రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా
Published Wed, May 10 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
కర్నూలు(హాస్పిటల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఎస్‌ఎల్ మైనింగ్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. ఈ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాలలోపు వయస్సుగల వారు, ఐటీఐ(ఫిట్టర్‌ట్రేడ్) చదివిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారు బేతంచర్ల మండలం వీరయపల్లి గ్రామంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వీరికి రూ.8,700 నుంచి రూ.9వేల వరకు జీతం ఇస్తామన్నారు.
Advertisement
Advertisement