వర్సిటీలో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో భోజనశాలలను తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఓయూ అధికారులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం లా కాలేజీ వద్ద రోడ్డుపై వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పట్ల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఓయూ స్టూడెంట్ వెల్‌ఫేర్ డీన్ ప్రొ. లక్ష్మీనారాయణ వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. త్వరలో ఈ విషయంపై అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఓయూలో మెస్‌లు తెరిపించాలి
Published Wed, Sep 9 2015 1:47 AM | Last Updated on Tue, Jul 31 2018 4:52 PM
Advertisement
Advertisement