ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 27 నుంచి 31 వరకు వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో జరుగుతాయి. ఓయూ క్రికెట్ జట్టు జాబితాను ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ కమిటీ సెక్రటరీ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రకటించారు. ఎంపికైన క్రికెటర్లు ఓయూ ‘బి’ గ్రౌండ్స్‌లో క్రికెట్ కోచ్ ఎం.జయప్రకాష్‌కు రిపోర్ట్ చేయాలని ఆయన కోరారు.
జట్టు: ఆకాష్ బండారి(కెప్టెన్), టి.రవితేజ, హిమాలయ్ అగర్వాల్, విశ్వజిత్ పట్నాయక్, రజిత్ రమేష్ (అరోరా డిగ్రీ కాలేజి), బి.యతిన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజి), జె.మల్లికార్జున్, పి.శరత్ కుమార్ (నిజాం కాలేజి), ఎం.దినేష్ (అవంతి కాలేజి), కె.శ్రీదరహాస్ రెడ్డి (వెస్లీ కాలేజి), ప్రతీక్ (భవాన్స్ కాలేజి), ఎస్.సాయి చరణ్ తేజ, పి.నిఖిల్ దీప్, ఆర్.అరుణ్ దేవ్, ఎ.ఆకాష్ (ఎస్‌పీ కాలేజి), అనురాగ్ హరిదాస్ (ఎం.జె.ఇంజనీరింగ్ కాలేజి), జయప్రకాష్ (కోచ్), ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ (మేనేజర్).
ఇంటర్ యూనివర్సిటీ టోర్నీకి ఓయూ క్రికెట్ జట్టు
Published Fri, Dec 27 2013 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement