మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో భూతగాదాలు పడగ విప్పాయి. షాద్ నగర్లో ఓ వ్యక్తిపై కబ్జాదారులు పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థల వివాదం కారణంగానే ప్రత్యర్థులు ఈ దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
షాద్ నగర్లో వ్యక్తిపై హత్యాయత్నం
Published Mon, Nov 3 2014 8:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM
Advertisement
Advertisement