సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ (వీసీ) ప్రొఫెసర్ నవనీత రావు (95) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి తీరని లోటని పలువురు విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యాభివృద్ధికి ఆయనెంతో కృషి చేశారని కొనియాడారు.
అయితే, నవనీత రావు 1985 నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఆయన పని చేశారు. నవనీత రావు మృతితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు అధ్యాపకులు, విద్యార్థులు చేరుకుంటున్నారు. ఇక, ఆయన మృతిపై బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవనీత రావు డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ అని ఆయన కొనియాడారు. ఓయూ గౌరవాన్ని పెంచడమే కాకుండా, నిరుపేద విద్యార్థుల జీవితాలను కూడా తీర్చిదిద్దారని పేర్కొన్నారు.
నవనీత రావు మృతిపై దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిపాలనలో రాజకీయ జోక్యాలకు తావు ఇవ్వకుండా, స్వయం ప్రతిపత్తిని కొనసాగించారని గుర్తు చేశారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత ఐపీఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయనతో సన్నిహితంగా పని చేయడం తనకు దక్కిందని శ్రవణ్ పేర్కొన్నారు. నవనీత రావు ఆత్మకు శాంతి చేకూరాలని శ్రవణ్ ప్రార్థించారు.
Very saddened to know the unfortunate demise of
— Prof Dasoju Srravan (@sravandasoju) August 26, 2023
Prof T Navaneeth Rao Garu, former Vice Chancellor of Osmania University @osmania1917 & former Director of @ipe_info Institute of Public Enterprise.
He was a dynamic administrator with great professional values, dignity and… pic.twitter.com/PqRSH68PoY
Comments
Please login to add a commentAdd a comment