నిరుద్యోగులకు భరోసా హెచ్‌ఆర్డీ
-
నేడు ఎస్‌కేవీటీ కళాశాలలో ప్రారంభించనున్న కలెక్టర్
-
నన్నయ, వికాస సంయుక్త ఆ««దl్వర్యంలో శిక్షణ, ఉపాధి
-
జిల్లాలో భర్తీకానున్న 30 వేల ఔట్‌సోర్సింగ్ పోస్టులు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం) :
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన లక్ష్యంగా అడుగులు వేస్తోంది ఆదికవి నన్నయ యూనివర్సిటీ. ఏటా ఉభయగోదావరి జిల్లాల పరిధిలో యూనివర్సిటీ నుంచి 30 వేల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వెళుతున్నారు. వీరందరికీ ఉద్యోగాల సాధనకు నడుంబిగించింది. ఏటా అత్యధిక గ్రాడ్యుయేట్స్ విద్యను పూర్తిచేసి బయటకు వెళ్లే రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నన్నయే ప్రథమం. ఆ దిశగా చర్యలు చేపట్టారు యూనివర్సిటీ వీసీ ముత్యాలనాయుడు. దీనికోసం ‘వికాస’ స్వచ్ఛందlసంస్థ (ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల కల్పన సంస్థ)తో కలిసి పనిచేస్తోంది. రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ డిగ్రీ కశాశాల దీనికి వేదికకానుంది. హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ పేరుతో శుక్రవారం కళాశాలలలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దీనిని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రారంభిస్తారు. ఆయనతో పాటు నన్నయ వీసీ ముత్యాలనాయుడు, వికాస ప్రాజెక్టు డైరక్టర్ వీఎన్ రావు, అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ దీనిలో పాల్గొననున్నారు.
జిల్లాలోనే తొలి కేంద్రంగా ఎస్‌కేవీటీకి పేరు దక్కింది. కాకినాడ కలెక్టరేట్‌లో హెచ్‌ఆర్డీ ఉన్నా అది కేవలం ఉద్యోగ కల్పనకు మాత్రమే పరిమితమైంది. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసే ఈ శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరం, రూరల్ మండలాలతో పాటు జిల్లాలోని నిరుద్యోగులంతా దీనిలో చేరి శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఇందులో చేరేందుకు ఎవరైనా అర్హులే. పదో తరగతి చదివిన వారి నుంచి గ్రాడ్యుయేట్స్ వరకు వారు ఎన్నుకున్న విభాగాలకు సంబంధించి శిక్షణ ఇచ్చి ఉపా«ధి కల్పించడమే హెచ్‌ఆర్డీ లక్ష్యం. ఔట్‌సోర్సింగ్ విధానంలో జిల్లాలో 30 వేల ఉద్యోగాలు ఉన్నాయి. దీనిలో శిక్షణ పొందిన అభ్యర్థులతో ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ కల్పనే లక్ష్యం
ప్రతి ఒక్కరికీ ఉద్యోగం అనే లక్ష్యంతో ఉన్నాం. దానికి కావల్సిన అన్ని పక్రియలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 50 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అందులో భాగంగానే వికాస సంస్థతో కలిసి నడుస్తున్నాం. యూనివర్సిటీలో విద్యనభ్యసించిన అందరికీ ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ముత్యాల నాయుడు, నన్నయ వీసీ.
శిక్షణ కేంద్రం మాకు రావడం అదృష్టం
నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేలా ప్రారంభించనున్న హెచ్‌ఆర్డీ శిక్షణ కేంద్రం ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం మా అదృష్టం. ఈ కేంద్రం నుంచి పదో తరగతి చదువుకున్న వారి దగ్గర నుంచి ఉన్నత చదువులు చదిని వారివరకు వారు ఏ విభాగాలు ఎన్నుకున్నారో అందులో శిక్షణ ఇస్తారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులంతా ఉపయోగించుకోవాలి.
– పసుపులేటి శ్రీరామచంద్రమూర్తి, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్