Un employees
-
సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో సోమవారం(జులై 15) సెక్రటేరియట్ సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగులను బీఆర్కేభవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అంతకుముందు సెక్రటేరియట్‌కు వెళ్లే అన్ని దారుల్లో నిఘా పెంచారు. ముందస్తుగా నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ముట్టడికి బయలుదేరిన వారిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోటీ పరీక్షలు వాయిదా వేయాలని రెండు రోజుల నుంచి అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. -
నిరుద్యోగులకు మరో శుభవార్త
-
మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలిపారు. తన 59వ జన్మదినం సందర్భంగా మనుగోడు నియోజకవర్గంలోని 59మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వారికి పాస్‌పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు తెలిపారు. మునుగోడు నిరుద్యోగ యువత రెజ్యూమ్‌లు తీసుకుని సెప్టెంబర్ 25న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కు రావాలని సూచించారు. తన 59వ పుట్టినరోజు కానుకగా వచ్చిన ప్రతి ఒక్కరిలో లాటరీ ద్వారా 59 మందిని ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్టు చేయించి, అమెరికా వీసా స్పాన్సర్ షిప్ చేయించి ఇస్తానని వెల్లడించారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న సదావకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ మేరకు కేఏ పాల్ మంగళవారం వీడియో రిలీజ్ చేశారు. -
బీసీ రుణాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు
బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఏప్రిల్‌లో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. కమ్మర్పల్లి(బాల్కొండ) : బీసీ కార్పొరేషన్ 2018–19 సంవత్సరానికి గాను రుణాల మంజూరు కోసం ఏప్రిల్ 4 నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా, జిల్లాలో 11,542 మంది నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తు ఫారం, సంబంధిత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీల మూడు సెట్లను అభ్యర్థులు స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో సమర్పించాలని, గ్రామసభల తీర్మానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ వారం రోజుల కిత్రం అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టారు. ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా లేని, అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. వివరాలను మండల పరిషత్తు కార్యాలయంలో ఆన్లైన్ చేశారు. అయితే గ్రామస్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక మాత్రం చేపట్టలేదు. దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను పంపాలని మార్గదర్శకాలు జారీ అయినప్పటికీ, గ్రామస్థాయి అధికారులు అవేమీ పరిగణనలోకి తీసుకోలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడితే లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్న దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. గతంలో సాధారణంగా దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తికాగానే వాటి ని పరిశీలించి 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఎంపిక కోసం మౌఖిక పరీక్షలు(ఇంటర్వ్యూలు) నిర్వహించేవారు. ప్రస్తుతం నెలలు గడుస్తున్నా ఇంటర్వ్యూలు నిర్వహించిన దాఖలాలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన హడావుడిలో ఉన్న అధికారం యంత్రాంగం కార్పొరేషన్ రుణాల ఎంపిక కోసం మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి రాకముందే ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అందని రాయితీ రుణాలు.. 2015–16 సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతీ యువకులకు పూర్తిస్థాయిలో రాయితీ రుణాలు అందలేదు. 80 శాతం రాయితీ ప్రకటించడంతో దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. మండల స్థాయిలో ఎంపీడీఓ, బీసీ కార్పొరేషన్, బ్యాంక్, ఎంప్లాయిమెంట్, ఇతర అధికారులు కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సంక్షేమ రుణాల జారీలో అక్రమాలకు తావులేకుండా ప్రక్రియ అంతా బీసీ సంక్షేమ శాఖ ఆన్లైన్లోనే పూర్తి చేసింది. కాని ఎంపికైన లబ్ధిదారుల్లో కొంతమందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. చాలామంది అభ్యర్థులకు రాయితీ రుణాలు అందలేదు. రుణాలు మం జూరైన లబ్ధిదారులతో బ్యాంకు అధికారులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిపించడంతో పాటు, డాక్యూమెంట్ ప్రక్రియ పూర్తి చేయించారు. కాని రుణాలు మంజూరు కాకపోవడంతో అభ్యర్థులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి చాలించుకున్నారు. మరుసటి ఏడాదైనా రాకపోతాయా అని 2017–18 సంవత్సరంలో వేచి చూశారు. కాని ఆ సంవత్సరంలో రుణాల కోసం నోటిఫికేషన్ జారీ చేయలేదు. రెండేళ్ల నుంచి రాయితీ రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈయేడు బ్యాంకు అంగీకారం లేకుండానే లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించడంతో అభ్యర్థులు చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాయితీ పెంచడంతో డిమాండ్... కార్పొరేషన్ రుణాలకు రాయితీ పెంచడంతో డిమాండ్ విపరీతంగా ఏర్పడింది. రుణాలను మూడు కేటగిరిలుగా విభజించారు. 1వ కేటగిరిలో రూ. 1 లక్ష వరకు రుణ సదుపాయానికి 80 శాతం రాయితీ, 2వ కేటగిరిలో రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రుణ సదుపాయానికి 70 శాతం రాయితీ, 3వ కేటగిరిలో రూ. 2 లక్షల నుంచి 12 లక్షల వరకు రుణానికి 60 శాతం రాయితీ ప్రకటించారు. రుణాలకు రాయితీ అధికంగా ఉండడంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కులాల వారీగా, బీసీ ఫెడరేషన్ ప్రకారం యూనిట్ల కేటాయింపు ఉండే అవకాశం ఉందని ప్రచారం ఉండడంతో ఆశావహులు తమకు రుణాలు మంజూరవుతాయని నమ్మకంతో ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా..? రుణాల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుందనేది అయోమయం నెలకొంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి ఇంటర్వ్యూల కోసం తేదీని ప్రకటించి అధికార బృందం లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ మొదలు రుణాలు వచ్చే వరకు అంతా ఆన్లైన్ ప్రక్రియనే కొనసాగిస్తుండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇంతవరకు మండలానికి ఎన్ని యూనిట్లు కేటాయించారో స్పష్టంగా తెలియజేయలేదు. లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల తీర్మానం ద్వారానే చేపట్టాలని మార్గదర్శకాలు జారీ అయినప్పటికీ, గ్రామస్థాయిలో అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. ధ్రువీకరణ పత్రాలు సరిగ్గాలేని, ఆన్లైన్ చేయని దరఖాస్తులను తిరస్కరించి మిగతా అన్ని వాటితో లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఆన్లైన్ చేశారు. దరఖాస్తు చేసుకున్న అందరూ అర్హులైతే ఎంతమందికి రాయితీ రుణాలు అందుతాయో వేచి చూడాల్సిందే. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తారా అనే సంశయం నెలకొంది -
‘ఆ మంత్రికి 10సార్లు ఫోన్ చేశా.. స్పందించలేదు’
సాక్షి, అమరావతి : రాష్ట్ర సాక్షర భారత్ పథకంలో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగులను ఒక లెటర్ ద్వారా తొలగించి వారిని రోడ్డున పడేసారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు వస్తే జాబ్ అన్నారు.. 21వేల మందిని నిరుద్యోగులు చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి 10సార్లు ఫోన్ చేశామని తెలిపారు. అయిన ఈ విషయంపై వారు స్పందించలేదన్నారు. 21వేల ఉద్యోగుల ఉసురు తగులుతుందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24,470 మంది నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చీకటి రోజు అని ఆయన పేర్కొన్నారు. సాక్షర భారత్‌లో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగలను తొలగించారు.. 8ఏళ్ళుగా పనిచేస్తున్న వారిని ఉన్న ఫలంగా తీసేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. వయోపరిమితి దాటిన వారికి అక్షరాలు నేర్పడం వారి పని.. కానీ వారితో ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించుకున్నారని విమర్శించారు. ‘600మోమో కాపీని వారికి ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం. ఇది కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పని అని చెప్పి విమర్శలు చేస్తారేమో. 21వేల మందిని తొలగించడం ప్రభుత్వంకు తెలుసో లేదో అర్ధం కావడం లేదు. రూ. 4కోట్ల రూపాయలు 21 వేలమంది ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వలేదా? మానవతా దృక్పదంతో ఆలోచించి ప్రభుత్వం తక్షణమే స్పందించి మోమోని ఉపసంహరించుకోవాలని’ బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
రండిబాబూ.. రండి..!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే టీచర్ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తులు కూడా పూర్తయ్యాయి. సంబంధిత పరీక్షలో విజయం సాధించేందుకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా కొలువు కొట్టాలని ఆసక్తితో ఉన్నారు. అయితే సదరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ‘రండిబాబూ.. రండి’ అంటూ అభ్యర్థులను నిలువునా ముంచుతున్నారు. అర్హతలేని టీచర్లతో బోధిస్తూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. గోదావరిఖని టౌన్ : టీఆర్టీకి కేవలం కొద్ది నెలల గడువు మాత్రమే ఉందని భావించిన నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగు తీస్తున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కోసం కోచింగ్ తీసుకునే అభ్యర్థులు తస్మాత్జాగ్రత్తగా ఉండాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీని ప్రకటించిన వెంటనే కొన్ని బూటకపు కోచింగ్ సెంటర్లు పుట్టుకచ్చి, అభ్యర్థుల నుంచి వేలల్లో డబ్బు గుంజడానికి అసత్యపు ప్రచారాలతో ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 35 నుంచి 40వేల వరకు టీఆర్టీ కోసం కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారు. గతంలో వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలలో మాత్రమే గుర్తింపు ఉన్న కోచింగ్ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం గుర్తింపు లేకున్నా ప్రతీ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం సంబంధిత అధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించడం లేదు. కోచింగ్ సెంటర్లకు కావాల్సిన అర్హత ఏమిటి, వాటిని ఎలా సమసన్వయ పరుచాలనే బాధ్యతలను నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్ట పోతున్నారు. వేలల్లో ఫీజులు గోదావరిఖని, మంథని, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలలో ఉన్న పలు సెంటర్లు మూడు నెలలకు రూ. 40 నుంచి 60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని అభ్యర్థులు అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులను నియంత్రించడమే కాకుండా, సరైన కోచింగ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సరైన సెంటర్‌ను ఎంచుకోవాలి కోచింగ్ సెంటర్లలలో బోధించే అధ్యాపకులకు అర్హత ఉందా, లేదా? అని చూసి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో చేరాలి. అధిక డబ్బులు చెల్లించి సరైన కోచింగ్ సెంటర్‌ను ఉంచుకోవడం వలన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – దాదాసలాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రచారాలు నమ్మొద్దు ప్రభుత్వం టీచర్ రిక్రూట్మెంట్ ప్రకటించిన వెంటనే చాలా కోచింగ్ సెంటర్లు సెల్ ద్వారా, ఇతర ప్రచారా సాధనాల ద్వార ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఏది మెరుగైంది. గతంలో వాటి చరిత్ర ఏంటి ఇలా చాలా రకాలుగా సెంటర్‌పై విషయాన్ని తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – ఎల్ సుహాసిని, ఆర్జేడీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కోచింగ్ సెంటర్ల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. గుర్తింపు లేని సెంటర్లను మూసి వేయాలి. అర్హత లేని భోధకులను తొలగించాలి. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. లేకుంటే డబ్బుతో పాటు సమయాన్ని, భవిష్యత్‌ను, అవకాశాన్ని చేజార్చుకుంటాం. – సుచరిత, హెచ్‌పీటీ అభ్యర్థి -
ఏపీలో లక్షల్లో నిరుద్యోగులు
► ఉద్యోగం కావాలంటూ 9.28 లక్షల మంది పేర్లు నమోదు ► కార్మిక, ఉపాధి శాఖ బడ్జెట్ పద్దులో వెల్లడించిన ఏపీ సర్కారు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉందని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ వైఫల్యం చెందింది. జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేయడమే కాకుండా ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.రెండు వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని కూడా టీడీపీ ప్రభుత్వం విస్మరించింది. బడ్జెట్ సమావేశాల ముందు ప్రతిపక్ష నేత జగన్ నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో నిరుద్యోగులకు అసిస్టెంట్ పేరుతో బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ సహాయం కూడా ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారనే మార్గదర్శకాలను కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం రూపొందించలేదు. పైగా ఆర్థిక సాయం పొందేవారు సామాజిక సేవ చేయాలంటూ ముడిపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలంటూ ఎంప్లాయిమెంట్ ఎక్పేంజీల్లో పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య 9,28,566 ఉన్నట్లు కార్మిక, ఉపాధి శాఖ స్పష్టం చేసింది. 2016 డిసెంబర్ నాటికి ఇంత మంది ఉద్యోగాల కోసం పేర్లు రిజిష్టర్ చేసుకుని కొలువుల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వమే పేర్కొంది. ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్యే 9.28 లక్షల మందిగాప్రభుత్వం వెల్లడించగా ఎక్సేంజీల్లో పేర్లు నమోదు చేసుకోని నిరుద్యోగుల సంఖ్య మరో 20 లక్షలకు పైగా ఉంటుందని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 474 జాబ్ మేళాలను నిర్వహించగా ఈ మేళాలకు 35,061 మంది హాజరయ్యారు. ఇందులో 11,542 మంది ఎంపికవ్వగా కేవలం 3,111 మందికి మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇప్పించగలిగారు. నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన సర్కారు మరో వైపు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ పోతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన సర్కారు మూడేళ్ల అనంతరం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయబోమని ఇటీవలే తేల్చి చెప్పింది. ఉద్యోగం కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య కర్నూలు 91451 అనంతపురం 49574 చిత్తూరు 67087 వైఎస్ఆర్ కడప 72147 విజయవాడ 73791 ఏలూరు 64721 గుంటూరు 51739 నెల్లూరు 53136 ఒంగోలు 53132 కాకినాడ 82735 శ్రీకాకుళం 53631 విశాఖపట్టణం (ఎస్పీ) 7627 విజయనగరం 59295 పీ అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ 37,288 విశాఖపట్టణం (సీఐ) 72897, విశాఖపట్టణం (టీ అండ్ ఎస్) 38315 మొత్తం 9,28,566 -
నయవంచనపై నిరసన పథం
అందరికీ ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటన ఇప్పటికీ అమలుకు నోచని ఆయన హామీలు జిల్లాలో జాబ్ కోసం 80 వేల మంది నిరీక్షణ మొక్కుబడి తంతుగా మారిన జాబ్‌మేళాలు మోసాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ పోరుబాట యువజన విభాగం ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద నేడు ‘ఉద్యోగ పోరు’ ఆర్భాటం ఎక్కువ.. అసలు తక్కువ అన్నట్టుగా ఉంది టీడీపీ ప్రభుత్వం తీరు. అధికారం పొందేందుకు అలవికాని హామీలిచ్చి.. తీరా అందలం ఎక్కాక.. వాటి ఊసే విస్మరించిందనడానికి ఉదాహరణలెన్నో. ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలిస్తామని, లేకుంటే ప్రతి నెలా రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామంటూ గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ అటువంటి కోవలోకే వస్తుంది. ఈ హామీలు అమలు చేయాలన్న డిమాండుతో వైఎస్సార్ సీపీ పోరుబాట పడుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : గత ఎన్నికల సమయంలో గద్దెనెక్కేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎడాపెడా హామీలు గుప్పించేశారు. ఆయన ఇచ్చిన 600 పైచిలుకు హామీల్లో నిరుద్యోగం లేకుండా చేస్తానన్నది ప్రధానమైనది. ఉద్యోగం కల్పించలేని పక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీలు ఇప్పటివరకూ అమలుకు నోచకపోవడంతో జిల్లాలోని నిరుద్యోగులు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ నిరుద్యోగ సైన్యం కాకినాడలోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం లెక్కల ప్రకారం పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన 80 వేల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఉన్నారు. పదో తరగతి అభ్యర్థులు 52 వేలు, టెక్నికల్ అభ్యర్థులు 16 వేలు, నా¯ŒS టెక్నికల్ 13 వేలమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగం కోసం నమోదు చేసుకుంటున్నవారి సంఖ్య ఏటేటా రెట్టింపవుతోంది. కానీ అందుకు తగ్గట్టు ఉద్యోగాలు పెరిగిన దాఖలాలు లేవు. ప్రభుత్వ శాఖల్లో 10 వేలకు పైగా ఖాళీలు మరోపక్క వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంలేదు. జిల్లాలోని పంచాయతీ, రెవెన్యూ తదితర శాఖల్లో 30 వేల మంది ఉద్యోగులున్నారు. ఆయా శాఖలన్నీ కలిపి జిల్లా మొత్తంమీద 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఉపాధి కల్పనాధికారి ద్వారా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలి. కానీ ఆ ప్రక్రియ అసలు జరగడమే లేదు. జాబ్‌మేళాల ప్రహసనం శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. చిన్నచిన్న సంస్థల్లో ఉద్యోగుల నియామకానికి జాబ్‌మేళాల పేరుతో ప్రహసనం నడుపుతోంది. స్వయంగా జిల్లా అధికార యంత్రాంగమే నిర్వహిస్తున్న వికాస సంస్థ ద్వారా గడచిన రెండేళ్లలో 12 జాబ్‌మేళాలు నిర్వహించారు. వీటన్నింటికీ కలిపి సుమారు 60 వేల మంది హాజరైతే, 9 వేల మందికి మాత్రమే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించగలిగారు. అవి కూడా నెలకు రూ.7 వేల నుంచి రూ.13 వేలకు మించి జీతం రాని ఉద్యోగాలే. దీనినిబట్టి మేళాలు నిర్వహించామని ఘనంగా చెప్పడమే తప్ప.. ఉద్యోగాలు పొందుతున్నవారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోంది. ఇటీవల రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ సమక్షంలో నిర్వహించిన జాబ్మేళాదీ ఇదే పరిస్థితి. చాలా సందర్భాల్లో ఈ మేళాలకు వచ్చే కంపెనీలపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చి ఆ చిరుపోస్టులను కూడా ఎగరేసుకుపోతున్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పటివరకూ 32 నెలలైంది. దీని ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.2 వేల వంతున ఇప్పటివరకూ రూ.66 వేలు భృతిగా ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఆ ఊసే విస్మరించింది. నిరుద్యోగులకు బాసటగా.. సర్కారు చేతిలో నయవంచనకు గురవుతున్న నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నడుం బిగించింది. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగం లేదా భృతి ఇవ్వాలన్న డిమాండుతో ‘ఉద్యోగ పోరు’కు ఉద్యుక్తమవుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించనున్నారు. అనంతరం దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ‘ఉద్యోగ పోరు’ నిర్వహించే దిశగా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సిద్ధమవుతున్నారు. విజయవంతం చేయాలి ప్రభుత్వాన్ని మేల్కొల్పి నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకే ‘ఉద్యోగ పోరు’ నిర్వహిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులందరికీ చంద్రబాబు సర్కార్ నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ పోరు నిర్వహిస్తున్నాం. యువత కోసం తలపెట్టిన ఈ పోరుకు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. తద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. – అనంత ఉదయభాస్కర్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం -
కొలువు ఆశతో వెల్లువలా..
ఎన్టీఆర్ ట్రస్ట్ జాబ్‌మేళాకు వేలాదిమంది నిరుద్యోగులు సౌకర్యాల లేమితో అవస్థలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో మొదలైన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. రెండురోజులు జరిగే మేళాకు ఉభయ గోదావరి సహా వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులైన వేలాదిమంది యువతీయువకులు ఎంతో ఆశతో తరలివచ్చి పేర్లను నమోదు చేయించుకున్నారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అవస్థలు పడ్డారు. మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయప్ర«ధాన కార్యదర్శి నారా లోకేష్ తన ప్రసంగంలో ‘బాబు’ వస్తే జాబు ఇస్తామన్న మాటకు అర్థం ప్రభుత్వోద్యోగం కాదని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని అనడంతో నిరుద్యోగ యువత నిసృ్పహ చెందారు. రాజమహేం ద్రవరం రూ రల్ ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధ్యక్షతన జరిగిన ఈ జాబ్‌మేళాలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మేయర్ పంతం రజనీశేషసాయి, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జెడ్పీ ఛైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గొల్లపల్లి సూర్యారావు, జవహర్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, శశికిరణ్, కలెక్టర్ అరుణ్‌కుమార్, నన్న య వర్సిటీ వీసీ ఎం.ముత్యాలునాయుడు పాల్గొన్నారు. సొమ్మసిల్లిన ఉద్యోగార్థులు జాబ్‌మేళాకు సుమారు 25 వేలమంది నిరుద్యోగులు హాజరయ్యారు. సభ ప్రారంభమయ్యే వరకు నిరుద్యోగులను బారులు తీర్చి ఎండలో నిలబెట్టడంతో చాలా మంది సొమ్మసిల్లిపోయారు. సుమారు 75కి కంపెనీలు మేళాకు రాగా నిరుద్యోగులు రిజిస్ట్రేష¯ŒS చేసుకునేందుకు 30 వరకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులంతా గంటల తరబడి కౌంటర్ల ముందు నిలబడి ఎండవేడిలో మాడిపోయారు. తాగేందుకు సరైన మంచినీరు సౌకర్యం ఏర్పాటుచేయలేదు. రిజిస్ట్రేష¯ŒS చేసుకున్న వారికి ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాలల్లో ఇంటర్వూలు నిర్వహించారు. నిలబడలేక నీరసం వచ్చేసింది ఉద్యోగం మాట ఎలా ఉన్నా ముం దు క్యూలో నిలబడలేక నీరసం వచ్చేసింది. ఆయా విభాగాల వారీగా రిజిస్ట్రేషన్ల కౌం టర్లు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేష¯ŒSకు గంటల తరబడి మండే ఎండలో నిల్చున్నాను. –సంధ్య, ఎంబీఏ, కాకినాడ జాబ్ వస్తుందో లేదో తెలీదు ఉద్యోగమేళాలో ముందు పేరు రిజిస్ట్రేష¯ŒS చేసుకునేందుకు వచ్చా. జాబ్ వస్తుందో లేదో తెలీదు. ఇక్కడ ఏర్పాట్లు బాగా లేవు. ఎండ వేడి తగలకుండా ఏమైనా ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. –పి.ప్రేమ్‌కుమార్, ఎమ్మెస్సీ, జంగారెడ్డిగూడెం -
రేపు జాబ్ మేళా
కర్నూలు సిటీ: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రి గ్రో ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏరియా హెడ్ ఇబ్రహీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు ఉండి, డిగ్రీ, ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంకులో సెల్స్ ఆఫీసర్‌గా పని చేయుటకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళా భూపాల్ కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తులో నిర్వహిస్తారని చెప్పారు. నేడు .. నగరంలోని ఆక్సా హోటల్ మేనేజ్మెంట్ సంస్థ ఆదివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి నాజ్నిక్ తెలిపారు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేందుకు పదోతరగతి, ఆ పై చదువులు చదివిన వారు మేళాకు హాజరుకావాలని కోరారు. పార్క్ రోడ్డులో ఉన్న ఆక్సా కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 8519868994, 9030486715 నంబర్లను సంప్రదించాలన్నారు. -
నేడు ఉద్యోగమేళా
కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగ యువకుల కోసం ఈ నెల 19వ తేదిన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన, శిక్షణా శాఖ అధికారి ప్రతాపరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శివశక్తి బయోటెక్నాలజీ ఫెర్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సేల్స్ రెప్రజెంటేటివ్స్గా పనిచేసేందుకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివి ఉండాలని, 19 నుంచి 35 ఏళ్లలోపు పురుషులు మాత్రమే అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.7,600 జీతం ఇస్తారన్నారు. -
నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ
బాలాజీచెరువు (కాకినాడ) : గ్రామీణ నిరుద్యోగ యువతకు రామానంద రూరల్ డవలప్మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో మూడు నెలలు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు సొసైటీ డైరెక్టర్ డి.రామకృష్ణ శనివారం తెలిపారు. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా ఉపాధి శిక్షణ ఇస్తున్నామని, పదో తరగతి పాసై 15 నుంచి 35 ఏళ్లు గ్రామీణ యువతీ యువకులు అర్హులన్నారు. శిక్షణ కాలం మూడు నెలలు ఉచిత వసతి, యూనిఫామ్, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. అసక్తి గలవారు తమ బయోడెటాతో కాకినాడ సేఫ్ హస్పటల్ వద్దగల తమ కార్యాలయంలోగాని, 78429 74445 లోంబరులోగాని సంప్రదించవచ్చన్నారు. -
నిరుద్యోగులకు భరోసా హెచ్ఆర్డీ
నేడు ఎస్‌కేవీటీ కళాశాలలో ప్రారంభించనున్న కలెక్టర్ నన్నయ, వికాస సంయుక్త ఆ««దl్వర్యంలో శిక్షణ, ఉపాధి జిల్లాలో భర్తీకానున్న 30 వేల ఔట్సోర్సింగ్ పోస్టులు కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన లక్ష్యంగా అడుగులు వేస్తోంది ఆదికవి నన్నయ యూనివర్సిటీ. ఏటా ఉభయగోదావరి జిల్లాల పరిధిలో యూనివర్సిటీ నుంచి 30 వేల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వెళుతున్నారు. వీరందరికీ ఉద్యోగాల సాధనకు నడుంబిగించింది. ఏటా అత్యధిక గ్రాడ్యుయేట్స్ విద్యను పూర్తిచేసి బయటకు వెళ్లే రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నన్నయే ప్రథమం. ఆ దిశగా చర్యలు చేపట్టారు యూనివర్సిటీ వీసీ ముత్యాలనాయుడు. దీనికోసం ‘వికాస’ స్వచ్ఛందlసంస్థ (ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పన సంస్థ)తో కలిసి పనిచేస్తోంది. రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ డిగ్రీ కశాశాల దీనికి వేదికకానుంది. హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పేరుతో శుక్రవారం కళాశాలలలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దీనిని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రారంభిస్తారు. ఆయనతో పాటు నన్నయ వీసీ ముత్యాలనాయుడు, వికాస ప్రాజెక్టు డైరక్టర్ వీఎన్ రావు, అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ దీనిలో పాల్గొననున్నారు. జిల్లాలోనే తొలి కేంద్రంగా ఎస్కేవీటీకి పేరు దక్కింది. కాకినాడ కలెక్టరేట్లో హెచ్ఆర్డీ ఉన్నా అది కేవలం ఉద్యోగ కల్పనకు మాత్రమే పరిమితమైంది. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసే ఈ శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరం, రూరల్ మండలాలతో పాటు జిల్లాలోని నిరుద్యోగులంతా దీనిలో చేరి శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఇందులో చేరేందుకు ఎవరైనా అర్హులే. పదో తరగతి చదివిన వారి నుంచి గ్రాడ్యుయేట్స్ వరకు వారు ఎన్నుకున్న విభాగాలకు సంబంధించి శిక్షణ ఇచ్చి ఉపా«ధి కల్పించడమే హెచ్ఆర్డీ లక్ష్యం. ఔట్సోర్సింగ్ విధానంలో జిల్లాలో 30 వేల ఉద్యోగాలు ఉన్నాయి. దీనిలో శిక్షణ పొందిన అభ్యర్థులతో ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ కల్పనే లక్ష్యం ప్రతి ఒక్కరికీ ఉద్యోగం అనే లక్ష్యంతో ఉన్నాం. దానికి కావల్సిన అన్ని పక్రియలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 50 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అందులో భాగంగానే వికాస సంస్థతో కలిసి నడుస్తున్నాం. యూనివర్సిటీలో విద్యనభ్యసించిన అందరికీ ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – ముత్యాల నాయుడు, నన్నయ వీసీ. శిక్షణ కేంద్రం మాకు రావడం అదృష్టం నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేలా ప్రారంభించనున్న హెచ్ఆర్డీ శిక్షణ కేంద్రం ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం మా అదృష్టం. ఈ కేంద్రం నుంచి పదో తరగతి చదువుకున్న వారి దగ్గర నుంచి ఉన్నత చదువులు చదిని వారివరకు వారు ఏ విభాగాలు ఎన్నుకున్నారో అందులో శిక్షణ ఇస్తారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులంతా ఉపయోగించుకోవాలి. – పసుపులేటి శ్రీరామచంద్రమూర్తి, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
ఏపీలో నిరుద్యోగుల ఆందోళన బాట
-
విశాఖలో ఘరానా మోసం