కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగ యువకుల కోసం ఈ నెల 19వ తేదిన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన, శిక్షణా శాఖ అధికారి ప్రతాపరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శివశక్తి బయోటెక్నాలజీ ఫెర్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సేల్స్ రెప్రజెంటేటివ్స్‌గా పనిచేసేందుకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్‌మీడియట్ చదివి ఉండాలని, 19 నుంచి 35 ఏళ్లలోపు పురుషులు మాత్రమే అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.7,600 జీతం ఇస్తారన్నారు.