హిందూపురం రూరల్ : స్థానిక ఎంజీఎం పాఠశాలలో శుక్రవారం దివ్యాంగుల మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్‌డీఏ జాబ్ కోఆర్డినేటర్ లక్ష్మిదేవి తెలిపారు. మేళాను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పదోతరగతి ఉత్తీర్ణులైన, ఆపైన చదివిన వారు అర్హులన్నారు. అదేవిధంగా 18 నుంచి 32 ఏళ్ల లోపు వయసు ఉండాలి. శారీరక వికలాంగులు (ఆర్థోపెడిక్), బధిరులు (డెఫ్ అండ్ డంబ్), పార్షిక అంధులందరికీ ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా బ్యుటీషియన్, కాల్‌సెంటర్, ట్యాలీ, కంప్యూటర్ ఆపరేటర్, రీటైల్, హోటల్ మేనేజ్‌మెంట్, మొబైల్ సర్వీసింగ్‌తో పాటు స్పోకెన్ ఇంగ్లిషు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో శిక్షణ కల్పిస్తామన్నారు. జాబ్‌మేళాకు హాజరయ్యే దివ్యాంగులు విద్యార్హత సర్టిఫికెట్లు, వికలాంగుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు.
రేపు మెగా జాబ్‌మేళా
Published Wed, Feb 8 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
Advertisement