kakathiya university
-
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతో సీపీ రంగనాథ్ సమావేశం
-
National Service Scheme 2021: గ్రామాల దత్తత: సేవాధీరలు
ఈ నెల 24వ తేదీ, జాతీయ సేవాపథకం ఆవిర్భావ దినోత్సవం. మన దేశరాజధాని నగరంలోని రాష్ట్రపతి భవనం 2020–21జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి వేదికైంది. విశిష్ట సేవలందించిన నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కార్యకర్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఆనంద తరుణం. ఆ సంతోషంలో మన తెలుగు మహిళలు ఇద్దరున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం అమ్మాయి సిరిశ్రీ దేవనపల్లి. మరొకరు తెలంగాణ రాష్ట్రం, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి. దేవనపల్లి సిరిశ్రీ సొంతూరు సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) కదిరి. నాన్న పద్మనాభ రెడ్డి ఎల్ఐసీలో హైయ్యర్‌గ్రేడ్ అసిస్టెంట్‌గా రిటైరయ్యారు. అమ్మ అమరావతి గృహిణి. తమ్ముడు నిఖిల్ బీటెక్ ఫైనల్ ఇయర్. ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేస్తున్న సిరి శ్రీ విద్యార్థి దశ నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేది. తాను పొల్గొన్న ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ‘‘ఎస్ఆర్ఐటీ కళాశాలలో నిత్యం జాతీయ సేవా పథకంపై ప్రత్యేక క్యాంపులు నిర్వహించాం. రక్తదానం, మొక్కలు నాటడం, పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమాలు చాలా నిర్వహించాం. రోటరీపురం వద్ద రెండు గ్రామాలు దత్తత తీసుకున్నాం. గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరించాం. ప్రతిరోజూ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి పంపాం. డేటా సేకరించి నిరక్షరాస్యులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) గురించి వివరించి వారికి అవగాహన కల్పించాం. కాలేజీలో శారో హుండీ మా ఎస్ఆర్ఐటీ కళాశాలలో ‘శారో (సేవ్ ఏ రూపీ ఆర్గనైజేషన్)’ పేరుతో ప్రతి బ్లాక్‌లోనూ హుండీ ఏర్పాటు చేశారు. విద్యార్థులం స్వచ్ఛందంగా ఇందులోకి నగదు జమ చేసేవాళ్లం. ఆరు నెలలకోసారి ఈ మొత్తంతో అనాథ, వృద్ధాశ్రమాల్లో కార్యక్రమాలను నిర్వహించేవాళ్లం. ఈ విధానం నచ్చడంతో జాతీయ సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితమయ్యాను. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చిన్నపుల్లయ్య సార్ మాకు ఎంతో తోడ్పాటు అందించారు. జాతీయ సేవా పథకంలో పని చేయడం వల్ల సేవాభావం మాత్రమే కాదు నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌గా 2019లో గుజరాత్లో జరిగిన ప్రీ–రిపబ్లిక్ పరేడ్ క్యాంప్‌కు ఎంపికయ్యాను. 2020 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు గౌరవనీయులు భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడాన్ని జీవితకాల సాఫల్యంగా భావిస్తున్నాను. ఇంతకు మించి గొప్ప ఘనత నా జీవితంలో ఉండదేమో! మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా సత్కారం అందుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సిరి శ్రీ దేవనపల్లి. – బడ శ్రీనివాస రెడ్డి, సాక్షి, అనంతపురం లీడర్షిప్ మాత్రమే ‘‘మాది హన్మకొండ. ఇంటర్ హన్మకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాల, డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. కాకతీయ యూనివర్సిటీ, కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్ చేసి, 2007లో అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించాను. 2008లో అప్పటి ప్రిన్సిపాల్ నన్ను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా నియమించారు. నాకు విద్యార్థి దశలో ఎన్ఎస్ఎస్తో పరిచయం లేదు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత నా టీమ్‌లోని వాలంటీర్ల సామాజిక సేవాపథం, వారు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే తీరు నన్ను స్ఫూర్తిమంతం చేశాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కుమ్మరిగూడెంలో ప్రత్యేక శిబిరం పెట్టి మొక్కలు నాటాం. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్య కల్పన కు కృషి చేశాం. అలా 2012వరకు నాలుగేళ్లపాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా కొనసాగాను. కో ఆర్డినేటర్‌గా... కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా 2017లో అప్పటి వీసీ ఆచార్య ఆర్ సాయన్న నియమించారు. యూనివర్సిటీ చరిత్రలో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్‌గా ఒక మహిళకు అవకాశం రావడం అదే తొలిసారి. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్ఎస్ఎస్ యూనిట్లు 36 వేలమంది వాలంటీర్లతో పనిచేశాను. హరితహారంలో మొక్కలు నాటాం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాం. రక్తదానం శిబిరాల్లో 25 వేలమంది వాలంటీర్లు, లక్షా 18వేల యూనిట్ల రక్తదానం చేశారు. 975 ఆరోగ్య శిబిరాలు నిర్వహించాం. గుప్పెడు బియ్యం (కప్ ఆఫ్ రైస్) పేరున ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించి, నిరుపేదలకు, అనాథలకు పంపిణీ, జలశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా నీటì సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం, శ్రమదానం చేసి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంకుడు గుంతలు తవ్వడంతోపాటు క్యాంపస్‌లో ఉన్న చెక్ డ్యామ్‌లకు మరమ్మతులు కూడా చేశాం. మేడారం జాతరలో భక్తులకు సేవలందించడం, ఎన్నికల సమయాల్లో పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్లకు సేవలందించడంలోనూ మా కార్యకర్తలు ముందుండేవాళ్లు. కోవిడ్ సమయంలో శానిటైజర్, మాస్కుల పంపిణీ చేశాం. ఇన్ని సేవల నేపథ్యంలో అందిన ఈ గౌరవం మధురానుభూతిగా మిగులుతుంది’’ అన్నారు సుంకరి జ్యోతి. – డి. రమేశ్, సాక్షి, హన్మకొండ -
పాస్వర్డ్ పరేషాన్!
‘కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి డిగ్రీలో చేరేందుకు తల్లిదండ్రులతో కలిసి ఒక ప్రైవేట్ కళాశాలకు మొదటి దశలో సర్టిఫికెట్లు అప్పగించారు. సదరు కళాశాలకు చెందిన వారు తమ కళాశాలకు సంబంధించిన ఫోన్ నంబర్, దానికి వచ్చే పాస్వర్డ్ ఆధారంగా మొదటి దశలో నమోదు చేసి కేవలం తమ కళాశాలలోనే ఆప్షన్ ఇవ్వగా, అందులోనే సీటు వచ్చింది. ఇప్పుడు విద్యార్థి స్నేహితులకు వేరే కళాశాలల్లో సీటు రాగా మారాలని ఆలోచన ఉంది. మారుదామంటే కళాశాల ఫోన్ నంబర్ ఇచ్చి ప్రవేశాలు నమోదు చేశారు. ఇప్పుడు రెండో దశలో మారాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. ఈ విషయమై కళాశాలల వారిని అడుగగా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు’ ఇది శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఇలాగే కళాశాల నంబర్లు ఇచ్చి విద్యుర్థులు ఎటూ వెళ్లకుండా చేస్తున్నారు. – శాతవాహనయూనివర్సిటీ: డిగ్రీ మొదటి దశలో పలు ప్రైవేట్ కళాశాలలు ఒడిగట్టిన అక్రమాలకు విద్యార్థులు బలవుతున్నారు. వివిధ అఫర్ల పేరుతో నమ్మబలికి మొదటి దశలో పలు కళాశాలలకు సంబంధించిన వ్యక్తులవే ఫోన్ నంబర్లు ఇచ్చి వాటికి వచ్చిన ఓటీపీలతోనే ప్రవేశాల నమోదు చేశారు. తమ కళాశాలల్లోనే సీట్లు వచ్చేలా అప్షన్లు ఇచ్చారు. ఫలితంగా వారుకోరుకున్నట్టే వారి కళాశాలల్లోనే సీట్లు పొందారు. కానీ మొదటి దశ సీట్ల కేటాయింపు పక్రియ ముగిసి రెండో దశ కౌన్సిలింగ్‌కు నేటి(సోమవారం) వరకు అవకాశముంది. రెండో దశలో కళాశాల మార్చుకుందామనే ఆలోచన ఉన్న విద్యార్థులకు పలు ప్రైవేట్ కళాశాల వారి నంబర్లే ఇవ్వడంతో మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. డిగ్రీ ప్రవేశాల నమోదులో ఫోన్ నంబరే కీలకం కావడంతో కళాశాల మార్చేందుకు ఆప్షన్లు పెట్టుకుందామనే వారికి పలు ప్రైవేట్ కళాశాలలు ఫోన్ నంబర్ ఇవ్వడం లేదు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పలు కళాశాలలు ఇచ్చిన ఆఫర్లకు ఆకర్షితులై వారి పిల్లలకు కూడా తెలియకుండా వారి ప్రవేశాలు ప్రైవేట్ కళాశాలల్లో తీసుకున్నారు. వారికి మారుదామనే ఆలోచన ఉన్నా ప్రవేశాల సమయంలో కళాశాలల నంబర్లు ఇవ్వడం, మారడం ఎందుకనే తల్లిదండ్రుల బలవంతంతో అదే కళాశాలల్లో మగ్గుతున్నారు. బహుమానాలు.. బంఫర్ ఆఫర్లు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం రెండో దశ కొనసాగుతుంది. మొదటి దశ సీట్లు కేటాయించగా నేటితో రెండోదశ నమోదు, వెబ్ఆప్షన్లు, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ముగుస్తుంది. ఇది ఇలా ఉండగా తమ కళాశాలలో సీట్లు నింపుకునేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకరు ప్రవేశానికి మొబైల్ ఫోన్ ఉచితంగా ఇవ్వడం, మరో కళాశాల ఏకంగా ల్యాప్‌టాప్ ఇస్తామని, మరికొన్ని కళాశాలలు రవాణా ఫీజు, పరీక్ష ఫీజుతోపాటు అన్ని ఫీజులు ఉచితమేనని, ఇంకొన్ని కళాశాలలు ఒక అడుగు ముందుకు వేసి అన్ని ఫీజులు ఉచితంతోపాటు తిరిగి విద్యార్థులకు నగదు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని కళాశాలల యాజమాన్యాలు డిగ్రీ ప్రవేశాల పక్రియలో తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీతో దిగజారుడుతనం ప్రదర్శిస్తున్నాయి. ఎలాగో సీట్లు నింపుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొల్లగొడుదామనే ఆలోచనతో ప్రవేశాలు కొనసాగిస్తున్నాయి. దీనికితోడు తమ లెక్చరర్లలో కాన్వాసింగ్ చేపించి అడ్మిషన్‌కు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా తల్లిదండ్రలు మాత్రం విద్యా నాణ్యత ప్రమాణాలు పాటించే కళాశాలల్లోనే విద్యార్థులను చేర్చాలని విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. ప్రైవేట్ కళాశాలల అక్రమాల విషయంపై శాతవాహన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యూ.ఉమేశ్‌కుమార్‌ను సంప్రదించగా ప్రైవేట్ కళాశాలలు ప్రవేశాల విషయంలో ప్రలోభాలు, ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. -
కేయూ క్యాంపస్: ‘సేవ’కు సెలవు..
సాక్షి, కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఏటా నిర్వహించే జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) కార్యక్రమాలు నిధుల లేమితో నిలిచిపోయాయి. ఈ విద్యాసంవత్సరం కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించలేదు. ప్రతి ఏటా కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగానికి సుమారు రూ.ఒక కోటి 60 లక్షల వరకు విడుదలవుతుం టాయి. ఆ నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేయూ పరిధిలో 363 ఎన్ఎస్ఎస్ యూనిట్లు.. నాట్ మీ బట్ యూ(నా కోసం కాదు నీ కోసం) అనే నినాదంతో జాతీయ సేవా పథకం ద్వారా కళాశాల స్థాయిలో విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో వారిలో వ్యక్తిత్వ వికాసం కూడా పెంపొందుతుంది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ ,పీజీ కళాశాలల్లో మొత్తంగా 363 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు 100 మంది చొప్పున యూనివర్సిటీ పరి«ధిలో 36,300 మంది వలంటీర్లు ఉన్నారు. ఆయా కళాశాలల్లో ఎయిడ్స్ డే, పర్యావరణ దినోత్సవం తదితర ముఖ్యమైన రోజుల్లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేగాక క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛ భారత్, హరితహారం కింద మొక్కలను నాటడంలాంటివి కూడా చేస్తుంటారు. ఇలా రోటీన్ కార్యక్రమాల నిర్వహణకుగాను ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్‌కు రూ.22 వేలు విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు తమ కళాశాల పరిధిలో ఎంపిక చేసిన గ్రామంలో ఏడు రోజులపాటు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తుంటారు. నిధుల లేమితో ఈ ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ఈ విద్యాసంవత్సరంలో డిసెంబర్ మొదటి వారం దాటినా ఇంకా నిధులు విడుదల చేయలేదు. నిధుల విడుదల తర్వాతే అడ్వయిజరీ కమిటీ భేటీ.. ఈ విద్యాసంవత్సరంలో కేయూలో ఎన్ఎస్ఎస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఇందులో గత విద్యాసంవత్సరంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను సమీక్షించటంతోపాటు ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించి నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశం నిర్వహించి ఆయా జిల్లాల పరిధిలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. ఇందులోనే రోటీన్ కార్యక్రమాల కోసం రూ.22 వేల చొప్పున ప్రతి ప్రోగ్రాం ఆఫీసర్‌కు చెక్ అందజేస్తారు. నిధులు విడుదల కాకపోవడంతో ఇవేమి జరగడం లేదు. అయితే కళాశాలల్లో నిధులతో అవసరం లేని స్వచ్ఛ భారత్, హరితహారంలాంటి కార్యక్రమాలను మాత్రం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి సమావేశంలో చర్చ.. ఇటీవల హైదరాబాద్‌లో అన్ని యూనివర్సిటీల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు కూడా ఈ ఏడాది నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని, ఇప్పటికే జాప్యమైందని రాష్ట్ర ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు కాగానే విడుదల చేస్తామని సదరు అధికారి సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే ఆ నిధులు ఎప్పుడొస్తాయనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోలేపోతున్నారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని, సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించే ఎన్ఎస్ఎస్కు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వరంగల్ కేయూలో విద్యార్థుల ఆందోళన
సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ కామన్మెస్ విద్యార్థులు గురువారం క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించి, పరిపాలనాభవనం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఇస్తారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మెనూచార్టును సక్రమంగా అమలు చేయటంలేదని విమర్శించారు. మెనూకు సంబంధించిన అవకతకవలపై ఆడిట్ అ«ధికారులతో అందరి సమక్షంలో సమగ్ర విచారణ జరిపించాలని, కామన్‌మెస్‌ను డివైడ్ చేయాలని డిమాండ్ చేశారు. కేయూ వీసీ అనుమతి లేకుండా యూనివర్సిటీలో పోలీసుల జోక్యం సరికాదన్నారు. స్టీమర్ రైస్‌ను తొలగించాలని కోరారు. హాస్టళ్లకు వెళ్లేదారిలో పూర్తిస్థాయిలో విద్యుద్ధీపాలు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా మెస్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వంకాయకూరలో పురుగులు వచ్చాయని రెండురోజుల క్రితం రాత్రివేళ వీసీ లాడ్జ్ వద్దకు వెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వచ్చిన రిజిస్ట్రార్ కె.పురుషోత్తమ్ కామన్‌మెస్‌లోని విద్యార్థుల సమస్యలపై చర్చిద్దామని సర్దిచెప్పారు. గురువారం మళ్లీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై కిందపడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. రిజిస్ట్రార్ సమక్షంలో విద్యార్థులతో చర్చలు.. కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్‌బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో సాయంత్రం కామన్ మెస్, హాస్టళ్ల విద్యార్థులతో రిజిస్ట్రార్ కె.పురుషోత్తమ్ సమక్షంలో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టి.రవీందర్‌రెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఎం.ఇస్తారి, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ జి.వీరన్న, కేయూ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆచార్య వి.రాంచంద్రం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యారులు మాట్లాడుతూ ఒకే మెస్‌లో ఎక్కువమంది కాకుండా ఏ హాస్టల్‌కు అక్కడే మెస్‌ను విడివిడిగా ఏర్పాటు చేయాలని, మెస్‌లలో బయోమెట్రిక్‌ను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రతివిద్యార్థి ఎన్నిరో జులు తింటే అన్ని రోజులకు మాత్రమే బిల్లు వేయాలన్నారు. ఇలా అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. అయితే విడివిడిగా మెస్‌లను వచ్చే విద్యాసంవత్సరంలో ఏర్పాటుకు పరిశీలిస్తామని ఆచార్యులు తెలిపారు. బయోమెట్రిక్ సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని పేర్కొంటూ ఒక మెస్‌లో ప్రయోగాత్మకంగా పెట్టి పరిశీలించాక మిగితా వాటిల్లో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తామని సమాధానం ఇచ్చారు. -
కేయూలో అక్రమాలు..!
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో పలు అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నిబంధనలకు విరుద్ధంగా వీసీ, రిజిస్ట్రార్ల అప్రూవల్ లేకుండా వివిధ పద్దుల కింద ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ విషయం ఇటీవల సంబంధిత యూనివర్సిటీ అధికారులతోపాటు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి వెళ్లింది. దీంతో సదరు ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి ఇటీవలనే యూనివర్సిటీ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దుల కింద ఖర్చుచేసిన వాటిల్లో బిల్లులకు సంబంధించిన లెక్కల వివరాలు, ఓచర్లు, ఇతర డాక్యుమెంట్లు తమకు సమర్పించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ ఇటీవల ప్రస్తుత డైరెక్టర్ ప్రొఫెసర్ మనోహర్‌ను ఆదేశిం చారు. గత ఆర్థిక సంవత్సరంలో కేయూ అడ్మిషన్ల డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ రవీందర్ ఉద్యోగ విరమణ సైతం పొందాడు. ఆయన హయాంలో చేసిన ఖర్చులు, బిల్లుల వివరాలు, వాటిలో లోపాలను నివేదిక రూపంలో ప్రస్తుత డైరెక్టర్ టి.మనోహర్ రిజిస్ట్రార్‌కు నివేదించినట్లు తెలిసింది. ప్రధానంగా కేయూలో రూ.20వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తే తొలుత వీసీ, రిజిస్ట్రార్ల అప్రూవల్ తీసుకోవాల్సిందే. అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో రూ.20వేలకు మించి ఖర్చుచేసినా అప్రూవల్ తీసుకోలేదనేది Ððవెల్లడైంది. స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్, నాన్ టీచింగ్, టీచింగ్ రెమ్యునరేషన్, హైర్‌చార్జెస్ వెహికల్స్, సీహెచ్‌డీ అడ్మిషన్స్ ప్రాసెసింగ్ టూ డీన్స్ కేయూ, కేయూ పీజీసెట్–2017, ఎంఫిల్, పీహెచ్డీ, జనరల్ లేబర్స్, క్యాజువల్ వేజెస్, ఫీజురిఫండ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ, మిస్లీనియస్, సానిటరీ, ప్రింటింగ్, అలవెన్సెస్, డైరెక్టర్ అండ్ జేడీల రెమ్యునరేషన్ కింద వ్యయం చేశారు. ఇందులో ఏమైనా లోపాలున్నాయా అనే కోణంలో విచారించాల్సి ఉంటుంది. కంప్యూటర్లు కొనుగోలు చేసినట్లు బిల్లులు ఉన్నప్పటికీ ఆ కంప్యూటర్లు అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో లేవనే ఆరోపణలున్నాయి. అలాగే స్టాక్ ఎంట్రీ రిజిస్టర్ మేయింటనెన్స్ చేయలేదని, ఎక్కువశాతం బిల్లులు సంతకం లేకుండానే పాసయ్యాయని తెలుస్తోంది. అప్పటి డైరెక్టర్ ఒక్కరే అవకతకవలకు పాల్పడ్డారా లేక అందులో మరో జాయింట్ డైరెక్టర్ ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. అప్పటి రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తేనే అసలు విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశాలున్నాయి. డైరెక్టర్ సంతకం లేకుండా బిల్లులు ఎలా పాస్‌అవుతాయనేది కూడా చర్చగాఉంది. ముగ్గురితో విచారణ కమిటీ.. కాకతీయ యూనివర్సిటీ డైరెక్టరేట్‌లో 2017–18 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అవకతవకల ఆరోపణలపై సమగ్ర విచారణకు కమిటీని నియమిస్తూ శుక్రవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ ఉత్తర్వులు జారీచేశారు. కమిటీలో చైర్మన్‌గా కేయూ సీడీసీ డీన్ కామర్స్‌విభాగం ప్రొఫెసర్ సీహెచ్.రాజేశం, సభ్యులుగా కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ ప్రభావతి, ప్రిన్సిపాల్ కార్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ కోలా శంకర్‌ను నియమించారు. సాధ్యమైనంత త్వరగా నివేదక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నేటి నుంచి అంతర్జాతీయ కాన్ఫరెన్స్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ అసోసియేషన్ సంయుక్తంగా శని, ఆదివారాల్లో నిర్వహించే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు డిస్టెన్స్ ఎడ్యూకేషన్ హయ్యర్ ఎడ్యూకేషన్ ఫోకస్ ఆన్ అండర్ సర్వ్డ్ కమ్యూనిటీస్ అండ్ అన్కవర్డ్ రీజియన్స్’ అనే అంశంపై నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి, సింగపూర్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర చోట్ల నుంచి 108 పరిశోధన పత్రాలను సమర్పించేందుకు ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉన్నత విద్యకు దూరమైన వారికి దూరవిద్య అనేది ఓ వరం. దూరవిద్య ద్వారా వివిధ ఉన్నత విద్యా కోర్సులు అందిస్తున్నాయి. అయితే ఆయా కోర్సులను మారుమూల ప్రాంతాల వారికి కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి మార్పులు తీసుకురావాలనే అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నారు. దూరవిద్య ప్రస్తుతం అందిస్తున్న కోర్సులు, వాటి సిలబస్, ఆన్లైన్ కోర్సులు తదితర అంశాలపై చర్చిస్తారు. ఉదయం 11 గంటలకు కేయూ సెనేట్హాల్లో జరిగే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ వీసీ ఆచార్య కె.నాగేశ్వర్రావు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆచార్య కె.సీతారామారావు, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ అసోసియేషన్ (ఐడియా) అధ్యక్షుడు ఆచార్య కె.మురళీమనోహర్, జనరల్ సెక్రటరీ ఆచార్య రోమేష్వర్మ, దూరవిద్యకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్ ఈకాన్ఫరెన్స్కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా దూరవిద్యా కేంద్రం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్‌రావు వ్యవహరిస్తున్నారు. మొదటి ప్లీనరీ సమావేశంలో ముంబై విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హరిచందన్ భారతదేశంలో దూరవిద్య పాత్రపై, రెండో ప్లీనరీ సమావేశంలో ఇగ్నో ప్రొఫెసర్ ఆర్.సత్యనారాయణ ప్రసంగిస్తారు. ఆచార్య రామ్‌రెడ్డి మెమోరియల్ లెక్చర్‌ను కేయూ మాజీవీసీ ఆచార్య ఎన్.లింగమూర్తి ప్రసంగిస్తారు. ఈనెల 12న ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా దూరవిద్యకు సంబంధించిన వివిధ యూనివర్సిటీల దూరవిద్య డైరెక్టర్లతో సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఆదివారం సాయంత్రం ముగింపు సమావేశంలో మధ్యప్రదేశ్‌లోని బోజ్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీంద్రా ఆర్ కనహార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ పాల్గొంటారు. కాగా అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై శుక్రవారం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్, ఐడియా అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీమనోహర్, ఇతర అధ్యాపకులు సమావేశమై చర్చించారు. సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రాలను రాబోయే రోజుల్లో పుస్తకరూపంలోకి తీసుకొస్తామని, సదస్సులో చర్చించిన అంశాలు, సూచనలను భారత దూరవిద్య మండలికి నివేదిస్తామని దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్ తెలిపారు. -
ఎట్టకేలకు మోక్షం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నూతన భవనం ఎట్టకేలకు పూర్తయింది. రూ 2.63 కోట్ల వ్యయంతో 2016లో అగ్రిమెంట్ అయిన ఈ భవనంలో ఆరు తరగతి గదులు, ఐదు ల్యాబ్‌లు, ప్రిన్సిపాల్ గది, ఆఫీస్ గది, స్టాప్రూంలు నిర్మించారు. సరిపడా ల్యాబ్‌లు లేకపోవడం, వివిధ సమస్యలతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెగ్యులర్ అధ్యాపకులు లేక కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. వారం రోజుల్లో నూతన భవనం ప్రారంభం కానుండడంతో కొంత మేర ఊరట కలుగనుంది. క్లాస్ రూంలు దూర విద్యా కేంద్రం భవనంలోనే.. కాకతీయ యూనివర్సిటీలో దూర విద్యాకేంద్రంలోని అకాడమిక్ బ్లాక్‌లో మహిళా ఇంజనీరింగ్ కళాశాలను నిర్వహిస్తున్నారు. నాలుగు బ్రాంచీలు సీఎస్ఈ, ఐటీ, ఈఈఈ, ఈసీఈ ఉన్నాయి. ఆ నాలుగు బ్రాంచ్‌ల్లో సుమారు 1000 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరికి కనీసం 16 తరగతి గదులు అవసరం ఉంది. అయితే 15 గదుల్లో కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా మరికొన్ని ల్యాబ్‌ల కూడా అవసరం ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రాక్టికల్స్ ల్యాబ్లకోసం ఇప్పటికే క్యాంపస్‌లోని బయోకెమిస్ట్రీలోని ల్యాబ్‌లను వినియోగించుకుంటున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఆ భవనం వారికి పూర్తిస్థాయిలో సరి పోదు. అందువల్ల దూర విద్యా కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అకాడమిక్ బ్లాక్‌లోనే విద్యార్థినులకు తరగతి గదులను అలాగే వినియోగించుకుంటూ నూతన భవనంలో అని గదులన్నింటిని ల్యాబ్‌లుగా వినియోగించుకోవాలనేది సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల యోచిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాల పూర్తిస్థాయిలో ఒకే చోట నిర్వహించాలంటే ఈ భవనం పక్కనే మరో భవనం నిర్మిస్తే సాధ్యమవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ కళాశాల భవనం చుట్టూ ప్రహరీని కూడా నిర్మించలేదు. కొన్ని నిధులు వెచ్చించి ప్రహరీని నిర్మించాలనేది కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ భవనం ప్రారంభోత్సవంతో కొంతమేర మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినులకు ల్యాబ్‌ల సౌకర్యం పెరిగి ఎంతో ఉపయోగపడబోతుంది. -
అభివృద్ధి పేరుతో విధ్వంసం సరికాదు
సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్ కేయూ క్యాంపస్ : అభివృద్ధి పేరుతో అటవీప్రాంతాల్లోని ఆదివాసీల జీవితాలను విధ్వంసం చేయడం సరికాదని సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్ కళాశాల సెమినార్‌హాల్‌లో మానవహక్కుల నేత దివంగత డాక్టర్ కె.బాలగోపాల్ యాదిసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి–విధ్వంసం అనే అంశంపై ఆయన మాట్లాడారు. విధ్వంసం చేసే అభివృద్ధి ఎవరికోసమని ప్రశ్నించారు. అభివృద్ధి అనేది మానవీయంగా ఉండాలన్నారు. అభివృద్ధి పేరుతో భూములు లాక్కుంటూ హింసకు గురిచేయడం సరికాదన్నారు. పౌర హక్కుల సంఘాన్ని తాను, బాలగోపాల్, ఇతర సభ్యులతో కొనసాగించామని గుర్తుచేశారు. పౌరహక్కుల సంఘం ప్రశ్నించిన తీరును పలు ఉదాహరణతో వివరించారు. నక్సటైట్లను రాజ్యం హింసతో చంపినప్పుడు తమ సంఘం ప్రశ్నిస్తే.. నక్సలైట్ల హింసను కూడా ఎందుకు వ్యతిరేకించరని అప్పట్లో పౌరహక్కుల సంఘాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు.రెండు నక్సలైట్ల గ్రూపుల మధ్య గొడవలతో చంపుకున్నప్పుడు కూడా పౌరహక్కుల సంఘంలో తాము తర్జనభర్జన పడ్డామని, ఆ సమయంలో వీరు వినకుంటే మీపై వ్యాసాలు రాస్తామని నిర్మొహమాటంగా బాలగోపాల్ వారికి చెప్పారని వివరించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులతో నిర్బంధం కూడా బాలగోపాల్ ఎదుర్కొన్నారన్నారు. పౌరహక్కుల కోసం పనిచేసే డాక్టర్ రామనాథంను చంపినప్పుడు జిల్లాలోని పౌరుల నుంచి స్పందన రాలేదని వివరించారు. ఆ తర్వాత క్రమంలో మానహక్కుల వేదికను బాలగోపాల్ ఏర్పాటు చేశారన్నారు. తాను పౌరహక్కుల సంఘంలోనే ఉన్నానన్నారు. బాలగోపాల్ జీవితాంతం విలువలను పాటిస్తూ, సమాజంకోసం నిరంతరం పరితపించిన అరుదైన గొప్ప మానవతవాది అని కొనియాడారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు బాదవత్ రాజు, బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కేయూ ఇన్చార్జి వీసీగా చిరంజీవులు!
నేడు వెలువడనున్న ఉత్తర్వులు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్‌గా ఉన్న చిరంజీవులు కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జీ వీసీ గా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్ టి.చిరంజీవులును నియమిం చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.వీరారెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి కాకతీయ యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఇన్చార్జీ వీసీగా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయ న పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో కేయూ ఇన్చార్జి వీసీగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్‌గా ఉన్న చిరంజీవులు కుబా ధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలిసింది. సంబంధిత ఫైల్‌పై రెండు రోజు లక్రితమే సీఎం సంతకం కూడా అయినట్లు సమాచారం. విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సంతకమైన తర్వాత ఆ ఉత్తర్వులు శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం వెలువడే అవకాశాలున్నాయి. కేయూకు రెగ్యులర్ వీసీగా బి.వెంకటరత్నం పదవీకాలం 2014, మే 17న ముగి సింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్‌చాన్సలర్ లేరు. వెంకటరత్నం పదవీ విరమణ తర్వాత... ముగ్గురు ఇన్చార్జి వీసీలు మారారు. 2014, మే 18 నుంచి జూలై 9 వరకు ఇన్చార్జి వీసీగా ఐఎఫ్ఎస్ అధికారి ఆర్ఎం డోబ్రియాల్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ పనిచేశారు. సెప్టెంబరు 24 వరకు ఇన్చార్జి వీసీ గాపనిచేసిన ఆయన ఒక్కసారి కూడా యూనివర్సిటీ ముఖం చూడలేదు. ఈ సమయంలో యూనివర్సిటీలో పాలన మరిం త గాడితప్పింది. తర్వాత సెప్టెంబర్ 25న బాధ్యతలు స్వీకరించిన వీరారెడ్డి రెండుసార్లే వర్సిటీకి వచ్చారు. ఆయన పదవీకాలంముగియటంతో ఆయన స్థానంలో చిరంజీవులును నియమించనట్లు తెలుస్తోంది. చిరంజీవులు వరంగల్ జిల్లకు చిరపరిచతులే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన చిరంజీవులు గతం లో జిల్లాలో ఆర్డీఓగా, డీఆర్వోగా, డీఆర్డీఏ జిల్లా పీడీగా పని చేశారు. సుమారు ఎనిమి దేళ్లు ఆయా బాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక ఇటీవల ఆయన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌గా, కమిషనర్‌గా నియమితులయ్యూరు. కాగా శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా మాత్రం వీరారెడ్డినే కొనసాగించనున్నారని తెలిసింది. -
విజయీభవ!
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు జిల్లాల్లో 153 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 153 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో అబ్జర్వర్ ఉంటారు. అందులో వరంగల్ జిల్లాలో 60, ఖమ్మం జిల్లాలో 46, ఆదిలాబాద్ జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జంబ్లింగ్ విధానంలోనే ఒక కాలేజీ విద్యార్థులు మరో కాలేజీలో పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ పరిధిలో వరంగల్ జిల్లా ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రమే సెల్ఫ్ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. అక్కడ సమీపంలో మరో కాలేజీ లేకపోవటమే కారణం. 18 నుంచి ఏప్రిల్ 18 వరకు పరీక్షలు మూడు జిల్లాల్లో కలిపి 2,33,782 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బీఏ మొదటి సంవత్సరంలో 19,671, ద్వితీయ 13,874, తృతీయ 10,292, బీకాం మొదటి 31,182, ద్వితీయ 26,717, ఫైనల్ ఈయర్ 21,575, బీఎస్సీ మొదటి 43,182, ద్వితీయ 36,527, ఫైనల్ ఈయర్‌లో 29,707, బీబీఎం మొదటి 377, ద్వితీయ 353, ఫైనల్ ఈయర్‌లో 325 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. డిగ్రీ ఫస్టియర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. సెకండియర్, ఫైనల్ ఈయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటారుు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు డిగ్రీ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి, మూడో సంవత్సరం పరీక్షలు ఒకరోజు మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు. ఏర్పాట్లు పూర్తి పరీక్షలు పకడ్బందీగా నిర్వహంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.వెంకట్రామ్రెడ్డి తెలిపారు. హాల్‌టికె ట్లు సంబంధిత కాలేజీల వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రిన్సిపాల్స్ లాగిన్ అయి హాల్‌టికెట్లను డౌన్లోడు చేసుకొవాలి. ఒక్కో జిల్లాకు రెండు ఫ్లయింగ్స్క్వాడ్లను అందులో ఒక్కో స్క్వాడ్ బృందంలో నలుగరు చొప్పున డిగ్రీ కాలేజీల సీనియర్ లెక్చరర్లు ఉంటారు. జిల్లాకు ఒక స్పెషల్ స్కాడ్ కూడా ఉం టుంది. ఇందులో యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉంటారు. తనీఖీలు చేస్తారు. అబ్జర్వర్లలను నియమించామన్నారు. ప్రశ్నాపత్రాలు పోలీస్స్టేషన్లలోను, నోడల్ కాలేజీల్లోను అందుబాటులో ఉంచారు. వరంగల్ జిల్లాలో రూరల్ ఏరియాలో 7 పరీక్ష కేంద్రాల పరిధిలో, ఖమ్మంలో 12 పరీక్షా కేంద్రాల పరిధిలో, ఆదిలాబాద్‌లో 13 పరీక్షాకేంద్రాల పరిధిలో పోలీస్టేషన్లో ఉంచారు. మిగతా కేంద్రాలకు సంబంధిత పరీక్షా కేంద్రాల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లోను అందుబాటులో ఉంచారు. -
ఉద్యమ నేతకు ఉన్నత పదవి
కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నియమితులయ్యూరు. ఈ విషయూన్ని మంగళవారం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వయంగా పాపిరెడ్డికి ఫోన్ చేసి తెలియజేశారు. ఉన్నత విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఫోన్ చేసి.. హైదరాబాద్‌కు రావాలని చెప్పడంతో పాపిరెడ్డి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంభించిన తమ్మల పాపిరెడ్డి ప్రొఫెసర్‌గా ఎదిగి వివిధ పదవులు నిర్వర్తించి ఈ ఏడాది జూన్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ప్రొఫెసర్‌గా ఉంటూనే 2009 సంవత్సరం నుంచి జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోశించారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు పాపిరెడ్డి కేసీఆర్‌తో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ ప్రభుత్వంలో ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని పాపిరెడ్డి చెప్పుకుంటూవచ్చారు. ప్రస్తుతం ఉన్నత విద్యలో సంస్కరణలు చేయాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఇందుకు రిటైర్డ్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే పాపిరెడ్డికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా అవకాశం కల్పించారని భావిస్తున్నారు. ఎన్నో పదవులు.. ఆదిలాబాద్ జిల్లా జయపూర్ మండలం పవనూర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పాపిరెడ్డి చదువు నిమిత్తం హన్మకొండకు వచ్చి స్థిపరడ్డారు. ఆయన సతీమణి శోభ హన్మకొండ మండలంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. పాపిరెడ్డి 1975లో ఓయూలో బీఏ, కాకతీయ యూనివర్సిటీలో 1977లో ఎంఏ ఎకనామిక్స్, 1980లో ఎంఫీల్ పూర్తిచేశారు. 1981లో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. కేయూలోనే 1988లో పీహెచ్డీ పూర్తిచేశారు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగం అధిపతిగా 2004నుంచి 2006వరకు, బోర్డు ఆఫ్ చైర్‌పర్సన్‌గా 2006 నుంచి 2008 వరకు, పరీక్షల నియంత్రణాధికారిగా 2006 నుంచి 2009 వరకు, కేయూ ఇం చార్జి రిజిస్ట్రార్‌గా 2002 నుంచి 2003 వరకు పనిచేశారు. ఆయన పర్యవేక్షణలో 8మంది పీహెచ్‌డీలు, 8 మంది ఎంఫిల్ పూర్తిచేశారు. ఐదు పుస్తకాలు, 13 జర్నల్స్‌ను ప్రచురించా రు. 15 పరిశోధనాపత్రాలను వివిధ సదస్సు ల్లో సమర్పించారు. నాలుగు మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టులు, రెండు మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ లేబర్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ అగ్రికల్చరల్ ఎకనామిక్ అసోసియేషన్, న్యూడిల్లీలోని ఇండియన్ ఇని స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పొలిటికల్ ఎకనామి అసోసియేషన్ లైఫ్‌టైమ్ మెంబర్‌షిప్‌ను కలిగి ఉన్నారు. వివక్షపై ఆనాడే నిరసన.. కాకతీయ యూనివర్సిటీలో పాపిరెడ్డి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడిగా రెండు సార్లు, జనరల్ సెక్రటరీగా రెండుసార్లు పనిచేశారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారంతోపాటు సామాజిక సమస్యలపై కూడా స్పందించేవారు. తెలంగాణ ప్రాంతం వారిపై ఉన్న వివక్షపై ప్రొఫెసర్ జయశంకర్, భూపతి కృష్ణమూర్తితో కలిసి 1986 నవంబర్ 1న విద్రోహ దినం పాటించి నిరసన తెలిపారు. 1994లో ఓయూ ప్రొఫెసర్ వైకుంఠంను కేయూ వీసీగా నియామకం చేశారు. వైకుంఠం నిర్ణయాలను పాపిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. జాక్ై చెర్మన్‌గా.. తెలంగాణ మలి దశ పోరాటంలో కేయూ విద్యార్థుల పాత్ర మరువలేనిది. ఇందులో ఉద్యోగులు, అధ్యాపకులు సకలజనుల సమ్మెతో భాగస్వాములుయ్యారు. ఈ దశలో పాపిరెడ్డి 2009 నుంచి తెలంగాణ పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్‌గా నియమించబడ్డారు. జాక్ చైర్మన్‌గా జిల్లాలో అనేక ఉద్యమాలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. అధ్యాపకుల, విద్యార్థుల హర్షం ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన పాపిరెడ్డికి మంగళవారం పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ సారంగపాణి, జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి, బాధ్యులు డాక్టర్ వెంకయ్య, షాయెదా, సురేఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు కొండల్‌రెడ్డి, కృష్ణమాచార్య, ఎన్జీవో సంఘం బాధ్యులు పుల్లాశ్రీనివాస్, కాంట్రాక్ట్ లెక్చరర్లు డాక్టర్ సాదురాజేశ్, ఫిరోజ్, రాజు, కరుణాకర్, అంజన్‌రావు, ప్రొఫెసర్లు సీతారామరావు, ఎ.సదానందం, రాజేషం, మోహన్‌రెడ్డి పూల బోకేలను అందించి అభినందించారు. పాపిరెడి.. తన తల్లి సరోజతోను, సతీమణి శోభతోను తన సంతోషాన్ని పంచుకున్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దు ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలోనే చేపట్టేలా కృషిచేస్తానని, తెలంగాణ వి ద్యార్థులు ఆందోళన చెందవద్దని పాపిరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. వీసీల నియూమకాలను త్వరగా చేపట్టేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. తనపై నమ్మకంతో రాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
విజేత ఉస్మానియా యూనివర్సిటీ
జింఖానా, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ మహిళల క్రికెట్ టోర్నమెంట్లో ఉస్మానియా జట్టు విజేత గా నిలిచింది. ఈ విజయంతో ఈ నెల 24వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ జోనల్స్‌కు అర్హత సాధించింది. వరంగల్‌లోని కాకతీయ యూనివ ర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో ఉస్మానియా జట్టు 110 పరుగుల తేడాతో బరకతుల్లా యూనివర్సిటీపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చే సిన ఉస్మానియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. నిఖిత (91) అర్ధ సెంచరీతో అజేయంగా నిలువగా... ఏక్తా సక్సేనా (45), పల్లవి (21) మెరుగ్గా ఆడారు. బరకతుల్లా బౌలర్లు దివాంగి 3, వర్ష 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన బరకతుల్లా 33 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. ఉస్మానియా బౌలర్లు ప్రణీష, కావ్య చెరో 3 వికెట్లు తీసుకోగా... మౌనిక 2 వికెట్లు చేజిక్కించుకుంది. -
ఇంటర్ యూనివర్సిటీ టోర్నీకి ఓయూ క్రికెట్ జట్టు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 27 నుంచి 31 వరకు వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో జరుగుతాయి. ఓయూ క్రికెట్ జట్టు జాబితాను ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ కమిటీ సెక్రటరీ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రకటించారు. ఎంపికైన క్రికెటర్లు ఓయూ ‘బి’ గ్రౌండ్స్‌లో క్రికెట్ కోచ్ ఎం.జయప్రకాష్‌కు రిపోర్ట్ చేయాలని ఆయన కోరారు. జట్టు: ఆకాష్ బండారి(కెప్టెన్), టి.రవితేజ, హిమాలయ్ అగర్వాల్, విశ్వజిత్ పట్నాయక్, రజిత్ రమేష్ (అరోరా డిగ్రీ కాలేజి), బి.యతిన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజి), జె.మల్లికార్జున్, పి.శరత్ కుమార్ (నిజాం కాలేజి), ఎం.దినేష్ (అవంతి కాలేజి), కె.శ్రీదరహాస్ రెడ్డి (వెస్లీ కాలేజి), ప్రతీక్ (భవాన్స్ కాలేజి), ఎస్.సాయి చరణ్ తేజ, పి.నిఖిల్ దీప్, ఆర్.అరుణ్ దేవ్, ఎ.ఆకాష్ (ఎస్పీ కాలేజి), అనురాగ్ హరిదాస్ (ఎం.జె.ఇంజనీరింగ్ కాలేజి), జయప్రకాష్ (కోచ్), ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ (మేనేజర్). -
క్రీడలతో వ్యక్తిత్వ వికాసం
కొత్తగూడెం, న్యూస్‌లైన్: క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయని సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ (పర్సనల్) కె.బి.ఎస్.సాగర్ అన్నారు. మూడురోజుల పాటు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడాపోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్న వాళ్లే అన్ని రంగాల్లో రాణిస్తూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం పొందుతారన్నారు. సింగరేణి సంస్థ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. విద్యార్థినులు క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, స్నేహభావంతో మెలగాలన్నారు. క్రీడల్లో మెళుకవలు నేర్చుకోవాలని సూచించారు. గెలుపు ఓటములకు ప్రాధాన్యత ఇవ్వకుండా పోటీల్లో పాల్గొనాలని జీఎం (ఎడ్యుకేషన్) వై.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఎంత ఇష్టంతో క్రీడల్లో పాల్గొంటామో అదే శ్రద్ధనూ చదువుల్లో కనబరచాలని సూచించారు. తొలుత కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం కళాశాలల విద్యార్థినులు మార్చ్ఫాస్ట్ నిర్వహిం చారు. బెలూన్లను ఎగురవేసి పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు అలరించాయి. కబడ్డీ పోటీలను కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ఫిజికల్ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి, కిట్స్ వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ సీఐ కిషన్ ప్రారంభించారు. ప్రారంభ మ్యాచ్‌లో కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల, ఖమ్మం ప్రియదర్శిని కళాశాల విద్యార్థినులు తలపడ్డారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ కమలారాణి, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఇందిర, క్రీడల నిర్వాహకురాలు, మహిళా కళాశాల ఫిజికల్ డెరైక్టర్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు