'నిమ్స్ను ఎయిమ్స్ స్థాయికి తీసుకు వెళతాం'
హైదరాబాద్ : నిమ్స్ను ఎయిమ్స్ స్థాయికి తీసుకు వెళతామని ఆరోగ్య శాఖమంత్రి రాజయ్య అన్నారు. నిమ్స్లో అవినీతిని అరికట్టేందుకు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కంప్యూటరైజేషన్ చేస్తామన్నారు. ఇందుకోసం పీ డాక్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నట్లు రాజయ్య గురువారమిక్కడ తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న పాత సామాగ్రిని తీసివేసి కొత్త సామాగ్రిని అందచేస్తామని పేర్కొన్నారు.
వరంగల్లో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మెడికల్ కళాశాలలో కోల్పోయిన సీట్ల కోసం ఎంసీఐని సంప్రదించామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో వంద సీట్లు వచ్చే అవకాశం ఉందని రాజయ్య చెప్పారు.