కేయూ ఇన్‌చార్జి వీసీగా చిరంజీవులు!
నేడు వెలువడనున్న ఉత్తర్వులు
పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్‌గా ఉన్న చిరంజీవులు
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జీ వీసీ గా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్ టి.చిరంజీవులును నియమిం చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.వీరారెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి కాకతీయ యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఇన్‌చార్జీ వీసీగా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయ న పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో కేయూ ఇన్‌చార్జి వీసీగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్‌గా ఉన్న చిరంజీవులు కుబా ధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలిసింది. సంబంధిత ఫైల్‌పై రెండు రోజు లక్రితమే సీఎం సంతకం కూడా అయినట్లు సమాచారం.
విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సంతకమైన తర్వాత ఆ ఉత్తర్వులు శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం వెలువడే అవకాశాలున్నాయి. కేయూకు రెగ్యులర్ వీసీగా బి.వెంకటరత్నం పదవీకాలం 2014, మే 17న ముగి సింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్‌చాన్సలర్ లేరు. వెంకటరత్నం పదవీ విరమణ తర్వాత... ముగ్గురు ఇన్‌చార్జి వీసీలు మారారు. 2014, మే 18 నుంచి జూలై 9 వరకు ఇన్‌చార్జి వీసీగా ఐఎఫ్‌ఎస్ అధికారి ఆర్‌ఎం డోబ్రియాల్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ పనిచేశారు. సెప్టెంబరు 24 వరకు ఇన్‌చార్జి వీసీ గాపనిచేసిన ఆయన ఒక్కసారి కూడా యూనివర్సిటీ ముఖం చూడలేదు. ఈ సమయంలో యూనివర్సిటీలో పాలన మరిం త గాడితప్పింది. తర్వాత సెప్టెంబర్ 25న బాధ్యతలు స్వీకరించిన వీరారెడ్డి రెండుసార్లే వర్సిటీకి వచ్చారు.
ఆయన పదవీకాలంముగియటంతో ఆయన స్థానంలో చిరంజీవులును నియమించనట్లు తెలుస్తోంది. చిరంజీవులు వరంగల్ జిల్లకు చిరపరిచతులే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన చిరంజీవులు గతం లో జిల్లాలో ఆర్డీఓగా, డీఆర్వోగా, డీఆర్‌డీఏ జిల్లా పీడీగా పని చేశారు. సుమారు ఎనిమి దేళ్లు ఆయా బాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక ఇటీవల ఆయన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌గా, కమిషనర్‌గా నియమితులయ్యూరు. కాగా శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా మాత్రం వీరారెడ్డినే కొనసాగించనున్నారని తెలిసింది.