యార్థులను.. జిల్లాలు, తాలూకాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 2 వేల మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఓయూలో సస్పెండైనవారిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉన్నారు. కొందరు నాయకులు జోక్యం చేసుకోవడంతో.. విద్యార్థులపై సస్పెన్షన్ తొలగించారు. కానీ స్వాతంత్య్ర ఉద్యమ భావజాలం ఉన్న చాలా మంది విద్యార్థులు దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు తరలి వెళ్లారు. అలాంటి వారికి నాగ్‌పూర్ వర్సిటీ స్వాగతం పలికింది. ఆ విద్యార్థులంతా అక్కడ వందేమాతరం ఉద్యమాన్ని కొనసాగించారు. -
విశ్వనగరి.. నిధుల ఝరి
►విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు ►బడ్జెట్లో నగరానికి భారీ నిధులు ►మంచినీళ్లు, రహదారులు, ప్రజాభద్రతకు పెద్దపీట ►మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం ►కూతపెట్టనున్న పటాన్చెరు–తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైలు ►జూన్ 2న ప్రారంభమయ్యే మెట్రో రైలుకు మినీబస్సులు సపోర్ట్ ►ఉస్మానియాకు రూ.200 కోట్లతో ‘శతాబ్ది’ వెలుగులు సిటీబ్యూరో: అందరికీ మంచినీళ్లు, దుమ్ము రేగని రహదారులు, ఆధునిక భద్రతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ‘విశ్వనగరి’ బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారు. సోమవారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్లో ఔటర్ రింగు రోడ్డు లోపలున్న ప్రాంతాలన్నింటికీ మంచినీళ్లు, కాలుష్య కాసారమై చిక్కి శల్యమైన మూసీనది శుద్ధి–ఆధునీకరణ, దుమ్మురేగని వైట్‌టాప్ రహదారులకు తోడు నగరంలో ఎక్కడ నేరం జరిగినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆనవాళ్లు పట్టించే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు నిధులు కుమ్మరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీకి రూ.1000 కోట్లు కేటాయిస్తూ అందులో మూసీ నది ఆధకోసం రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయాలని నిర్ణయించటం గమనించదగ్గ విషయం. తద్వారా మూసీ మురికిని వదిలించే కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇక జలమండలి ఐదువేల కోట్లకు పైగా నిధులు కావాలని ప్రతిపాదనలు పంపినా, ఈ బడ్జెట్లో కోర్‌సిటీని పక్కన బెట్టి ఔటర్ రింగురోడ్డు లోపలున్న 190 నివాసిత ప్రాంతాలకు మంచినీళ్లందించే పనులను ప్రారంభించనున్నారు. నగరంలో మరింత భద్రతే లక్ష్యంగా మూడు పోలీస్ కమిషనరేట్లకు ఏకంగా రూ.520 కోట్లను కేటాయించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో పాటు లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ యేడాది నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాదే..మెట్రో రైలు, ఎంఎంటీఎస్–2 ప్రారంభం! ఈ ఏడాది జూన్ 2న మెట్రో రైలు ప్రారంభించేందుకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా మినీ బస్సులను ఏర్పాటు చేసే దిశగా ఆర్టీసీకి భారీగా నిధులను కేటాయించింది. వీటితో పాటు పటాన్చెరు–తెల్లాపూర్ల మధ్య ఎంఎంటీఎస్ రెండవ దశ తొలి రైలు కూతపెట్టే దిశగానే బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రూ.200 కోట్ల వ్యయంతో అత్యంత ఆర్భాటంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇదిలా ఉంటే నగరంలో ప్రజారోగ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు సరిపోను కేటాయింపులు చేయకపోవటం, రవీంధ్రభారతి ఆధునీకరణకు తోడు మిగిలిన ప్రాంతాల్లో ఆధునిక ఆడిటోరియాల ప్రస్తావన లేకపోవటం, పర్యాటక రంగానికి ప్రత్యేక నిధులేవీ కేటాయించకపోటంతో భాషాసాంస్కృతిక, పర్యాటక శాఖల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమైంది. -
13న ఉస్మానియా కళాశాలలో జాబ్‌మేళా
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): స్థానిక ఉస్మానియా కళాశాలలో ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి డా. నిస్సార్ అహ్మద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డా. రెడ్డీస్ ఎస్ఎంటీ(హైదరాబాద్) ఆధ్వర్యంలో ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 18–19 ఏళ్లలోపు యువకులు హాజరుకావాలని ఆయన కోరారు. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ(2016)లో 60 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్ సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌కార్డుతో ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలలో అర్హత సాధించిన వారికి రెండేళ్లపాటు అన్ని సదుపాయాలతో ఏడాదికి రూ.1.45 లక్షల వేతనంతో ఉపాధి కల్పిస్తారని తెలిపారు. వివరాలకు 9700382288 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఉస్మానియా అధ్యాపకునికి జాతీయ అవార్డు
కర్నూలు సిటీ: ఉస్మానియా కాలేజీలో హిందీ అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ షేక్ సలీంబాషాకు డాక్టర్ అబ్దుల్ కలాం జీవిత సాఫల్య జాతీయ పురస్కారం లభించింది. ఈ మేరకు మంగళవారం ఆ కాలేజీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంఘిక, ఆర్థిక సంస్థ గత నెల 28వ తేదీన బెంగళూరులో అవార్డు ప్రదానం చేసిందన్నారు. అభినందన కార్యక్రమంలో ఆ కాలేజీ కరస్పాండెంట్ అజ్రాజావెద్, ప్రిన్సిపాల్ డా.సిలార్ మహ్మద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
మన్సూర్ రహమాన్‌కు అమెరికా డాక్టరేట్
కర్నూలు(హాస్పిటల్): యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా గౌరవ డాక్టరేట్‌ను ఉస్మానియా కళాశాల అధ్యాపకులు డాక్టర్ మన్సూర్ రహమాన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కరస్పాండెంట్ అజ్రాజావేద్ మాట్లాడుతూ అర్థశాస్త్ర ఆచార్యులుగా 13 సంవత్సరాలుగా డాక్టర్ రహమాన్ అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యనిర్వాహక సభ్యులుగా కూడా సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సిలార్ మహమ్మద్, రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్, రంగారెడ్డి, నరేంద్రకుమార్, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ కళాశాలల్లో ఒక్క సీటు కూడా పోదు
ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కళాశాలల సీట్లపై లక్ష్మారెడ్డి హైదరాబాద్: ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కళాశాలల సీట్లు యథాతథంగా ఉంటాయని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఎంసీఐ ఎత్తి చూపిన లోపాలన్నింటినీ సరిదిద్దాలని, సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తాను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో మాట్లాడతానని చెప్పారు. సచివాలయంలోని తన చాంబర్లో ఆయన ఈ మెడికల్ కళాశాలలపై ఉన్నతస్థారుులో సమీక్షించారు. ఇటీవల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు లోపాలను ఎత్తి చూపింది. విద్యార్థుల నిష్పత్తికి సరిపడా భవనాలు, అధ్యాపక సిబ్బంది, పరికరాలు లేవని తేల్చింది. ఫలితంగా కొన్ని సీట్లను రద్దు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో మంత్రి... నిర్మాణ పరమైన లోపాలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఔషధ సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థను ఆదేశించారు. తగిన విధంగా భవనాలను సవరించాలని, అవసరమైతే కొత్త భవనాలను నిర్మించాలని సూచించారు. అలాగే పరికరాలకు వెంటనే మరమ్మతులు చేరుుంచాలన్నారు. తదుపరి తనిఖీ నాటికి అన్నింటినీ సిద్ధం చేయాలన్నారు. -
ఉస్మానియా అధ్యాపకుడికి అబ్దుల్ కలాం అవార్డు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉస్మానియా కళాశాలలో అర్ధశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ మన్సూర్ రహమాన్‌కు ప్రతిష్టాత్మక డాక్టర్ అబ్దుల్ కలాం జాతీయ అవార్డు–2016కు ఎంపికయ్యారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని వేరిగోల్డ్ ఆడిటోరియంలో ' గ్లోబల్ ఎకనామిక్ రిసర్చ్ అండ్ ప్రోగ్రెస్ ఫౌండేషన్, ఇండియన్ అబ్జర్వర్ పత్రికలు సంయుక్తంగా అవార్డును శనివారం బహుకరించనున్నాయి. విద్యారంగంలో చేసిన పరిశోధనాత్మక కృషి ఈ పురస్కారం లభించినట్లు రహమాన్ తెలిపారు. -
హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు!
- తల్లిదండ్రులకు సుశ్రీత వాట్సాప్ మెస్సేజ్.. అనంతరం ఆత్మహత్య - భర్త, అత్తమామలపై కేసు సాక్షి, హైదరాబాద్: ‘మళ్లీ బావ కొట్టిండు. నేను ఏమీ అనలేదు. హీటర్ కాసేపు ఎక్కువ పెట్టినని కొట్టిండు. అప్పటికీ చూసుకోలేదు తప్పైంది అన్నా. అయినా బాత్రూమ్లో స్నానం చేస్తుంటే వచ్చి కొట్టిండు. బయటకు వచ్చినాక బట్టలు కూడ వేసుకోలే... వాళ్ల అమ్మ ఉంది కింద. తోటి కోడలు వాళ్ల పిల్లలు చూస్తుండగానే బట్టలు లేకుంటా కొట్టాడు. మా మామయ్య పైకి వచ్చి ఆయన్నే సపోర్ట్ చేస్తుండు’... హైదరాబాద్‌లోని సైదాబాద్ ఠాణా పరిధిలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించిన సుశ్రీత తాను చనిపోవడానికి కొద్దిసేపటి ముందు తల్లిదండ్రులకు పంపిన వాట్సప్ మెస్సేజ్ ఇది. ఆమె భర్తతో పాటు అత్తమామల్నీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన ఎస్.మోహన్ రాజ్ జీవీకే సంస్థలో సైంటిస్ట్. ఈయనకు పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుశ్రీతతో(30) వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. వివాహమైన నాటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మరింత పెరిగాయి. హీటర్ ఎక్కువసేపు పెట్టావంటూ... ఆదివారం ఉదయం సుశ్రీత హీటర్‌తో నీళ్లు కాచుకుంది. హీటర్‌ను ఎక్కువసేపు పెట్టావంటూ మోహన్‌రాజ్ గొడవ పడి బాత్రూమ్లో ఉన్న సుశ్రీతపై చేయిచేసుకున్నాడు. ఆ సమయంలో బంధువులు సైతం అక్కడే ఉండటంతో సుశ్రీత మనోవేదనకు గురైంది. విషయాన్ని తన తల్లిదండ్రులకు వాట్సప్ ద్వారా తెలిపింది. కొద్దిసేపటికే సీలింగ్ ఫ్యా నుకు ఉరేసుకుంది. బాధ్యులను శిక్షించాలని సుశ్రీత కుటుంబ సభ్యులు ఆదివారం సైదాబాద్ పోలీసుస్టేషన్ వద్ద ధర్నా చేశారు. మార్చురీ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఉస్మానియాలో పోస్టుమార్టం అనంత రం మృతదేహాన్ని సుశ్రీత కుటుంబీకులకు అప్పగించారు. పూసలబస్తీలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె కుటుంబీకులు పోలీసులకు చెప్పారు. అయితే, సూర్యాపేటకే తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు. మహిళా సం ఘాలు బాధిత కుటుంబానికి మద్దతు తెలిపి పోలీసుల్ని అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఉస్మానియా పరిశోధనా దీపం
ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్‌లో కె. రామచంద్రాచార్య (కె. ఆర్. ఆచార్య) జూలై 14, 1934న జన్మించారు. వెనుకబడిన అటవీ ప్రాంతం నుండి చదువు కోసం వరంగల్‌కు వచ్చారు. డిగ్రీ పూర్తి చేయాలనే పట్టుదలతో హైదరాబాద్‌లో గుమస్తా ఉద్యోగంలో చేరారు. కానీ అది తృప్తినివ్వకపోవడంతో దీర్ఘకాలిక సెలవుపెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. రాజనీతి శాస్త్రంలో చేరి ‘స్వామి రామలింగ తీర్థ బంగారు పథకాన్ని‘ చేజిక్కించుకున్నారు. తర్వాత ఓయూలో రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా చేరి మూడు దశాబ్దాల పై చిలుకు, అధ్యాపక, పరిశోధన రంగాలలో తనదైన ముద్ర వేశారు. 1994లో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ ఆచార్య 5 ఏప్రిల్ 2016న కన్నుమూశారు. 1970లలో రాజనీతిశాస్త్ర విభాగంలో ‘అనుభవపూర్వక పరిశోధన‘కు ఆద్యుడైన ప్రొ॥రషీదుద్దీన్ ఖాన్ శిష్యరికంలో పీ.హెచ్.డీ. పట్టాను ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలో రెండు పరస్పర సిద్ధాంతా లైన లెఫ్ట్, రైట్ను సమాంతర దూరంతో చూసేవారు. 1970-80లలో గ్రామీణ ప్రాంతం నుంచి మొదటి తరం తెలుగు మీడియం విద్యార్థులు రావడం మొదలైంది. కె.ఆర్ ఆచార్య, ప్రొ॥సుభాష్ చంద్రారెడ్డి వారిలో ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించి ఎంతగానో ప్రోత్స హించిన ఫలితంగానే చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం, పట్టణ ప్రాంత విద్యా ర్థులతో పోటీ పడగలిగారు. భారతదేశంలో ప్రవర్తనవాద దృక్పథం ఆధారంగా ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుందో ముందే చెప్పగల పరిశోధనా పద్ధతులను ఉపయోగించి చెప్పడంలో ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అందులో కె.ఆర్. ఆచార్య భాగస్వాములు కావడమే కాకుండా విద్యార్థులను తీర్చిదిద్ద డంలో, శిక్షణ ఇవ్వడంలో తనదైన శైలి, ముద్ర చూపారు. భారతదేశ ఎన్నికల చరిత్రలో 1971 ఒక మైలురాయి. 1971 ముందు, ఆ తర్వాత రాజకీయాలకు గుణాత్మక తేడా వుంది. నెహ్రూ, శాస్త్రిల మరణం, ప్రధానిగా ఇందిరాగాంధీ, హరిత విప్లవం, కా్రంగెస్ చీలిక, బ్యాంకుల జాతీయీకరణ, నక్సలైట్ ఉద్యమం వంటి వాటితో భారత రాజకీయాల్లో మార్పు కనబడుతుంది. అలాంటి క్లిష్ట సమయాలలో జరిగిన ఎన్నికల విశ్లేషణకు కె.ఆర్. ఆచార్య నేతృత్వం వహించారు. పొలిటికల్ సైన్స్ విభాగంలో విధానాల అధ్యయనం కోసం ఒక సెంటర్‌ను (సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్) నెలకొల్పగా, దీనికి ఆచార్య డెరైక్టర్‌గా వ్యవహ రించి ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలను ప్రచురించారు. ఎన్నికల అధ్యయనంలో భాగంగా తను రాసిన ’క్రిటికల్ ఎలెక్షన్స్’ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది. నా జీవితంలో మరిచిపోని సంఘటన, అదే నా జీవితాన్ని మార్చిన సంఘటన కూడా. 1987లో ఆయన విభాగాధిపతిగా బాధ్యతలు తీసుకున్న రోజే నేను కలవడానికి వెళితే, నా ఎం.ఫిల్ అంశాన్ని ఫైనలైజ్ చేసి ‘రేపు ఫీల్డ్కి వెళ్లి డేటా కలెక్ట్ చేసుకొని రా’ అన్నారు. నేను.. ఎండలు బాగా ఉన్నాయి సార్, నెల రోజుల తర్వాత పోతానంటే, ‘ఇక్కడినుండి ఫో, నిన్ను భగవంతుడు కూడా బాగు చేయలేడు‘ అని గద్దించారు. వెంటనే ‘లేదు సార్, రేపే వెళ్తాను’ అని చెప్పి వెళ్ళాను. దీనివల్ల జరిగింది ఏంటంటే ఎం.ఫిల్ నిర్ణీత కాలంలో పూర్తి చేయడం, యూనివర్సిటీలో లెక్చరర్ పోస్టులు పడడం, నాకు అర్హత వచ్చింది. ఒకవేళ రీసెర్చ్‌ను వాయిదా వేసుకుంటే నేనీరోజు వర్సిటీలో ఉండేవాడిని కాదు. ప్రొ॥కె.ఆర్.ఆచార్య తెలుగు మీడియం విద్యార్థులకు ఎనలేని సేవచేశారు. తెలుగు అకాడమీ నేతృత్వంలో రాజనీతి శాస్త్రంలో వచ్చిన ‘పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం’, ‘భారత ప్రభుత్వం-రాజకీయాలు’, ‘రాజనీతి సిద్ధాంతం-సంస్థలు’ పుస్తకాలకు రచయి తగా, ఎడిటర్‌గా బాధ్యత తీసుకున్నారు. సులువైన భాషలో, లోతైన విషయ పరిజ్ఞానం కల్గిన పుస్తకాల వల్ల లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. నేటికి ఆ పుస్తకాలను కొన్ని మార్పులతో పునర్ముద్రిస్తుండటం విశేషం. 1980లలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంప నలు మొదలైనాయి. వాటిపైన విశ్లేషణాత్మక వ్యాసా లను ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, సియాసత్ ఉర్దూ పత్రికలకు రాసేవారు. భారత రాజకీయాలపై తను రాసిన దాదాపు ఐదువేల వ్యాసాలు వివిధ పత్రిక లలో అచ్చయ్యాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్ర ప్రదేశ్ టైమ్స్ పత్రికలలో రాసిన వ్యాసాల సమాహా రంగా ‘సమకాలీన రాజకీయాలు’ అనే పుస్తకాన్ని సంకలన వ్యాసాల రూపంలో ఆచార్య తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నాటి ప్రధాని పి.వి. న రసింహారావు చేతుల మీదుగా 1991, నవంబర్ 23న విడుదల చేశారు. ఎందరో విద్యార్థులను తన పరిశోధనా నైపుణ్యంతో తీర్చిదిద్ది స్ఫూర్తినిచ్చిన మా గురువు కె.ఆర్. ఆచార్యకు విద్యార్థుల, పరిశోధకుల పక్షాన ఇదే నా నివాళి. (నేడు ప్రొఫెసర్ కె. రామచంద్రాచార్య వైకుంఠ సమారాధన సందర్భంగా) ప్రొ డి. రవీందర్, వ్యాసకర్త ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ విభాగం మొబైల్: 9866047889 -
ఉస్మానియా ‘న్యాక్’ ఔట్!
ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఓయూకు దక్కని చోటు అదే దారిలో కాకతీయ, జేఎన్టీయూ, ఇతర వర్సిటీలు కేంద్రం ఇచ్చే నిధులకు గండి! నిధులు, నియామకాల్లేక అల్లాడుతున్న యూనివర్సిటీలు ఓయూలో ఇద్దరు.. కేయూలో ఒక్కరే ప్రొఫెసర్ డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులన్నీ ఖాళీ! సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. అటు నిధుల్లేక, ఇటు నియామకాల్లేక విలవిల్లాడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ సైతం న్యాక్ గుర్తింపునకు నోచుకోలేని దుస్థితి తలెత్తింది. కాకతీయ, జేఎన్టీయూ వంటి ప్రధాన వర్సిటీలూ అదే దారిలో ఉన్నాయి. ఫలితంగా వీటికి కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత జనవరిలో ప్రకటించిన మొదటి జాబితాలో ఒక్క నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీ మినహా రాష్ట్రంలో మరే విశ్వవిద్యాలయానికి కూడా న్యాక్ గుర్తింపు దక్కలేదు. గతనెల 29న ప్రకటించిన న్యాక్ గుర్తింపు రెండో జాబితాలోనూ ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూలకు చోటు లభించలేదు. ఈ జాబితాలో రాష్ట్రంలోని రెండు ప్రైవేటు కాలేజీలు, నిజామాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి మాత్రమే న్యాక్ గుర్తింపు దక్కింది. ఈ నెల 4న కేంద్రం ప్రకటించిన టాప్-100 ప్రతిష్టాత్మక విద్యాసంస్థల జాబితాలోనూ ఈ వర్సిటీలకు చోటు దక్కలేదు. వీసీలు, తగిన సంఖ్యలో బోధన సిబ్బంది లేకపోవడంతో వర్సిటీల ఈ దయనీయ పరిస్థితిలో పడ్డాయి. ముందే చెప్పినా అదే నిర్లక్ష్యం న్యాక్ అక్రెడిటేషన్ ఉంటేనే నిధులిస్తామని ఏడాది కిందటే రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) స్పష్టంచేసింది. అయినా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మేల్కొనలేదు. ఫలితంగా గతేడాది రూ.20 కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగిన ఉస్మానియాకు ఈసారి పైసా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నుంచి ఏయే నిధులు వస్తాయంటే.. యూనివర్సిటీలకు రాష్ట్రం ఇచ్చే నిధులు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పెన్షన్లకే సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే నిధులే వర్సిటీల అభివృద్ధికి ప్రధానాధారం. ఒక్కో యూనివర్సిటీకి వివిధ పరిశోధనలు, ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిధులిస్తాయి. ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా వివిధ ప్రాజెక్టుల కింద నిధులు వస్తాయి. రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉంటేనే పరిశోధనల కింద నిధులు వస్తాయి. యూజీసీ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కీం, సెంట్రల్ అసిస్టెంట్ ప్రోగ్రాంలతోపాటు టెక్విప్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, సీఎస్ఐఆర్ పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కింద రూ.50 లక్షల నుంచి రూ.15 కోట్ల వరకు నిధులు వస్తాయి. అయితే ఇవన్నీ కనీస బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు ఉంటేనే దక్కుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో అధ్యాపకుల్లేక ఇవేవీ రావడం లేదు. ఒక్కో విభాగంలో 6 నుంచి 18 మంది వరకు ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఆ మేరకు ఏ యూనిర్సిటీలో కూడా లేరు. ఇంజనీరింగ్ విభాగంలో అయితే 16 మంది వరకు ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలోనే అంత సంఖ్యలో ఫ్యాకల్టీ లేరు. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన చాలా నిధులకు గండిపడుతోంది. న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉంటే... న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీలకు యూజీసీ.. యూనివర్సిటీ విత్ పొటెన్షల్ ఫర్ ఎక్సలెన్స్ కింద రూ.50 కోట్ల వరకు ఇస్తుంది. ఇలా 2012లో ఉస్మానియాకు రూ.50 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం న్యాక్ అక్రెడిటేషన్ లేనందునా ఆ నిధులకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది న్యాక్ గుర్తింపు ఉంటేనే రూసా రూ.20 కోట్లు ఇచ్చింది. కనీస సదుపాయాలు, సిబ్బంది లేకపోవడం వల్ల ఈసారి అవీ కూడా వచ్చే పరిస్థితి లేదు. 12వ పంచవర్ష ప్రణాళికలో అభివృద్ధి నిధుల కింద గతంలో రూ.12 కోట్లు వచ్చాయి. ఇకపై అవీ వచ్చేలా లేవు. ఖాళీలే.. ఖాళీలు! ఉస్మానియా వర్సిటీలో డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో మంజూరైన ప్రొఫెసర్ పోస్టులు 152. వాటిలో ఇప్పుడున్నది ఇద్దరే! కాకతీయ వర్సిటీలోనూ డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో మంజూరైన ప్రొఫెసర్ పోస్టులు 54 కాగా.. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. మహత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల్లోనూ ఒక్కరు చొప్పునే ప్రొఫెసర్లు ఉన్నారు. మహత్మాగాంధీ, పాలమూరు, బాసర ట్రిపుల్ ఐటీల్లో అయితే డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో మంజూరైన పోస్టులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. జేఎన్టీయూహెచ్లో ప్రొఫెసర్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం వర్సిటీల్లో పదోన్నతులపై వచ్చిన కొద్ది మందీ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. కాకతీయ వర్సిటీలో అయితే సగం సిబ్బంది కూడా లేదు. దీంతో రూ.16 కోట్ల టెక్విప్ నిధులు రాలేని పరిస్థితి నెలకొంది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 60 మంది వరకు సిబ్బంది అవసరం ఉన్నా 25 మందే ఉన్నారు. మహత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో మూడు బ్రాంచీలతో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అక్కడ 40 మంది వరకు సిబ్బంది అవసరం ఉన్నా రెగ్యులర్ సిబ్బంది ఒక్కరూ లేకపోవడం గమనార్హం. యూనివర్సిటీల వారీగా డెరైక్టు రిక్రూట్‌మెంట్‌లోని ఖాళీల వివరాలివీ.. ఆశలు అడియాశలవుతున్నాయి - సీఎం కేసీఆర్‌కు ఓయూ అధ్యాపకుల బహిరంగ లేఖ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉస్మానియా యూనివర్సిటీకి మంచి రోజులొస్తాయనే ఆశలు అడియాశలు అయ్యాయని ఓయూ అధ్యాపకులు, ఉద్యోగులు వాపోయారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా), బోధనేతర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఓయూ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ మనోహార్ మాట్లాడుతూ... గత రెండేళ్లుగా ఓయూకు పూర్తిస్థాయి వీసీ లేనందున పరిస్థితులు దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ లేనందున యూజీసీ నుంచి వచ్చే రూ.3 కోట్ల అభివృద్ధి నిధులు వెనక్కు వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నియామకాలు చేపట్టకుంటే 2018 నాటికి ఓయూలోని అనేక విభాగాలు మూతపడతాయన్నారు. ఓయూకు వీసీని, పాలక మండలి సభ్యులను నియమించాలని, ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పొడిగించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రజారోగ్యానికి ‘త్రీడీ’ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు రాష్ట్రస్థాయిలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వరకు అన్ని ఆసుపత్రుల్లోనూ ప్రజారోగ్యమే ప్రధానంగా ముందుకు వెళ్లాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన డయాగ్నస్టిక్ (వైద్య పరీక్షలు), డ్రగ్స్ (మందులు), డాక్టర్లు (వైద్యులు).. ఈ మూడింటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించింది. ఈ మూడింటి మొదటి అక్షరాలు ఇంగ్లిషు అక్షర మాలలో ‘డి’తో ఉన్నందున ‘త్రీడీ’ వ్యవస్థగా నామకరణం చేశారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం త్రీడీపై దృష్టి కేంద్రీకరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ పరిస్థితి... రాష్ట్రంలో సుమారు 740 పీహెచ్‌సీలు ఉన్నాయి. మరో 5 వేల వరకు ఉప కేంద్రాలు ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాలు 115, ఏరియా ఆసుపత్రులు 42, జిల్లా ఆసుపత్రులు 10, బోధనాసుపత్రులు 18, మెటర్నిటీ ఆసుపత్రులు 5 ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ప్రజారోగ్యం సక్రమంగా లేదు. అన్ని చోట్లా వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు.. పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నది సర్కారు అంచనా. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో రోజుకు 2 వేల మందికిపైగా రోగులు ఓపీలో చికిత్స పొందుతుంటారు. రోజూ 250 మంది వరకు ఆసుపత్రిలో చేరుతుంటారు. ప్రతీ రోజూ 200 వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. అయితే ఆపరేషన్ కోసం వారాల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉంది. ఇక ఎంఆర్ఐ, సిటీస్కాన్, అల్ట్రాసౌండ్ తదితర రోగ నిర్ధారణ పరీక్షల కోసమైతే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఇలా కింది నుంచి పై స్థాయి ఆసుపత్రి వరకూ దారుణమైన పరిస్థితి ఉంది. ఇక మందుల కొరత సరేసరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏవీ పూర్తిస్థాయిలో దొరకడంలేదు. ఇదిలావుంటే పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు వైద్యులుండాల్సి ఉండగా... ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. నిమ్స్‌లో 172 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే నర్సింగ్ పోస్టులు 158 వరకు ఖాళీ ఉన్నాయి. మరో 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌లో 385 వైద్యులు, 429 నర్సింగ్, 765 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉున్నాయి. ప్రజారోగ్యంలో 298 వైద్యులు, నర్సింగ్‌లో 205, పారామెడికల్ విభాగంలో 765 ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకే త్రీడీ వ్యవస్థ... వైద్య పరీక్షలు, మందులు, డాక్టర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేం దుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇక వైద్య పరీక్షలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఔట్సోర్సింగ్ వ్యవస్థకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నుంచి నిధులు వస్తాయి. ప్రతీ పరీక్షకు కొంత చొప్పున ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఇస్తుంది. రోగులకు ఉచితంగా అన్ని పరీక్షలు చేస్తారు. ఇక సాధారణ మందులు, అత్యవసర మందులకూ ఎన్హెచ్ఎం నిధులు కేటాయిస్తుంది. ఆ ప్రకారం మందులను అందుబాటులో ఉంచుతారు. మరోవైపు వైద్య సిబ్బంది కొరత తీర్చేందుకు ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో ప్రయత్నం మొదలైంది. ఇలా త్రీడీ వ్యవస్థను మెరుగుపరిచి వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయనున్నారు. ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
పునరుద్ధరించి.. మళ్లీ అమర్చి
* దెబ్బతిన్న కాలేయానికి ఉస్మానియాలో అరుదైన శస్త్రచికిత్స * ప్రపంచంలోనే రెండోది... దేశంలో మొదటిది సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కాలేయం, కాళ్లు, పొట్ట భాగంలోని ప్రధాన రక్తనాళాలు మూసుకుపోవడంతో కాలేయం పని తీరు దెబ్బతిని తరచూ రక్తస్త్రావంతో బాధపడుతున్న యువకుడికి 'ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ లివర్'(దెబ్బతిన్న కాలేయాన్ని శరీరం నుంచి బయటికి తీసి, పూడుకుపోయిన అంతర్గత రక్త నాళాలను పునరుద్ధరించి, తిరిగి అమర్చడం) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా చికిత్స చేయడం ఇది రెండోదని, దేశంలో మొదటిదని ఉస్మానియా వైద్యులు తెలిపారు. కెనడాలో మాదిరిగా... ఖమ్మం జిల్లాకు చెందిన నాగరాజు(24) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. కాలేయం నుంచి గుండెకు, తిరిగి అటు నుంచి కాలేయానికి రక్తం సరఫరా చేసే ఇంట్రాహెపటిక్ బ్లడ్ వెసెల్ (ఐవీసీ) మూసుకుపోయింది. దీంతో కాలేయం దెబ్బతింది. పొట్ట, కాళ్లకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం వల్ల అవి ఉబ్బి తరచూ రక్తస్త్రావం అవుతోంది. దీన్ని వైద్య పరిభాషలో 'క్రానిక్ బడ్ చియరీ సిండ్రోమ్'గా పిలుస్తారు. చికిత్స కోసం నగరంలోని ప్రధాన కార్పొరేట్ ఆస్పత్రులను సంప్రదించగా... కాలేయ మార్పిడి చేయాలని, అందుకు రూ.20-30 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అంత ఖర్చు భరించే స్తోమత లేక నాగరాజు ఉస్మానియా ఆసుపత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.మధుసూదన్‌ను ఆశ్రయించాడు. పరీక్షలు చేసిన వైద్యులు... కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని తొలుత భావించారు. అయితే... కాలేయ దాత కోసం రెండు మాసాలు ఎదురు చూసినా దొరకలేదు. ఈ క్రమంలో కెనడాలోని టొరంటో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా ఇదే వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి 'ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ లివర్' పద్ధతిలో శస్త్రచికిత్స చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో డాక్టర్ మధుసూదన్ బృందం ఈ తరహా శస్త్రచికిత్సకు సిద్ధమైంది. 25 మంది వైద్యులు... 10 గంటలు... ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్సలకు కావాల్సిన నిధులను సమకూర్చారు. ప్రభుత్వ అనుమతితో ఈ నెల 13న ఛాతీ కింది భాగంలోని కాలేయాన్ని పూర్తిగా కత్తిరించి, బయటకు తీసి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్స్ దగ్గర దాన్ని భద్రపరిచారు. కాలేయంలో పూడుకుపోయిన అంతర్గత రక్తనాళాలను పునరుద్ధరించారు. ఇదే సమయంలో కాళ్లు, పొట్ట భాగం రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్‌లను క్లియర్ చేశారు. ఇలా శరీరం పునరుద్ధరించిన కాలేయాన్ని తిరిగి అదే వ్యక్తికి అదేచోట విజయవంతంగా అతికించారు. ఇందు కోసం 25 మందితో కూడిన వైద్య బృందం సుమారు 10 గంటలు శ్రమించినట్లు మధుసూదన్ తెలిపారు. బాధితుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని, గురువారం డిశ్చార్జ్ కానున్న అతను జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందన్నారు. -
ఓయూలో మెస్‌లు తెరిపించాలి
వర్సిటీలో విద్యార్థుల ఆందోళన హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో భోజనశాలలను తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఓయూ అధికారులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం లా కాలేజీ వద్ద రోడ్డుపై వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పట్ల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఓయూ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొ. లక్ష్మీనారాయణ వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. త్వరలో ఈ విషయంపై అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. -
ప్రమోషన్ ప్లీజ్..!
రాష్ట్ర విభజనతో వైద్యుల పదోన్నతుల్లో జాప్యం రెండు రాష్ట్రాలకు జరగని వైద్యుల విభజన ఆ తర్వాతే పదోన్నతులంటున్న ఉన్నతాధికారులు లబ్బీపేట : పదోన్నతుల కోసం ప్రభుత్వ వైద్యులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రభావంతో పదోన్నతులకు నోచుకోవడం లేదు. ఏడాది కిందటే పదోన్నతులు రావాల్సిన వారు ఎందరో ఉన్నప్పటికీ ఎప్పుడు అమలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వైద్యుల విభజన జరగకపోవడంతో పదోన్నతులూ నిలిచిపోయాయి. ఉద్యోగుల విభజనపై వేసిన కమలనాథన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేటాయింపులు జరిగిన తర్వాత పదోన్నతులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రొఫెసర్ పదోన్నతి కోసం ఎదురు చూపులు రాష్ట్రంలోని బోధనాస్పత్రిలో పనిచేస్తున్న 50 మందికి ప్రొఫెసర్లుగా ఏడాది కిందటే పదోన్నతి రావాల్సివుంది. అయితే ఆ సమయానికి రాష్ట్ర విభజన జరగడంతో ప్రమోషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, వరంగల్ కాకతీయ వైద్య కళాశాలల్లో పని చేస్తున్నారు. వైద్యుల విభజన జరిగితే వారందరిని ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆస్పత్రుల్లో సర్దుబాటు చేయాలి. ఈ నేపథ్యంలో పదోన్నతికి అర్హులు ఉన్నా నిలిపివేశారు. తీవ్రంగా నష్టపోతున్నాం సకాలంలో పదోన్నతి రాకపోతే సర్వీసులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం నష్టపోవడమే కాకుండా, అనంతరం అడిషనల్ డెరైక్టర్ పదోన్నతులు కూడా జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి, బోధనాస్పత్రికి వచ్చిన వైద్యులు కొందరు పదోన్నతుల్లో తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుత జాప్యంతో మరింత నష్టపోవాల్సి వస్తోం దని వారు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయకుండా నేరుగా వైద్య కళాశాలల్లో చేరిన తమ కన్నా జూనియర్లు ప్రొఫెసర్లుగా పనిచేస్తుంటే, గ్రామీణ సేవలు అందించినందుకు తాము అసోసియేట్లుగానే మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిషనల్ డెరైక్టర్లదీ అదే దుస్థితి రాష్ట్రంలో సుమారు 20 అడిషనల్ డెరైక్టర్ పోస్టులు ఉన్నాయి. అవి అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాటిలో ప్రొఫెసర్లు ఇంచార్జులుగా కొనసాగుతున్నారు. చివరికి రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు, అదనపు సంచాలకులు సైతం ప్రొఫెసర్ కేటగిరిలోనే ఉంటూ ఇన్చార్జులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అడిషనల్ డెరైక్టర్ల పదోన్నతుల విషయంలో ప్రభుత్వాలు ఎప్పటి నుంచో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ దుస్థితి నెలకొందని వైద్యులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం వైద్యుల పదోన్నతుల విషయంలో జాప్యాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండు రాష్ట్రాల్లో వైద్యుల విభజనపై కమలనాథన్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది పదోన్నతులు కోసం ఎదురు చూస్తున్నారు. దీర్ఘకాలంగా పదోన్నతి దక్కకుంటే సర్వీసులో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. - డాక్టర్ ఎన్.ఎస్.విఠల్‌రావు, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు -
వారంలోగా ఉస్మానియా ఖాళీ
-
డిగ్రీ సిలబస్ మార్పుల అమలెప్పుడు?
* పట్టించుకోని ప్రధాన యూనివర్సిటీలు * ఇప్పటికే ప్రారంభమైన తరగతులు * ఇంకా ముద్రణకు నోచుకోని పుస్తకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టినా ప్రధాన యూనివర్సిటీలు మాత్రం వాటి అమలుపై దృష్టి సారించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,200 వరకు డిగ్రీ కాలేజీలు ఉంటే ప్రధానమైన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోనే 800కు పైగా కాలేజీలున్నాయి. సిలబస్ మార్పు అమలుపై ఆ రెండు యూనివర్సిటీల నిర్లక్ష్య వైఖరి కారణంగా వాటి పరిధిలోని సిలబస్ మారుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ఎక్కువ డిగ్రీ కాలేజీలు ఉన్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు స్పందించకపోవడంతో మార్పు చేసిన సిలబస్‌కు అనుగుణంగా తెలుగు అకాడమీ పుస్తకాలను రూపొందించలేకపోతోంది. ఆ యూనివర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో మార్పు చేసిన సిలబస్ అమలుకు తీర్మానం పంపితేనే కొత్త పుస్తకాలు ముద్రణకు నోచుకుంటాయని తెలుగు అకాడమీ పేర్కొంటోంది. ఇప్పటివరకు 300కు పైగా కాలేజీలు ఉన్న శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు మాత్రమే సిలబస్ మార్పుల అమలుకు తమ అకడమిక్ కౌన్సిళ్లలో తీర్మానం చేశాయి. అంతేకాదు ఈ మార్పులు ప్రథమ సంవత్సరలోనే చేసినందున ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలను తొలగించి, తెలంగాణ అంశాలను చేర్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇచ్చింది. పోటీ పరీక్షలకు ఇవే ప్రామాణికం రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, తెలుగు, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల సిలబన్ను మార్పు చేసింది. ఏపీకి సంబంధించిన అంశాలను తొలగించి, తెలంగాణకు సంబంధించిన అంశాలపై సిలబస్‌ను రూపొందించింది. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల్లో తెలంగాణపై ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూపు-1లో తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరునే పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో సిలబస్ మార్పులకు యూనివర్సిటీలు అన్నీ ఆమోదం తెలపకపోవడంతో గందరగోళం ఏర్పడింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కొత్త సిలబస్ అందక ఆందోళన చెందుతున్నారు. -
హా...స్పత్రి!
- ప్రమాదపుటంచున ఉస్మానియా - పెచ్చులూడుతున్న భవనం పైకప్పు - ఇప్పటికే అనేక మందికి గాయాలు - భయం భయంగా సిబ్బంది విధులు - ప్రకటనలకే పరిమితమవుతున్న నిధులు - పట్టించుకోని ప్రభుత్వం సాక్షి, సిటీబ్యూరో: ఎందరికో ప్రాణభిక్ష పెట్టిన చరిత్ర... ఎన్నో మొండి రోగాలను నయం చేసిన ఘనత దాని సొంతం. కానీ ఇప్పుడు దానికే వైద్యం కరువైంది. నిధులనే మందులేసి... మరి కొన్నాళ్లు సేవలందించేలా చూడాల్సిన సర్కారు... అనాథలా వదిలేసింది. ఫలితంగా ప్రాణాలు పోసే ఆస్పత్రే...ప్రాణాంతకంగా మారింది. అదే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి. 1925లో 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆస్పత్రి భవనాల పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. తరచూ రోగులు, వైద్య సిబ్బంది గాయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఇప్పటి వరకు ఫైర్‌సేఫ్టీ... పీసీబీల అనుమతులు లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టాన్నేచవిచూడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిక్కుబిక్కుమంటూ... కొన్నాళ్ల క్రితం సూపరెంటెండెంట్ చాంబర్లో అప్పటి అదనపు సూపరెంటెండెంట్ డాక్టర్ డీవీఎస్ ప్రతాప్, డాక్టర్ రవీందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి శివరామిరెడ్డి వివిధ అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా పైకప్పు పెచ్చులూడి పడింది. డాక్టర్లుడీవీఎస్ ప్రతాప్, రవీందర్ గాయపడ్డారు. ఆ తర్వాత వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు, ఇద్దరు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా నాలుగు రోజుల క్రితం జనరల్ సర్జన్ విభాగంలో పైకప్పు కూలి కిందపడింది. దీంతో వైద్యులంతా సూపరెంటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని సోమవారం కలిసి పరిస్థితిని వివరించారు. ఇక ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపం వేధిస్తోంది. ఏ వార్డులోకి తొంగి చూసినా ముక్కు పుటాలదిరే దుర్వాసన. కళ్ల ముందే సర్జికల్ డిస్పోజల్స్, చెత్త, మురుగు నీరు పారుతున్నా పట్టించుకునే నాథుడు లేరు. కాగితాలకే పరిమితం... ఉస్మానియా ఆస్పత్రి ఏమాత్రం సురక్షితం కాదని ఇప్పటికే ఇంజినీరింగ్ నిపుణులు తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. గాంధీ ఆస్పత్రి తరహాలో ఉస్మానియా ప్రాంగణంలో నాలుగెకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల భవ నాన్ని నిర్మించి... రోగుల ఇబ్బందులను తొలగించవచ్చని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. దీని కోసం 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మర ణానంతరం అధికారంలోకి వ చ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు.రూ.50 కోట్లు కేటాయించారు. ఆ మేరకు ఆస్పత్రిలో పైలాన్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వ రకు పునాది రాయి కూడా పడలేదు. ఇదే సమయంలో ఏడంతస్తుల భవ నానికి ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం చెప్పడంతో ఐదంతస్తులకు కుదించారు. అడ్డంకులన్నీ తొలగాయని భావించి... పనులు మొదలు పెట్టే సమయంలో నర్సింగ్ విద్యార్థులు తమ భవనాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరించారు. దీంతో చంచల్‌గూడ జైలు సమీపంలో భవనాలు నిర్మించాలనే ప్రతిపాదన తెచ్చారు. ఈ అంశం ఎటూ తేలకముందే సీఎం కేసీఆర్ ఇటీవల మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఉస్మానియా ప్రాంగణంలోనే 12 అంతస్తులతో రెండు భారీ టవర్స్ నిర్మిస్తామని చెప్పారు. ఆరు నెలలవుతున్నా దీనికీ కదలిక లేదు. అరచేతిలో వైకుంఠం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం రూ.వంద కోట్లు కేటాయించింది. వైద్య పరికరాల కొనుగోలుకు 75 శాతం, భవనం పునరుద్ధరణకు 25 శాతం నిధులు ఖర్చు చే యనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కనీసం టెండర్లు కూడా పిలువలేదు. తాజాగా 2015 బడ్జెట్లో మరో రూ.100 కోట్లు కేటాయించింది. ఇవన్నీ కాగితాలకే తప్ప...కార్యరూపం దాల్చలేదు. డాక్టర్ నాగేందర్, టీజీడీఏ అధ్యక్షుడు, ఉస్మానియా శాఖ -
‘సూపర్’ వైద్యసీట్లలో తెలంగాణకు అన్యాయం
ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంల్లో జూడాల నిరసన సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ, బ్రాడ్ స్పెషాలిటీ వైద్య సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జూనియర్ డాక్టర్ల(జూడా) సంఘం మండిపడింది. రాష్ట్రంలోని నిమ్స్ సహా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జూడాలు ఉస్మానియా, గాంధీ, వరంగల్‌లోని ఎంజీఎంలలో సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సూపర్‌స్పెషాలిటీ సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కేలా నిబంధనలున్నాయని రాష్ట్ర జూడాల కన్వీనర్ శ్రీనివాస్ విమర్శించారు. ఉస్మానియాలో నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని సూపర్ వైద్య సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణవారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. -
వైద్య విద్య.. మిథ్యే!
మెడికల్ కాలేజీల్లో భారీగా పోస్టులు ఖాళీ టీచింగ్‌కు తప్పని ఇబ్బందులు ఉస్మానియాలో 458 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 110 ఖాళీ గాంధీలో 187 పోస్టులకు 30పైగా ఖాళీలు ‘ఎనిమల్హౌస్’ లేకుండానే ఉస్మానియాలో పరిశోధనలు ఎంసీఐ హెచ్చరించినా మెరుగుపడని సౌకర్యాలు సిటీబ్యూరో: సర్కార్ వైద్య విద్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, నిజామాబాద్, ఆదిలాబాద్‌లోని రిమ్స్ వైద్యకళాశాలల్లో 910 అసిసె ్టంట్ ప్రొఫెసర్ పోస్టులకుగాను 224 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఉస్మానియా వైద్యకళాశాలల్లోనే 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన ఫిజియాలజీలో 9, ఎస్ఎంపీలో 7, జనరల్ మెడిసిన్‌లో 7, సైక్రియాటిక్లో 8, కార్డియాలజీలో 5, గ్యాస్ట్రోఎంటరాలజీలో 3, న్యూరాలజీలో 3, నెఫ్రాలజీలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా సిటీసర్జరీలో 8కి 3, ప్లాస్టిక్ సర్జరీలో 3, పీడియాట్రిక్ సర్జరీలో ఆరు, నియోనాటాలజీలో మూడుకు మూడు పోస్టులు ఖాళీనే. దంత విభాగంలో 43 పోస్టులకు 25, పీడియాట్రిక్ విభాగంలో 31కి తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్లతరబడి నియామకాలు చేపట్టకపోవడం, ఉన్నవారు కూడా రాజీనామా చేసి వెళ్లిపోవడ మే ఇందుకు కారణం. ఎప్పటికప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేయాలని ఎంసీఐ ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఉదయం అనుబంధ ఆస్పత్రిలో రోగులను చూసి, మధ్యాహ్నం మెడికల్ కళాశాలలో థీయరీ చెప్పాల్సి వస్తోందని, ఇది తమకు తీవ్ర భారంగా మారుతోందని నీలోఫర్ ఆస్పత్రికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసీఐ హెచ్చరించినా... ఉస్మానియా వైద్యకళాశాలలో 35 వైద్య కోర్సులు అందిస్తుండగా, 250 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, నీలోఫర్ చిల్డ్రన్స్ ఆస్పత్రి, ఛాతి, మానసిక ఆస్పత్రులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, సుల్తాన్ బజార్, పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రులతో పాటు సరోజినిదేవి కంటి ఆస్పత్రి దీనికి అనుబంధంగా కొనసాగుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ఎంబీబీఎస్ చేసి దేశవిదేశాల్లో గుర్తింపు పొందిన వైద్యులెంతో మంది ఉన్నారు. ఇది గతం. ప్రస్తుతం ఎంసెట్‌లో టాప్‌టెన్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సైతం ఉస్మానియాకు బదులు గాంధీ వైద్యకళాశాలను ఎంచుకుంటున్నారు. చదువుతున్న కాలేజీకి ప్రాక్టీస్ చేయాల్సిన అనుబంధ ఆస్పత్రులకు మధ్య ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం ఉండటానికి తోడు ఆయా ఆస్పతి భవనాలు, వైద్య పరికరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్యార్థుల నిష్పత్తికి తగిన సెమినార్ హాల్లే కాదు, కాలర్ మైక్‌లు, మరుగుదొడ్లు, గ్రంథాలయం, కీలకమైన జర్నల్స్, ఎగ్జామినేషన్ హాల్, పేపర్ వాల్యూయేషన్ హాల్ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇచ్చే మందులు ఎలా పని చేస్తున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి తదితర అంశాలను పరీక్షించేందుకు అవసరమైన ఎనిమల్హౌస్ ఏ వైద్య కళాశాల లో కూడా లేకపోవడం విచారకరం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల తనిఖీలు నిర్వహించి ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఖాళీలు భర్తీ చేయాలి.. ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న క్వాలిఫైడ్ వైద్యులను టీచింగ్ ఆస్పత్రులకు తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరతను అధి గమించవచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు. ప్రస్తుతం టీచింగ్ ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదం. కమల్‌నాథన్ కమిటీతో సంబంధం లేకుండా అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి తెలంగాణ వైద్యులతో ఖాళీలను భర్తీ చేయాలి. - డాక్టర్ బొంగు రమేష్, గౌరవ అధ్యక్షుడు, టీజీడీఏ -
తెలంగాణకు మరో 100 ఎంబీబీఎస్ సీట్లు
ఉస్మానియాకు 50, కాకతీయకు 50 సీట్లు వసతులు పరిశీలించిన ఎంసీఐ బృందం సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మరో 100 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. ఉస్మానియాకు 50, కాకతీయ మెడికల్ కాలేజీకి 50 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యవిద్యా సంచాలకుడు డా.పుట్టా శ్రీని వాస్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు భారతీయ వైద్య మండలికి చెందిన 2 బృందాలు ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలను సందర్శించినట్లు చెప్పారు. ఆయా మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, పరికరాలు, రోగుల సంఖ్య, ల్యాబ్ సౌకర్యాలను ఎంసీఐ బృందాలు పరిశీలించినట్లు పుట్టా శ్రీనివాస్ చెప్పారు. వారి పర్యటన సంతప్తికరంగా జరిగినట్లు, ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 200, కాకతీయ మెడికల్ కాలేజీలో 150, రిమ్స్‌లో 100, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 100, గాంధీలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీల్లో పెంచే సీట్లతో కలిపి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 850 ఎంబీబీఎస్ సీట్లు అవుతాయి. -
గ్రేటర్లో 52 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు
వరంగల్ జిల్లాలో ఒకరికి, మహబూబ్‌నగర్‌లో మరొకరికి .. సాక్షి, హైదరాబాద్/వరంగల్/ మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లో చలితగ్గుముఖం పట్టినా స్వైన్‌ఫ్లూ కేసులు మాత్రం పెరుగుతుండటంతో గ్రేటర్ వాసు లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 336 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 21 మంది మృతి చెందారు. తాజాగా ఆదివారం 52 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో చాలామంది ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లోని స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాల్లో, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారులు తెలిపారు. మరో పక్క జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఒకరికి, మహబూబ్‌నగర్‌లో మరొకరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట యువకుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ మనోహర్, మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. మరో వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వైన్‌ఫ్లూ అనుమానితులకు రవాణా సౌకర్యం రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గిందని, ప్రజలు ఆందోళన చెందొద్దని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూ అనుమానిత రోగులను ఆస్పత్రులకు చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 108కు ఫోన్ చే స్తే వారిని ఆస్పత్రులకు చేరుస్తాయని ఆయన వివరించారు. ఆదివారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ.. స్వైన్‌ఫ్లూ సోకినట్లు అనుమానం ఉన్న వారిని ప్రైవేటు ఆస్పత్రులు అడ్మి ట్ చేసుకోవాలని, లేదంటే ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. స్వైన్‌ఫ్లూ అనుమానితులు గాంధీ ఆసుపత్రికే రావాలని, ఎక్కడికి పం పాలో తామే నిర్ణయిస్తామని అన్నారు. శని, ఆది వారాల్లో 35 కేసులు పాజిటివ్‌గా తేలాయన్నారు. -
ఆసుపత్రులకు నిధుల విడుదల
పరిపాలనా అనుమతి ఇస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆసుపత్రులు, వైద్య క ళాశాలల అభివృద్ధి, ఆధునీకరణ కోసం ప్రభుత్వం రూ. 169.54 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గత బడ్జెట్లో ఆస్పత్రులు, కళాశాలల కోసం నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఆస్పత్రులు, కళాశాలల్లో వివిధ అవసరాల కోసం నిధుల కేటాయింపు ఇలా ఉంది... ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఐపీ బ్లాక్, ఎన్పీఆర్ బ్లాక్‌ల పటిష్టానికి రూ. 23.92 కోట్లు. గాంధీ ఆసుపత్రిలో సీనియర్ల నివాసాలు, పీజీ విద్యార్థుల వసతి తదితరాలకు రూ. 30 కోట్లు, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.5 కోట్లు. ఈఎన్టీ ఆసుపత్రి మూడో అంతస్తు నిర్మాణం సహా ఇతరాలకు రూ. 8.35 కోట్లు. నీలోఫర్ ఆసుపత్రిలో ఆధునిక వంటశాల, లాండ్రీ, పీజీ హాస్టళ్లు, సులభ్ కాంప్లెక్స్, రోడ్ల కోసం రూ. 7.15 కోట్లు, వార్డులు, మరుగుదొడ్ల పునరుద్ధరణ తదితరాలకు రూ. 2.85 కోట్లు. హైదరాబాద్‌లోని ఛాతి ఆసుపత్రికి రూ. 3.81 కోట్లు, సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి రూ. 1.06 కోట్లు, ఫీవర్ ఆసుపత్రిలో మెడికల్ స్టోర్ నిర్మాణానికి, లైబ్రరీ తదితరాల కోసం రూ. 4.60 కోట్లు. పేట్లబురుజులోని జీఎంహెచ్‌కు రూ. 16.34 కోట్లు, సుల్తాన్బజారులోని జీఎంహెచ్‌కు రూ. 17.60 కోట్లు. ఎర్రగడ్డలోని మెంటల్ కేర్‌కు రూ. 16.75 కోట్లు, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రూ. 8.33 కోట్లు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్ల వసతి గృహాలకు రూ. 5 కోట్లు. నిమ్స్ స్థాయిలో ఆధునీకరించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 4 కోట్లు, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 6 కోట్లు వరంగల్‌లో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ. 5 కోట్లు. అలాగే గాంధీ ఆసుపత్రి సహా ఆదిలాబాద్, వరంగల్‌లలో నర్సింగ్ కాలేజీల నిర్మాణాలకూ ప్రభుత్వం నిధులు కేటాయించింది. -
టీడీపీ దాడులు చేస్తున్నా పట్టించుకోరా?
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న దస్తగిరిరెడ్డిని పరామర్శించిన జగన్ అఫ్జల్‌గంజ్ ‘‘పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని అధికార తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తున్నా పోలీసుయంత్రాంగం పట్టించుకోవడంలేదు. కేసులు నమోదుచేయకుండా చోద్యం చూస్తోంది.’’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడి, ఉస్మానియాలో చికిత్సపొందుతున్న వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం జీవంపేటగ్రామానికి చెందిన పార్టీ నేత దస్తగిరిని ఆయన బుధవారం పరామర్శించారు. ఆయన వెంట నాయకులు ఎంవీ మైసూరారెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దస్తగిరిరెడ్డిని అడ్డుకుని దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయకుండా బాధితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కొనసాగుతున్న దాడులపై పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడంలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎం.వి.మైసూరారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రాజార్యంగేతర శక్తులు ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం వల్లే వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలపై వరుస దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దస్తగిరికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీజీ రఘురామ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్చవాన్, శివకుమార్, ఆస్పత్రి ఆర్ఎంవోలు డాక్టర్ మహ్మద్ రఫీ, నరేందర్, సిద్ధిఖీ, వైద్య నిపుణులు డాక్టర్ నాగేందర్, డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
షాద్ నగర్లో వ్యక్తిపై హత్యాయత్నం
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో భూతగాదాలు పడగ విప్పాయి. షాద్ నగర్లో ఓ వ్యక్తిపై కబ్జాదారులు పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థల వివాదం కారణంగానే ప్రత్యర్థులు ఈ దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సమ్మె ఉధృతం
అత్యవసర సేవలను బహిష్కరించిన జూడాలు స్తంభించిన వైద్యసేవలు వెనుదిరుగుతున్న రోగులు సాక్షి, సిటీబ్యూరో: జూనియర్ డాక్టర్ల సమ్మెతో నగరంలో అత్యవసర వైద్యసేవలు స్తంభించిపోయాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకున్న క్షతగాత్రులు, హృద్రోగులు, గర్భిణులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. అత్యసర విభాగాల్లో నిపుణులు లేకపోవడంతో వచ్చిన రోగులకు ఇతర ఆస్పత్రులకు తిప్పిపంపుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణ్ (48) ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత చాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు చికిత్స కోసం 108లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత వైద్యం అందక ఆయన మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే రోగి మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. 107 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 15రోజులుగా సాధారణ విధులను బహిష్కరించిన జూడాలు తాజాగా అత్యవసర సేవలనూ నిలిపివేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి చికిత్స కోసం గురువారం ఉదయం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకున్న రోగులకు కనీస వైద్యసేవలు అందక పోవడంతో వారు నిరాశతో వెనుతిరుగాల్సి వస్తోంది . ఓపీ సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతో రోగులు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రభుత్వం చెప్పుతున్నప్పటికీ ఆచరణలో అవి కన్పించడం లేదు. అత్యవసర విభాగాల్లో యునానీ, ఆయుర్వేద వైద్యులతో పాటు 108 సిబ్బందే రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు ఉస్మానియా వైద్య కళాశాలలో... జూడాల సమస్యలు పరిష్కారించపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఉస్మానియా వైద్యకళాశాల ఆవరణలో 18వ రోజు జూడాలు తమ ఆందోళన కొనసాగించారు. రక్తంతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలనే 107 జీవో ప్రతులను వారు హోమగుండంలో వేసి దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి పెద్ద పెట్టున ప్రభుత్వానికి, డిఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
‘ఉస్మానియా’ పనులు 4 ఏళ్లు పెండింగా?
ఎంఎస్ఐడీసీ అధికారులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఎంఎస్ఐడీసీ) పనితీరుపై ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరై నాలుగేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఎంఎస్ఐడీసీ ఎండీ రవిచంద్ర, వైద్యవిద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ తదితరులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం 200 కోట్లు మంజూరైనా నేటికీ పైసా కూడా ఖర్చు చేయని అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. స్థలం సమస్య సాకు చూపి మంజూరైన నిధులు ఖర్చు చేయకపోతే ఎలా అని రాజయ్య ప్రశ్నించారు. ఏటా 50 కోట్లు ఖర్చు చేసినా ఈపాటికే ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమయ్యేవని అభిప్రాయపడ్డారు. ఆంధ్రపాలకుల నిర్లక్ష్యం, సంస్థలోని కొందరు అధికారుల అవినీతి, అలసత్వంవల్ల పనులు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎంఎస్ఐడీసీ పనులేవీ పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదని, ఉన్న నిధులన్నీ కచ్చితంగా వాడుకోవాలని ఆదేశించారు. చంచల్‌గూడ వద్దనున్న స్థలంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని సాధ్యమైనంత తొందర్లో నిర్మించేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అవినీతి, వసూళ్ల కేంద్రంగా ఎంఎస్ఐడీసీ మారుతున్నాయనే ఆరోపణలను సమావేశంలో ప్రస్తావించారు. ఒక ఉన్నతాధికారి, ఫార్మాసిస్టు కలసి సంస్థను అవినీతి కూపంగా మార్చారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎంఎస్ఐడీసీని విభజించినప్పటికీ సాంకేతిక కారణాలవల్ల అధికారులను నియమించలేదు. తొందర్లోనే తెలంగాణ ఎంఎస్‌ఐడీసీకి పూర్తిస్థాయి యంత్రాంగాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. -
రోగులకు ‘పరీక్ష’!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు.. పేదోడికి పెద్దరోగం వస్తే ఆదుకొనే వైద్యాలయాలు. కానీ, ఇప్పుడు వాటికే పెద్ద జబ్బు చేసింది. నిపుణులైన డాక్టర్లు ఉన్నా.. సుశిక్షుతులైన సిబ్బంది ఉన్నా.. సరైన సదుపాయాలు లేక విలవిలలాడుతున్నాయి. నిరుపేద నిండుప్రాణాలు తన ప్రాంగణంలోనే పోతున్నా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నాయి. తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రుల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపగా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లమైంది. ఎంఆర్ఐ, సీటీస్కాన్, వెంటిలేటర్స్, ఈసీజీ, టూడీఎకో, డయాలసిస్, కలర్‌డాప్లర్, ఎక్స్‌రే, ఎండోస్కోపి, కొలనోస్కోపి మిషన్లు ఈ రెండు ఆసుపత్రుల్లో తగినన్ని లేవు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. గాంధీలో ఎంఆర్ఐ కోసం ఇప్పటికే 250 మందికిపైగా ఎదురు చూస్తుంటే, ఉస్మానియాలో 180 మందికిపైగా నిరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల కోసం 15 నుంచి 30 రోజులు వేచి ఉండాల్సివస్తోంది. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే స్తోమత లేక సర్కారు ఆసుపత్రిల్లోనే రోజులు వెళ్లదీస్తున్న రోగులు చివరకు రోగం ముదిరి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. గాంధీలో రోజూ 250 మంది వెయిటింగ్ గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 200 నుంచి 300 రోగులు వస్తుండగా, వీరిలో చాలా మందికి ఎంఆర్ఐ, సీటీ స్కాన్ అవసరం. ఒక్కో సీటీ స్కాన్‌కు 20 నిమిషాలు పడుతుంది. ఇలా గంటకు ముగ్గురి చొప్పున రోజుకు సగటున 30 నుంచి 35 మందికి మాత్రమే టెస్టులు చేయగలరు. కానీ రోగుల సంఖ్య రోజు వందల్లో ఉండడంతో ఇక్కడి సిబ్బంది ప్రతిరోజు 50కిపైగా సీటీ, ఎంఆర్ఐ టెస్టులు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రస్తుతం 250 మందికిపైగా రోగులు ఇక్కడ తమ రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎక్స్‌రే తీయించుకుంటే మరుసటి ఉదయం 11 గంటలకు గానీ ఈ ఆసుపత్రిలో రిపోర్టులు రోగుల చేతికి అందవు. ఇక పనిభారం ఎక్కువగా ఉండడం వల్ల యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. రేడియాలజీ విభాగానికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు(ఏఎంసీ) లేకపోవడం వల్ల రిపేరు చేయడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. రక్తప్రసరణ తీరును గుర్తించే కలర్‌డాప్లర్ టెస్ట్‌కు రెండు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక నెఫ్రాలజీ విభాగంలో ఐదు డయాలసిస్ యంత్రాలు ఉంటే కేవలం మూడే పనిచేస్తున్నాయి. అదనంగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సమకూర్చాల్సిందిగా ఆస్పత్రి యాజమాన్యం డీఎంఈకి లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందనే లేదు. ఉస్మానియాలో ఇలా... ఉస్మానియా ఆసుపత్రికి రోజూ రెండు వేలకుపైగా రోగులు వస్తుంటారు. ఇక్కడి క్యాజువాల్టీలో వెంటిలేటరే లేదు. ఇక ఏఎంసీ వార్డులో ఒకే వెంటిలేటర్ పని చేస్తుంది. రికార్డుల్లో 40కిపైగా వెంటిలేటర్లు ఉన్నా పనిచేస్తున్నవి మాత్రం 25కి మించి లేవు. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఒకే ఒక్క ఎంఆర్ఐ మిషన్ ఉంది. దీంతో పరీక్ష చేయాలంటే ఒక్కో రోగికి సగటున 30 నిమిషాలు పడుతోంది. దీంతో ఇక్కడ పేరు నమోదు చేయించుకున్న రోగులకు 12 రోజుల తర్వాతే టెస్టుల కోసం సమయం ఇస్తున్నారు. ప్రస్తుతం 180 మంది ఇక్కడ వెయింటింగ్ లిస్టులో ఉన్నారు. సీటీస్కాన్దీ అదే పరిస్థితి. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ మిషన్ల కాలపరిమితి ముగియడంతో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. నెబులైజర్స్ లేక ఆస్తమా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. రోగుల గుండెను రీయాక్టివ్ చేయడానికి ఉపయోగించే డి ప్రీవిలేటరూ అందుబాటులో లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని పరికరాలు సమకూర్చాలని ఆస్పత్రి అధికారులు ఏడాది క్రితం ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదు. ఇక్కడ డిజిటల్ ఎక్స్‌రే సర్వీసులు అందుబాటులో ఉన్నా సాధారణ ప్రింట్లనే చేతికిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఎక్స్‌రే తీయించుకుంటే సాయంత్రం ఐదు గంటలకు రిపోర్టు చేతికందుతుంది. -
ఉస్మానియాలో దళారుల దందా!
-
'నిమ్స్‌ను ఎయిమ్స్ స్థాయికి తీసుకు వెళతాం'
హైదరాబాద్ : నిమ్స్‌ను ఎయిమ్స్ స్థాయికి తీసుకు వెళతామని ఆరోగ్య శాఖమంత్రి రాజయ్య అన్నారు. నిమ్స్‌లో అవినీతిని అరికట్టేందుకు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కంప్యూటరైజేషన్ చేస్తామన్నారు. ఇందుకోసం పీ డాక్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నట్లు రాజయ్య గురువారమిక్కడ తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న పాత సామాగ్రిని తీసివేసి కొత్త సామాగ్రిని అందచేస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మెడికల్ కళాశాలలో కోల్పోయిన సీట్ల కోసం ఎంసీఐని సంప్రదించామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో వంద సీట్లు వచ్చే అవకాశం ఉందని రాజయ్య చెప్పారు. -
సోలార్ వెలుగులు
- గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు - ఆదిత్య గ్రీన్ ఎనర్జీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం సాక్షి, సిటీబ్యూరో : గంటల తరబడి విద్యుత్ కోతలు.. రూ.లక్షల్లో నెలసరి విద్యుత్ చార్జీలు.. వెరసి ప్రభుత్వ ఆస్పత్రులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఈ కష్టాల నుంచి ఆస్పత్రులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఆస్పత్రుల్లోనే సూర్యరశ్మితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కోతలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆస్పత్రి, నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రుల భవనాలపై 400 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ పలకలను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కేంద్రప్రభుత్వం దీనికి ఆర్థిక సహాయం అందిస్తుండంగా... లాథోర్‌కు చెందిన ఆదిత్యగ్రీన్ ఎనర్జీ సంస్థ పనులు దక్కించుకుంది. సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.5.50ల చొప్పున చెల్లించి కొనుగోలు చేయనుంది. ఆస్పత్రి అవసరాలు తీరగా మిగిలిన విద్యుత్‌ను ఇతరులకు విక్రయించనుంది. గాంధీలో 50 శాతం పనులు పూర్తి ... గాంధీ ఆస్పత్రిలో 1065 పడకల సామర్థ్యం ఉంది. ఓపీకి ప్రతి రోజూ 2000 మంది రోగులు వస్తుండగా, ఇన్‌పేషంట్ వార్డుల్లో నిత్యం 1500 మంది చికిత్స పొందుతుంటారు. ప్రతి రోజూ 150 శస్త్రచికిత్సలు చేస్తుంటారు. నెలకు రూ.25 నుంచి 30 లక్షల వరకు విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఇది ఆస్పత్రికి భారంగా మారుతోంది. ఈ వ్యయం, కోతల నుంచి బయటపడేందుకు రూ.3.5 కోట్ల వ్యయంతో ఆస్పత్రిలో 400 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఆస్పత్రి అవసరాల కోసం వినియోగించనున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు నెలసరి విద్యుత్ ఖర్చు కూడా తగ్గించవచ్చు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. త్వరలో ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో ... ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సుమారు 1100 పడకల సామర్థ్యం కలిగుంది. ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజూ 2500 మంది వస్తుండగా, ఇన్‌పేషంట్ వార్డుల్లో నిత్యం 2000 మంది చికిత్స పొందుతుంటారు. ఇక్కడ నిత్యం 200 శ స్త్రచికిత్సలు అవుతుంటాయి. ప్రతి నెలా రూ.25 లక్షలకుపైగా విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. 350 పడకల సామర్థ్యం కలిగిన నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి ప్రతి నెలా రూ. లక్షన్నరకుపైగా విద్యుత్ బిల్లు వస్తోంది. ఈ బిల్లులు ఆస్పత్రులకు భారంగా మారుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో 400 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేసి, కోతల నుంచి రోగులను కాపాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
దవాఖానాల్లో దాహం.. దాహం
ప్రభుత్వాసుపత్రుల్లో క‘న్నీటి’ కష్టాలు పేషెంట్లకు కలుషిత నీరే దిక్కు మినరల్ వాటర్ కొనలేని పరిస్థితి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు పట్టనట్లు వ్యవహరిస్తున్న ఆసుపత్రులు సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు దాహంతో అల్లాడుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ఆస్పత్రులకు సరిపడా మంచి నీరు సరఫరా చేయక పోవడంతో ఖాళీ సీసాలు పట్టుకుని రోగుల బంధువులు రోడ్ల వెంట ఉన్న చలివేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. కొంతమంది సొంత ఖర్చుతో మినరల్ వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ఆస్పత్రుల్లో సరఫరా అవుతున్న మురుగు నీరే సేవిస్తున్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల సమీపంలోని దుకాణాల్లో మంచినీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. అడపాదడపా సరఫరా అవుతున్న నీరు కూ డా పూర్తిగా కలుషితం అవుతోంది. మంచినీటిలో ఈ కొలి బ్యాక్టీరియా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత అంశాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్రమత్తత లోపించింది. కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం వల్ల మంచినీటి ట్యాంకుల్లో చెత్త, మురికి పేరుకు పోతుంది. దీంతో రోగులకు సరఫరా చేస్తున్న మంచి నీటిలో ‘ఈ కోలీ బ్యాక్టీరియా’ ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఈ నీటిని తాగడంతో రోగులతో పాటు వారి వెంట వచ్చిన బంధువులు అనారోగ్యం పాలు కావాల్సి వస్తోందని పేర్కొంది. రోజుల తరబడి శుభ్రం చేయని సంపులు రోగులు, వైద్యులు, సిబ్బంది తాగునీటి అవసరాల కోసం ఉస్మానియా ఆసుపత్రిలో 14 సంపులను ఏర్పాటు చేశారు. వీటిలో చా లా వాటికి మూతల్లేవు. చెట్ల ఆకులు, దుమ్ము, ధూళి ట్యాంకుల్లో చేరడంతో నాచు పేరుకుపోతోంది. దీనికి తోడు బోరు నీరు కూడా కలుస్తుంది. ఏడాదైనా వీటిని శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమవుతోంది. ఇలా కలుషితమైన నీటిని తాగడంతో గత ఏడాది ఇదే ఆసుపత్రిలోని 40 మంది నర్సింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అప్రమత్తమైన అధికారులు అప్పట్లో ట్యాంకులను క్లీన్ చేయించినప్పటికీ, ఆ తర్వాత వీటి నిర్వహణను పూర్తిగా మరిచిపోయారు. తాజాగా ఓ రోగికి చెందిన ఇద్దరు బంధువులు ఈ నీటిని తాగడంతో వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. బ్లీచింగ్ కూడా కొరతే ఛాతీ ఆసుపత్రిలోని మంచినీటి ట్యాంకు పరిసరాలు, వంటగది అపరిశుభ్రంగా ఉన్నాయి. అదేవిధంగా ఎర్రగడ్డ మానసిక చికిత్సా లయంలోని నీటి ట్యాంకుల వద్ద మురుగు నీరు చేరుతుంది. నిలోఫర్, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రిలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇక్కడ సరఫరా అవుతున్న మంచినీటిలో కోలీఫామ్ బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు ఐపీఎం పరీక్షల్లో తేలింది. ప్రతి ఆరు మాసాలకోసారి బ్లీచింగ్‌తో ట్యాంకులను శుభ్రం చే యడంతో పాటు, ప్రతి నెలా నీటిని పరీక్షించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు వీటిని అసలు పట్టించుకోవడం లేదు. అయితే ఆసుపత్రుల్లో బ్లీచింగ్ లేకపోవడం వల్లే ట్యాంకుల జోలికి వెల్లడం లేదని సిబ్బంది పేర్కొం టుంది. ఫలితంగా అనేక మంది రోగులు, వారి తరుపు బంధువులు వాంతులు, విరేచనాలతో బాధ పడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. -
‘దగా’ ఖానా
ధర్మాస్పత్రుల్లో మందులు కరువు =దవాఖానాలకు వచ్చి దగాపడుతున్న రోగులు =సాధారణ మందులూ బయట కొనాల్సిందే.. =బడ్జెట్ ఉన్నా వినియోగించని వైనం =వృథాగా మూలుగుతున్న అభివృద్ధి కమిటీ నిధులు సాక్షి, సిటీబ్యూరో: రాజు కరీంనగర్ జిల్లా హనుమాజీపేట వాసి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయమై రక్తస్రావం ఆగలేదు. అక్కడి వైద్యుల సూచనతో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి.. హిమోఫీలియా ఉండటంతో రక్తస్రావమవుతోందని గుర్తించారు. అయితే, అందుకు సంబంధించిన మందుల్లేవని చేతులేత్తేసి చోద్యం చూశారు. దీంతో వైద్యం అందని దైన్యస్థితిలో రాజు ప్రాణాలు వదిలాడు. కనీసం వేరేచోటకు తీసుకెళ్లాలని సూచించినా అతని ప్రాణాలు దక్కేవి. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వంద శాతం బతికే అవకాశం ఉన్నా.. కేవలం మందుల్లేవన్న సాకుతో వైద్యులు గుడ్లప్పగించి చూడ్డం వల్లే 25 ఏళ్లకే రాజుకు నూరేళ్లు నిండాయంటూ బంధువులు గుండెలు పగిలేలా రోదించారు. వైద్యుల తీరును నిరసిస్తూ హిమోఫీలియా సొసైటీ ఆందోళనకు దిగింది. మాదాపూర్ ప్రాంతంలో ఉండే రత్తమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్సకు అవసరమైన మందులు బయటి నుంచి తెచ్చుకుంటే తప్ప తామేం చేయలేమని వైద్యులు చెప్పారు. ణాలు పోయాల్సిన ధర్మాస్పత్రుల్లోని దారుణాలివి. ‘ఖానా’ ఎలాగూ లేదు.. కనీసం ‘దవా’కు కూడా గతిలేని దవాఖానాల మెట్లెక్కుతున్న రోగులు నిలువునా దగా పడుతున్నారు. ప్రఖ్యాతిగాంచిన గాంధీ, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాథమిక వైద్యమూ అందట్లేదు. సాధారణ మందులు కూడా అందుబాటులో ఉండట్లేదు. కనీసం గాయాన్ని తుడిచేందుకు దూదే కాదు.. కట్టుకట్టేందుకు బ్యాండేజ్‌లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. బీపీ, షుగర్ మాత్రల కోసం కూడా చీటీలు పట్టుకుని రోగి బంధువులు బయటి మెడికల్ దుకాణాలకు వెళ్తున్నారు. ప్రత్యేకించి ధర్మాస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసమే రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.. నిజానికి సూది కి, దూదికి గతిలేని దౌర్భాగ్య పరిస్థితి రాజ్యమేలుతోం ది. ఉస్మానియా, గాంధీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, సరోజినిదేవి కంటి ఆస్పత్రిలోనూ పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. ఆయా ఆస్పత్రులకు వస్తున్న రోగుల్ని మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మందుల బడ్జెట్ సంగతేంటి? నిజానికి ప్రభుత్వ కేటాయింపులతో పనిలేకుండా, గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాస్పత్రులకు సొంత బడ్జెట్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల వంటి సౌల భ్యాలు ఉన్నాయి. ఈ నిధులతో సాధారణ మందులను అందుబాటులో ఉంచవచ్చు. గాంధీకి ఏటా రూ.3 కోట్ల మేర, ఉస్మానియాకు రూ.4 కోట్ల మేర మందుల కొనుగోలు బడ్జెట్ ఉంది. కానీ, బ్యాండేజీ కోసం కూడా రోగులు బయటి మెడికల్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గాంధీ జనరల్ ఆస్పత్రిలో హిమోఫీలియా మందులు అందుబాటులో లేక శనివారం రాజు అనే యువకుడు నిస్సహాయస్థితిలో ప్రాణాలు వదిలాడు. హిమోఫీలియా ఉన్న వారికి చిన్న గాయమైనా రక్తస్రావమవుతూనే ఉంటుంది. నిజానికి ఈ వ్యాధికి సంబంధించిన మందుల్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కానీ గాంధీలో అవి అందుబాటులో లేవట! బోసిపోతున్న పసినవ్వులు ప్రభుత్వ నిర్లక్ష్యం చిన్నారుల ఉసురూ తీస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద రెఫరల్ సెంటరైన నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో నాజిల్ డ్రాప్స్కూ గతిలేదు. మోర్ఫెన్ సల్పైట్ 10 ఎంజీ ఇంజక్షన్, ఫెనోబార్బిటోన్ 20 ఎంజీ సిరప్, సెఫోటాక్సిమీ 250 ఎంజీ ఇంజక్షన్ వంటి మందుల్ని రోగులే బయటి నుంచి తెచ్చుకొంటున్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులు మూలుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పు కష్టమే.. సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రుల కు రోజూ సగటున 2000-3000 మంది గర్భిణిలు వస్తారు. వంద వరకు ప్రసవాలు జరుగుతాయి. కడు పు బిగుసుకుపోవడం, బేబీ మూవ్మెంట్ తగ్గిన గర్భిణిలకు ‘ఐసాక్స్ సుఫ్రిన్ హెచ్ సీఎల్’ఇంజక్షన్ ఇవ్వాలి. కానీ ఇది అందుబాటులో లేదు. బీపీతో బాధపడే గర్భిణిలకు ఇచ్చే మైథాల్ డోపాటాబ్లెట్స్తో పాటు క్లోఫిడోగ్రెల్ 75 ఎంజీ మాత్రం కొరతా తీవ్రంగా ఉంది. ఇక్కడికొస్తే ‘కిర్రాకే’.. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ఓపీకి రోజూ 200-250 మంది రోగులు వస్తుంటారు. మానసిక సమస్యల నుంచి బయట పడేందుకు వస్తే.. తీరా ఇక్కడి పరిస్థితి వ్యాధి తీవ్రతను మరింత పెంచేలా ఉంది. మానసిక రుగ్మతతో బాధపడే వారికి ఇచ్చే సోడియం వాల్పొరేట్ 200ఎంజీ, సోడియం వలిజియేట్ 500 ఎంజీ, రెస్పిరిడోన్ 2,4 ఎంజీ టాబ్లెట్స్, ఫ్లూఫినైజిన్ 400 ఎంజీ ఇంజక్షన్లు లేవు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లోనూ వీటి లభ్యత లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారు. గాంధీలోనూ అంతంత‘మాత్ర’మే! గాంధీ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఉచిత వైద్యం కోసం వచ్చిన నిరుపేద రోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. వివిధ రోగాలను నయం చేసేందుకు ఈ ఆస్పత్రిలో 67 రకాల ఇంజక్షన్లు, 50 రకాల టాబ్లెట్లు, 10 రకాల ఆయింట్మెంట్లు, 11 రకాల ఐవీప్లూయిడ్స్, 7 రకాల సిరప్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే, వీటిలో చాలా వరకు మందులు అందుబాటులో లేవు. ఫిమైటోఇన్ సోడియం, కాల్షియం గ్లూకోనేట్, అట్రాక్యురియం, సిల్వర్ సల్ఫా వంటి ఇంజక్షన్లు, సిఫాలక్సిన్, మెట్రోనిడాజోలీ, ఫెర్రాయిస్ సల్ఫేట్, మల్టీవిటమిన్ వంటి టాబ్లెట్లు, ఏంప్లిసిలిన్, సోల్బుటామోల్ వంటి సిరప్లు అందుబాటులో లేవు. కంటి చుక్కలూ కరువే.. సరోజినిదేవి కంటి ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగానికి రోజూ 500-800 మంది రోగులు వస్తారు. రోజూ సగటున 30-40 శస్త్రచికిత్సలు జరుగుతాయి. మూడు రోజులుగా ఇక్కడ పోస్ట్ ఆపరేషన్ పేషంట్లుకు కనీసం యాంటీ ఐ డ్రాప్స్‌ను కూడా ఇవ్వట్లేదు. ఏపీహెచ్‌ఎంఐడీసీ నుంచి సరఫరా లేకపోతే..ఆస్పత్రి అభివృద్ధి కమిటి నిధులతో మందుల్ని కొనాలి. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ఇదే విషయమై తాజాగా ఇద్దరు సీనియర్ వైద్యుల మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. హోమాట్రోఫిన్, టోబ్రామైసిన్, టిమోలోల్, ట్రైపాన్బ్లూ, హైలెస్ ఇంజక్షన్లను రోగులే బయటి నుంచి సమకూర్చ్ఙుకొంటున్నారు. మందుల్లేవన్నారు.. మాదాపూర్ లో ఉండే మేం దినసరి కూలీలం. మా అమ్మ రత ్తమ్మ (40) రెండ్రోజుల క్రితం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. వెంటనే ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చాం. ఆసుపత్రిలో మందుల్లేవని చెప్పి వైద్యులు బయట నుంచి తెచ్చుకొమ్మన్నారు. చేసేది లేక రూ.150 విలువ చేసే మందులను ఆసుపత్రి ఆవరణలో ఉన్న మందుల దుకాణంలో కొనాల్సి వచ్చింది. - సుశీల, మాదాపూర్ ఇదేం పరిస్థితి? మా అమ్మ రెహనా బేగమ్‌కు చేతుల నొప్పితో ఉస్మానియా ఆసుపత్రిలో చేరింది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో అవసరమైన మందులు లేవని చెప్పి వైద్యులు బయట నుంచి తెచ్చుకోవాలన్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోని మెడికల్ షాపులో కొనుగోలు చేశాం. పేదల దవాఖానాలో కనీస స్థాయిలోనూ మందులు లేకపోవడం దారుణం. - హైదర్, నూర్‌ఖాన్‌బజార్ జేబు ఖాళీ అయ్యింది ఉచితంగా వైద్యసేవలు అందిస్తారని గాంధీ ఆస్పత్రికి వస్తే, మందుల కొనుగోలు రూపంలో జేబుకు చిల్లుపడింది. మా బావ దుర్గయ్య అస్వస్థతకు గురైతే వైద్యుల సూచన మేరకు వారం క్రితం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాం. కొన్ని రకాల మందులు లేవని బయట తెచ్చుకోవాలని ఇక్కడి వైద్యులు చెబుతున్నారని, ఇప్పటికే వందలాది రూపాయలు మందుల కోసం ఖర్చుచేసామని సిద్దయ్య బావురుమన్నాడు. - సిద్ధయ్య, పాపన్నపేట, మెదక్ జిల్లా -
విషాదం
=గోడకూలి ముగ్గురి దుర్మరణం. =మరో ఇద్దరికి తీవ్ర గాయాలు =విజయనగర్ కాలనీలో ఘటన మెహిదీపట్నం/విజయనగర్ కాలనీ, న్యూస్‌లైన్: కుండపోత ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. భారీ వర్షం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని బలిగొంది. గోడ కూలి ఇంటిపై పడడంతో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విజయనగర్‌కాలనీ కోటమ్మ బస్తీలో ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా భీవరానికి చెందిన గోతూరి పార్వతి (55) కుటుంబం విజయనగర కాలనీ సమీపంలో నివాసముంటోంది. ఆమె పెద్ద కుమారుడు మావుళ్లు (30), ఆయన భార్య లక్ష్మి (26), కుమారులు శ్రీహరి, జనార్ధన్ (5)లతో కలిసి కోటమ్మ బస్తీలో ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రహరీని ఆనుకొని ఉన్న పూరి గుడిసెలో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే నిద్రపోయారు. నాలుగు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రహరీ పక్కనే ఉన్న శిథిలాలు, మట్టిపెళ్లల కారణంగా ఒత్తిడి పెరిగి గోడ వారి ఇంటిపై పడింది. శిథిలాలు మీదపడి పార్వతమ్మ, లక్ష్మి, జనార్ధన్ నిద్రలోనే కన్నుమూశారు. కొన ఊపిరితో ఉన్న మావూళ్లు, శ్రీహరి ఆర్తనాదాలు చేయడంతో చుట్టుపక్కల వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సమాచారమందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో మావుళ్లు, శ్రీహరిని శిథిలాల నుంచి వెలికి తీసి ఉస్మానియాకు తరలించారు. రెండు గంటల పాటు శ్రమించి పార్వతమ్మ, లక్ష్మి, జనార్ధన్ మృతదేహాలను వెలికితీశారు. గంట ఆలస్యమైతే ప్రాణాలు దక్కేవి.. ఓ గంట ఆలస్యంగా ప్రమాదం జరిగితే బాధితులంతా ప్రాణాలతో బయటపడే వారని స్థానికులు పేర్కొంటున్నారు. మావూ ళ్లు కుటుంబ సభ్యులు రోజూ ఉదయం ఏడు కల్లా వంట చేసుకొని కూలి పనికి బయల్దేరే వారు. అయితే, ఏకదాటిగా వర్షం కురుస్తుండడంతో వారు నిద్ర లేవడంలో జాప్యం జరిగింది. గంట ఆలస్యంగా ప్రమాదం జరిగితే వారంతా ప్రాణాలతో బయటపడే వారని చుట్టుపక్కల వారు కన్నీరుమున్నీరయ్యారు. తెల్లవారక ముందే తమ వారి బతుకులు తెల్లవారిపోవడంతో పార్వతమ్మ చిన్న కొడుకు ఆదినారాయణ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఫిర్యాదు మేరకు హుమాయున్‌నగర్ ఠాణాలో కేసు నమోదైంది. తమ వారి మృతికి బీఈడీ కళాశాల వారే కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నేతల పరామర్శ.. ప్రమాద వార్త తెలిసి రాజకీయ నేతలు, అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, టీడీపీ నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు మతీన్ ముజదాది, పార్టీ మైనార్టీ విభాగం కన్వీనర్ రెహ్మాన్, నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మేయర్ మాజిద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్థానికుల ఆందోళన బాధితులకు తక్షణమే సహాయం అందించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను ఓ అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లి, గేట్‌కు తాళం వేశారు. కలెక్టర్ వచ్చి ఎక్స్‌గ్రేషియా విషయమై స్పష్టమైన హామీ ఇస్తేనే మృతదేహాలను పోస్టుమార్టంకు పంపిస్తామని భీష్మించా రు. అలాగే, క్షతగాత్రులకు ఉస్మానియాలో సరైన వైద్యం అందడం లేదని, వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా అక్కడకు చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. అయితే, ఉత్తుత్తి హామీలు కాకుండా స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టడంతో.. మృతులకు ఒక్కొక్కరికీ వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, క్షతగాత్రులను ఉస్మానియా నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలంటూ అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు ఆందోళన విరమించడంతో మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం రాత్రి 7 గంటల సమయంలో స్థానిక దేవునికుంట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అక్రమ డంపింగే కారణం.. మూడేకరాల విస్తీర్ణంలో ఎత్తై ప్రదేశంలో ఉన్న బీఈడీ కళాశాల ప్రహరీ చుట్టూ దట్టమైన చెట్లపొదలు మొలిచాయి. ఇక్కడ సెక్యూరిటీ లేకపోవడం తో కొందరు గుట్టుచప్పుడు కాకుండా మట్టి, శిథిలాలను తీసుకొచ్చి ప్రహరీ పక్కన డంపింగ్ చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మట్టి కుంగి ప్రహరీ గోడపై ఒత్తిడి పెరిగింది. దీంతో అది కూలి కిందిభాగంలో ఉన్న ఇంటిపై పడింది. అయి తే, కళాశాలకు సెక్యూరిటీ గార్డును కొందరు భయపెట్టి అతడ్ని పంపించేశారని కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. రాత్రి సమయంలో డంపింగ్ చేస్తుండడంతో నియంత్రించ లేకపోయమన్నారు. విషాదకరం పొట్ట చేతపట్టుకొని జీవనోపాధి కోసం వచ్చి ఇలా మృత్యువాత పడ టం విషాదకరం. రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఇక్కడి పేదలకు నివాసయోగ్యంగా ఉండే పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. - మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. - బండారు దత్తాత్రేయ, బీజేపీ సీనియర్ నేత సంఘటనలు జరిగినప్పుడే హడావుడి ప్రమాదాలు జరిగినప్పుడే ప్రభుత్వం అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ యథాతథమే. దీనివల్ల అమాయకులు మృత్యువాత పడుతున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. - తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీడీపీ నగర అధ్యక్షుడు -
ఉస్మానియాలో జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో జీహెచ్ఎంసీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. అలాగే విద్యార్థినుల డెంగీ మరణాల నేపథ్యంలో నర్సింగ్ హాస్టల్ వసతి గృహంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలోని నర్సింగ్ హాస్టల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు డెంగీ బారినపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నర్సింగ్ స్కూల్ లో రెండో ఏడాది చదువుతున్న నిరీషా డెంగీతో నిన్న మధ్యాహ్నం మృతి చెందింది. కాగా మెదక్ జిల్లాకు చెందిన నర్సింగ్ విద్యార్థిని మౌనిక డెంగీతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. నర్సింగ్ స్కూ ల్ ప్రిన్సిపాల్,ఉస్మానియా వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు చనిపోయారని ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. -
నర్సింగ్ విద్యార్థినిని కాటేసిన డెంగీ
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌పై ‘బెంజీన్’ భూతం కోరలు చాస్తోంది. వాతావరణంలో ఈ మూలకం మోతాదు శ్రుతి మించుతోంది. ‘సిటీ’జనుల్లో క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలడానికి కారణమవుతోంది. క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడని ఈ మూలకం వార్షిక మోతాదు గ్రేటర్లో ఇపుడు 8.4 మైక్రోగ్రాములకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మహానగరంలో వాహనాల సంఖ్య 38 లక్షలకు చేరుకోవడం.. ఇందులో పదేళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు సుమారు 10 లక్షల మేర ఉండడంతో నగరం పొగచూరుతోంది. మరోవైపు కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, పెట్రోలు, డీజీలు వంటి పెట్రో ఉత్పత్తులను విచక్షణారహితంగా వినియోగిస్తుండటం వెరసి బెంజీన్ భూతం జడలు విప్పుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవధులు దాటితే అనర్థమే తీయటి వాసన గల బెంజీన్ మూలకం మోతాదు అవధులు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావమూ అధికమే. ఈ మూలకం విచ్ఛిన్నం అయ్యేందుకు 10-30 ఏళ్లు పడుతుంది. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుందన్నమాట. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకు తరలి వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలుతాయని పీసీబీ శాస్త్రవేత్త వీరన్న ‘సాక్షి’కి తెలిపారు. వాహన కాలుష్యంతోనే ముప్పు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్నిరకాల వాహనాలు (ద్విచక్రవాహనాలు, కార్లు, జీపులు, బస్సులు, ఆటోలు) కలిపి 38 లక్షలున్నాయి. ఇందులో పదేళ్లకు పైబడిన వాహనాలు పదిలక్షల మేర ఉన్నాయి. ఈ వాహనాల సామర్థ్యం దెబ్బతినడంతో వీటి నుంచి విపరీతంగా పొగ వెలువడుతుంది. ఫలితంగా నగరంలో కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. అలాగే సిటీలో పెట్రోలుతో నడిచే వాహనాలకు ఏటా 5400 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ వాహనాలకు 12వేల లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. పైగా వాహనాల జాబితాలో ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ప్రతిరోజు 600 కొత్త వాహనాలు రిజిష్టర్ అవుతున్నట్లు రవాణా అధికారుల అంచనా. కానీ మహానగరంలో రహదారులు 8 శాతం మేరకే అందుబాటులో ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ఇంధన వినియోగం అధికమౌతోంది. కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఈ వాయుకాలుష్యంలో బెంజీన్ మోతాదు కూడా ఏటేటా పెరుగుతూ ఉంది. కాగా 2015 నాటికి వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకోనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలతో పోల్చుకుంటే ప్రస్తుతానికి నగరంలో వాహనాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వాహన సాంద్రత మాత్రం ఎక్కువగానే ఉంది. పరిశ్రమలు సైతం.. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమిసంహారకాలు, రబ్బరు, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజీన్ మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కళ్లుగప్పి పారిశ్రామికవర్గాలు విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజీన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ ప్రబలడం తథ్యం బెంజీన్ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, మూత్రకోశ క్యాన్సర్లు ప్రబలే ప్రమాదం ఉంది. నగరంలో ఇటీవల ఈ క్యాన్సర్ల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మాస్క్‌లు ధరించినా అవి గాలిని పూర్తిగా ఫిల్టర్ చేయలేవు. కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చేయాలి. కల్తీ ఇంధనాల వినియోగం తగ్గించాలి. వాహనాల్లో యూరో-4 ప్రమాణాలను తప్పనిసరి చేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. - డాక్టర్ మోహనవంశీ, క్యాన్సర్ వైద్యనిపుణుడు, ఒమేగా ఆసుపత్రి -
పోలీసులపై ఓయూ విద్యార్థుల రాళ్లదాడి
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతి లేకున్నా పోలీసులను ఏమాత్రం లెక్కచేయని విద్యార్థులు శనివారం ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కాలేజీ నుంచి నిజాం కాలేజీకు బయల్దేరారు. అయితే వారిని పోలీసులు ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లదాడికి దిగారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు. ఎన్సీసీ గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రోడ్డుపైనే విద్యార్థులు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ హాస్టల్ రణరంగంగా మారింది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ కోసం వస్తున్న ఏపీఎన్జీవో ఉద్యోగులపై నిజాం కాలేజ్ విద్యార్థులు....నాన్‌బోర్డర్స్ రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో పలువురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రాణభయంతో వాళ్లు పరుగులు తీశారు. రాళ్ల దాడి చేసిన నిజాం కాలేజ్ స్టూడెంట్స్‌ను, నాన్‌బోర్డర్స్‌ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఫతేమైదాన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండువర్గాల మధ్య దాడి జరగటంతో పలువురు గాయపడ్డారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
ఫిర్యాదు తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు.. అంతేకాకుండా స్టేషన్నుంచి బయటకు పొమ్మని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన బాధితురాలు పోలీసుస్టేషన్ సమీపంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే మామిడి ఆశ (28) శ్రీనివాస్‌ను 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో కొన్నేళ్ల పాటు వేరుగా కాపుం సాగించారు. అయితే, దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఈ క్రమంలో ఆశ తన మేనమామ శ్రీనివాస్‌ను రెండో పెళ్లి చేసుకొని కూకట్‌పల్లిలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. అయి తే, భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం కావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉం టున్నారు. దీంతో ఆశ గౌరీశంకర్‌కాలనీలో ఉంటున్న మొదటి భర్త వద్దకు వచ్చారు. కాగా, ఆయన అప్పటికే ఓ హోటల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న హేమలతను పెళ్లి చేసుకున్నాడు. అయితే, తనను కూడా ఇంట్లో ఉండనివ్వాలని ఆమె వారితో గొడవ పడింది. దీనిపై కొంతకాలంగా ముగ్గురి మధ్య ఘర్షణ జరుగుతోంది. బుధవారం ఉదయం హోటల్‌కు వెళ్లిన ఆశ.. తన భర్తను వదిలిపెట్టాలంటూ హే మలతను హెచ్చరించింది. ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగి, కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో హేమలతకు తీవ్ర గాయాలు కాగా, భర్త ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, హేమలత, శ్రీనివాస్‌లపై ఫిర్యాదు చేసేందు కు మధ్యాహ్నం సమయంలో ఆశ బంజారాహిల్స్ ఠాణాకు చేరుకున్నారు. ఎస్సై ఆమె ఫిర్యాదు తీసుకోకపోగా, బయటకు వెళ్లమంటూ గదమాయించారు. ఇప్పటికే మూడుసార్లు వచ్చినా ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆమె నిలదీయగా, పోలీసులు ఆమెను బయటకు గెంటేశారు. మనస్తాపానికి గురైన ఆమె ఠాణా సమీపంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పం టించుకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను 108లో ఉస్మానియాకు తరలించారు. పోలీ సుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు బాధితురాలు మీడియాకు తెలిపింది. ప్రస్తుతం ఆమె పరి స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, ముందు ఆసుపత్రికి తరలించి తర్వాత ఫిర్యాదు తీసుకుంటామని బాధితురాలు ఆశకు చెప్పామని, అంతలోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు.