
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కార్ఫ్‌బాల్ (మిక్స్‌డ్) చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) గ్రౌండ్స్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో ఓయూ 3–8తో ఎండీయూ రోహ్‌తక్ యూనివర్సిటీ చేతిలో పరాజయం పాలైంది. విజేత జట్టులో అంజలి, సుమన్ ఆకట్టుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో జమ్మూ యూనివర్సిటీ 4–3తో ఢిల్లీ యూనివర్సిటీపై గెలుపొందింది. జమ్ము తరఫున రుషాలి మెరుగైన ప్రతిభ కనబరిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ కార్ఫ్‌బాల్ సంఘం అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
, ,
Comments
Please login to add a commentAdd a comment