ఉస్మానియా ఆస్పత్రిలో జీహెచ్ఎంసీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో జీహెచ్ఎంసీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. అలాగే విద్యార్థినుల డెంగీ మరణాల నేపథ్యంలో నర్సింగ్ హాస్టల్ వసతి గృహంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలోని నర్సింగ్ హాస్టల్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు డెంగీ బారినపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నర్సింగ్ స్కూల్ లో రెండో ఏడాది చదువుతున్న నిరీషా డెంగీతో నిన్న మధ్యాహ్నం మృతి చెందింది.
కాగా మెదక్ జిల్లాకు చెందిన నర్సింగ్ విద్యార్థిని మౌనిక డెంగీతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. నర్సింగ్ స్కూ ల్ ప్రిన్సిపాల్,ఉస్మానియా వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు చనిపోయారని ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.