osmania team
-
ఉస్మానియా యూనివర్సిటీ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కార్ఫ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఉస్మానియా జట్టు శుభారంభం చేసింది. ఓయూ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఉస్మానియా 15–2తో వినాయక్ మిషన్ యూనివర్సిటీని చిత్తుగా ఓడించింది. రెండో మ్యాచ్‌లో ఉస్మానియా 7–5తో హరియాణా ఐజీ యూనివర్సిటీపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో ఢిల్లీ యూనివర్సిటీ 10–4తో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీపై, జమ్మూ యూనివర్సిటీ 9–8తో కాలికట్ యూనివర్సిటీపై, ఆర్టీఎం యూనివర్సిటీ 14–1తో సింఘానియా యూనివర్సిటీపై, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 12–0తో బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీపై, కాలికట్ యూనివర్సిటీ 7–3తో సీఆర్ఎస్యూపై విజయం సాధించాయి. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత కార్ఫ్‌బాల్ సమాఖ్య కార్యదర్శి కృషణ్ కుమార్ వర్మ, కోశాధికారి అశోక్ కుమార్, ఓయూసీసీ స్పోర్ట్స్ చైర్మన్ ఎల్బీ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఓయూ మహిళల జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు సత్తా చాటింది. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మహిళల రెగూ, డబుల్స్ ఈవెంట్లలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన టైటిల్‌పోరులో ఉస్మానియా యూనివర్సిటీ 21–17, 21–13తో పంజాబ్ యూనివర్సిటీపై విజయం సాధించింది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో మణిపూర్ యూనివర్సిటీ 21–14, 21–4తో ఎంజేపీ రోహిల్‌ఖండ్ యూనివర్సిటీపై గెలిచింది. మరోవైపు మహిళల డబుల్స్ ఫైనల్లో ఉస్మానియా జట్టు 17–21, 21–14, 21–18తో మణిపూర్ యూనివర్సిటీపై గెలుపొందింది. పాటియాలా పంజాబీ యూనివర్సిటీ 21–17, 21–17తో కుమాయున్ యూనివర్సిటీపై నెగ్గి కాంస్యాన్ని గెలుచుకుంది. పురుషుల విభాగంలో ఉస్మానియా జట్టు త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. కాంస్య పతక పోరులో ఓయూ 22–20, 17–21, 3–21తో ఎంజేపీ రోహిల్‌ఖండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఈ విభాగంలో అన్నా యూనివర్సిటీ విజేతగా నిలవగా, పాటియాలా పంజాబీ యూనివర్సిటీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల రెగూ ఈవెంట్ తుదిపోరులో పంజాబీ యూనివర్సిటీ 21–12, 21–13తో అన్నా యూనివర్సిటీపై గెలుపొందింది. కాలికట్ యూనివర్సిటీ 21–13, 21–6తో ఎంజేపీ రోహిల్‌ఖండ్ యూనివర్సిటీపై గెలిచి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
విజేత ఉస్మానియా యూనివర్సిటీ
జింఖానా, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ మహిళల క్రికెట్ టోర్నమెంట్లో ఉస్మానియా జట్టు విజేత గా నిలిచింది. ఈ విజయంతో ఈ నెల 24వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ జోనల్స్‌కు అర్హత సాధించింది. వరంగల్‌లోని కాకతీయ యూనివ ర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో ఉస్మానియా జట్టు 110 పరుగుల తేడాతో బరకతుల్లా యూనివర్సిటీపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చే సిన ఉస్మానియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. నిఖిత (91) అర్ధ సెంచరీతో అజేయంగా నిలువగా... ఏక్తా సక్సేనా (45), పల్లవి (21) మెరుగ్గా ఆడారు. బరకతుల్లా బౌలర్లు దివాంగి 3, వర్ష 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన బరకతుల్లా 33 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. ఉస్మానియా బౌలర్లు ప్రణీష, కావ్య చెరో 3 వికెట్లు తీసుకోగా... మౌనిక 2 వికెట్లు చేజిక్కించుకుంది.