సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కార్ఫ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఉస్మానియా జట్టు శుభారంభం చేసింది. ఓయూ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఉస్మానియా 15–2తో వినాయక్ మిషన్ యూనివర్సిటీని చిత్తుగా ఓడించింది. రెండో మ్యాచ్‌లో ఉస్మానియా 7–5తో హరియాణా ఐజీ యూనివర్సిటీపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో ఢిల్లీ యూనివర్సిటీ 10–4తో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీపై, జమ్మూ యూనివర్సిటీ 9–8తో కాలికట్ యూనివర్సిటీపై, ఆర్‌టీఎం యూనివర్సిటీ 14–1తో సింఘానియా యూనివర్సిటీపై, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 12–0తో బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీపై, కాలికట్ యూనివర్సిటీ 7–3తో సీఆర్‌ఎస్‌యూపై విజయం సాధించాయి.
అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత కార్ఫ్‌బాల్ సమాఖ్య కార్యదర్శి కృషణ్ కుమార్ వర్మ, కోశాధికారి అశోక్ కుమార్, ఓయూసీసీ స్పోర్ట్స్ చైర్మన్ ఎల్‌బీ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment