రేపు జాబ్ మేళా
Published Sat, Dec 10 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
కర్నూలు సిటీ: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రి గ్రో ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏరియా హెడ్ ఇబ్రహీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు ఉండి, డిగ్రీ, ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంకులో సెల్స్ ఆఫీసర్‌గా పని చేయుటకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళా భూపాల్ కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తులో నిర్వహిస్తారని చెప్పారు.
నేడు ..
నగరంలోని ఆక్సా హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థ ఆదివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి నాజ్నిక్ తెలిపారు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేందుకు పదోతరగతి, ఆ పై చదువులు చదివిన వారు మేళాకు హాజరుకావాలని కోరారు. పార్క్ రోడ్డులో ఉన్న ఆక్సా కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 8519868994, 9030486715 నంబర్లను సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement