బంజారాహిల్స్, న్యూస్‌లైన్: భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు.. అంతేకాకుండా స్టేషన్‌నుంచి బయటకు పొమ్మని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన బాధితురాలు పోలీసుస్టేషన్ సమీపంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే మామిడి ఆశ (28) శ్రీనివాస్‌ను 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో కొన్నేళ్ల పాటు వేరుగా కాపుం సాగించారు.
అయితే, దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఈ క్రమంలో ఆశ తన మేనమామ శ్రీనివాస్‌ను రెండో పెళ్లి చేసుకొని కూకట్‌పల్లిలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. అయి తే, భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం కావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉం టున్నారు. దీంతో ఆశ గౌరీశంకర్‌కాలనీలో ఉంటున్న మొదటి భర్త వద్దకు వచ్చారు. కాగా, ఆయన అప్పటికే ఓ హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న హేమలతను పెళ్లి చేసుకున్నాడు. అయితే, తనను కూడా ఇంట్లో ఉండనివ్వాలని ఆమె వారితో గొడవ పడింది. దీనిపై కొంతకాలంగా ముగ్గురి మధ్య ఘర్షణ జరుగుతోంది.
బుధవారం ఉదయం హోటల్‌కు వెళ్లిన ఆశ.. తన భర్తను వదిలిపెట్టాలంటూ హే మలతను హెచ్చరించింది. ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగి, కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో హేమలతకు తీవ్ర గాయాలు కాగా, భర్త ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, హేమలత, శ్రీనివాస్‌లపై ఫిర్యాదు చేసేందు కు మధ్యాహ్నం సమయంలో ఆశ బంజారాహిల్స్ ఠాణాకు చేరుకున్నారు. ఎస్సై ఆమె ఫిర్యాదు తీసుకోకపోగా, బయటకు వెళ్లమంటూ గదమాయించారు. ఇప్పటికే మూడుసార్లు వచ్చినా ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆమె నిలదీయగా, పోలీసులు ఆమెను బయటకు గెంటేశారు. మనస్తాపానికి గురైన ఆమె ఠాణా సమీపంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పం టించుకొంది.
తీవ్రంగా గాయపడిన ఆమెను 108లో ఉస్మానియాకు తరలించారు. పోలీ సుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు బాధితురాలు మీడియాకు తెలిపింది. ప్రస్తుతం ఆమె పరి స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, ముందు ఆసుపత్రికి తరలించి తర్వాత ఫిర్యాదు తీసుకుంటామని బాధితురాలు ఆశకు చెప్పామని, అంతలోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు.
ఫిర్యాదు తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం
Published Thu, Sep 5 2013 2:39 AM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM
Advertisement
Advertisement