కొలువు ఆశతో వెల్లువలా..
-
ఎన్టీఆర్ ట్రస్ట్ జాబ్‌మేళాకు
-
వేలాదిమంది నిరుద్యోగులు
-
సౌకర్యాల లేమితో అవస్థలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో మొదలైన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. రెండురోజులు జరిగే మేళాకు ఉభయ గోదావరి సహా వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులైన వేలాదిమంది యువతీయువకులు ఎంతో ఆశతో తరలివచ్చి పేర్లను నమోదు చేయించుకున్నారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అవస్థలు పడ్డారు.
మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయప్ర«ధాన కార్యదర్శి నారా లోకేష్ తన ప్రసంగంలో ‘బాబు’ వస్తే జాబు ఇస్తామన్న మాటకు అర్థం ప్రభుత్వోద్యోగం కాదని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని అనడంతో నిరుద్యోగ యువత నిసృ్పహ చెందారు. రాజమహేం ద్రవరం రూ రల్ ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధ్యక్షతన జరిగిన ఈ జాబ్‌మేళాలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మేయర్ పంతం రజనీశేషసాయి, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జెడ్పీ ఛైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గొల్లపల్లి సూర్యారావు, జవహర్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, శశికిరణ్, కలెక్టర్ అరుణ్‌కుమార్, నన్న య వర్సిటీ వీసీ ఎం.ముత్యాలునాయుడు పాల్గొన్నారు.
సొమ్మసిల్లిన ఉద్యోగార్థులు
జాబ్‌మేళాకు సుమారు 25 వేలమంది నిరుద్యోగులు హాజరయ్యారు. సభ ప్రారంభమయ్యే వరకు నిరుద్యోగులను బారులు తీర్చి ఎండలో నిలబెట్టడంతో చాలా మంది సొమ్మసిల్లిపోయారు. సుమారు 75కి కంపెనీలు మేళాకు రాగా నిరుద్యోగులు రిజిస్ట్రేష¯ŒS చేసుకునేందుకు 30 వరకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులంతా గంటల తరబడి కౌంటర్ల ముందు నిలబడి ఎండవేడిలో మాడిపోయారు. తాగేందుకు సరైన మంచినీరు సౌకర్యం ఏర్పాటుచేయలేదు. రిజిస్ట్రేష¯ŒS చేసుకున్న వారికి ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాలల్లో ఇంటర్వూలు నిర్వహించారు.
నిలబడలేక నీరసం వచ్చేసింది
ఉద్యోగం మాట ఎలా ఉన్నా ముం దు క్యూలో నిలబడలేక నీరసం వచ్చేసింది. ఆయా విభాగాల వారీగా రిజిస్ట్రేషన్ల కౌం టర్లు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేష¯ŒSకు గంటల తరబడి మండే ఎండలో నిల్చున్నాను.
–సంధ్య, ఎంబీఏ, కాకినాడ
జాబ్ వస్తుందో లేదో తెలీదు
ఉద్యోగమేళాలో ముందు పేరు రిజిస్ట్రేష¯ŒS చేసుకునేందుకు వచ్చా. జాబ్ వస్తుందో లేదో తెలీదు. ఇక్కడ ఏర్పాట్లు బాగా లేవు. ఎండ వేడి తగలకుండా ఏమైనా ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది.
–పి.ప్రేమ్‌కుమార్, ఎమ్మెస్సీ, జంగారెడ్డిగూడెం