విజేత ఉస్మానియా యూనివర్సిటీ | osmania university won central zone cricket tournment | Sakshi
Sakshi News home page

విజేత ఉస్మానియా యూనివర్సిటీ

Published Mon, Jan 13 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

osmania university won central zone cricket tournment

 జింఖానా, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో ఉస్మానియా జట్టు విజేత గా నిలిచింది. ఈ విజయంతో ఈ నెల  24వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ జోనల్స్‌కు అర్హత సాధించింది. వరంగల్‌లోని కాకతీయ యూనివ ర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో ఉస్మానియా జట్టు 110 పరుగుల తేడాతో బరకతుల్లా యూనివర్సిటీపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చే సిన ఉస్మానియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
 
 నిఖిత (91) అర్ధ సెంచరీతో అజేయంగా నిలువగా... ఏక్తా సక్సేనా (45), పల్లవి (21) మెరుగ్గా ఆడారు. బరకతుల్లా బౌలర్లు దివాంగి 3, వర్ష 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన బరకతుల్లా 33 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. ఉస్మానియా బౌలర్లు ప్రణీష, కావ్య చెరో 3 వికెట్లు తీసుకోగా... మౌనిక 2 వికెట్లు చేజిక్కించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement